Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షోడశో7ధ్యాయః. అథ బుద్ధాద్యవతార కథనమ్. అగ్ని రువాచ : వక్ష్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతో7ర్ధదమ్ | పురా దైవాసురే యుద్ధే దైత్యైద్దేవాః పరాజితాః. 1 రక్ష రక్షేతి శరణం వదన్తో జగ్మురీశ్వరమ్ | మాయామోహస్వరూపో7సౌ శుద్ధోదనసుతో7భవత్. 2 మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్ | తే చ బౌద్ధా బభూవుర్హి తే7భ్యో7న్యే వేదవర్జితాః. అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి. నారకార్హం కర్మ చక్రుర్గ్రహీష్యన్త్యధమాదపి | సర్వే కలియుగా న్తే తు భవిష్యన్తి చ సఙ్కరాః. 5 దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః | దశ పఞ్ఛ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి. 6 వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు. ధర్మకఞ్చకసంవీతా అధర్మరుచయ స్తథా | మానుషాన్ భక్షయిష్యని వ్లుెచ్ఛాః సార్థివరూపిణః. 7 ధర్మ మను చొక్కా తొడిగికొనిన వ్లుెచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.) కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః | ఉత్సదయిష్యతి వ్లుెచ్ఛాన్ గృహీతాస్త్రః కృతాయుధః. 8 విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి వ్లుెచ్ఛులను నశింపజేయును. స్థాపయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణ్యే యథోచితామ్ | ఆశ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని. 9 నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు. కల్కిరూపం పరిత్యజ్య హరిః స్వర్గం గమిష్యతి | తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతి. 10 విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును. వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్యన్తి సత్తమ | ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేషు చ. 11 అవతారా ఆసంఖ్యాతా అతీతానాగతాదయః | విష్ణోర్దశావతారాఖ్యాన్యః పఠేచ్ఛృణుయాన్నరః. 12 సో7వాప్తకామో విమలః సకులః స్వర్గమాప్నుయత్ | ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః. 13 అవతీర్ణశ్చ స గతః సగ్గాదేః కారణం హరిః | ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశో7ధ్యాయ. ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణ మైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను. ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.