Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్విషష్ట్యుత్తర శతతమో೭ధ్యాయః అథ ధర్మశాస్త్రనిరూపణమ్. పుష్కర ఉవాచ : మనుర్విష్ణుర్యాజ్ఞవల్క్యో హారీతో೭త్రిర్యమో೭ఙ్గిరాః | వసిష్ఠదక్షసంవర్తశాతాతపపరాశరాః. 1 ఆపస్తమ్బోశనోవ్యాసాః కాత్యాయనబృహస్పతీ | గోతమః శఙ్ఖలిఖితా ధర్మమేతే యథాబ్రువన్. 2 తథా వక్ష్యే సమాసేన భుక్తిముక్తిప్రదం శృణు | ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్. 3 కామ్యం కర్మప్రవృత్తం స్యాన్నివృత్తం జ్ఞానపూర్వకమ్ | వేదాభ్యాసస్తపో జ్ఞానమిన్ద్రియాణాం చ సంయమః. 4 అహింసా గురుసేవా చ నిఃశ్రేయసకరం పరమ్ | సర్వేషామపి చైతేషామాత్మజ్ఞానం పరం స్మృతమ్. 5 తచ్చాగ్ర్యం సర్వవిద్యానాం ప్రాప్యతే హ్యమృతం తతః | సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. సమం పశ్యన్నాత్మయాజీ స్వారాజ్యమధిగచ్ఛతి | ఆత్మజ్ఞానే సమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్నవాన్. 7 ఏతద్ద్విజన్మసామర్థ్యం బ్రాహ్మణస్య విశేషతః | వేదశాస్త్రార్థతత్త్వజ్ఞో యత్ర తత్రాశ్రమే వసన్. 8 ఇహైవ లోకే తిష్ఠన్హి బ్రహ్మభూయాయ కల్పతే | స్వాధ్యాయానాముపాకర్మ శ్రావణ్యాం శ్రవణన తు. 9 హస్తే చౌషధివారే చ పఞ్చమ్యాం శ్రవణస్య వా | పౌషమాసస్య రోహిణ్యామష్టకాయామథాపి వా. 10 జలాన్తే విధివత్కుర్యాదుత్సర్గం విధివద్బహిః. పుష్కరుడు చెప్పెను; మనువు, విష్ణువు, యాజ్ఞవల్క్యుఢు, హారీతుడు, అత్రి, యముడు, అంగిరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనస్సు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గోతముడు, శంఖలిఖితులు, వీరు చెప్పిన విధముగ భుక్తిముక్తిప్రదమగు ధర్మమును సంక్షిప్తముగా చెప్పెదను వినుము. వైదికకర్మ 'ప్రవృత్తము' 'నివృత్తము' అని రెండు విధములు. కామ్యకర్మ ప్రవృత్తము. జ్ఞానపూర్వక మగు కర్మ నివృత్తము. వేదాభ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియసంయమము, అహింస, పూజ్యుల సేవ ఇవి నిశ్శ్రేయసకరములు. వీటి అన్నింటికంటెను ఆత్మజ్ఞానము శ్రేష్ఠము. అది అన్ని విద్యలలో ఉత్తమము. దానివలన మోక్షము లభించును. తనను సర్వభూతములందును, సర్వభూతములను తనయందును చూచు, ఆత్మజ్ఞానము కలవాడు స్వారాజ్యమును పొందును ఆత్మజ్ఞానము సమముగ నుండునట్లు చేసికొని, వేదాభ్యాసమునందు ప్రయత్నము కలవాడు కావలెను. ఇది ద్విజు లందరికిని సామర్థ్యమును పెంపొందించునది. బ్రాహ్మణులకు విశేషముగ సామర్థ్యవర్ధకము. వేదశాస్త్రార్థతత్త్వము తెలిసినవాడు ఏ ఆశ్రమమునందున్నను, ఈ లోకమునందే బ్రహ్మత్వమును పొంద సమర్థుడగును. శ్రావణపూర్ణిమనాడు గాని, శ్రవణ నక్షత్రయుక్తదినమున గాని, హస్తనక్షత్రయుక్త శ్రావణశుక్ల పంచమినాడు గాని, తమ శాఖకు సంబంధించిన గృహ్య సూత్రము ప్రకారము నియమపూర్వకముగా వేదాధ్యయన ప్రారంభము చేయవలెను. పౌషమాసమున రోహిణీనక్షత్రమునందు గాని, అష్టకతిథియందు గాని నగరము లేదా గ్రామము వెలుపల జలసమీపమున వేదాధ్యయనోత్సర్గము చేయవలెను. త్ర్యహం ప్రేతేష్వనధ్యాయః శిష్యర్త్విగ్గురుబన్ధుషు. 11 ఉపాకర్మణి చోత్సర్గే స్వశాఖాశ్రోత్రి¸° తథా | సన్ధ్యాగర్జితనిర్ఘాతే భూకమ్పోల్కానిపాతనే. 12 సమాప్య వేదం హ్యనిశమారణ్యకమధీత్య చ | పఞ్చదశ్యాం చతుర్దశ్యామష్టమ్యాం రాహుసూతకే. 13 ఋతుసన్ధిషు భుక్త్వా వా శ్రాద్ధికం ప్రతిగృహ్య చ | శశమణ్డూకనకులశ్వాహిమార్జార సూకరైః.14 కృతే೭న్తరే త్వహోరాత్రం శక్రపాతే తథోచ్ఛ్రయే | శ్వక్రోష్టుగర్దభోలూకసామ బాణార్తనిస్వనే. 15 అమేధ్యశవశూద్రాన్త్యశ్మశానపతితాన్తికే | అశుభాసు చ తారాసు విద్యుత్త్సనిత సంప్లవే. 16 భుక్తార్ద్రపాణిరమ్భో೭న్తరర్ధరాత్రే೭తిమారుతే | పాంసువర్షే దిశాం దాహే సన్ధ్యానీహారభీతిషు. 17 ధావతః ప్రాణిబాధే చ శిష్టే చ గృహమాగతే | ఖరోష్ట్రయానహ స్త్యశ్వనౌకావృక్షాధిరోహణ. 18 సప్తవింశత్యనధ్యాయా నేతాంస్తాత్కాలికాన్విదుః. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ధర్మశాస్త్రనిరూపణం నామ ద్విషష్ట్యధిక శతతమో೭ధ్యాయః. శిష్యుడు, ఋత్విక్కు గురువులు, బంధువులు మరణించినపుడు మూడు దినములు అధ్యయనము మానివేయవలెను. ఉపాకర్మ - ఉత్సర్జనదినములు మొదలు మూడు దినములు అధ్యయనము చేయరాదు. తన వేదశాఖకు చెందిన వేదాధ్యేత మరణించినపుడు కూడ అట్లే. సంధ్యాకాలమునందు, ఉరుముచున్నపుడు, ఉత్పాతసూచకము లగు ధ్వనులు వినబడినప్పుడు, భూకంపమునందు, ఉల్కానిపాతనమునందు, వేదాధ్యయనసమాప్తి చేసిన పిమ్మటను, ఆరణ్యకమును చదివిన పిమ్మటను ఒక రాత్రి అనధ్యయనము. పూర్ణిమ, చతుర్దశి, అష్టమి, రాహుగ్రహణము, ఋతుసంధులు, శ్రాద్ధాన్నభోజనము చేసినపుడు శ్రాద్ధదానము పట్టినపుడును ఒక దినము అనధ్యాయము. స్వాధ్యాయము చేయువారి మధ్యనుండి చెవులపిల్లి, కప్ప, ముంగిస, కుక్క, సర్పము, పిల్లి, పంది వెళ్ళినచో ఒక దినము అనధ్యయనము. ఇంద్రధ్వజమును దింపిన దినమునను, ఎత్తిన దినము నందును, అనధ్యయనము. కుక్క, నక్క, గాడిద, గుడ్లగూబ వీటి అరుపులు వినబడినపుడు, సామగానము వినబడినప్పుడును, బాణధ్వని, ఆర్తధ్వని వినబడినపుడును, అపవిత్రవస్తువు, శవము, శూద్రుడు, అంత్యజుడు, శ్మశానము, పతితుడు మొదలగువారి సాన్నిధ్యమునందును, అశుభతారలందును, మాటామాటికి మెరపులు మెరయు చున్నప్పుడును, తాత్కాలిక అనధ్యాయము. భోజనానంతరము తడిచేతులతో అధ్యయనము చేయకూడదు. జలములోపల, అర్ధరాత్రములందును, దుమ్ము పడుచున్నపుడును, పెను గాలులు వీచుచున్నపుడును, దిగ్దాహసమయమునందును, సంధ్యలందును, మంచు వర్షించుచున్నపుడును, భయసమయములందును అధ్యయనము చేయరాదు. పరుగెత్తుచు అధ్యయనము చేయరాదు. ఏదైన ప్రాణి బాధ పడుచున్నపుడును, శిష్యులు ఇంటికి వచ్చి నపుడును అధ్యయనము చేయరాదు. గాడిద, ఒంటె, రథము మొదలగు వాహన ములు ఎక్కినపుడును, ఏనుగ, గుఱ్ఱము, నావ, వృక్షము మొదలైన వాటిని ఎక్కినపుడు, మరుభూమియందును, అధ్యయ నముచేయరాదు. ఈ ముప్పదియైదును తాత్కాలికానధ్యయన కాలములు. అగ్నిమహాపురాణమునందు ధర్మశాస్త్రవర్ణన మను నూటఅరువది రెండవ అధ్యాయము మాప్తము.