Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుఃషష్ట్యధిక శతతమో೭ధ్యాయః అథ నవగ్రహహోమ నిరూపణమ్. పుష్కర ఉవాచ : శ్రీకామః శాన్తికామో వా గ్రహయజ్ఞం సమారభేత్ | వృష్ట్యాయుఃపుష్టికామో వా తథైవాభిచరన్ పునః. 1 సూర్యః సోమో మఙ్గలశ్చ బుధశ్చాథ బృహస్పతిః | శుక్రః శ##నైశ్చరో రాహుః కేతుశ్చేతి గ్రహాః స్మృతాంః. తామ్రకాత్ స్ఫటికాద్రక్తచన్దనాత్ స్వర్ణకాదుభౌ | రజతాదయసః సీసాద్గ్రహాః కార్యాః క్రమాదిమే. 3 స్వర్ణ్వైర్వాయజేల్లిఖ్య గన్ధమణ్డలకేషు వా | యథావర్ణం ప్రదేయాని వాసాంసి కుసుమాని చ. 4 గన్ధాశ్చ బలయశ్చైవ ధూపో దేయస్తు గుగ్గులుః | కర్తవ్యా మన్త్రవన్తశ్చ చరవః ప్రతిదైవతమ్. 5 ఆ కృష్ణేన ఇమం దేవా అగ్నిర్మూర్థా దివః కకుత్ | ఉద్బుధ్యస్వేతి చ ఋచో యథాసంఖ్యం ప్రకీర్తితాః. బృహస్పతే అతియదర్యస్తథైవాన్నాత్పరిస్రుతః | శన్నో దేవీస్తథా కాణ్డాత్ కేతుం కృణ్వన్విమాం స్తథా. 7 అర్కః పలాశః ఖదిరో హ్యపామార్గోథ పిప్పలః | ఉదుమ్బరః శమీ దూర్వా కుశాశ్చసమిధః క్రమాత్. 8 ఏకైకస్యాత్రాష్టశతమష్టావింశతిరేవ వా | హోతవ్యా మధుసర్పిర్భ్యాం దధ్నా చైవ సమన్వితాంః. 9 గుడౌదనం పాయసం చ హవిష్యం క్షీరయష్టికమ్ | దధ్యోదనం హవిః పూపాన్ మాంసం చిత్రాన్నమేవ చ. దద్యాద్గ్రహక్రమాదేతద్ద్విజేభ్యో భోజనం బుధః | శక్తితో వా యథాలాభం సత్కృత్య విధిపూర్వకమ్. 11 ధేనుః శఙ్ఖస్తథానడ్వాన్హేమవాసో హయస్తథా | కృష్ణాగౌరాయసశ్ఛాగ ఏతా వై దక్షిణాః క్రమాత్. 12 యశ్చ యస్య యదా దూష్యః స తం యత్నేన పూజయేత్ | బ్రహ్మణౖషాం వరో దత్తః పూజితాః పూజితస్య చ. 13 గ్రహాధీనా నరేన్ద్రాణాముచ్ఛ్రాయాః పతనాని చ | భావాభావౌ చ జగతస్తస్మాత్పూజ్యతమా గ్రహాః. 14 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నవగ్రహ నిరూపణంనామ చతుఃషష్ట్యధికశతమో೭ధ్యాయః లక్ష్మిని కోరువాడును, శాంతికాముడును, వృష్టి - అయుర్దాయ-పుష్టులు కోరువాడును లేదా అభిచారప్రక్రియ ప్రారంభించ నున్నవాడును గ్రహపూజ ప్రారంభించవలెను. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు. ఈ గ్రహముల మూర్తులను క్రమముగ రాగి, స్పటికము, రక్త చందనము, స్వర్ణము (ఋధగురువులు), రజతము, ఇనుము, సీసము (రాహుకేతువులు) - వీటితో నిర్మించవలెను లేదా ఆయా గ్రహముల రంగులతో వ్రాసి గాని, గంధమండలములపై గాని పూజించవలెను. వారి వారి రంగులననుసరించి వస్త్రములు, పుష్పములు, గంధములు, బలులు ఇవ్వవలెను. గుగ్గులుధూప మీయవలెను. ప్రతిగ్రహమునకును మంత్ర పూతము లైన చరువులు ఇవ్వవలెను. ఈ గ్రహములకు వరుసగా ''ఆకృష్ణేన ..... '' ''ఇమం దేవా......'' ''అగ్ని ర్మూర్ధా దివః కకుత్...'' ''ఉద్బుధ్యస్వ...'' ''బృహస్పతే అతి యదర్యః....'', అన్నాత్పరిస్రుతః...'', ''శన్నో దేవీః...'', ''కాణ్డాత్'', ''కేతుం కృణ్వన్నిమాన్...'' అను మంత్రములు వినియోగించవలెను. ఈ గ్రహములకు క్రమముగ - అర్కము - పలాశ - ఖదిర - అపామార్గ - పిప్పల - ఉదుంబర - శమీ - దూర్వా - కుశలు సమిధలు. ఒక్కొక్క గ్రహమునకు ఈ సమిధులు నూటఎనిమిది గాని, నూటఇరువదిగాని, మధు - ఆజ్య - దధులతో హోమము చేయవలెను. ఈ గ్రహముల నుద్దేశించి బ్రాహ్మణులకు భోజనమునందు వరుసగా బెల్లముతో వండిన అన్నము, పాయసము, హవిష్యము, క్షీరయష్టికము, దధ్యోదనము, హవిస్సు, అపూపములు, మాంసము, చిత్రాన్నము ఇవ్వవలెను. వారిని యథాశక్తిగా, యథా లాభముగా సత్కరించవలెను ఈ గ్రహముల నుద్దేశించి క్రమముగా ఈయ దగిన దక్షిణలు - ధేనువు, శంఖము, ఎద్దు, సువర్ణము, వస్త్రము, అశ్వము, కపిలధేనువు, మేక. ఏగ్రహము ఎవనికి దుష్టస్థానాదుల నుండుటచే అపకారిగా నుండునో అతడు ఆ గ్రహమును పూజించవలెను. ''మిమ్ములను ఎవరు పూజింతురో వారిని మీరు పూజించవలెను (రక్షించవలెను).'' అని బ్రహ్మ ఈ గ్రహములకు వరములిచ్చెను రాజుల ఉన్నతి పతనము కూడ గ్రహాధీన మైనది. జగత్తుయొక్క స్థితి లయములు గూడ వీటిపై ఆధారపడి యున్నవి. అందుచే గ్రహములు చాల పూజింపదగినవి. అగ్ని మహాపురాణమునందు నవగ్రహహోమా నిరూపణ మను నూట అరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.