Sri Madhagni Mahapuranamu-1 Chapters
అథ అష్టషష్ట్యుత్తర శతతమో೭ధ్యాయః
అథ మహాపాతకాదిప్రాయశ్చిత్తమ్.
పుష్కర ఉవాచ :
దణ్డం కుర్యాన్నృపో నౄణాం ప్రాయశ్చిత్తమకుర్వతామ్ |
కామతో೭కామతో వాపి ప్రాయశ్చిత్తం కృతం చరేత్. 1
మత్తక్రుద్ధాతురాణాం చ న భు ఞ్జీత కదాచన | మహాపాతకినా స్పృష్టం యచ్చ స్పృష్టముదక్యయా. 2
గణాన్నం గణికాన్నం చ వార్ధుషేర్గాయకస్య చ | అభిశప్తస్య షండస్య యస్యాశ్చోపపతిర్గృహే. 3
రజకస్య నృశంసస్య బన్దినః కితవస్య చ | మిథ్యాతపస్వినశ్చైవ చౌరదణ్డికయోస్తథా. 4
కుణ్డగోలస్త్రీజితానాం వేదవిక్రయిణ స్తథా | శైలూషతన్తువాయాన్నం కృతఘ్నస్యాన్నమేవ చ. 5
కర్మారస్య నిషాదస్య చైలనిర్ణేజకస్య చ | మిథ్యాప్రవ్రజితస్యాన్నం పుంశ్చ ల్యాస్తౌలికస్య చ. 6
ఆరూఢపతిత స్యాన్నం విద్విష్టాన్నం చ వర్జయేత్ | తథైవ బ్రాహ్మణస్యాన్నం బ్రాహ్మణనానిమన్త్రితః. 7
బ్రాహ్మణాన్నం చ శూద్రాన్నం నాద్యాచ్చైవ నిమన్త్రితః |
ఏషామన్యతమస్యాన్నమమత్యా వా త్ర్యహం క్షిపేత్. 8
మత్యా భుక్త్వా చరేత్ కృచ్ర్ఛం రేతో విణ్మూత్రమేవ చ
చణ్డాలశ్వపచాన్నం తు భుక్త్వా చాన్ద్రాయణం చరేత్. 9
అనిర్దశం చ ప్రేతాన్నం గవాఘ్రాతం తథైవ చ | శూద్రోచ్ఛిష్టం శునోచ్ఛిష్టం పతితాన్నం తథైవ చ. 10
తప్తకృచ్ర్ఛం ప్రకుర్వీత హ్యాశౌచే కృచ్ర్ఛమాచరేత్ | ఆశౌచే యస్య యో భుం క్తే సో೭ప్యశుద్దస్తథా భ##వేత్.
పుష్కరుడు చెప్పెను : ప్రాయశ్చిత్తము చేసికొననివారిని రాజు దండిచవలెను. తప్పు తెలిసి చేసినను, తెలియక చేసినను ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. మత్తులు, క్రుద్ధులు, రోగగ్రస్తులు - వీరి అన్నము ఎన్నడును తిన గూడదు. రజస్వల స్పృశించిన అన్నమును, సామూహికాన్నమును, వేశ్యాస్త్రీ అన్నమును తినరాదు. మహాపాతకములు చేసినవాడు, వడ్డీవ్యాపారము చేయువాడు, దాయకుడు, అభిశప్తుడు, నపుంసకుడు, ఉపపతితో నివసించు స్త్రీ, రజకుడు, క్రూరుడు, వంది, జూదగాడు, కపటి, తపస్వి, చోరుడు, దండధారి యైన భటుడు, స్త్రీకిభర్త ఉండగా జారునివలన పుట్టినవాడు, స్త్రీకిభర్త చనిపోయిన పిమ్మట జారునివలన పుట్టినవాడు, స్త్రీకి లొంగిపోయినవాడు, వేదమును అమ్ముకున్నవాడు నటుడు, సాలివాడు, కృతఘ్నుడు, కమ్మరి, నిషాదుడు, బట్టలకు రంగులు వేయువాడు, కపటసంన్యాసి, జారిణి, తిలఘాతకుడు, ఆరూఢపతితుడు, శత్రువు-వీరి అన్నము తినగూడదు. బ్రాహ్మణునిచే నిమంత్రితుడు కానిచో బ్రాహ్మణాన్నము తినగూడదు. నిమంత్రితు డైనను శూద్రాన్నము తినగూడదు. పైన చెప్పిన వారి అన్నమును తెలియక తిన్నచో మూడు దినములు ఉపవాసము చేయవలెను. తెలిసి తిన్నచో కృచ్ర్ఛవ్రత మాచరించవలెను. వీర్యము, మలము, మూత్రము, చాండాలాన్నము శ్వపచాన్నము తిన్నచో చాంద్రాయణవ్రతము చేయవలెను. పది రోజులు దాటని ప్రేతకు ఇచ్చిన అన్నమును, ఆవు వాసనచూసిన అన్నమును, శూద్రోచ్ఛిష్టమును, శునకోచ్ఛిష్టమును, పతితుని అన్నమును తిన్నచో తప్తకృచ్ర్ఛవ్రతము చేయవలెను. అశౌచములో ఉన్న వారి అన్నము తిన్నవాడు అశుద్ధుడగును. అట్టి అన్నము తిన్నపుడు గూడ తప్తకృచ్ర్ఛవ్రతము చేయవలెను.
మృతపఞ్చనఖాత్కూపాదమేధ్యేన సకృద్యుతాత్
అపః పీత్వా త్ర్యహం తిష్ఠేత్ సోపవాసో ద్విజోత్తమః. 12
సర్వత్ర శూద్రే పాదః స్యాద్ద్వితయం వైశ్యభూపయోః |
విడ్వరాహఖరోష్ట్రానాం గోమాయోః కపికాకయోః. 13
ప్రాశ్య మూత్రపురీషాణి ద్విజశ్చాన్ద్రాయణం చరేత్ |
శుష్కాణి జగ్ద్వా మాంసాని ప్రేతాన్నం కరకాణి చ. 14
గోనరాశ్వఖరోష్ట్రాణాం ఛత్రాకం గ్రామకుక్కుటమ్. 15
మాంసం జగ్ధ్వా కుఞ్జరస్య తప్తక్భచ్ర్ఛేణ శుధ్యతి | ఆమశ్రాద్దం తథా భుక్త్వా బ్రహ్మచారీ మధుత్వదన్. 16
లశునం గృఞ్జనం చాద్యాత్ ప్రాజాపత్యాది నా శుచిః |
భుక్త్వా చాన్ద్రాయణం కుర్యాన్మాంసం చాత్మకృతం తథా. 17
పీలుం గవ్యం చపీయూషం తథా శ్లేష్మాతకం మృదమ్ |
వృథా కృసరసం యావపాయసాపూపశష్కు లీః. 18
అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీంషి చ | గవాం చ మహిషాణాం చ వర్జయిత్వా తథాప్యజామ్. 19
సర్వక్షీరాణి వర్జ్యాని తాసాం చైవాప్యనిర్దశమ్ | శశకః శల్లకీ గోధా ఖడ్గః కూర్మస్తథైవ చ. 20
భక్ష్యాః పఞ్చనఖాః ప్రోక్తాః ఫలిశేషాశ్చ వర్జితాః | పాఠీనరౌహితాన్మత్స్యాన్ సింహతుణ్డాంశ్చ భక్షయేత్. 21
యవగోధూమజం సర్వం పయసశ్చైవ విక్రియాః | వాగషాంగవ చక్రాదీన్ సస్నేహముషితం తథా. 22
అగ్నిహోత్రపరీద్దాగ్నిర్ర్బాహ్మణః కామచారతః | చాన్ద్రాయణం చరేన్మాసం వీరవధ్యాసమం హి తత్. 23
ఏదైన ఐదు గోళ్ల జంతువు మరణించిన కూపము నుండి, అపవిత్రవస్తుసంబంధ మేర్పడిన కూపము నుండియు జలము త్రాగినచో ద్విజోత్తముడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. పైపాపము లన్నియు శూద్రుని విషయమున ఒక్క పాదమే అంటును. (ప్రాయశ్చిత్తములు గూ అంతే). వైశ్య క్షత్రియులకు రెండు పాదములు అంటును. గ్రామ్యవరాహము, గాడిద, ఒంటె, నక్క, కోతి, కాకి-వీటి మూత్రపురీషములు తిన్న ద్విజుడు చాంద్రాయణము చేయవలెను. శుష్కమాంసమును, ప్రేతాన్నమును, కరకములను, మాంసము తిను అరణ్యమృగములు, సూకరములు, ఉష్ట్రము, నక్క, కోతి, కాకి, గోవు, నరుడు, అశ్వము, గాడిద - వీటిమాంసమును, ఛత్రాకమును, గ్రామ్యకుక్కుటమును, ఏనుగు మాంసమును తిన్నవాడు తప్తకృచ్ర్ఛ మాచరించి విశుద్ధు డగును. బ్రహ్మచారి ఆమశ్రాద్దమున భుజించినను మద్యము సేవించినను తప్తకృచ్ర్ఛము చేయవలెను. వెల్లుల్లి, గృంజనము తిన్నవాడు ప్రాజాపత్యాదులచే శుద్ధుడగును. తనకొరకై మాంసము వండించుకొని తిన్నవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. పీలుగవ్యము, జున్ను, శ్లేష్మాతకము, మట్టి, నిమిత్తము లేకుండ వండిన పులగము, సంయావము, పాయసము, అప్పములు, చేగోడీలు మొదలైనవాటిని, అసంస్కృతములగు మాంసములను, దేవాన్నములను, హవిస్సులను తిన్నవాడు పైవిధముగ ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఆవులు, గేదెలు, మేకలు తప్ప ఇతర పశువుల పాలు వర్జ్యములు. పై పశువుల పాలు కూడ ఈనిన పది రోజుల లోపున నిషిద్దము. చెవులపిల్లి, సల్లకి, ఉడుము, ఖడ్గమృగము, కూర్మము అను ఐదు గోళ్లు గల జంతువులు భక్ష్యములు. ఇతర జంతువులు భక్ష్యములు కావు. పాఠీనములను, రోహితమత్స్యములను, సింహతుండములను భక్షించవచ్చును. అగ్నిహోత్రమునందు ప్రజ్వలింపచేయబడిన అగ్ని గల బ్రాహ్మణుడు స్వేచ్ఛాగా యవగోధూమలతో చేసి పదార్థములను, పాలతో చేసిన భక్ష్యములను, వాగషాంగవచక్రాదులను, నూనె వస్తువులును, నిలవ ఉన్నదానిని తిన్నచో ఒకమాసము చాంద్రాయణము చేయవలెను. అది వీరవధతో సమాన మైనది.
బ్రహ్మహత్య సురాపానం స్తేయం గుర్వఙ్గనాగమః |
మహాన్తి పాతకాన్యాహుః సంయోగశ్చైవ తైః సహ. 24
అనృతే చ సముత్కర్షో రాజగామి చ పైశునమ్ |
గురోశ్చాలీకనిర్బన్ధః సమానం బ్రహ్మహత్యయా. 25
బ్రహ్మోజ్ఘ్యం వేదనిన్దా చ కౌటసాక్ష్యం సుహృద్వచః | గర్హి తాన్నాజ్యయోర్జగ్ధిః సురాపానసమానిషట్. 26
నిక్షేపస్యాపహరణం నరాశ్వరజతస్య చ | భూమివజ్రమణీనాం చ రుక్మస్తేయసమం స్మృతమ్. 27
రేతః సేకః సయోన్యాసు కుమారీష్వన్త్యజాసు చ | సఖ్యః పుత్రస్య చ స్త్రీషు గురుతల్పసమం విదుః. 28
గోవధో೭యాజ్యసంయాజ్యం పారదార్యాత్మ విక్రయః |
గురుమాతృపితృత్యాగః | స్వాధ్యాయాగ్న్యోః సుతస్య చ.
పరివిత్తితానుజేన పరివేదనమేవ చ | తయోర్ధానం చ కన్యాయాస్తయోరేవ చ యాజనమ్. 30
కాన్యాయా దూషణం చైవ వార్దుష్యం వ్రతలోపనమ్ | తడాగారామదారాణామపత్యస్య చ విక్రయః. 31
వ్రాత్యతా బాన్దవత్యాగో భృతాధ్యాపనమేవ చ | భృతాచ్చాధ్య యనాదానమవిక్రేయస్య విక్రయః. 32
సర్వాకరేష్వధీకరో మహామన్త్రప్రవర్తనమ్ | హింసౌషధీనాం స్త్ర్యాజీవః క్రియాలఙ్ఘనమేవ చ. 33
ఇన్దనార్ధమశుష్కానాం ద్రుమాణాం చైవ పాతనమ్ | యోషితాం గ్రహణం చైవ స్త్రీనిన్దకసమాగమః. 34
ఆత్మార్థం చ క్రియారమ్భో నిన్దితాన్నాదనం తథా | అనాహితాగ్ని తాస్తే యమృణానాం చానపక్రియా. 35
అసచ్ఛాస్త్రాధిగమనం దౌః శీల్యం వ్యసనక్రియా | ధాన్యకుప్యపశుపస్తేయం మద్యపస్త్రీనిషేవణమ్. 36
స్త్రీ శూద్రవిట్ క్షత్రవధో నాస్తీక్యం చోపపాతకమ్ | బ్రాహ్మణస్య రుజః కృత్యం ఘ్రాతిర ఘ్రేయమద్యయోః.
జైహ్మ్యం పుంసి చ మైథున్యం జాతిభ్రంశకరం స్మృతమ్ |
శ్వఖరోష్ట్రమృగేన్ద్రాణామజావ్యోశ్చైవ మారణమ్. 38
సంకీర్ణకరణం జ్ఞేయం మీనాహినకులస్య చ | నిన్దితేభ్యో ధనాదానం వాణిజ్యం శూద్రసేవనమ్. 39
అపాత్రకరణం జ్ఞేయమసత్యస్య చ భాషణమ్ | కృమికీటవయోహత్యా మద్యానుగతభోజనమ్. 40
ఫలైధః కుసుమస్తేయమధైర్యం చ మలావహమ్
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మహాపాతకాదిప్రాయశ్చిత్తం నామాష్టషష్ట్యధిక శతతమో೭ధ్యాయః.
బ్రహ్మహత్య, సురాపానము, (సువర్ణ) చౌర్యము, గురుస్త్రీసంగమము, ఇవి మహాపాతకములు. ఈ మహాపాతకములు చేసిన వారితో సంబంధము కూడ మహాపాతకము. అసత్యమును పెంపొందించుట, రాజువిషమున చాడీలు చెప్పుట, పూజ్యుని అనావశ్యకముగ నిర్బంధించుట - ఇవి బ్రహ్మహత్యతో సమానము. వేదమును పరిత్యజించుట, వేదనింద, కపట సాక్ష్యము, మిత్రుని చంపుట, నింద్య మైన అన్నమును ఆజ్యమును తినుట ఈ ఆరును సురాపానసమానములు. దాచా ఉంచిన వస్తువును, నరులను, ఆశ్వములను రజతములు అపహరించుట, భూమిని, వజ్రమును, మణిని హరించుట సువర్ణస్తేయముతో సమానము. తోడబుట్టువులు, బాలికలు. అంత్య జాతుల స్త్రీలు, మిత్రుని స్త్రీలు, పుత్రుని స్త్రీలు, వీరియందు రేతఃసేకము గురుపత్నీ గమనతుల్యము. గోవధ, అయాజ్యులచే యాగము చేయించుట, పరస్త్రీ సంబంధము, తనను ఇతరులకు అమ్మివేయుట, గురువును, తల్లిని, తండ్రిని విడచివేయుట, స్వాధ్యాయమును, అగ్నిని, పుత్రుని పరిత్యజించుట, పరివిత్తిత్వము (తమ్ముడు వివాహము చేసికొనగా తాను అవివాహితుడుగా నుండుట), తమ్ముడు పరివేదనము చేయుట (అన్న కంటె ముందుగా వివాహము చేసికొనుట), అట్టివారికి కన్యను ఇచ్చుట, వారికి యాజకుడుగా నుండుట, కన్యను చెరచుట, వడ్డీతో జీవించుట, వ్రతమునకు విఘాతము కలిగించుట, తటాకమును, ఆరామమును, భార్యను సంతానమును విక్రయించుట, స్వధర్మపరిత్యాగము, బాంధవత్యాగము, జీతమునకు వేధాధ్యయనము చేయించుట జీతము తీసికొను వానినుండి అధ్యయనము చేయుట, అమ్మకూడనివాటిని అమ్ముట, గనులపై అధికారము, పెద్దయంత్రములను నడపుట, ఓషధులను హింసించుట, స్త్రీపై ఆధారపడి జీవించుట, కర్తవ్యమును దాటవేయుట, కట్టెలకొరకై సజీవములైన వృక్షములను ఛేదించుట, స్త్రీలను నిర్బంధించుట, స్త్రీలను నిందించువారితో స్నేహము, స్వలాభము కొరకై పనులు ప్రారంభించుట, నిందితుల అన్నము తినుట, అగ్న్యాధానము చేయకుండుట, చౌర్యము, బుణములు తీర్చకపోవుట, అసచ్ఛాస్త్రముల అభ్యాసము, దుష్టశీలము, ధాన్యమును, వెండి మొదలగువాటిని పశువులను అపహరించుట, మద్యమును త్రాగుస్త్రీని సేవించుట స్త్రీని, శూద్రుని, వైశ్యుని, క్షత్రియుని చంపుట, నాస్తికత్వము- ఇవి ఉపపాతకములు. బ్రహ్మణునకు పీడ కల్గించుట, వాసనచూడదగని వాటిని, మద్యమును వాసనచూచుట, వక్రత్వము, పురుషునితో మైథునము-ఇవన్నియు జాతిభ్రష్టత్వమును కలిగించును. కుక్క, గాడిద, ఒంటె, సింహము, మేక, గొఱ్ఱ- వీటిని చంపుట, మీన - సర్ప - నకులములను చంపుట - ఇది సంకీర్ణకరణ మని చెప్పబడును. నిందితులనుండి ధనము స్వీకరించుట, వాణిజ్యము, శూద్రసేవ, అసత్యభాషణము ఇవి ''అపాత్రీకరణము''. కృమి - కీట - పక్షులను చంపుట, మద్యము కలిసిన భోజనము, ఫలములను, పుష్పములను అపహరించుట, అధైర్యము -ఇవి పాపహేతువులు.
అగ్నిమహాపురాణమునందు మహాపాతకాదిప్రాయశ్చిత్త మను నూటఅరువదియెనిమిది అధ్యాయము సమాప్తము.