Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుఃసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః అథ పునః ప్రాయశ్చిత్తాని అగ్నిరూవాచ : దేవాశ్రమార్చనాదీనాం ప్రాయశ్చిత్తం తు లోపకః | పూజాలోపే చాష్టశతం జపేద్ద్విగుణపూజనమ్. 1 పఞ్చోపనిషదైర్మన్త్రైర్హుత్వాబ్రాహ్మణభోజనమ్ | సూతికాన్త్యజకోదక్యాస్పృష్టే దేవే శతం జపేత్. 2 పఞ్చోపనిషదైః పూజాం ద్విగుణం స్నానమేవ చ | విప్రభోజ్యం హోమలోపే హోమస్నానం తథార్చనమ్. 3 హోమద్రవ్యే మూషికాద్యైర్భక్షితే కీటసంయుతే | తావన్మాత్రం పరిత్యజ్య ప్రోక్ష్య దేవాది పూజయేత్. 4 అఙ్కురార్పణమాత్రం తు ఛిన్నం భిన్నం పరిత్యజేత్ | అస్పృశ్యైశ్చైవ సంస్పృష్టే హ్యన్యపాత్రే తదర్పణమ్. 5 దేవమానుషవిఘ్నఘ్నం పూజాకాలే తథైవ చ | మన్ద్రద్రవ్యాదివ్యత్యాసే మూలం జప్త్యా పునర్జపేత్. 6 కుమ్భే నష్టే శతజాపో దేవే తు పతితే కరాత్ | భిన్నే నష్టేచోపవాసః శతహోమాచ్ఛుభం భ##వేత్. 7 కృతే పాపే7ను తాపో వై యస్య పుంసః ప్రజాయతే. | ప్రాయశ్చిత్తం తు తసై#్యకం హరిసంస్మరణం పరమ్ . 8 చాన్ద్రాయణం పరాకో వా ప్రాజాపత్యమఫ°ఘనుత్ | సూర్యేశశక్తి శ్రీశాదిమన్త్రజప్యమఫ°ఘనుత్. 9 గాయత్రీప్రణవస్తోత్రమన్త్రజప్యమఘాన్తకమ | కాద్యైరాబీజసంయుక్తైరాద్యైరాద్యైస్తదన్తకైః. 10 సూర్యేశశక్తిశ్రీశాదిమన్త్రాః కోట్యధికాః పృథక్ | ఓం హ్రీమాద్యాశ్చతుర్థ్యన్తానమో7న్తాః సర్వకామదాః 11 దేవాలయాదులలో అర్చనాదులు చేయుటలో ఏవైన లోపములు వచ్చినచో అట్టిలోపములు చేసినవాడు ప్రాయశ్చిత్తము చేయవలెను. పూజాలోపము కలిగినచో నూట ఎనిమిది పర్యాయములు జపము చేసి, రెట్టింపు పూజ చేయవలెను. పంచోపనిషన్మంత్రములతో హోమము చేసి బ్రాహ్మణ భోజనము చేయించవలెను. సూతిక కలవారుగాని, అంత్యజులుగాని రజస్వలగాని దేవుని స్పృశించినచో నూరు పర్యాయములు జపముచేసి పంచోపనిషన్మంత్రములతో పూజ రెట్టింపు అభిషేకము చేయవలెను. హోమమునందు లోపమున్నచో బ్రాహ్మణభోజనము హోమస్నానము, అర్చనము చేయవలెను. హోమద్రవ్యము ఎలుకలు మొదలగు వాటిచే భక్షింపబడినను, కీటకములతో కూడినను ఆ భాగమును త్యజించి, మిగిలిన దానిని జలముతో ప్రోక్షించి దేవాదిపూజ చేయవలెను. అంకురార్పణము భిన్నమైనను, ఛిన్నమైనను దానిని పరిత్యజించవలెను. ఆ అంకురార్పణ పాత్ర అస్పృశ్యులచే స్పృశింపబడినచో దానిని మరొక పాత్రలో నుంచి సమర్పించవలెను. పూజాకాలమునందు, దేవమానుషవిఘ్నములను తొలగించుటకును, మంత్రద్రవ్యాదివ్యత్యాసము కలిగినపుడును మూలమంత్రమును జపించి మరల జపము చేయవలెను. దేవాలయమునందలి కుంభము నష్టమైనపుడు శతవారజపము దేవతా ప్రతిమ చేతినుండి జారి పడి పోయినచో ఉపవాసము చేసి నూరు హోమములు చేసినచో శుభమగును. పాపము చేసి పశ్చాత్తాపము చెందువానికి హరిస్మరణమే పరమ ప్రాయశ్చిత్తము. చాంద్రాయణము, పరాకము, ప్రాజాపత్యము పాపములను తొలగించును. సూర్య-శివ-శక్తి-విష్ణుమంత్రముల జపము కూడ పాపములను నశింపచేయును. గాయత్రీ-ప్రణవ-స్తోత్ర-మంత్రముల జపము కూడ పాపవినాశకము. సూర్య-శివ-శక్తి-విష్ణువుల క కారముతో ప్రారంభ##మై రా బీజముతో కూడి నవియు రాది - ఆది-రాంతమంత్రములును ఒక్కొకటి కోట్యధిక ఫలము నిచ్చును. ఓం హ్రీం లతో ప్రారంభ##మైన నమః అంతమునందుండు చతుర్థ్యంత మంత్రములు సర్వకామప్రదములు. నృసింహద్వాదశాష్టార్ణమాలామన్త్రాద్యఫ°ఘనుత్ | ఆగ్నేయస్య పురాణస్య పఠనం శ్రవణాదికమ్. 12 ద్వివిద్యారూపకో విష్ణురగ్ని రూపస్తుగీయతే | పరమాత్మా దేవముఖం సర్వవేదేషు గీయతే. 13 ప్రవృత్తౌ తు నివృత్తౌ తు ఇజ్యతే భుక్తిముక్తిదః | అగ్నిరూపస్య విష్ణోర్హి హవనం ధ్యానమర్చనమ్. 14 జప్యం స్తుతిశ్చ ప్రణతిః శరీరస్థాద్యఫ°ఘనుత్ | దశస్వర్ణాని దానాని ధాన్యద్వాదశ##మేవ చ. 15 తులాపురుషముఖ్యాని మహాదానాని షోడశ | అన్నదానాని ముఖ్యాని సర్వాణ్యఘహరాణి చ. 16 తిథివారర సంక్రాన్తి యోగమన్వాదికాలకే | వ్రతాదిసూర్యేశశక్తిశ్రీశాదేరఘఘాతనమ్ . 17 గఙ్గాగయాప్రయాగశ్చకాశ్యయోధ్యాహ్యవన్తి కా | కురుక్షేత్రం పుష్కరం చ నైమిషం పురుషోత్తమః. 18 శాలగ్రామప్రభాసాద్యం తీర్థం చాఫ°ఘఘాతకమ్ | అహం బ్రహ్మ పరంజ్యోతిరితిధ్యానమఫ°ఘనుత్. 19 శిక్షా ఛన్దో వ్యాకరణం నిరుక్తం చాభిధానకమ్. | కల్పో న్యాయశ్చ మీమాంసా హ్యన్యత్సర్వం హరిః ప్రభుః. 22 ఏకో ద్వయోర్యతో యస్మిన్యః సర్వమితి వేద యః. | తం దృష్ట్వాన్యస్య పాపాని వినశ్యన్తి హరిశ్చ సః. 23 విద్యాష్టాదశరూపశ్చ సూక్ష్మః స్థూలో7