Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అశీత్యధిక శతతమోధ్యాయః. అథ పఞ్చమీవ్రతాని. అగ్ని రువాచ :- పఞ్చమీవ్రతకం వక్ష్యే ఆరోగ్యస్వర్గమోక్షదమ్ | నభోనభోస్యాశ్వినే చ కార్తి కే శుక్లపక్షకే. 1 వాసుకి స్తక్షకః పూజ్యః కాలీయో మణిభద్రకః | ఖరావతో ధృతరాష్ట్రః కర్కోటకధనఞ్జ¸°. 2 వీత్వే ప్రయచ్ఛన్త్య భయమాయుర్విద్యాం యశః శ్రియమ్. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పఞ్చమీవ్రతాని నామాశీత్యధికశతతమో೭ధ్యాయః. అగ్ని పలికెను : ఆరోగ్య - స్వర్గ - మోక్షప్రద మగు పంచమీవ్రతమును చెప్పెదను. శ్రావణ - భాద్రపద ఆశ్వయుజ - కార్తికశుక్లపక్ష పంచమీతిథులందు వాసుకి - తక్షక - కాలియ - మణిభద్ర - ఐరావత - ధృతరాష్ట్ర - కర్కోటక - ధనంజయు లను నాగులను పూజించవలెను. ఈ నాగము లన్నియు అభయ - ఆయుర్విద్యా - యశో - లక్ష్ములను ఇచ్చెదరు. అగ్ని మహాపురాణమునందు పంచమీవ్రత వర్ణన మను నూటఏనుబదవ అధ్యాయము సమాప్తము.