Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకాశీత్యుత్తర శతతమోధ్యాయః అథ షష్ఠీవ్రతాని అగ్ని రువాచ : షష్ఠీవ్రతాని వక్ష్యామి కార్తికాదౌ సమాచరేత్ | షష్ఠ్యాం ఫలాశనోర్ఘ్యాద్యైర్భుక్తిముక్తమిమవాప్నుయాత్. 1 స్కన్దషష్ఠీవ్రతం ప్రోక్తం భాద్రే షష్ఠ్యామథాక్షయమ్ | కృష్ణషష్ఠీవ్రతం వక్ష్యే మార్గశీర్షే చరేచ్చ తత్ | అనాహారో వర్షమేకం భుక్తిముక్తిమవాప్నుయాత్. 2 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే షష్ఠీవ్రతాని నామైకాశీత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు షష్ఠీవ్రతములను గూర్చి చెప్పెదను. కార్తికకృష్ణషష్ఠియందు ఫలములు భుజించి కార్తికేయునకు అర్ఘ్యదానము చేయలెను. దీని వలన మనుష్యుడు భుక్తిముక్తులను పొందును. దీనికి స్కందషష్ఠీ వ్రత మని పేరు. భాద్రపదకృష్ణషష్ఠియందు అక్షయషష్ఠీవ్రతము చేయవలెను. ఇది మార్గశీర్గమునందు గూడ చేయవలెను. ఈ అక్షయషష్ఠీదివసమున ఏ ఒక సంవత్సరమునందైనను ఉపవాస ముండువాడు భుక్తిముక్తులను పొందును. అగ్నిమహాపురాణమునందు నూటఎనుబదియొకటవ అధ్యాయము సమాప్తము.