Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వ్యశీత్యధిక శతతమో7ధ్యాయః అథ సప్తమీవ్రతాని అగ్ని రువాచ : సప్తమీ వ్రతకం వక్ష్యే సర్వేషాం భుక్తిముక్తిదమ్ | మాఘమాసే೭బ్జకే శుక్లే సూర్యం ప్రార్చ్య విశోకభాక్. సర్వావాప్తిస్తు సప్తమ్యాం మాసి భాద్రే೭ర్కపూజనాత్ | పౌషే మాసి సితే ೭నశ్నన్ప్రార్చ్యార్కం పాపనాశనమ్. 2 కృష్ణపక్షే తు మాఘస్య సర్వావాప్తిస్తు సప్తమీ | ఫాల్గునే తు సితే నన్దాసప్తమీ చార్కపూజనాత్. 3 మార్గశీర్షే సితే ప్రార్చ్య సప్తమీ చాపరాజితా | మార్గశీర్షే సితే చాబ్దం పుత్రీయా సప్తమీ స్త్రియాః. 4 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సప్తమీవ్రతాని నామ ద్వ్యశీత్యధిక శతతమో೭ ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : అందరికిని భుక్తిముక్తిప్రద మగు సప్తమీ వ్రతమును చెప్పెదను. మాఘశుక్ల సప్తమీతిథియందు కమలమును నిర్మించి దానిపై సూర్యుని పూజించినవాడు శోకరహితు డగును. భాద్రపదశుక్ల సప్తమి యందు సూర్యుని పూజించినచో సకలాభీష్టవస్తువులు లభించును. పౌషశుక్లసప్తమియందు ఉపవాసము చేసి సూర్యుని ఆరాధించినచో సకలపాపములును నశించును. మాఘకృష్ణసప్తమినాడు 'సర్వాప్తిసప్తమీ' వ్రతము చేసినచో అభీష్ట-వస్తువులు లభించును. ఫాల్గునకృష్ణపక్షమునందు నందసప్తమీవ్రతమును చేయవలెను. మార్గశీర్షశుక్లపక్షమున పుత్రీయసప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు. అగ్నిమహాపురాణమునందు సప్తమీవ్రతవర్ణన మను నూటఎనుబదిరెండవ అధ్యాయము సమాప్తము. (అ) 61