Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ త్ర్యశీత్యధిక శతతమో೭ధ్యాయః అథ అష్టమీవ్రతాని అగ్ని రువాచ : వక్ష్యే వ్రతాని చాష్ట్యమ్యాం రోహిణ్యాం ప్రథమం వ్రతమ్ | మాసి భాద్రపదే ೭ష్టమ్యాం రోహిణ్యామర్ధరాత్ర కే. కృష్ణో జాతో యత స్తస్యాం జయన్తీ స్యాత్తతో೭ష్టమీ | సప్తజన్మకృతాత్పాపాన్ముచ్యతే చోపవాసతః. 2 కృష్ణపక్షే భాద్రపదే చాష్టమ్యాం రోహిణీయుతే | ఉపోషితోర్చ೭యేత్కష్ణం భుక్తిముక్తిప్రదాయకమ్. 3 ఆవాహయామ్యహం కృష్ణం బలభద్రం చ దేవకీమ్ | వసుదేవం యశోదాం గాః పూజయామి నమోస్తుతే. 4 యోగాయ యోగపతయే యోగేశాయ నమోనమః | యోగాదిసంభవాయైవ గోవిన్దాయ నమోనమః. 5 స్నానం కృష్ణాయ దద్యాత్తు హ్యర్ఘ్యం చానేన దాపయేత్ | యజ్ఞయ యజ్ఞేశ్వరాయ యజ్ఞానాం పతయే నమః. 6 యజ్ఞాదిసంభవాయైవ గోవిన్దాయ నమో నమః | గృహాణ దేవ పుష్పాణి సుగన్ధీని ప్రియాణి తే. 7 సర్వకామప్రదో దేవ భవ మే దేవవన్దిత | ధూపధూపిత ధూపం త్వం ధూపితస్త్వం గృహాణ మే. 8 సుగన్ధధూపగన్ధాఢ్యం కురు మాం సర్వదా హరే | దీపదీప్త మహాదీపం దీపదీప్తిద సర్వదా. 9 మయాదత్తం గృహాణ త్వం కురుచోర్ధ్వగతిం చ మామ్ | విశ్వాయ విశ్వపతయే విశ్వేశాయ నమో నమః. 10 విశ్వాదిసంభవాయైవ గోవిన్దాయ నివేదితమ్. | ధర్మాయ ధర్మపతయే ధర్మేశాయ నమో నమః. 11 ధర్మాదిసంభవాయైవ గోవిన్ద శయనం కురు | సర్వాయ సర్వపతయే సర్వేశాయ నమో నమః 12 సర్వాదిసంభవాయైవ గోవిన్దాయ చ పావనమ్ | క్షీరోదార్ణవసంభూత అత్రినేత్రసముద్భవ. 13 గృహాణార్ఘ్యం శశాఙ్కేదం రోహిణ్యా సహితో మమ | స్థణ్డితే స్థాపయేద్దేవం సచన్ధ్రాం రోహిణీంయజేత్. 14 దేవకీం వసుదేవం చ యశోదాం నన్దకం బలమ్ | అర్థరాత్రే పయోధారాః పాతయేద్గుడసర్పిషా. 15 వస్త్రహేమాదికం దద్యాద్బ్రాహ్మణాన్భోజయేద్ర్వతీ | జన్మాష్టమీవ్రతకరః పుత్రవాన్విష్ణులోకభాక్. 16 వర్షే వర్షే తు యః కుర్వాత్పుత్రార్దీ వేత్తి నో భయమ్ | పుత్రాన్ దేహి ధనం దేహి హ్యాయురారోగ్యసన్తతిమ్. 17 ధర్మం కామం చ సౌభాగ్యం స్వర్గం మోక్షం చ దేహి మే. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే జయన్త్యష్టమీవ్రతం నామ త్ర్యశీతుత్తర శతతమో೭ధ్యాయః. అగ్నిదేవుడు పలికెను - ఇపుడు అష్టమీ తిథియందు జరుపబడు వ్రతములను వర్ణింతును. వాటిలో మొదటిది రోహిణీ యుక్తాష్టమీవ్రతము. భాద్రపద కృష్ణ పక్షమున రోహిణీయుక్తాష్టమీ తిథియందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడవతరించెను. అందుచే ఈ అష్టమీ జయంతిగా చెప్పబడుచున్నది. ఆ దినమున ఉపవాసము చేయువాడు సప్త జన్మకృతపాపములనుండి విముక్తుడగును. భాద్రపదమున, రోహిణీ యుక్తాష్టీమీ తిథియందు ఉపవాస ముండి శ్రీకృష్ణుని పూజించవలెను. ఇది భుక్తి ముక్తి ప్రదము. ''నేను శ్రీకృష్ణ - బలరామ - దేవకీ - వసుదేవ - యశోదా - గోవులను ఆవాహన చేసి పూజించుచున్నాను. మీ అందరికిని నమస్కారము. యోగస్వరూపుడు యోగపతి, యోగీశ్వరుడు, అగు శ్రీకృష్ణునకు నమస్కారము. యోగమునకు ఆదికారణ భూతుడును, ఉత్పత్తి స్థానమును అగు గోవిందునకు అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను.'' ఇట్లు ఆవాహనము చేసి శ్రీకృష్ణునకు స్నానము చేయించి - ''యజ్ఞేశ్వరా! యజ్ఞరూపా! యజ్ఞాధిపతీ! యజ్ఞాది కారణభూతుడా! గోవిందా! నీకు మాటిమాటికిని నమస్కారము.'' అని అర్ఘ్యదానము చేయవలెను. దేవా! నీకు ప్రియమైన సుంగంధయుక్తములగు ఈ పుష్పములను స్వీకరింపుము. దేవతలచే పూజింపబడినవాడా! నా కోరికల నన్నింటిని తీర్పుము. నీవు సదా ధూపముచే ధూపితుడవు, నేను సమర్పించిన ఈ ధూపముచే నీవు ధూప సుగంధమును గ్రహింపుము. నన్ను సర్వదా ధూపసుగంధ సంపన్నుని చేయుము.'' అని చెప్పుచు పుష్ప ధూపములు సమర్పించవలెను. ''ఓ ప్రభూ! నీవు సర్వాదా దీపమువలె దీపించుచుందువు. దీపమునకు కాంతి నిచ్చువాడవు. నే నిచ్చిన ఈ మహాదీపమును స్వీకరించి నన్ను కూడ దీపము వలె ఊర్ధ్వగతి కలవానిని చేయుము, విశ్వరూపా, విశ్వపతీ, విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము; నమస్కారము, విశ్వమునకు ఆదికారణభూతుడైన శ్రీ గోవిందునకు నేను ఈ దీపము నిచ్చుచున్నాను.'' అని చెప్పుచు దీపము సమర్పించవలెను. ''ధర్మ స్వరూపుడును, ధర్మాధిపతియు, ధర్మమునకు ఆదిస్థాన భూతుడును అగు వాసుదేవునకు నమస్కారము, గోవిందా! నీ విపుడు శయనింపుము. సర్వరూపుడు, సర్వాధిపతి, సర్వేశ్వరుడు, సర్వాధికారణభూతుడు అగు గోవిందునకు మాటి మాటికిని నమస్కారము,'' అని చెప్పుచు శయనింప చేయవలెను. ''క్షీర సముద్రము నుండి పుట్టినవాడవును, అత్రినేత్ర సముద్భూతు డవును, తేజఃస్వరూపుడవును అగు ఒ శశాంకా! రోహిణీ సహితుడవై నే నిచ్చు అర్ఘ్యము గ్రహించుము'' అని చెప్పుచు చంద్రునకు అర్ఘ్య ప్రదానము చేయవలెను. పిదప భగవద్విగ్రహమును వేదికపై స్థాపించి, చంద్ర సహిత రోహిణీ పూజ చేయవలెను. అర్ధరాత్రియందు గుడ - ఘృతమిశ్ర క్షీరధారలతో వసుదేవ -దేవకీ - నంద - యశోదా - బలరాములకు అభిషేకము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి దక్షిణగా వస్త్రసువర్ణాదుల నీయవలెను. జన్మాష్టమీవ్రతము చేయువాడు పుత్రానందము పొంది విష్ణులోకనివాసి యగును. పుత్రప్రాప్తిని కోరి ప్రతిసంవత్సరము ఈ వ్రతము చేయువాడు పున్నామనరకవిముక్తుడగును. ''హే ప్రభూ! నాకు పుత్రులను, ధనమును, ఆయుస్సును, ఆరోగ్యమును సంతతిని ఇమ్ము. గోవిందా! నాకు ధర్మ - కామ - సౌభాగ్య - స్వర్గ మోక్షముల నిమ్ము.'' అని ప్రార్థించవలెను. అగ్ని మహాపురాణమునందు అష్టమీవ్రతవర్ణన మను నూటఎనుబదిమూడవ అధ్యాయము సమాప్తము.