Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షణ్ణవత్యుత్తర శతతమో7ధ్యాయః అథ నక్షత్రవ్రతాని అగ్నిరువాచ : నక్షత్రవ్రతకం వక్షే భే హరిః పూజితో7ర్థదః | నక్షత్రపురుషం చాదౌ చైత్రమాసే హరిం యజేత్. 1 మూలే పాదౌ యజేజ్జజ్ఘే రోహీణీస్వర్చయేద్దరిమ్ | జానునీ చాశ్వినీయోగే హ్యాషాఢాసూరుసంజ్ఞకే. 2 మేఢ్రం పూర్వోత్తరాస్వేన కటిం వై కృత్తికాసు చ | పార్శ్వే భాద్రపదాభ్యాం తు కుక్షిం వై రేవతీషు చ. 3 స్తనే చైవానురాధాసు ధనిష్ఠాసు చ పృష్ఠకమ్ | భుజౌ పూజ్యౌ విశాఖాసు పునర్వస్వజ్గులీర్యజేత్. 4 ఆశ్లేషాసు నఖాన్ పూజ్య కణ్ఠం జ్యేష్ఠాసు పూజయేత్ | శ్రోత్రే విష్ణోశ్చ శ్రవణ ముఖే పుష్యే హరేర్యజేత్. యజేత్స్వాతిషు దన్తాగ్రమాస్యం వారుణతో7ర్చయేత్ | మఘాసు నాసాం నయనే మృగశీర్షే లలాటకమ్. 6 చిత్రాచార్ద్రాసు కచానబ్దా న్తే స్వర్ణకం హరిమ్ | గుడపూర్ణే ఘటే7భ్యర్చ్య శయ్యాగోర్థాదిదక్షిణాః 7 నక్షత్రపురుషో విష్ణుః పూజనీయః శివాత్మకః | శామ్భవాయనీయవ్రతకృన్మాసభే పూజయేద్ధరిమ్. 8 కార్తికే కృత్తికాయాం చ మృగశీర్షే మృగాస్యకే | నామభిః కేశవాద్యైస్తు అచ్యుతాయ నమో7పి వా. 9 కార్తికే కృత్తికాభే7హ్ని మాసనక్షత్రగం హరిమ్ | శామ్భవాయనీయవ్రతకం కరిష్యే భుక్తిముక్తిదమ్. 10 కేశవాదిమహామూర్తిమచ్యుతం సర్వదాయకమ్ | ఆవాహయామ్యహం దేవమాయురారోగ్యవృద్ధిదమ్. 11 కార్తికాదౌ సకాసారమన్నం మాసచతుష్ఠయమ్ | ఫాల్గునాదౌ చ కృసరమాషాఢాదౌ చ పాయసమ్. 12 దేవాయ బ్రహ్మణభ్యశ్చ నక్తం నైవేద్యమాశ##యేత్| పఞ్చగవ్యజలే స్నాతస్తసై#్యవ ప్రాశనాచ్ఛుచిః. 13 అర్వాగ్విసర్జనాద్ద్రవ్యం నై వేద్యం సర్వముచ్యతే| విసర్జితే జగన్నాధే నిర్మాల్యం భవతి క్షణాత్. 14 నమోనమస్తే7చ్యుత మే క్షయో7స్తు పాపస్య వృద్దిం సముపైతు పుణ్యమ్ | ఐశ్వర్యవిత్తాది సదాక్షయం మే క్షయం చ మా సన్తతిరభ్యుపైతు. 15 యథాచ్యుతస్త్వం పరతః పరస్తాత్స బ్రహ్మభూతః పరతః పరాత్మన్. తథాచ్యుత త్వం కురు వాఞ్చితం మే మయా కృతం పాపహరాప్రమోయ. 16 అచ్యుతానన్త గోవిన్ద ప్రసీద యదభీప్సితమ్ | అక్షయం మామమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ. 17 సప్తవర్షాణి సంపూజ్య భుక్తిముక్తిమవాప్నుయాత్ | అనన్తవ్రతమాఖ్యాస్యే నక్షత్రవ్రతకే7ర్థదమ్. 18 మార్గశీర్షే మృగశిరే గోమూత్రాశీ యజేద్ధరిమ్ | అనన్తం సర్వకామానామనన్తో భగవాన్ ఫలమ్. 19 దదాత్యనన్తం చ పునస్తదేవాన్యత్ర జన్మని | అనన్తపుణ్యోపచయం కరోత్యేతన్మహావ్రతమ్. 20 యథాభిలషితప్రాప్తిం కరోత్యక్షయమేవ చ | పాదాది పూజ్య నక్తే తు భుఞ్జీయా త్తైలవర్జితమ్. 21 ఘృతేనానన్తముద్దిశ్య హోమో మాస చతుష్ఠయమ్ | చైత్రాదౌ శాలినా హోమః పయసా శ్రావణాదిషు. 22 మాన్ధాతా భూద్యువనాశ్వానన్తవ్రతకాత్సుతః | ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నక్షత్రవ్రతానినామషణ్ణవత్యధిక శతతమో7ధ్యాయః. అగ్నిదేవుడు పలికెను : ఇపుడు నక్షత్రవ్రతములను గూర్చి చెప్పెదను. నక్షత్ర విశేషములందు పూజ చేయుటచే శ్రీమహావిష్ణువు సకలాభీష్టములను తీర్చును. ప్రప్రథమముగా, నక్షత్రపురుషు డైన శ్రీమహావిష్ణువును చైత్రమాసమునందు పూజించవలెను. మూలనక్షత్రమునందు శ్రీమహావిష్ణువు చరణకమలములను, రోహిణీనక్షత్రమున మోకాళ్ళను, పూర్వాషాఢోత్తరాషాఢలందు ఊరుద్వయమును, పూర్వఫల్గున్యుత్తరఫల్గునులయందు, మేఢ్రమును, కృత్తికయందు కటిప్రదేశమును, పూర్వాభాద్రోత్తరాభాద్రలయందు పార్శ్వములను రేవతియందు కుక్షిని, అనూరాధయందు స్తనద్వయమును ధనిష్ఠయందు పృష్ఠభాగమును, విశాఖయందు భుజద్వయమును, పునర్వసువునందు వ్రేళ్ళను పూజించవలెను. ఆశ్లేషయందు నఖములను, జ్యేష్ఠయందు కంఠమును, శ్రవణమునందు, కర్ణములను, పుష్యమియందువదనమండలమును, స్వాతియందు దంతాగ్రములను శతభిషమునందు ముఖమును, మఘయందు నాసికను, మృగశిరయందు నేత్రములను, చిత్తయందు లలాటములు, ఆర్ద్రయందు కేశసమూహమును పూజించవలెను. సంవత్సరాంతమున బెల్లమునింపిన కలశ##పై శ్రీమహావిష్ణువు స్వర్ణమూర్తిని పూజించి బ్రాహ్మణునకు దక్షిణాసహితముగ శయ్య, గోవు, ధనము మొదలగునవి దానము చేయవలెను. సర్వపూజనీయు డగు నక్షత్రపురుషుడైన శ్రీమహావిష్ణువునకును, శివునకును భేదము లేదు. అందు శాంభవాయనీయవ్రత మాచరించువాడు కృత్తికా సంబద్ద మగు కార్తికమాసమునందును, మృగశీర్ష నక్షత్రసంబద్ధ మగు మార్గశీర్షమాసమునందును కేశవాది నామములతోడను, అచ్యుతాయ నమః ఇత్యాదినామములతోడను శ్రీమహావిష్ణువును పూజించవలెను, ''నేను కార్తికమాసముయొక్క కృత్తకాసంబద్ధ పూర్ణిమనాడు మాసమునందును, నక్షత్రమునందును ఉన్న శ్రీహరిని పూజింతును. భుక్తి ముక్తిప్రద మగు శాంభవనీయవ్రత మాచరింతును'' అని సంకల్పించవలెను. '' కేశవాదిమూర్తులతో ఉన్నవాడును. ఆయురారోగ్యవృద్ధికలిగించువాడును అగు అచ్యుతుని ఆవాహనము చేయుచున్నాను'' అని ఆవాహనము చేయవలెను. కార్తికమునుండి మాఘమువరకు నాల్గు మాసములు అన్నదానము చేయవలెను. ఫాల్గునమునుండి ఆషాఢమువరకు ముద్గాన్నము అషాఢమునుండి ఆశ్వయుజమువరకు పాయసము దానము చేయవలెను. రాత్రియందు శ్రీమహావిష్ణువునకును బ్రాహ్మణునకును నైవేద్యము సమర్పించవలెను. పంచగవ్య జలముతో స్నానము చేసి, దానిని త్రాగుటచే పవిత్రుడగును. ఉద్వాసన చెప్పుటకు పూర్వము దేవునకు సమర్పించిన దంతయు నైవేద్యము; ఉద్వాసనచెప్పగానే అదిఅంతయు నిర్మాల్యమగును. ''అచ్యుతా! నీకు నమస్కారము. నమస్కారము. నాపాపములు నశించి పుణ్యము వృద్దిపొందు గాక! నా ఐశ్వర్యాదులు సదా అక్షయ్యము లగుగాక. నా సంతాన పరంపర విచ్ఛిన్నము కాకుండుగాక. పరాత్పరా! పరమేశ్వరా! నీవుపరాత్పరుడవై బ్రహ్మవై నీ మర్యాదనుండి ఎన్నడును ఏ విధముగ చ్యుతుడవు కావో అట్లే నా మనోవాంఛిత కార్యమును సఫలము చేయుము. ఓ పాపవినాశకా! నేను చేసిన పాపములు తొలగింపుము. అచ్యుతా! అనంతా!గోవిందా! అప్రమేయస్వరూపా! పురుషోత్తమా! నన్ననుగ్రహించి నా కభీష్టములైన పదార్థములను అక్షయములుగ చేయుము''. అని ప్రార్థించవలెను. ఈ విధముగ ఏడు సంవత్సరములు శ్రీహరిని పూజించినవాడు భోగమోక్షములను పొందును. ఈ నక్షత్రవ్రత సందర్భమున సకలాభీష్టప్రద మగు అనంతవ్రతమును గూర్చి చెప్పెదను. మార్గశీర్ష మాసమునందు మృగశీర్ష నక్షత్రము వచ్చినపుడు గోమూత్రప్రాశనము చేసి శ్రీహరిని పూజించవలెను. ఆ అనంతుడు సకలకామప్రదాత; అనంతఫలముల నిచ్చువాడు ఈ వ్రతము చేయువానికి రాబోవు జన్మలో కూడ అనంతపుణ్యఫలమునిచ్చును. ఈ మహావ్రతమువలన అనంతమహా పుణ్యము లభించును. ఇది అభిలషిత వస్తువుల నిచ్చు వాటిని అక్షయములుగ చేయును. అనంతుని చరణ కమలాదిపూజ చేసి రాత్రి తైలరహిత మగు భోజనము చేయవలెను. అనంతుని ఉద్దేశించి మార్గశీర్షమునుండి ఫాల్గునమువరకు ఘృతమును, చైత్రమునుండి ఆషాఢమువరకు బియ్యము శ్రావణమునుండి కార్తికమువరకు క్షీరమును హోమము చేయవలెను. ఈ అనంతవ్రత మాచరించుటచేతనే యువనాశ్వునకు మాంధాత అను పుత్రుడు జనించెను. అగ్ని మహాపురాణమునందు నక్షత్రవ్రతవర్ణన మను నూట తొంబది యారవ అధ్యాయము సమాప్తము.