Sri Madhagni Mahapuranamu-1
Chapters
శ్రీమదగ్ని మహాపురాణము అథ ద్వితియో7ధ్యాయః. అథ మత్స్యావతార వర్ణనమ్ వసిష్ఠ ఉవాచ : మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్. 1 మత్స్యవతార వర్ణనము విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము. అగ్నిరూవాచ ః మత్స్యావతారం వక్ష్యే7హం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2 అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా? ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3 ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి. మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్. తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకో7భ్యపద్యత| వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను. క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ. గ్రాహాదిభ్యో భక్షయం మే7త్ర తచ్ఛ్రుత్వా కలశే7క్షిపత్ | ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను. స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్ . 6 స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనే7క్షిపత్ | ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను. తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7 సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్ | ఊచే దేహి బృహత్ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8 అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను ః " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను. లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో 7భవత్ | మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9 అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను. కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10 "నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?" మనునోక్తో7బ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11 మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను". సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12 సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13 "(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము". ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14 ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను. ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్ . 15 శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్ స్తుతిభిశ్చ తమ్ | ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను. బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్. 16 అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పే7థ వారాహే కూర్మరూపో7 భవద్దరిః. 17 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః. కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను. అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.