Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకద్విశతతమోధ్యాయః అథ నవవ్యూహార్చనమ్. అగ్నిరువాచ : నవవ్యూహార్చనం వక్ష్యే నారదాయ హరీరితమ్ | మణ్డలే7బ్జేర్చయేన్మధ్యే హ్యబీజం వాసుదేవకమ్. 1 éఅబీజం చ సఙ్కర్షణం ప్రద్యుమ్నం చ ప్రదక్షిణ | అః అనిరుద్ధం నైరృతే ఓం నారాయణమప్సు చ. 2 తత్సద్బ్రహ్మాణమనిలే హృది విష్ణుం క్షౌం నృసింహకంమ్ | ఉత్తరే భూవరాహం చత్వీశేద్వారి చ పశ్చిమే. 3 కం టం సం శం గరుత్మన్తం పూర్వవక్త్రం చ దక్షిణ | ఖం భం వం హుం ఫడితి చ ఖం ఠం పం శం గదాం విధౌ. 4 బం ణం మం క్షం కోణశం చ ధం దం భం హం శ్రియం యజేత్ | దక్షిణ చోత్తరే పుష్టిం గం డం వం శం స్వబీజకమ్. 5 పీఠస్య పశ్చిమే ధం వం మనమాలాం చ పశ్చిమే | శ్రీవత్సం వచైవ సం హం లం ఛం తం యం కౌస్తుభం జలే. 6 దశమాఙ్గక్రమాద్విష్ణోర్నమో7నన్తమథో7ర్చయేత్ | దశాఙ్గాదిమ హేన్ద్రాదీన్ పూర్వాదౌ చతురో ఘటాన్. తోరణాని వితానం చ అగ్న్యనిలేన్దుబీజకైః | మణ్డలాని క్రమద్ధ్యాత్వాతనుం వన్ద్య తతః ప్లవేత్. 8 అమ్బరస్థం తతో ధ్యాత్వా సూక్ష్మరూపమథాత్మనః | సితామృతే నిమగ్నం చ చన్ద్రబిమ్బాత్సృతేన చ. 9 తదేవ చాత్మనో బీజమమృతం పూర్వసంస్కృతమ్ | ఉత్పద్యమానం పురుషమాత్మానముపకల్పయేత్. 10 ఉత్పన్నో7స్మి స్వయం విష్ణుర్బీజం ద్వాదశకం న్యసేత్| హృచ్ఛిరస్తు శిఖా చైవ కవచం చాస్త్రమేవ చ. 11 వక్షో మూర్ధశిఖాపృష్ఠలోచనేషు న్యసేత్పునః | అస్త్రం కరద్వయే న్యస్య తతో దివ్యతనుర్భవేత్. 12 యథాత్మని యథా దేవే శిష్యదేహే న్యసేత్తథా | అనిర్మాల్యా స్మృతా పూజా యద్దరేః పూజనం హృది. 13 సనిర్మాల్యా మణ్డలాదౌ బద్దనేత్రాశ్చ శిష్యకాః | పుష్పం క్షి పేయుర్యన్మూర్తౌ తస్య తన్నామ కారయేత్. 14 నివేశ్య వామతః శిష్యాం స్తిలవ్రీహిఘృతకం హువేత్ | శతమష్టోత్తరం హుత్వా సహస్రం కాయశుద్దయే. 15 నవవ్యూహస్య మూర్తీనామాఙ్గానాం చ శతాధికమ్| పూర్ణాం దత్త్వా దీక్షయేత్తాన్ గురుః పూజ్యశ్చ తైర్దనైః. 16 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నవవ్యూహార్చనం నామైకాధికద్విశతతమోధ్యాయః. అగ్నిదేవుడు పలికెను : వసిష్ఠమహామునీ! శ్రీ మహావిష్ణువు నారదునకు చెప్పిన విధమున నవవ్యూహార్చన విధానము చెప్పెదను. పద్మమయ మగు మండలము మధ్య 'అం' బీజముతో కూడిన వాసుదేవుని పూజించవలెరె. (ఉదా : అం వాసుదేవాయ నమః) ఆగ్నేయమునందు 'అం' బీజయుక్తప్రద్యుమ్నుని, నైరృతియందు 'అః' బీజయుక్తు డగు అని రుద్ధుని, పశ్చిమమున ప్రణవయుక్త నారాయణుని, వాయువ్యమునందు తత్సద్ బ్రహ్మను, ఉత్తరమునందు 'హుం' బీజయుక్తవిష్ణువును, 'క్ష్రౌం' బీజయుక్తనృసింహుని, ఈశాన్యము పృథ్విని, పశ్చిమద్వారమున వరాహమూర్తిని పూజించవలెను. కం, టం శం , సం బీజయుక్తగరుడుని, పూర్వాభిముఖనిగా దక్షిణమున పూజించవలెను. బం, భం, బం, హుం, ఫట్, అను బీజమలతోను, ఖం, ఠం ఫం, శం అను బీజములతోనుగదను చంద్రమండలమునందు పూజించవలెను. బం, ణం, మం, క్షం బీజములతోను శం, ధం, దం భం, హం బీజములతోను శ్రీదేవిని కోణభాగమునందు పూజించవలెను. దక్షిణోత్తరములదు గం, డం, బం, శం బీజములతో పుష్టిదేవిని పూజించవలెను. పీఠపశ్చిమభాగమునందు ధం, వం బీజములతోవనమాలను పూజించవలెను. పశ్చిమదిశయందు సం, హం లం బీజములతో శ్రీవత్సమును, జలమునందు భం, తం, యం బీజములతో కౌస్తుభమును పూజించవలెను. పిదప దశమాంగక్రమమున విష్ణువును. అతని క్రిందిభాగమున అనంతుని, వారిపేర్లకు నమః జోడించి పూజించవలెను. పూర్వాది దిశలందు దశాంగాదులను మహేంద్రాది దశదిక్పాలులను, పూర్వాది దిశలందు నాలుగు కలశ లను పూజించవలెను, తోరణ-వితాన-అగ్ని-వాయు-చంద్రుల బీజములతో కూడిన మండలములను క్రమముగా ధ్యానించి, తన శరీరమును వందనపూర్వకముగ అమృతప్లావితము చేయవలెను. ఆకాశమునందున్న అత్మయొక్క సూక్ష్మరూపమును ధ్యానించి, ఆ ఆత్మ చంద్రమండలమునుండి ప్రవహించుచున్న శ్వేతామృతధారలో నిమగ్నమైనట్లు భావన చేయవలెను. ప్లవనసంస్కృత మైన అమృతమే ఆత్మబీజము. ఆ అమృతము నుండి పుట్టిన పురుషుడే తానని భావన చేయవలెను. ''నేనే విష్ణుస్వరూపమున ప్రకట మైతిని'' అని భావన చేయవలెను. పిదప ద్వాదశబీజన్యాసము చేయవలెను. క్రమముగ వక్ష్యఃస్థల-మస్తక-శిఖా-పృష్ఠభాగ-నేత్ర హస్తద్వయములందును, హృదయ శిరః -శిఖా-కవచ- నేత్రత్రయ, అస్త్రములందును అంగన్యాసము చేయవలెను. రెండు హస్తములందును అస్త్రన్యాసము చేసిన పిదప సాధకుని శరీరమునందు దివ్యత్వము వచ్చును. తన శరీరమునందు చేసినట్లే దేవతావిగ్రహ శరీరమునందును శిష్యశరీరమునందును గూడ న్యాసము చేయవలెను. హృదయములో చేయు శ్రీమహావిష్ణుపూజనము నిర్మాల్యరహిత పూజనము మండలాదులపై చేయునిది నిర్మాల్యసహితము. దీక్షాకాలమున శిష్యుని నేత్రములు బంధింపబడి యండును. ఆసమయమున ఆతడు ఇష్టదేవతా విగ్రహముపై విసరిన పుష్పమునుబట్టివానికా పేరు పెట్టవలెను. శిష్యులను ఎడమ ప్రక్క కూర్చుండబెట్టుకొని అగ్నియందు తిలలు, బియ్యము, ఘృతము హోమము చేయవలెను. నూటఎనిమిది ఆహుతులిచ్చిన పిదప కాయ శుద్ధి కొరకై వెయ్యి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువు శిష్యులకు దీక్ష ఇవ్వవలెను. శిష్యులు ధనముచే గురువును పూజించవలెను. అగ్నిమహాపురాణమునందు నవవ్యూహార్చనవర్ణన మను రెండు వందలఒకటవ అధ్యాయము సమాప్తము.