Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వ్యధికద్విశతతమోధ్యాయః. అథ పుష్పాధ్యాయ కథనమ్. అగ్నిరువాచ : పుష్పం శ్రేష్ఠం మాలతీ చ తమాలో భుక్తిముక్తిమాన్. | మల్లికా సర్వపాపఘ్నీ యుథికా విష్ణలోకదా. 1 అతిముక్తమయం తద్వత్ పాటలా విష్ణులోకదా | కరవీరైర్విష్ణులోకే జపాపుషై#్పశ్చ పుణ్యవాన్. 2 పావన్తీ కుబ్జికాద్యైశ్చ తగరైర్విష్ణులోకభాక్ | కర్ణికారైర్విష్ణులోకః కురుణ్టౖః పాపనాశనమ్. 3 పద్మైశ్చ కేతకీభిశ్చ కున్దపుషై#్పః పరా గతిః | బాణపుషై#్పర్బర్బరాభిః కృష్ణాభిర్హరిలోకభాక్. 5 అశోకైస్తిలకైస్తద్వద్వటరూషభ##వైస్తథా | ముక్తి భాగీ బిల్వపత్రైః శమీపత్రైః పరాగతిః. 6 విష్ణులోకీ భృఙ్గరాజైస్తమాలస్య దలైస్తథా | తులసీ కృష్ణగౌరాఖ్యా కహ్లోరోత్పలకాని చ. 7 పద్మం కోకనదం పుణ్యం శతాబ్జమాలాయా హరిః | నీపార్జునకదమ్బైశ్చ బకులైశ్చ సుగన్దిభి. 8 కింశుకైర్మునిపుషై#్పస్తు గోకర్ణైర్నాగకర్ణకైః | సన్ద్యాపుషై#్పర్బిల్వతకైరఞ్జనీకేతకీభ##వైః. 9 కూష్మాణ్డతిమిరోత్థైశ్చ కుశకాశశరోద్భవైః | ద్యూతాదిభిర్మరువకైః పత్రైరన్యైః సుగన్ధకైః. 10 భుక్తిర్ముక్తిః పాపహానిర్భక్త్యా సర్వైస్తు తుష్యతి | స్వర్ణలక్షాధికం పుష్పం మాలాకోటిగుణాధికా. 11 అగ్నిదేవుడు పలికెను : శ్రీమహావిష్ణువు పుష్ప-గంధ-ధూప-దీప-నైవేద్యముల సమర్పణచే ప్రసన్ను డగును. శ్రీ మహావిష్ణువునకు సమర్పింప యోగ్యములు, అయోగ్యములు అయిన పుష్పములను గూర్చి చెప్పెదను. మాలతీ పుష్పము పూజకు అత్యుత్తమము. తమాలపుష్పము భోగమోక్షప్రదము. మల్లికాపుష్పము సమస్తపాపనాశకము. యూథికవిష్ణులోకమునిచ్చును. అతిముక్తకలోధ్రపుష్పముల విష్ణులోకప్రాప్తిహేతువులు కరవీరపుష్పములతో పూజించువాడు విష్ణులోకమును చేరును. జాపాపుష్పములు పుణ్యప్రదములు. పావన్తీ-కుబ్జక-తగరపుష్పములు విష్ణులోకము నిచ్చును. కర్ణికారపుష్పపూజ చేయువాడు. వైకుంఠము చేరును. కురంటపుష్పపూజ పాపవినాశకము. కమల-కుంద-కేతకీపుష్పములు పరమగతినిచ్చును. బాణపుష్ప-కృష్ణతులసీ పత్రములతో పూజచేయువాడు విష్ణులోకమును పొందును. అశోక- తిలక - అటరూషపుష్పములచే పూజించువాడు మోక్షాధికారి యగును. బిల్వ-శమీపత్రములచే పరమగతి సులభము. తమాలదలములతోను, భృంగరాజముతోను పూజచేయువాడు విష్ణులోకనివాసి యగును. కృష్ణతులసీ- శుక్ల - తులసి-కల్హార-ఉత్పల-పద్మ-కోకనదుపుష్పములు పుణ్యప్రదములు. నూరుకమలముల మాల సమర్పించినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. నీప - అర్జున - కదంబ-కింశుక-అగస్త్య-గోకర్ణ-నాగకర్ణ-సంధ్యాపుష్పీ బిల్వాతక-రంజనీ-కేతకీ-కూష్మాండ-గ్రామకర్కటీ-కుశ-కాశ-ద్యూత- విభీతక- మరువ కాదిపత్రములతోను, ఇతరమైన సుగంధిపత్రములతోను పూజచేసినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును వీటితో పూజించిన వాడు పాపవిముక్తుడై భుక్తిముక్తులను పొందును. లక్షస్వర్ణములకంటె గూడ కోట్ల రెట్లు పుష్పములు ఉత్తములు. తన ఉద్యానవనమునుండియు. ఇతరుల ఉద్యానములనుండియు తెచ్చిన పుష్పములకంటె వన్యపుష్పములకు మూడు రెంట్లు ఫల మధిక మని చెప్పబడినది. విశీర్ణైర్నార్చయేద్విష్ణుం నాధికాఙ్గైర్న మోటితైః. 12 కాఞ్చనారైస్తథోన్మత్తైర్గికర్ణికయా తథా | కుటజైః శాల్మలీయైశ్ఛ శిరీషైర్నరకాదికమ్. 13 సుగన్ధైర్బ్రహ్మపద్మైశ్చ పుషై#్పర్నీలోత్పలైర్హరిః | అర్కమన్దార ధుస్తూరకుసుమైరర్చ్యతే హరః. 14 కుటజైః కర్కటీపుషై#్పః కేతకీం న శివే దదేత్ | కూష్మాణ్డనిమ్బసమ్భూతం పైశాచం గన్దవర్జితమ్. 15 అహింసా చేన్ద్రియజయః క్షాన్తిర్జానం దయాశ్రుతమ్ | భావాష్టపుషై#్పః సంపూజ్య దేవాన్స్యాద్భుక్తిముక్తిభాక్. అహింసా ప్రథమం పుష్పం పుష్పమిన్ద్రియనిగ్రహః | సర్వపుష్పం దయా భూతే పుష్పం శాన్తిర్విశిష్యతే. శమః పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పం చ సప్తమమ్ | సత్యం చై వాష్టమం పుష్పమేత్తెస్తుష్యతి కేశవః. 18 ఏతై రేవాష్టభిః పుషై#్పస్తుష్యత్యేవార్చితో హరిః | పుష్పాన్తరాణి సన్త్యత్ర బాహ్యాని మనుజోత్తమ. 19 భక్త్యా దయాన్వితైర్విష్ణుః పూజితః పరితుష్యతి | వారుణం సలిలం పుషం సౌమ్యం ఘృతపయోదధి. 20 ప్రాజాపత్యం తదాన్నాది హ్యాగ్నేయం ధూపదీపకమ్ | ఫలపుష్పాదికం చైవ వానస్పత్యం తు పఞ్చమమ్. పార్థివం కుశమూలాద్యం వాయవ్యం గన్దచన్దనమ్ | శ్రద్ధాఖ్యం విష్ణుపుష్పం చ సర్వదా చాష్టపుష్పికా . 22 ఆసనం మూర్తిపఞ్చాఙ్గం విష్ణుర్వాచాష్టపుష్పికా | విష్ణోస్తు వాసుదేవాద్యైరీశానాద్యైః శివస్య వా. 23 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పుష్పాధ్యాయో నామ ద్వ్యధికద్విశతతమో7ధ్యాయః. రాలిన పూవులతోను, అధిక మైన అవయవములు గలవాటితోను, నలిగిపోయినవాటితోని శ్రీమహావిష్ణువును పూజించరాదు. కాంచనార ఉన్మత్త-గిరికర్ణికా - కుటజ-శాల్మలి - శిరీషపుష్పములతో విష్ణువును పూజించరాదు. వీటితో శ్రీమహావిష్ణువును పూజించువాడును నరకము చెందును. సుగంధము గల రక్తకమలముతోను, నీలకమలములతోను శ్రీమహావిష్ణువును పూజించవలెను. అర్క-మందార-ధుస్తూరకుసుమములతో శివుని పూజించవలెను. కాని కుటజ-కర్కటీ-కేతకీపుష్పములతో శివుని పూజింపగూడదు. కూష్మాండ-నింబపుష్పములును, గంధహీనము లగు ఇతర పుష్పములును పైశాచము లని చెప్పబడుచున్నవి. అహింస, ఇంద్రియజయము, ఓర్పు, జ్ఞానము, దయ, స్వాధ్యాయము మొదలగు ఎనిమిది భావపుష్పములచే దేవతలను పూజించు మానవుడు భుక్తిముక్తి-పాత్రుడగును. వీటిలో అహింస మొదటి పుష్పము. ఇంద్రియ నిగ్రహము రెండవది. సకలప్రాణులపై దయ మూడవపుష్పము. ఓర్పు నాల్గువదగు శ్రేష్టపుష్పము. ఈ విధముగ శమ- తపో-ధ్యానములు పంచమ-షష్ఠ-సప్తమ పుష్పములు. సత్యము ఎనిమిదవ పుష్పము. వీటితో పూజించినచో భగవంతుడు ప్రసన్ను డగును; సంతసించును. నరశ్రేష్ఠా! ఇతరపుష్పములు పూజకు బాహ్యోపకరణములు మాత్రమే. శ్రీమహావిష్ణువు భక్తిదయాసమన్వితము లగు భావపుష్పములతో పూజించినచో సంతుష్ట డగును. జలము వారుణ పుష్పము. ఘృత-దుగ్ధ-దధులు సౌమ్యపుష్పములు. అన్నాదులు ప్రాజాపత్య పుష్పములు. ధూపదీపములు అగ్నేయపుష్పములు. ఫలపుష్పాదులు వానస్పత్యపుష్పములు. శ్రాద్ధాదిభావములు వైష్ణవకుసుమములు. ఈ అష్టవిధకుసుమములు సర్వకామప్రదములు. ఆసనము (యోగపీఠము) పంచాంగన్యాసము, అష్టపుష్బములు-ఇవి విష్ణురూపములు. ఈ అష్టపుష్పములచే పూజితుడై శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. ఇవి కాక వాసుదేవాదినామములతో శ్రీమహావిష్ణువును, ఈశానాదినామ పుష్పములతో శివుని పూజించవలెను. అగ్ని మహాపురాణమునందు పుష్పాధ్యాయ మను రెండువందలరెండవ అధ్యాయము సమాప్తము.