Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఆష్టోత్తరద్విశతతమో7ధ్యాయః అథ వ్రతదానసముచ్చయః. అగ్నిరువాచ : వ్రతదానాని సామాన్యం ప్రవదామి సమాసతః | తథౌ ప్రతిపదాదౌ చ సూర్యాదౌ కృత్తికాసు చ. 1 విష్కుమ్బాదౌ చమేషాదౌ కాలే చ గ్రహణాదికే | యత్కాలే యద్వ్రతం దానం యద్ద్రవ్యం నియమాది యత్. 2 తద్ద్రవ్యాఖ్యం చ కాలాఖ్యం సర్వం వై విష్ణుదైవతమ్ | రవీశబ్రహ్మలాక్ష్మ్యాద్యాః సర్వే విష్ణోర్విభూతయః. సముద్దిశ్య వ్రతం దానం పూజాది స్యాత్తు సర్వదమ్ | జగత్పతే సమాగచ్ఛ హ్యాసనం పాద్యమర్ఘ్యకమ్. 4 మధుపర్కం తథాచామం స్నానం వస్త్రం చ గన్దకమ్ | పుష్పం ధూపశ్చ దీపశ్చ నై వేద్యాది నమో7స్తుతే. ఇతి పూజా వ్రతే దానే దానవాక్యం సమం శృణు | అద్యాముక సగోత్రాయ విప్రాయాముశర్మణ. 6 ఏతద్ద్రవ్యం విష్ణుదైవం సర్వపాపోపశాన్తయే | ఆయురారోగ్యవృద్ద్యర్థం సౌభాగ్యాదివివృద్ధయే. 7 గోత్రసన్తతివృద్ధర్థం విజయాయ ధనాయ చ | ధర్మాయైశ్వర్య కామాయ తత్పాపశమనాయ చ . 8 సంసారముక్తయే దానం తుభ్యం సంప్రదదే హ్యహమ్ | ఏతద్దానప్రతిష్ఠార్థం తుభ్యమేతద్దదామ్యహమ్. 9 ఏతేన ప్రీయతాం నిత్యం సర్వోలోకపతిః ప్రభుః | యజ్ఞదానవ్రతపతే విద్యాకీర్త్యాది దేహి మే. 10 ధర్మకామార్థమోక్షాంశ్చ దేహి మే మనసేప్సితమ్ | యః పఠేచ్ఛృణుయాన్నిత్యం వ్రతదానసముచ్చయమ్. సంప్రాప్తకామో విమలో భుక్తిం ముక్తిమవాప్నుయాత్ | తిథివారరక్రాన్తి యోగమన్వాదికం వ్రతమ్ | నైకధా వాసుదేవాదేర్ని యమాత్పూజనాద్భవేత్. 12 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వ్రతదానసముచ్చయో నామాష్టాధికద్విశతతమోధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : వసిష్ఠా! ఇపుడు, సామాన్యవ్రతమును గూర్చియు, దానములను గూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. ప్రతిపదాదితిథులందును సూర్యవారాదులందును, కృత్తికాదినక్షత్రములందును, నిష్కంభాదియోగములందును, మేషాది రాశులందును, గ్రహణాది సమయములందును చేయ దగిన వ్రతములు, దానములు వాటికి సంబంధించిన ద్రవ్యములు, నియమాదులు-వీటిని గూర్చి కూడ చెప్పెదను. వ్రతదానోపయోగులగు ద్రవ్యములకును, కాలమునకును, అధిష్ఠాతయైన దేవత శ్రీమహావిష్ణువు. సూర్యశివబ్రహ్మలక్ష్మ్యాది దేవతలందురును శ్రీమహావిష్ణువిభూతులే. అందుచే ఆయనను ఉద్దేశించిచేసిన వ్రతదానపూజనాదులు సకలమనోరథప్రదములు. "ఓ జగత్పతీ! నీకు నమస్కారము. రమ్ము. ఆసన-అర్ఘ్య-మధుపర్క-ఆచమనస్నాన వస్త్ర-గంధ-పుష్ప-ధూప-దీప-నైవేద్యములను గృహించుము" అని ప్రార్థించి పూజించవలెను పూజా-వ్రత-దానములందు పై మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇపుడు సామాన్యదానసంకల్పమును గూర్చి వినుము. ఈరోజున, ఈ గోత్రము గల, ఈ శర్మ అనుబ్రాహ్మణునకు నేను సమస్తపాపశాంతి, ఆయురారోగ్యవృద్ధి, సౌభాగ్యోదయము కలుగుటకై, గోత్ర- సంతానవిస్తృతి, ధనవిజయప్రాప్తికై, ధర్మ-అర్థ-కామసంపాదనమునకై, పాపనాశపూర్వకముగ సంసారము నుండి విముక్తి పొందుటకై. విష్ణువునకు సంబంధించిన ఈ వస్తువును దానము చేయుచున్నాను. ఏతద్దానసాద్గుణ్యార్థమై మీకు సువర్ణాదిద్రవ్యములను గూడ సమర్పించుచున్నాను. నేను చేసిన ఈ దానముచే, సకలలోకేశ్వరుడగు శ్రీహరి సర్వాదా ప్రసన్నుడగుగాక, ఓ యజ్ఞ-దాన వ్రతాధీశా! నాకు విద్యాయశస్సులను అనుగ్రహించుము. ధర్మార్థకామమోక్షరూపము లగు నాలుగు పురుషార్థములను, మనోభిలషితము లగు వస్తువులను అనుగ్రహించుము"ఈ వ్రతదానసముచ్చయమును ప్రతిదినము పఠించువాడు అభీష్టలాభములను పొంది, పాపరహితు డై భుక్తిముక్తులను రెండింటిని పొందును. వాసుదేవాదులకు సంబంధించిన ఇట్టి పూజానియమాదులచే అనేకవిధము లగు తిథి వార - నక్షత్ర- సంక్రాంతి- యోగ-మన్వాదిసంబధివ్రతముల ననుష్ఠించిన ఫలము సిద్ధించును. అగ్నిమహాపురాణమునందు వ్రతదాన సముచ్చయవర్ణన మను రెండువందల ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.