Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకవింశతితమో7ధ్యాయః అథ సామాన్యతో దేవపూజానిరూపణమ్ నారద ఉవాచ :- సామాన్యపూజాం విష్ణ్వాదేర్వక్ష్యే మన్త్రాంశ్చ సర్వదాన్ | సమస్త పరివారాయ అచ్యుతాయ నమో యజేత్. 1 నారదుడు పలికెను. విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వఫలములను ఇచ్చు మంత్రములను గూర్చ చెప్పెను సకల పరివార సమేతుడైన అబ్యుతునికి నమస్కరించి పూజించవలెను. ధాత్రే విధాత్రే గఙ్గాయ యమునాయ నిధీ తథా | ద్వారశ్రియం వాస్తునరం శక్తిం కూర్మమనన్తకమ్. 2 పృధ్వీం ధర్మకం జ్ఞానం పైరాగ్యైశ్వర్యమేవ చ | అధర్మాదీన్ కన్దనాలపద్మ కేసరకర్షికాః. 3 ఋగ్వేదాద్యం కృతాద్యం చ సత్త్వాద్యర్కాదిమణ్డలమ్ | విమలోత్కర్షిణీ జ్ఞానాక్రియాయోగా చ తా యజేత్. 4 ప్రహ్వే సత్యా తథేశాచానుగ్రహా7మలమూర్తికా | దుర్గాం గిరం గణం క్షేత్రం వాసుదేవాదికం యజేత్. 5 హృదయం చ శిరశ్బూడాం వర్మ నేత్రమథాస్త్రహమ్ | శఙ్ఖం చక్రం గదాం పద్మం శ్రీవత్సం కౌస్తుభం యజేత్. 6 వనమాలాం శ్రియం వుష్టం గరుడం గురుమర్చయేత్ | ఇన్ద్రమగ్నిం యమం దక్షో జలం వాయుం ధనేశ్వరమ్. 7 ఈశానం తమజం చాస్త్రం వాహనం కుముదాదికమ్ | విష్వక్సేనం మణ్డలాదౌ సిద్దిః పూజాదినా బవేత్. 8 విష్ణుపూజాంగముగ ద్వారదక్షిణభాగమున ధాతను, విధాతను, వామభాగమున ధాతను, విధాతను, వామభాగమును గంగను యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తుపురుషుని శక్తిని, కుర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ఆధర్మాదులను, పద్మభావన చేసి దాని కందమును, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్యభాగము)ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సత్త్వాదిగుణములను, సూర్యాది మండలమును, పూజించవలెను విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను. ప్రహ్వి, సత్య, ఈశ, అనుగ్రహి, అమలమూర్తి యగు దుర్గ, గీర్దేవి, గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను. హృదయమును శిరస్సును, కేశశిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును, చక్రమును గదను. పద్మమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని పుష్టిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, అగ్నిని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను అస్త్రమును, వహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింపవలెను. ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును. శివపూజాథ సామున్యా పూర్వం నన్దిన మర్చయేత్ | మహాకాలం యజేద్గజ్ఞాం యమునాం చ గణాదికమ్ 9 గరిం శ్రియం గురం వాస్తుం శక్త్వాదీన్ ధర్మకాదికమ్ | ఇపుడు సామాన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిన, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను. రామా జ్యేష్ఠా తథా రౌద్రీ కాలీ కలవికరిణీ. 10 బలవికరిణీ చాపి బలప్రమధినీ క్రమాత్ | సర్వభూతదమనీ చ తథా మనోన్మనీ శివా. 11 వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బలవికరిణి, బలప్రమథని, సర్వభూతదమని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను. హాంహూంహాం శివమూర్తయే సాఙ్గవస్త్రం శివం యజేత్ | హౌం శివాయ హౌమిత్యాది హామీశాసవక్త్రకమ్ 12 హ్రీం గౌరీం గం గణః éశక్రముఖాస్చణ్డోహృదాదికాః | క్రమాత్సూర్యార్చనే మన్త్రా దణ్డీపూజ్యశ్చ పిఙ్గలః. 13 ''హాం. హూం. హాం శివమూర్తయే నమః'' అను మంత్రముతో ఆయా ఆవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. ''హౌం శివాయ హౌం'' అని శివుని, 'హాం ' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. ''హ్రీం'' అను బీజాక్షరముతో గౌరిని ''గం' అను బీజాక్షరముతో గణమును (గణాధిపతిని) పూజింపవలెను. ఇంద్రుడు మొదలగు వారిని చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించవలెను. ఇపుడు సూర్యర్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను. ఉచ్ఛైఃశ్రవాశ్చారుణశ్చ ప్రభూతం విమలం యజేత్ | సోమసన్ధ్యా7పసుణం స్కన్దాద్యం మధ్మతో యజేత్. 14 ఉచ్చైః శ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, పరసుఖుని, స్కందాదులను మధ్మయందు పూజింపవలెను. దీప్తా సూక్ష్మా జయా భద్రా విభూతిర్విమలా తథా | అమోఘా విద్యుతా చైవ పూఙ్యాథో సర్వతోముఖీ. 15 దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విర్యుతా, సర్వతోముఖీ అను నవశక్తులను పూజింపవలెను. అర్కాసనం హి హం ఖం ఖం సోల్కాయేతి చ మూర్తి కామ్ | హ్రాం హ్రీం సః సూర్యాయ నమ ఆం నమో హృదయాయ చ. 16 ''హం'' ''ఖం'' ''ఖం'' అను బీజాక్షరములచే అర్కాసనమును ''సోత్కాయనమః అని మూర్తిని ''హాం హ్రీం సః సూర్యాయ నమః'' అని సూర్యుని, ''ఆం నమో హృదయాయ'' అని హృదయమును పూజింపవలెను. అర్కాయ శిరసే తద్వతగ్నే శాసురవాయుగాన్ | భూర్భువఃస్వర్ జ్వాలిని శిఖా హుం కవచమ్ స్మృతమ్. 17 భాం నేత్రం హస్తథాద్కాస్త్రం రాజ్ఞీ శక్తిశ్చ నిష్కుభా | సోమో7ఙ్గారకో7థ జీవః శుక్రః శనిఃక్రమాత్. 18 రాహుః కేతుస్తేజశ్చణ్డః సంక్షేపాదథ పూజనమ్ | అసనం మూర్తయో మూలం హృదాద్యం పరిచారకః. 19 విష్ణ్వాసనం విష్ణుమూర్తేరాం శ్రీం éశ్రీం శ్రీధరో హరిః | హ్రీం సర్వమూర్తి మన్త్రోయమితి త్రైలోక్యమోహనః. 20 క్లీం హృషీకేశః హూం విష్ణుః సర్వైర్దీర్ఘెర్హృదాదికమ్ | సమసై#్తః పఞ్చమీ పూజా సఙ్గ్రామాదౌ జయాదిదా. 21 ''ఓం అర్కాయ నమః అని శిరస్సున పూజించవలెను అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్ఠించి యున్న సూర్యుని పూజింపవలెను. ''భూః '' భువః స్వః జ్వాలిన్యై శిఖాయైనమః అని శిఖయు ''హుం'' అని కవచమును ''భాం'' అని నేత్రములను, హ్రః, అని అర్కాస్రమును పూజించవలెను. రాజ్ఞియను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగ ఛాయాదేవిని పూజించవలెను. పిమ్మట సోమ - అంగారక - బుధ - గురు - శుక్ర - శని- రాహు - కేతువులను, తేజశ్చండుని పూజించవలెను పిమ్మట సంక్షేపముగ పూజ చెప్పబడుచున్నది. ఆసనము, మూర్తులు, మూలము, హృదయాదులు పరిచారకులు వీరి పూజ చేయవలెను విష్ణ్వాసనమును పూజించవలెను. విష్ణువు యొక్కమూర్తిని పూజింపవలెను. ''రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః'' అని మంత్రము. ''హ్రీం'' అనునది సర్వ మూర్తులకుమ సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. ''క్లీం'' హృషీ హేశాయ నమః'' ''హూం విష్ణవే నమః'' అను మంత్రము లుచ్చరించవలెను. అన్ని ధీర్ఘ స్వరములచే హృదమాదికమును పూజించవలెను. ఈ పంచమ పూజ యుద్ధాదులో జయము నిచ్చును. చక్రం గదాం క్రమాచ్చజ్ఖం ముసలం ఖడ్గశార్జకమ్ | పాశాజ్కుశౌ చ శ్రీవత్సం కౌస్తుభం వనమాలయా. 22 శ్రీం శ్రీర్మహాలక్ష్మీ స్తార్‌క్ష్య గురురిన్రాదయోర్చనమ్ | చక్ర - గదా - శంఖ - ముసల - ఖడ్గ - శార్జ - పాశ - అంకుశ -శ్రీవత్స - కౌస్తుభ - వనమాలలను పూజించవలెను. ''శ్రీం'' అను బీజాక్షరమతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్యని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను. సరస్వత్యాసనం మూర్తిం రౌం హ్రీం దేవీ సరస్వతీ. 23 హృదాద్యా లక్ష్మీర్మేధా చ కలా తుష్టిశ్చ పుష్టకా | గౌరీ ప్రభావతీ దుర్గా గణో గురుశ్చ క్షేత్రవః 24 సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలెను. ''రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః'' అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు - వీరినందరిని పూజించవలెను. తథా గం గణపతయే చ హ్రీం గౌర్యై చ శ్రీం శ్రీయై | హ్రీం త్వరితాయై ఐం క్లీం సౌం త్రిపురా చతుర్థ్యన్తా నమోన్తకాః. 25 ప్రణవాద్యాశ్చ నామద్యమక్షరం బిందుసంయతమ్ | ఓం యుతా వా సర్వమన్త్రాః పూజనాజ్జవతః స్మృతాః. 26 ''గం గణపతయే నమః'' ''హ్రీం గౌర్యై నమః'', శ్రీం శ్రియై నమః'', ''హ్రీం త్వరితాయై నమః'', ఏం క్లీం సౌం త్రిపురాయై నమః'' అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలెను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను ''ఓం'' కారముతో ప్రాంభింపవలెను. హోమాత్తి లఘృతాద్యైశ్చ ధర్మకామార్థమోక్షదాః పూజా మన్త్రాన్ పఠేడ్యస్తు భక్తభోగో దివం వ్రజేత్. 27 ఇత్యాది మమాపురాణ ఆగ్నేయే విష్ణ్వాదిదేవసామాన్యపూజాకథనం నామ ఏకవింశతితమోధ్యాయః ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్థకామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగముల నన్నియు అనుభవించి స్వర్గమునకు వెళ్ళును. అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణ మను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.