Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ త్రయోవింశో೭ధ్యాయః అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్ నారద ఉవాచ: వక్ష్యే పూజావిధిం విప్రా యం కృత్వా సర్వమాప్నుయాత్ | ప్రక్షాలితాం ఘ్రిరాచమ్య వాగ్యతః కృతరక్షణః
1 ప్రాజ్ముఖః స్వస్తికం బద్ద్వా పద్మాద్యపరమేవ వా | 2 యం భీజం నాభిమధ్యస్థం ధూమ్రం చణ్డానిలాత్మకమ్. విశోషయేదశేషం తు ధ్యాయన్కాయత్తు కల్మషమ్ | నారదుడు పలికెను. విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమునుధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను 1,2 క్షౌం హృత్పంజ్వజమధ్యస్థం బీజం తేజోనిధిం స్మరన్ 3 అథోర్ధ్వతిర్యగ్గాభీస్తు జ్వాలాభిః కల్మషం దహేత్ | హృదయపద్మ మధ్యమునం దున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను. 13 శశజ్కాకృతివద్ధ్యాయేదమ్భరస్థం సుధామ్భుభిః 4 హృత్పద్మవ్యాపిభిర్దేహం స్వకమాప్లాపయేత్సుధీః | సుఘమ్నాయోనిమర్గేణ సర్వనాడీవిసర్పిభి. 5 ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. దాని నుండి స్రవించుచున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారలచేత తన దేహమును ని పవలెను 4, 5 శోధయిత్వా న్య సేత్తత్త్వం కరశుద్ధిరథాస్త్రకమ్ | వ్యాపకం హస్తయోరాదో దక్షిణాఙ్గుష్ఠతో7ఙ్గకమ్ 6 మూలం దేహే ద్వాదశాఙ్గం న్యసేన్మన్త్రైర్ధ్విషట్కకైః | హృదయం చ శిరశ్చైవ శిఖావర్మాస్త్రలోచనే 7 ఉదరం చ తథా పృష్ఠం బాహూరూ జానుపాదకమ్ | ముద్రాం దత్త్వా స్మర్వేద్వివ్ణుం జప్త్వాష్టశతమర్చయేత్. 8 శోధనము చేసి తత్త్వనా నము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. దేహమునందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను. 68. వా మేతు వర్థనీం న్యస్య పూజాద్రవ్యం తు దక్షిణ | ప్రక్షాళ్యాస్త్రేణ చార్ఘే7థ గన్దపుష్పాన్వితే న్యసేత్ 9 చైతన్యం సర్వగం జ్యోతిరస్త్రజప్తేన వారిణా | షడన్తేనతు సంసిచ్య హస్తే ధ్యాత్వా హరిం పరే 10 ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం వహ్నిగిఙ్ముఖాన్ | అధర్మాదీని గాత్రాణి పుర్వాదౌ యోగపీఠకే 11 కూర్మం పీఠే హ్యనన్తం చ యమం స్యూర్యాదిమణ్డలమ్ | విమలాద్యాః కేసరస్థానగ్రహాః కర్ణికాస్థితాః 12 పూర్వం స్వహృదయే ధ్యాత్వా ఆవాహ్యార్బేచ్చ మణ్డలే | అర్ఘ్యం పాద్యం తథాచామం మధుపర్కం పునశ్చ తత్. స్నానం వస్త్రోపవీతం చ భూషణం గన్దపుష్పకమ్ | ధూపదీపనైవేద్యాని పుణ్డరీకాక్షవిద్యయా. 14 యజేదఙ్గాని పూర్వాదౌ ద్వారి పూర్వే పరే7ణ్డజమ్ | దక్షేచక్రం గదాం సౌమ్యకోణ శఙ్ఖం ధనుర్వ్యసేత్. 15 దేవన్య వామతో దక్షే చేషుధీ ఖడ్గమేవ చ | వామే చర్మ శ్రియం దక్షేపుష్టిం వామేగ్రతో న్యసేత్ . 16 జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును. వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16 వనమాలాం చ శ్రీవత్సకౌస్తుభౌ దికృతీన్ బహిః | స్వమన్త్రైరరచ్చయేంతృర్వాన్విష్ణోరర్భావసాగతుః 17 వ్యస్తేన చ సమస్తేన అఙ్గేర్భీజేన వై యజేత్ | జప్త్వా ప్రదక్షిణీకృత్య స్తుత్వార్ఘ్య చ సమర్ప్యచ 18 హృదయే విన్యసేద్ధ్యాత్వా అహం బ్రహ్మహరిస్త్వితి | వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తియైన పిమ్మట అంగదేవతలను వ్యస్తరూపమునను, నమస్తరూపమునను బీజాక్షరయుక్త మంత్రములతో పూజింపవలెను. జపించి, ప్రదక్షిణముచేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి "నేనే బ్రహ్మను, నేనే హరిని" అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను. 17-18 ఆగచ్ఛావాహనే యోజ్యం క్షమస్వేతి విసర్జనే. 19 ఏవమష్టాక్షరాద్వైశ్చ పూజాం కృత్వా విముక్తిభాన్ | అవాహనము చేయు నపుడు 'అగచ్ఛ' అనియు, ఉద్వాననము చెప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును. 19 ఏకమూర్త్యర్చనం ప్రోక్తం నవవ్యూహార్చనం శృణు. 20 అఙ్గష్ఠద్వయకే న్యస్య వాసుదేవం బలాదితన్ | తర్హన్యాదౌ శరీరే7థ శిరోలలాటపవక్త్రకే. 21 హృన్నాభిగుహ్యజాన్వఙ్ఘ్ర మధ్యే పూర్వాధికం యజేత్ | ఏకపీఠే నవవ్యూహం నవపీఠం చ పూర్వవత్. 22 నవాబ్జే నవమూర్త్యా చ నవవ్యూహం చ పూర్వవత్ | పద్మమధ్యే చ తత్థ్సాని వాసుదేవం చ పూజయేత్. 23 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆదిమూర్త్యాదిపూజావిధిర్నామ త్రయోవింశో7ధ్యాయః ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. అంగుష్ఠద్వయము నందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. పిమ్మట శిలస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మధ్యయందు పూర్వాదిక్ పూజా చేయవలెను. ఏకపీఠముపై. క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుకటివలెనే చయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతను, వాసుదేవుని పూజించవలెను. అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము