Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ పఞ్చవింశో೭ధ్యాయః అథ వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనమ్: నారద ఉవాచ: వాసుదేవాదిమన్త్రాణాం పూజ్యానం లక్షణం వదే | వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్ధకః. 1 నమో భగవతే చాదౌ అ ఆ అం అః, సబీజకాః | ఓఙ్కారాద్యా నమోన్తాశ్చ నమో నారాయణస్తః. 2 నారదుడు పలికెను: పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను. ఆదియందు "నమో భగవతే" అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందు కలవి, 'నమః' అనునది అంతమందు కలవి అయిన "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' అను పదములచే "ఓం అ నమో భగవతే వాసుదేవాయ" ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ" "ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ" "ఓం అః నమో భగవతే అనిరుద్దాయ" అను మంత్రము లేర్పడును, పిమ్మట "ఓం నమో నారాయణాయ" అను మంత్రము. ఓం తత్సద్బ్రహ్మణ చైవ ఓం నమో విష్ణవే నమః | ఓం క్షౌం ఓం నమో నరసింహాయ వైనమః. 3 ఓం భూర్భగవతే వరాహాయ నరాధిపాః | జపారుణహరిద్రాభా నీలశ్యామలలోహితాః 4 మేఘాగ్ని మధుపిఙ్గాభా వల్లభా నవ నాయకాః | అఙ్గాని స్వరబీజనాం స్వనామాన్తైర్యథాక్రమమ్. 5 హృదయాదీని కల్పేత విభ##క్తైస్తన్త్రవేదిభిః | వ్యఞ్జనాదీని బీజాని తేషాం లక్షణమన్యథా. 6 "ఓం తత్సద్బ్రహ్మణ నమః" "ఓం నమో విష్ణవే నమః" ఓం క్షౌ ఓం నమో భగవతే నరసింహాయ నమః" "ఓం భూర్భగవతే వరాహాయ నమః" (ఇవి మంత్రములు). జపా పుష్పము వలె అరుణమైన రంగు పుసుపువంటి రంగు నీల - శ్యామల - లోహిత వర్ణములు, మేఘ - అగ్ని - మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు నీటికి నాయకులు, తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వరరూపము లైన బీజాక్షరములకు ఆ యా మంత్రము లందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించవలెను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును. దీర్ఘన్వర్తేస్తు భిన్నాది నమోన్తాన్తస్థితాని తు | అఙ్గాని హ్రస్వయుక్తాని ఉపాఙ్గానీతి వర్ణ్యతే. 'నమః' అనునది అంతము నందు గల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో గూడి యున్న వ్యంజనములు అంగము లనియు, హ్రస్వస్వరములతో కూడినవి ఉపాంగము లనియు చెప్పబడును. విభక్తనామవర్ణాన్తస్థితం బీజాత్మముత్తమమ్ | దీర్ఘహ్రసై#్వశ్చ సంయుక్తం సాఙ్గోపాఙ్గస్వరైః క్రమాత్. 8 వ్యఞ్జనానాం క్రమోహ్యేష హృదయాది ప్రక్లప్తయే | స్వబీజేన స్వనామాన్తైర్విభక్తాన్యఙ్గనామభిః 9 యుక్తాని హృదయాదీని ద్వాదశాన్తాని పఞ్చతః | ఆరభ్య కల్పయిత్వా తు జ పేత్సిద్ధానురూపతః. 10 దీర్ఘ హ్రస్వములతో కూడినదియు, సాంగోపాంగస్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరముల అంతమునందు ఉన్నదియు అగు బీజక్షరము ఉత్తమ మైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమ మిది - తన నామము అంతము నందు గల అంగనామములతే విభక్తములై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను. హృదయం చ శిరశ్చూడా కవచం నేత్రమస్త్రకమ్ | షడఙ్గాని తు బీజానాం మూలస్య ద్వాదశాఙ్గకమ్. 11 హృచ్ఛిరశ్చ శిఖా చైవ హస్తౌ నేత్రే తథోదరమ్ | పృష్ణ బాహూరు జానూంశ్చ జఙ్గే పాదౌ క్రమాన్య్నసేత్. హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల అంగములు, హృదయము, శిరస్సు, శిఖ, హస్తములు, నేత్రములు, ఉదరము, పృష్ఠభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు పిక్కలు, పాదములు ఈ పండ్రెండును మాలమునకు అంగములు, క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయవలెను. కం టం పం శం వైన తేయః ఖం ఠం ఫం షం గదానుజః | గం డం బం సం పుష్టిమన్త్రో ఘం ఢం భం హం శ్రియై నమః. 13 వం శం మం క్షం పాఞ్చజన్యం ఛం తం పం కౌస్తుభాయ చ | జం ఖం వం సుదర్శనాయ శ్రీవత్సాయ సం వం దం చం లం. 14 "కం టం పం శం వైనతేయాయ సమః" ''ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః" éగం డం బం సం పుష్టి మన్త్రాయ నమః". ఘం ఢం భం హం శ్రియై నమః'' ''వం శం మం క్షం పాఞ్చజన్యాయ నమః" "ఛం తం పం కౌస్తుభాయ నమః" "జం ఖం వం సుదర్శనాయ నమః " "సం వం దం చం లం శ్రీవత్సాయ నమః." ఓ ధం వం వనమాలయై మహానన్తాయ వై నమః | నిర్బీజపదమన్త్రాణాం పదైరఙ్గాని కల్పయేత్. 15 ఓం ధం వం వనమాలయైన నమః "మహానన్తాయ నమః" బీజరహితములైన పదములు గల మంత్రములకు పదములచేతనే అంగములను కల్పింపవలెను. జాత్యన్తైర్నమసంయుక్తైర్హృదయాదీని పఞ్చధా | ప్రణవం హృదయాదీని తతః ప్రోక్తాని పఞ్చధా. 16 నామసంయుక్తములును, జత్యంతములును అగు పదములచే హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి. ప్రణవం హృదయం పూర్వం పరాయేతి శిరః శిఖా | నామ్నాత్మనా తు కవచ మస్త్రం నామాన్తకం భ##వేత్. ముందుగా ప్రణవముచే హృదయమును, 'పరాయ' అని శిరస్సును, పేరుతో శికను, ఆత్మచేత కవచమును, నామాస్తముతో అస్త్రమును విన్యసించవలెను. ఓం పరాస్త్రాది స్వనామాత్మా చతుర్థ్యన్తోనమో న్తకః | ఏక వ్యూహాది షడ్వింశ వ్యూహాత్త స్యాత్మనో మనుః. ఓంకారము ఆదియందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలెను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమనము. కనిష్ఠికాది కరాగ్రేషు ప్రకృతిం దేహకే ర్చయేత్ | పరాయ పురుషాత్మా స్యాత్ ప్రకృత్యాత్మా ద్విరూపకః. ఓం పరాయాగ్న్యత్మనే చ వస్వర్కౌ చ ద్విరూపకః | అగ్నిత్రిమూర్తౌవిన్యస్య వ్యాపకం కరదేహయోః. 20 వాయ్వర్కౌ కరశాఖాసు సవ్యేతరకరద్వయే | హృది ముర్తౌ తనావేష త్రివ్యూహే తుర్యరూపకే. 21 కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను. ఋగ్వేదం వ్యాపకం హస్తే అఙ్గులషు యజుర్న్యసేత్ | తలద్వయేథర్వ రూపం శిరో హృచ్చరణాన్తిగమ్. 22 ఆకాశం వ్యాపకం న్యస్య కరే దేహే తు పూర్వవత్ | అఙ్గులీషు చ వాయ్వాది శిరో హృద్గుహ్యపాదకే. 23 వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను. వాయుర్జ్యోతిర్జలం పృథ్వీ పఞ్చావ్యూహః సమీరితః | మనః శ్రోత్రం త్వగ్దృగ్జిహ్వా ఘ్రాణం షడ్వ్యూహ ఈరితః || 24 వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము. వ్యాపకం మానసం న్యస్య తతో7ఙ్గుష్ఠాదితః క్రమాత్ | మూర్ధాస్యహృద్గుహ్యపత్సు కథితః కరణాత్మకః. 25 ఆదిమూర్తిస్తు సర్వత్ర వ్యాపకో జీవసంజ్ఞితః | వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు. భూర్భువః స్వర్మహర్జనస్తపఃసత్యం చ సప్తధా. కరే దేహే న్య సేదాద్యమఙ్గుష్ఠాదిక్రమేణ తు | 26 భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను. తలసంస్థః సప్తమశ్చ లోకేశో దేహకే క్రమాత్. దేవః శిరోలలాటాస్యహృద్గుహ్యాఙ్ఘ్రిషు సంస్థితిః | ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును. అగ్నిష్టోమస్తథోక్థస్తు షోడశీ వాజ పేయకః 28 ఆతిరాత్రో7ప్తోర్యామశ్చ యజ్ఞత్మా సప్తరూపకః | అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది. ధీరహం మనః శబ్దశ్చ స్పర్శరూపరసాస్తతః. 29 గన్ధో బుద్ధిర్వ్యాపకం తు కరే దేహే న్యసేత్క్రమాత్ | న్యసేదఙ్ఘ్ర చ తలయోః కే లలాటే ముఖే హృది. నాభౌ గుహ్యేచ పాదౌ చ అష్టవ్యూహః పుమాన్ స్మృతః | ధీ, అహంకారము, మనస్సు, శబ్ధము, స్పర్శ - రూప - రసములు - గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందను, దేహమునందును విన్యసించవలెను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, సుఖము, హృదయము, నాభి, గుహ్యప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహుడని చెప్పబడినాడు. జీవో బుద్ధిహఙ్కారో మనః శబ్దో గుణో7నిలః 31 రూపం రసో నవాత్మాయం జీవ అఙ్గష్ఠకద్వయే | తర్జన్యాదిక్రమాచ్ఛేషం యావద్వాతుప్రదేశినీమ్ . 32 దేహే శిరోలలాటస్యహృన్నాభీగుహ్యజానుషు | పాదయోశ్చ దశాత్మాయ మిన్ద్రో వ్యాపీ సమాస్థితః 33 అఙ్గుష్ఠద్వయకే వహ్ని స్తర్జన్యాదౌ పరేషు చ | శిరోలలాటవక్త్రెషు హృన్నాభీగుహ్యజానుషు. 34 పాదయోరేకాదశాత్మా మనః శ్రోత్రం త్వగేవ చ | చక్షుర్జిహ్వా తథా ఘ్రాణం వాక్పాణ్యఙ్ఘ్రిశ్చ పాయు చ. 35 ఉపస్థం మానపో వ్యాపి శ్రోత్రమఙ్గష్ఠకద్వయే | తర్జన్యాదిక్రమాదష్టావతిరిక్తం తలద్వయే. 36 ఉత్తమాఙ్గలలాటాస్య హృన్నాభావథ గుహ్యకే| ఊరుయుగ్మే తథా జఙ్ఘా గుల్ఫాపాదేషు చ క్రమాత్. 37 జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్ధము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నావాత్మకుడు. అంగష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జనిమొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను. దశాత్మకు డగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః శ్రోత్ర, చక్షుర్, జిహ్వా, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మరు డగు ఈ జీవుని శ్రోత్రమునందను, అంగుష్ఠ ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము. అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల్ఫ (చీలమండలు), పాదములపై విన్యసించవలెను. విష్ణుర్మధుహరశ్చైవ త్రివిక్రమకవామనౌ | శ్రీధరో7థహృషీ కేశః పద్మనాభస్తథైవ చ. 38 దామోదరః కేశవశ్చ నారాయణస్తతః పరః| మాధవశ్చాథ గోవిన్దో విష్ణుర్త్వె వ్యాపకం న్యసేత్ . 39 అఙ్గుష్ఠాదౌ తలాదౌ చ పదే జానుని వై కటౌ | శిరః శిఖోరః కట్యాస్యజానుపాదాదిషు న్యసేత్. 40 ద్వాదశాత్మా పంచవింశః షడ్వింశవ్యూహకస్తథా | విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుని అని ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదులందును, తలాదులందును, పాదమునందును, జానువునందను, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, వాదము మొదలైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములు కలవాడును, షడ్వింశవ్యూహములు కలవాడును, ఎట్లనగా, పురుషో ధీరహఙ్కారో మనిశ్చిత్తం చ శబ్దకః 41 తథా స్పర్శో రసో రూపం గన్ధః శ్రోత్రం త్వచస్తథా | చక్షుర్జిహ్వా నాసికా చ వాక్చ పాణ్యంఘ్రిశ్చ పాయవః. 42 ఉపస్థో భూర్జలం తేజో వాయురాకాశ##మేవ చ | పురుషం వ్యాపకం న్యస్య అఙ్గష్ఠాదౌ దశ న్యసేత్. 43 శేషాన్ హస్తతలే న్యస్య శిరస్యథ లలాటకే | ముఖహృన్నాభిగుహ్యోరుజన్వంఫ్ర° కరణోద్గతౌ. 44 పాదౌ జాన్వోరుపస్థే చ హృదయే మూర్ధ్ని చ క్రమాత్ | పరశ్చ పురుషాత్మాదౌ షడ్వింశే పూర్వవత్ పరమ్. 45 పురుష-ధీ-అహంకార-మనన్-చిత్త-శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-శ్రోత్ర-త్వక్-చక్షుర్-జిహ్వా-నాసికా-వాక్-పాణి-పాద-పాయు-ఉపస్థ-భూ-జల-తేజన్-వాయు-అకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందు, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు-వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పరరూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పనట్లే. సంచిన్త్య మణ్డలైకే తు ప్రకృతిం పూజయేద్బుధః పూర్వయామ్యాప్యసౌమ్యేఘ హృదయాదీని పూజయేత్. 46 అస్త్రమాగ్న్యాదికోణషు వైనతేయాదిపూర్వవత్ | దిక్పాలశ్చ విధిస్తస్య త్రివ్యూహే7గ్నిశ్చ మధ్యతః. 47 పూర్వాదిదిగ్దాలా వాసై రాజ్యాదిభిరలఙ్కృతః | కర్ణికాయాం నాభసశ్చ మానసః కర్ణికాస్థితః. 48 పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తరదిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్య్నాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యను దుండను. పూర్వాది దిక్కలందు దలములం దున్నదేవతలలో కూడా రాజ్యాద్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన స్మాత (అంతరాత్మ) ఉండును. విశ్వరూపం సర్వస్థిత్యై యజేద్రాజ్య జయాయ చ | సర్వవ్యూహైః సమాయుక్త మఙ్గైరపి చ పఞ్చభిః. 49 గురుడాద్యైస్తథేన్ద్రాద్యైః సర్వాన్ కామానవాప్నుయాత్ | విష్వక్సేనం యజేన్నామ్నా వై బీజం వ్యోమసంస్థితమ్. 50 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనం నామ పఞ్చవింశో7ధ్యాయః. ఈ విఖముగ సర్వవ్యూహములతోను, గరుడాదిపంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యయముకొరకును పూజింపవలెను. సమస్తకామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను. అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.