Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోనత్రింశో7ధ్యాయః. అథ సర్వతోభద్రమణ్డలవిధిః నారద ఉవాచ : సాధకః సాధయేన్మన్త్రం దేవతాయతనాదికే | శుద్ధభూమౌ గృహే ప్రాచ్యే మణ్డలే హరిమీశ్వరమ్. 1 చతురశ్రీకృతే క్షేత్రే మణ్డలాదీని వై లిఖేత్ | రసబాణాక్షికోష్ఠేషు సర్వతోభద్రమాలిఖేత్. 2 షట్త్రింశత్కోష్ఠకైః పద్మం పీఠం పఙ్త్క్యా బహిర్భవేత్ | ద్వాభ్యాం తు వీథికా తస్మాద్ద్వాభ్యాం ద్వారాణి దిక్షు చ. 3 సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్రమండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను. వర్తులం భ్రామయిత్వా తు పద్మక్షేత్రం పురోదితమ్ | పద్మార్ధే భ్రామయిత్వా తు భాగం ద్వాదశకం బహిః. 4 విభజ్య భ్రామయేచ్ఛేషం చతుః క్షేత్రం తు వర్తులమ్ | వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను. ప్రథముం కర్ణకాక్షేత్రం కేసరాణాం ద్వితీయకమ్. 5 తృతీయం దలసన్ధీనాం దలాగ్రాణాం చతుర్థకమ్ | మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము. ప్రసార్య కోణసూత్రాణి కోణదిఙ్మధ్యమం తతః. 6 నిధాయ కేసరాగ్రే తు దలసన్ధీంస్తు లాఞ్ఛయేత్ | పాతయిత్వాథ సూత్రాణి తత్ర పత్రాష్టకం లిఖేత్. 7 దలసన్ధ్యన్తరాలం తు మానం మధ్యేనిధాయ తు | దలాగ్రం భ్రమయేత్తేన తదగ్రే తదనన్తరమ్. 8 తదన్త రాలం తత్పార్శ్వే కృత్వా బాహ్యక్రమేణ చ కేసరే తు లిఖేద్ద్వౌ ద్వౌ దలమధ్యే తతః పునః. 9 పద్మలక్ష్మైతత్సామాన్యం ద్విషట్కదలముచ్చతే | కర్ణికార్ధేన మానేన ప్రాక్సంస్థం భ్రామయేత్ క్రమాత్. 10 తత్పార్శ్వే భ్రమయోగేన కుడ్ణల్యః షడ్భవన్తి హి | ఏవం ద్వాదశ మత్స్యాః స్యు ర్ద్విషట్కదలకం చ తైః. కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగమువరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దలముల సంధులను గుర్తింపవలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దలముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను. వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడుచున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దల కమలమేర్పడును. పఞ్చపత్రాభిసిద్ధ్యర్థం మత్స్యే కృత్వైవమబ్జకమ్ | వ్యోమరేఖా బహిఃపీఠం తత్ర కోష్ఠాని మార్జయేత్. 12 త్రీణి కోణషు పాదార్థం ద్విద్వికాన్యపరాణి తు | చతుర్దిక్షు విలిప్తాని పత్రకాణి భవన్త్యుత. 13 తతః పఙ్త్కిద్వయం దిక్షు వీథ్యర్థం తు విలోపయేత్ | ద్వారాణ్యాశాసు కుర్వీత చత్వారి చతసృష్వపి. 14 పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను. నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను. ద్వారాణాం పార్శ్వతః శోభా అష్టౌ కుర్యాద్విచక్షణః | తత్పార్శ్వ ఉపశోభాస్తు తావత్యః పరికీర్తితాః. 15 సమీప ఉపశోభానాం కోణాస్తు పరికీర్తితాః | చతుర్దిక్షు తతో ద్వే ద్వే చిన్త యేన్మధ్యకోష్ఠకైః. 16 చత్వారి బమ్యతో మృజ్యాదేకైకం పార్శ్వయోరపి | శోభార్థం పార్శ్వయోస్త్రీణి త్రీణి లుమ్పేద్దలస్య తు. 17 తద్వద్విపర్యయే కుర్యాదుపశోభాం తతః పరమ్ | కోణస్యాన్తర్బహిస్త్రీణి చిన్త యేద్ద్విర్విభేదతః. 18 విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును. ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను. శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను. ఏవం షోడశకోష్ఠం స్యా దేవమన్యత్తు మణ్డలమ్ | ద్విషట్కభాగే షట్త్రింశత్పదం పద్మం తు వీథికా. 19 ఏకా పఙ్త్కిః పరాభ్యాం తు ద్వారశోభాది పూర్వవత్ | ద్వాదశాఙ్గులిభిః పద్మమేకహస్తే తు మణ్డలే. 20 ద్విహస్తే హస్తమాత్రం స్యాద్వృద్ధ్యా ద్వారేణ వా చరేత్ | అపీఠం చతురస్రం స్యాద్ద్వికరం చక్రపఙ్కజమ్. 21 పద్మార్థం నవభిః ప్రోక్తం నాభిస్తు తిసృభిఃస్మృతా | అష్టాభిస్త్వరకాన్ కుర్యాన్నేమిం తు చతురఙ్గులైః. 22 త్రిధా విభజ్య చ క్షేత్రమన్తర్ద్వాభ్యామథాఙ్కయేత్ | పఞ్చాన్తరసద్ధ్యర్థం తేష్వాస్ఫాల్య లిఖేదరాన్. 23 ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24 భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25 అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26 ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండువలదల ఏబదిఆరు కోష్ఠములు గల మండలము వర్ణింపబడినది. ఇతర మండలనిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెం డేసి కోష్ఠములచే నూటనలభైనాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు. ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక చెప్పన విధమున, ద్వారశోభలు కల్పిలంపబడును. ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమలక్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తములు ప్రమాణము గల మండలమునందు కమలస్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను. రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహిత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానమునందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును. విభజ్య సప్తధా క్షేత్రం చతుర్దశకరం సమమ్ | ద్విధా కృతే శతం హ్యత్ర షణ్ణవత్యధికాని తు. 27 కోష్ఠకాని చతుర్భిసై#్తర్మధ్యే భద్రం సమాలిఖేత్ | పరితో విసృజేద్వీథ్యై తథా దిక్షు సమాలిఖేత్. 28 కమలాని పునర్వీథ్యై పరితః పరిమృజ్య తు | ద్వే ద్వే మధ్యమకోష్ఠే తు గ్రీవార్థం దిక్షు లోపయేత్. 29 చత్వారి బాహ్యతః పశ్చాత్త్రీణి త్రీణి తు తోపయత్ | గ్రీవా పార్శ్వే బహిస్త్వే కా శోభా సా పరికీర్తితా. 30 విసృజ్య బాహ్యకోణషు సప్తాన్తస్త్రీణి మార్జయేత్ | మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్. 31 పఞ్చవింశతికవ్యూహం మణ్డలం విశ్వరూపకమ్ | ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింవతాసమమ్. 32 ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్ | కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః. 33 భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పఙ్త్కిం విమృజ్య తు | తతః షోడవభిః కోష్ఠైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్. 34 పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను. లేదా - తూర్పునుండి పశ్చిమము వరకును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునైదేసి సమానరేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూటతొంబదియారు కోష్ఠము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను. మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలములు నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచివేయవలెను. పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టమలలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థానపార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వారశోభ యనిపేరు. వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచివేయవలెను. దానికి 'నవనాలము' లేదా ''నవనాభమండలము'' అని పేరు. దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహరూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పదిరెండుచేతనే సమముగా విభజింపవలెను. అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో ''భద్రమండలము''ను నిర్మింపవలెను. మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలెను. దీనికి ''భద్రాష్టకము'' అని పేరు. తతో7పి పఙ్త్కిం సంమృజ్య తద్వత్ షోడశభద్రకమ్ | లిఖిత్వా పరితః పఙ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్. 35 ద్వారద్వాదశకం దిక్షు త్రీణి త్రీణి యథాక్రమాత్ | షడ్భిశ్చ పరిలుప్యాన్తర్మధ్యే చత్వారి పార్శ్వయోః. 36 చత్వార్యన్తర్బహిర్ద్వే తు శోభార్థం పరిమృజ్య తు | ఉపద్వారప్రసిద్ధ్యర్థం త్రీణ్యన్తః పఞ్చ బాహ్యతః. 37 పరిమృజ్య తథా శోభాం పూర్వవత్పరికల్పయేత్ | వహ్నికోణషు సప్తాన్తస్త్రీణి కోష్ఠాని మార్జయేత్. 38 పఞ్చవింశతికవ్యూహే పరం బ్రహ్మ యజేచ్ఛుభీ | మధ్యే పూర్వాదితః పద్మే వాసుదేవాదయః క్రమాత్. 39 వరాహం పూజయిత్వా చ పూర్వపద్మే తతః క్రమాత్ | వ్యూహాన్ సంపూజయేత్తావద్యావత్ షట్త్రింశగో భ##వేత్. 40 యథోక్తం వ్యూహ మఖిలమేకస్మన్ పఙ్కజే క్రమాత్ | యష్టవ్యమితి యత్నేన ప్రచేతా మన్యతే7ధ్వరమ్. 41 సత్యస్తు మూర్తిభేదేన విభక్తం మన్యతే 7చ్యుతమ్ | చత్వారింశత్కరం క్షేత్రం హ్యుత్తరం విభ##జేత్ర్కమాత్. 42 ఏకైకం సప్తధా భూయస్తథైకైకం ద్విధా పునః | చతుష్షష్ట్యుత్తరం సప్తశతాన్యేకసహస్రకమ్. 43 కోష్ఠకానాం భద్రకం చ మధ్యే షోడశకోష్ఠకైః | పార్శ్వే వీథీం తతశ్చాభద్రాణ్యథ చ వీథికామ్. 44 షోడశాబ్జాన్యథో వీథీ చతుర్వింశతిపఙ్కజమ్ | వీథీపద్మాని ద్వాత్రింశత్ పఙ్త్కివీథిజకాన్యథ. 45 చత్వారింశత్తతో వీథీశేషపఙ్త్కిత్రయేణ చ | ద్వారశోభోపశోభాః స్యుర్దిక్షు మధ్యే విలోప్య చ. 46 ద్విచతుష్షడ్ద్వారసిద్ధ్యై చతుర్దిక్షు విలోపయేత్ | పఞ్చత్రీణ్యకకం బాహ్యే శోభోపద్వారసిద్ధయే. 47 ద్వారాణాం పార్శ్వయోరన్తః షడ్వా చత్వారి మధ్యతః | ద్వే ద్వే లుప్యే దేవమేవ షడ్ భవన్త్యుపశోభికాః. 48 ఏకస్యాం దిశి సఙ్ఖ్యాః స్యుశ్చతస్రః పరిసంఖ్యయా | ఏకైకస్యాం దిశి త్రీణి ద్వారాణ్యపి భవన్త్యుత. 49 పఞ్చ పఞ్చ చ కోణషు పఙ్త్కౌ పఙ్త్కౌ క్రమాత్సృజేత్ | కోష్ఠకాని భ##వేదేవం మర్త్యేష్టం మణ్డలం శుభమ్. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వతోభద్రమణ్డలాది విధిర్నామోనత్రింశో7ధ్యాయః. దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను. మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచివేయలవలెను. పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను. పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతివ్యూహమండలములోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను. మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను. ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను. ఒకేమండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను. నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను. పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను. సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను. ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున. అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.