Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ తృతీయో7ధ్యాయః. అథ కూర్మావతారవర్ణనమ్. అగ్ని రువాచ :- వక్ష్యే కూర్మావతారం చ సంశ్రుతం పాపనాశనమ్ | పురా దేవాసురే యుద్దే దైత్యైర్దేవాః పరాజితాః. 1 దుర్వాససశ్చ శాపేన నిశ్రీకాశ్చాభవంస్తదా | స్తుత్వా క్షిరాబ్దిగం విష్ణుమూచుః పాలయ చాసురాత్. 2 అగ్ని పలికెను: పాపములను తొలిగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞచేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసురయుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువును స్తుతించి ''మమ్ములను అసురులనుండి రక్షింపుము'' అని వేడికొనిరి. బ్రహ్మాదికాన్ హరిః ప్రాహ సన్దిం కుర్వన్తు చాసురైః | క్షీరాబ్దిమథనార్థం హి అమృతార్థం శ్రియే సురాః. 3 అరయో7పిహి సంధేయాః సతి కార్యార్థగౌదవే | యుష్మానమృతభాజో హి కరిష్యామి న దానవాన్. 4 మన్థానం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్ | క్షీరాబ్దిం మత్సాహాయేన నిర్మథధ్వమతన్ద్రతాః. 5 శ్రీ మహావిష్ణువు బహ్మాది దేవతలతో ఇట్లనెను: ''సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు. పని విడినపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా ! అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తక్కకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షిరాబ్ధిని మధింపుడు. మాంద్యము వలదు. విష్ణూక్తాః సంవిదం కృత్వా దైత్యైః క్షీరాబ్దిమాగతాః | తతో మథితుమారబ్ధా యతః పుచ్ఛం తతః సురాః. 6 విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యలతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికి వచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి. ఫణినిశ్శ్వాసన న్తప్తా హరిణాప్యాయితాః సురాః | మథ్యమానే 7ర్ణవే సో7ద్రిదనాధారో హ్యపో7విశత్. 7 సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతముక్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయేను. కూర్మరూపం సమాస్థాయ దధ్రే విష్ణుశ్చ మన్దరమ్ | క్షీరాబ్ధేర్మథ్యమానాచ్చ విషం హాలాహలం హ్యభూత్. 8 విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్ధినుండి హాలాహల విషము పుట్టెను. హరేణ ధారితం కణ్ఠ నీలకణ్ఠస్తతో7భవత్ | తతో7భూద్వారుణీ దేవీ పారిజాతస్తు కౌస్తుభః. 9 గావశ్చాప్సరసో దివ్యా లక్ష్మీర్దేవీ హరిం గతా | పశ్యన్తః సర్వదేవాస్తాం స్తువన్తః సశ్రియో7భవన్. 10 శివుడు ఆ విషమును కంఠమునందు ధరించెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవుల , దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి. తతో ధన్వన్తరిర్విష్ణురాయుర్వేద ప్రవర్తకః |బిభ్రత్కమణ్డలుం పూర్ణమమృతేన సముత్థితః. 11 పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్బవించెను. అమృతం తత్కరాద్దైత్యాః సురేభ్యో7ర్ధం ప్రదాయ చ | గృహీత్వా జగ్ముర్జమ్భాద్యా విష్ణుః స్త్రీరూపధృక్తతః. 12 జంభుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి, సగము దేవతల కిచ్చి, వెళ్లిపోయిరి. పిమ్మట విష్ణువు స్త్రీరూపమును ధరించెను. తాం దృష్ట్వా రూపసంపన్నాం దైత్యాః ప్రోచుర్విమోహితాః | భవ భార్యామృతం గృహ్య పాయయాస్మాన్వరాననే. 13 మంచి సౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చెంది, ''ఓ వరాననా ! మాకు భార్యవు కమ్ము; ఈ ఆమృతమును తీసికొని మాకు (త్రాగించుము) పంచిపెట్టుము'' అని పలికిరి. తథేత్యుక్త్వా హరిస్తేభ్యో గృహీత్వా పాయయత్సురాన్ | చన్ద్రరూపధరో రాహుః పిబంశ్చార్కేన్దునార్పితః. 14 అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహంచి దేవతలచే త్రాగించెను. రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్యచంద్రులాతనిని పట్టి చూపిరి. హరిణాప్యరిణా చ్ఛిన్నం తదా రాహోః శిరః పృథక్ | కృపయామరతాం నీతం వరదం హరిమబ్రవీత్ 15 రాహుర్మత్తస్తు చన్ద్రార్కౌ ప్రాప్స్యేతే గ్రహణం గ్రహః | తస్మిన్ కాలే తు యద్దానం దాస్యన్తే స్యాత్తదక్షయమ్. 16 అప్పుడు విష్ణువు రాహుశిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చేసెను. రాహువు వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను : '' చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణ మగును. ఆ కాలమునందు ఇచ్చు దానము ఆక్షయ మగుగాక''. తథేత్యాహాథ తం విష్ణుస్తతః సర్త్వెః సహామర్తెః | స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ. 17 ''అటులనే ఆగుగాక'' అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు '' ఆ స్త్రీ రూపమును చూపుము'' అని హరితో అనెను. దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్ హరిః | మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రియం గతః. 18 భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు స్త్రీరూపమును చూపెను. శివుడు విష్ణుమయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను. నగ్న ఉన్మత్తరూపో7భూత్ స్త్రీయః కేశానధారయత్ | అగాద్విముచ్చ కేశాన్ స్త్రీ అన్వధావచ్చ తాం గతామ్. 19 శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను. స్ఖలితం యత్ర వీర్యచం కౌ యత్ర యత్ర హరస్య హి | తత్ర తత్రాభవత్ క్షేత్రం లిఙ్గానాం కనకస్య చ. 20 ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను. మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థో7భవద్దరః | శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే. 21 న జేతుమేనాం శక్తో మే త్వదృతే7న్యః పుమాన్ భువి | ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తుయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : '' రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు. '' ఆప్రాప్యాథామృతం దైత్యా దేవైర్యుద్ధే నిపాతితాః. త్రిదివస్థాః సురాశ్చాసన్ దైత్యాః పాతాలవాసినః | యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్. 23 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యయః. అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతళలోకనివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందను. ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యయము సమాప్తము.