Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వాత్రింశో೭ధ్యాయః అథ సంస్కార కథనమ్ అగ్ని రువాచ : నిర్వాణాదిషు దీక్షాసు చత్వారింశత్తథాష్ట చ | సంస్కారాన్కారయేద్ధీమాఞ్ఛృణు తాన్యైః సురో భ##వేత్. 1 గర్బాధానం యోన్యాం వై తతః పుంసవనం చరేత్ | సీమన్తోన్నయనం చైవ జాతకర్మ చ నామ చ. 2 అన్నాశనం తతశ్చూడా బ్రహ్మచర్యం వ్రతాని చ | చత్వారి వైష్ణవీ పార్థీ భౌతికీ శ్రౌతికీ తథా. 3 గోదానం స్నాతకత్వం చ పాకయజ్ఞాశ్చ సప్త తే | అష్టకా పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రయణీతిచ. 4 చైత్రీ చాశ్యయుజీ సప్త హవిర్యజ్ఞాశ్చ తాఞ్ఛృణు | అధానం చాగ్నిహోత్రం చ దర్శో వై పౌర్ణమాసకః. 5 చాతుర్మాస్యం పశోర్బన్ధః సౌత్రామణిరథాపరః | సోమసంస్థాః సప్త శృణు చాగ్నిష్టోమః క్రతూత్తమః. 6 అత్యగ్నిష్టోమ ఉక్థశ్చ షోడశీవాజపేయకః | అతిరాత్రాప్తోర్యామశ్చ సహస్రేశాః సవాఇమే. 7 హిరణ్యాఙ్ఘ్రిర్హిరణ్యాక్షో హిరణ్యమిత్ర ఇత్యతః | | హిరణ్యపాణి ర్హేమాక్షో మేమాఙ్గో హేమసూత్రకః. 8 హిరణ్యాస్యో హిరణ్యాఙ్గో హేమజిహ్వా హిరణ్యవాన్ | అశ్వమేధో హి సర్వేశో గుణాశ్చాష్టాథ తాఞ్ఛృణు. 9 దయా చ సర్వభూతేషు క్షాన్తిశ్చైవ తథార్జవమ్ | శౌచం చైవ మనాయాసో మఙ్గలం చాపరో గుణః. 10 అకార్పణ్యం చాస్పృహా చ మూలేన జుహుయాచ్ఛతమ్ | సౌరశాక్తేయ విష్ణ్వీశదీక్షాస్వేతే సమాః స్మృతాః. 11 సంస్కారైః సంస్కృతశ్చతైర్భుక్తిం ముక్తిమవాప్నుయాత్ | సర్వరోగాదినిర్ముక్తో దేవవద్వర్తతే నరః. 12 జప్యాద్ధోమాత్పూజనాచ్చ ధ్యానాద్దేవస్య చేష్టభాక్ | ఇత్యాది మమాపురాణ ఆగ్నేయే అష్టచత్వారింశత్సంస్కారకథనం నామ ద్వాత్రింశో7ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పను : బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాదిదీక్షలలో నలబదియోనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము. వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును. మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతిక (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు, (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19 ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్యయుజి అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్ని హోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠ మైన దగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామముఅను ఏడు సోమసంస్థలు, (36) హిరణ్యాంఘ్రి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు (47) అన్ని యజ్ఞములకును అధిపతి యైన (1) అశ్వమేధము అను సహస్రేశయజ్ఞములు, సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను. ఇష్టదేవతామూలమంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను. సౌర-శాక్త-వైష్ణవ-శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును. మునుష్యునకు ఇష్టదేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును. ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కారవర్ణన మను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము,