Sri Madhagni Mahapuranamu-1
Chapters
విష్ణుపరిత్రారోపణ విధి అథ షట్త్రింశో7ధ్యాయః. అథ విష్ణుపవిత్రారోపణ విధిః అగ్నిరువాచ : ప్రాతః స్నానాదికం కృత్వా ద్వారపాలాన్ ప్రపూజ్య చ | ప్రవిశ్య గుప్తేదేశే చ సమాకృష్యాథ దారయేత్. 1 పూర్వాధివాసితం ద్రవ్యం వస్త్రాభరణగన్ధకమ్ | నిరస్య సర్వం నిర్మాల్యం దేవం సంస్థాప్య పూజయేత్. 2 పఞ్చామృతైః కషాయైశ్చ శుద్ధగన్ధోదకైస్తతః | పూర్వాధివాసితం దద్యాద్వస్త్రం గన్ధం చ పుష్పకమ్. 3 అగ్నే హుత్వా నిత్యవచ్చ దేవం సంప్రార్ధయేన్నమేత్ | సమర్ప్య కర్మ దేవాయ పూజాం నైమిత్తికం చరేత్. 4 ద్వారపాలవిష్ణుకుమ్భవర్ధనీః ప్రార్థయేద్ధరిమ్ | అతో దేవేతి మన్త్రేణ మూలమన్త్రేణ కుమ్భకే. 5 కృష్ణ కృష్ణ సమస్తుభ్యం గృహ్ణేష్వేదం పవిత్రకమ్| పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్. 6 పవిత్రకం కురుష్వాద్యా యన్మయా దుష్కృతం కృతమ్ | శుద్ధో భవామ్యహం దేవ త్వత్ప్రసాదాత్సురేశ్వర. 7 పవిత్రం చ హృదాద్యైన్తు ఆత్మాసమభిషిచ్య చ | విష్ణుకుమ్భం చసంప్రోక్ష్య వ్రజేద్దీపనమీపతః. 8 పవిత్రమాత్మనే దద్యాద్రక్షాబన్దం విసృజ్య చ | గృహాణ బ్రహ్మసూత్రం చ యన్మయా కల్పితం ప్రభో. 9 కర్మణాం పూరణార్ధాయ యథా డోషో న మే భ##వేత్ః అగ్ని దేవుడు చెప్పెను:- ప్రాతఃకాలమున స్నానాదికము చేసి, ద్వారపాలుల పూజ చేసిన పిదప గుప్తస్థానము నందు ప్రవేశించి, వెనుక అధివాసితములైన పవిత్రకములనుండి ఒక దానిని ప్రసాదముగా గ్రహింపవలెను. మిగిలిన వస్త్రములును, అలంకారములు,ను, గంధమును, నిర్మాల్యమును తొలగించి భగవంతునకు స్నానము చేయించి పూజ చేయవలయును, పంఛామృత-కషాయ-గంధోదకములచే స్నానము చేయించి ముందగనే సిద్ధము చేసికొని ఉంచుకొనిన వస్త్ర-గంధ-పుష్పములను దేవునకు సమర్పింపవలెను. నిత్యహోమము చేసిన విధముగ అగ్నిలోహోమము చేసి భగవంతుని స్తుతించి, ప్రార్థించి భగవచ్చరణములపై శిరస్సు ఉంచవలెను. తన సమస్తకర్మలను భగవంతునకు సమర్పించి పిదప నైమిత్తకపూజ చేయవలెను. ద్వారపాల-విష్ణు-కుంభ-వర్ధనులను ప్రార్థింపవలెను. "అతో దేవాః" ఇత్యాదిమంత్రముచే గాని, మూలమంత్రము గాని కలశముపై శ్రీహరిని ఈ విధముం ప్రార్థింపవలెను. "ఓ కృష్ణా! కృష్ణా! నీకు నమస్కారము. ఈ పవిత్రమును గ్రహింపుము. ఇది ఉపాసకుని పవిత్రునిగ చేసి సంవత్సరముపాటు చేయు పూజయొక్క సంపూర్ణ ఫలమును ఇచ్చును. పరమేశ్వరా! నేను చేసిన పాపములను నశింపచేసి నన్ను పరమపవిత్రుని చేయుము. సురేశ్వరా! నీ కృపచే నేను పరిశుద్ధుడ నగుదును". హృదయశిరోమంత్రములచే పవిత్రమునకును, తనకును అభిషేకము చేసి విష్ణుకలశమును ప్రోక్షించిన పిమ్మట దేవుని దగ్గరకు వెళ్ళవలెను. దేవుని రక్షాబంధమును తొలగించి, పవిత్రమును సమర్పించి-"ప్రభో! నేను నిర్మించిన ఈ బ్రహ్మసూత్రమును స్వీకరింపుము. ఇది కర్మపరిపూర్తిసాధనము. నాయం దేవిధమైన దోషములను ఉండని విధముగ ఈ పవిత్రారోపణకర్మను సంపన్నము చేయుము" అని ప్రార్థిం-వలెను. ద్వారపాలాసనగురుముఖ్యానాం చ పవిత్రకమ్. 10 కనిష్ఠాది చ దేవాయ వనమాలాం చ మూలతః| హృదాదివిష్వక్సేనాన్తే పవిత్రాణి సమర్పయేత్. 11 వహ్నౌ హుత్వా వహ్నిగేభ్యో విష్ణాదిభ్యః పవిత్రకమ్| ప్రార్చ్య పూర్ణాహుతిం దద్యాత్ప్రాయశ్చిత్తాయ మూలతః 12 అష్టోత్తరశతం వాపి పఞ్చోపనిషదైస్తతః | మణివిద్రుమమాలాభిర్మన్ధారకుసుమారిభిః. 13 ఇయం సాంవత్సరీ పూజా తవాస్తు గరుడధ్వజ | వనమాలా యథా దేవ కౌస్తుభం రసతతం హృది. 14 తద్వత్పవిత్రతన్తూంశ్చ పూజాం చ హృదయే వహ | కామతో7కామతో వాపి యత్కృతం నియమార్చనే. 15 విధినా విఘ్నలోపేన పరిపూర్ణం తదస్తు మే | ద్వారపాలులకును, యోగపీఠాసనమునకును, ముఖ్యగురువులకును పవిత్రకము సమర్పింపవలెను. వీటిలో కనిష్ఠ పవిత్రకమును (నాభివరకు వచ్చుదానిని) ద్వారపాలులకును, మధ్యమపవిత్రకమును (తొడలవరకు వచ్చుదానిని) యోగ పీఠాసనమునకును, ఉత్తమపవిత్రకమును (మోకాళ్ళ వరకు మచ్చుదానిని గురువులకును ఇవ్వవలెను. వనమాలా పవిత్రకమును (పాదములవరకు వచ్చుదానిని) మూలమంత్రముతో భగవంతునకు సమర్పింపవలెను. "నమో విష్వక్సేనాయ" అను మంత్రము చదువుచు విష్వక్సేనునకు కూడ పవిత్రకము మర్పింపవలెను. అగ్నిలో హోమము చేసి అగ్నిలో నున్న విశ్వాదిదేవతలకు పవిత్రకము అర్పింపవలెను. పూజానంతరము ప్రాయశ్చిత్తర్థమై మూలమంత్రముతో పూర్ణాహుతి చేయవలెను. అష్టోత్తర శతముతో గాని, ఐదు ఉపనిషన్మంత్రములతో గాని పూర్ణాహుతి ఇవ్యవలెను. అష్టోత్తరశతము లెక్కపట్టుటకు, మణిమాల గాని, మందారపుష్పాదులు కాని ఉపయోగింపవలెను. చివర- "ఓ గరుడధ్వాజా! నేని చేసిన ఈ వార్షికపూజ సఫల మగుగాక. వనమాల నీ వక్షస్థలమును ప్రకాశింపచేయుచున్నట్లే ఈ పవిత్రకతంతువులును, వీటి ద్వారా నేను చేసిన పూజలో తెలిసిన గాని తెలియక గాని కలిగిన లోపములను, విధినిర్వహణములో విఘ్నముల వలన కలిగిన లోపములను, కర్మలోపములను, తొలగించి, పూజ పూర్ణముగ సఫల మగునట్లు చేయుము" అని ప్రార్థించవలెను. ప్రార్థ్యనత్వాక్షమాస్యాథ పవిత్రం మస్తకే7ర్పయేత్. 16 దత్త్వా బలిం దక్షిణాభిర్త్వెష్ణవం తోషయేద్గురుమ్ | విప్రాన్ భోజనవస్త్రాద్యైర్దివసం పక్షమేవవా. 17 పవిత్రం స్నానకాలే వా అవతార్య సమర్చయేత్ | అనివారితమన్నాద్యం దద్యాద్భుజ్త్కే7థ చ స్వయమ్. 18 విసర్జనే7హ్ని సంపూజ్య పవిత్రాణి విసర్జయేత్ | సాంవత్సరీమిమాం పూజాం సంపాద్య విధివన్మమ. 19 వ్రజ పవిత్రకేదానీం విష్ణులోకం విసర్జితః| మధ్యే సోమేశమోఃప్రార్చ్య విష్వక్సేనం హి తస్య చ. 20 పవిత్రాణీ సమభ్యర్చ్య బ్రాహ్మణాయ సమర్పయేత్ | యవన్తస్తన్తవస్తత్ర పవిత్రే పరికల్పితాః. 21 తావద్యాగసహస్రాణి విష్ణులోకే మహీయతే | కులానాం శతముద్ధృత్య దశ పూర్వాన్దశాపరాన్. 22 విష్ణులోకే తు సంస్థాప్య స్వతాం ముక్తి మవాప్నుయాత్. ఇత్యాది మహాపురాణ అగ్నేయే విష్ణుపవిత్రారోప విధి నిరూపణం నామ షట్త్రింశో7ధ్యాయః ఈ విధముగ ప్రార్థనానమస్కరములు, అపరాధక్షమాపణము చేసి పవిత్రకమును శిరస్సుపై ఉంచవలెను. తగు విధముగ బలి ఇచ్చి, వైష్ణవగురువును దక్షిణలతే సంతోషపెట్టవలెను. ఒక దినమునగాని, ఒక పక్షముపాటు గాని భోజనవస్త్రాదుల నిచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను. స్నానసమయమున పవిత్రమును తీసివేసి పూజించవలెను. ఉత్సవదివసమునందు వచ్చువారి నెవరిని కాదనక అందరికీని తప్పక అన్నదానము చేసి తాను కూడా భోజనము చయవలెను. విసర్జనదినమున పవిత్రకమును పూజించి - "ఓ పవిత్రకమా! నేను చేసిన ఈ వార్షికపూజ సుసంపన్న మగునట్లు చేసితివి. ఇపుడు నిన్ను విసర్జంచుచున్నాను. నీవు విష్ణులోకమునకు పొమ్ము" అని ప్రార్థింపవలెను. ఉత్తర-ఈశాన్యముల మధ్య విష్వక్సేనపూజ చేసి, అతని పవిత్రకములను పూజించి బ్రాహ్మణులకు ఇచ్చివేయవలెను. ఆ పవిత్రములో ఎన్ని తంతువులున్నవో అన్ని వేల యుగముల కాలము ఉపాసకుడు విష్ణులోకములో నివసించును. పవిత్రారోపణము చేసిన సాధకుడు తన వెనుక నూరు తరములను ఉద్ధరించి, తనకు పూర్వము పది తరములవారిని తరువాతిపది తరముల వారిని విష్ణులోకమునకు చేర్ఛును. తాను కూడ ముక్తుడగును. అగ్నిమాహాపురాణమునందు విష్ణుపవిత్రారోపణవిధినిరూపణ మను ముప్పదియారవ అధ్యాయము సంపూర్ణము.