Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తత్రింశో7థ్యాయః. అథ సర్వదేవపవిత్రారోపణ విధిః. సంక్షేపాత్సర్వదేవానాం పవిత్రారోపణం శృణు| పవిత్రం పూర్వలక్ష్మీ స్యాత్త్వరసానులగం త్వపి. 1 జగద్యోనే సమాగచ్ఛ పరివారగణౖః సహ| నిమన్త్రయామ్యహం ప్రాతర్దద్యాం తుభ్యం పవిత్రకమ్. 2 జగత్సృజే నమస్తుభ్యం గృహ్ణీష్వేద పవిత్రకమ్| పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్| 3 శివ దేవ నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్| మణివిధ్రుమమాలాభిర్మన్దారకుసుమాదిభిః. 4 ఇయం సంవత్సరా పూజా తవాస్తు దేదవిత్పతే| సాంవత్సరా యమాం పూజాం సంపాద్య విధివన్మమ. 5 వ్రజ పవిత్రకేదానీం స్వర్దలోకం విసర్జితః| సూర్యదేవ నమస్తుభ్యం గృహ్ణేష్వేదం పవిత్రకమ్. 6 పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్| శివ దేవ నముస్తుభ్యం గృహ్ణీ ష్వేదం పవిత్రకమ్. 7 పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదమ్| గణశ్వర నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్. 8 పవిత్రీకరణార్థాయ వర్షపుజాఫలప్రదమ్|శక్తిదేవి నమస్తుభ్యం గృహ్ణీష్వేదం పవిత్రకమ్. 9 పవిత్రీకరణార్ధాయ వర్షపూజాఫలప్రదమ్ | అగ్నిదేవుడు చెప్పెను:- ఇపుడు సమస్తదేవతాపవిత్రారోపణవిధానమును సంక్షేపముగ చెప్పుచున్నాను. వినుము. పైన చెప్పిన లక్షణములు గల పవిత్రములనే దేవతలకు సమర్పింపవలెను. వాటిలో "స్వరసము" "అనలగము" అని రెండు భేదములున్నవి. మొదట ఇష్టదేవతను ఈ క్రింద చెప్పిన విధముగ ఆహ్వానింపవలెను. - "జగత్తునకు కారణమైన బ్రహ్మాదేవా! పరివారసహితుడవై ఇచటకు రమ్ము. నేను ని న్నాహ్వానించుచున్నాను. రేపు ప్రాతఃకాలమునందు నీకు పవిత్రకము సమర్పింపగలడు". మరునాడు మరల ఈ విధముగ ప్రార్థించుచు పవిత్రకములు సమర్పింపవలెను. " జగతృష్టికర్తలైన విధాతా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. నా పవిత్రత్వము కొరకై నీకు దీనిని సమర్పించుచున్నాను. ఇది సంవత్సర మంతయు జరుగు పూజఫలము నిచ్చునది." "వేదవేత్తలను రక్షీంచు శివా! దేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. దీనిచే మణులతో పగడములతో, మందార కుసుమాదులతో నీకు సంవత్సర మంతయు చేయు పూజ దీనిచే సంపన్న మగుగాక". "ఓ పవిత్రకమా! నేను చేయు ఈ వార్షికపూజను యథావిధిగ సుసంపన్నము చేసి, నీవు స్వర్గలోకమునకు పొమ్ము". సూర్యదేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయగల దును ఉద్ధేశ్యముతో దీనిని నీకు సమర్పించుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజకు ఫలము నివ్వగలదు." "గణశా! నీకు నమస్కారము. ఈ పవిత్రము స్వీకరింపుము. పవిత్రము చేయుటకై దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫల మిచ్చును." ఓ! శక్తిదేవీ! నీకు నమస్కారము. ఈ పవిత్రము స్వీకరింపుము. పవిత్రము చేయు నను ఉద్దేశ్యముతే దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫలము నిచ్చును". నారాయణమయం సూత్రమనిరుద్ధమయం వరమ్. 10 ధనధాన్యాయురారోగ్యప్రదం సంప్రదదామి తే| కామదేవమయం సూత్రం సఙ్కవర్షణమయం వరమ్. 11 విధ్యాసన్తతిసౌభాగ్యప్రదం సంప్రదదామితే| వాసుదేవమయం సూత్రం ధర్మకామార్థమోక్షదమ్. 12 సంసారసాగరోత్తారకారణం ప్రదదామి తే| విశ్వరూపమయం సూత్రం సర్వదం పాపనాశనమ్. 13 అతీతానాగతకులసముద్ధారం దదామి తే| కనిష్ఠాదాని చత్వారి దదిరే మునిభిః క్రమాత్. 14 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సర్వదేవపవిత్రారోపణం నామ సప్తత్రింశో7ధ్యాయఃé "పవిత్రకమునందలి ఈ దారము నారాయణ-అనిరుద్ధమయ మైనది. ధన-ధాన్య-ఆయురారోగ్యముల నిచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను. ఈ శ్రేష్ఠమైన దారము ప్రద్యుమ్న - సంకర్షణమయ మైనది. విద్యా-దంతతి-సౌభాగ్యముల నిచ్చును. దీనిని మీకు సమర్పించుచున్నాను.వాసుదేవమయ మగు ఈ సూత్రము ధర్మార్థకామమోక్షముల నిచ్చును. సంసారసాగరమును దాటుటకు ఇది ఉత్తమసాధనము. దీనిని మీ పాదములపై సమర్పించు చున్నాను. విశ్వరూపమయ మగు ఈ సూత్రము సర్వకామములను సఫలము చేయును. సమస్తపాపములను నశింపచేయును. కడచిన తరములవారిని, రాబోవు తరములవారిని కూడ ఉద్ధరించుచు. దీనిని మీకు సమర్పించుచున్నాను. కనిష్ఠము, మధ్యమము, ఉత్తమము, పరమోత్తమము అని నాలుగు విధము లగు పవిత్రకములను, మంత్రోచ్చారణపూర్వకముగ క్రమానుసారముగ మునులు సమర్పించిరి". అగ్ని మహాపురాణమునందు సర్వదేవతాపవిత్రారోపణ మను ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.