Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుర్వింశో7ధ్యాయః

అథర్ఘ్యాదిదానవిధిశల్యకథనే.

భగవానువాచ :

పూర్వమాసీన్మహద్భూతం సర్వభూతభయఙ్కరమ్‌ | తద్దేవైర్నిహితం భూమౌ సవాస్తుపురుషః స్మృతః. 1

చతుష్షష్టిపదే క్షేత్ర ఈశం కోణార్ధసంస్థితంమ్‌ | ఘృతాక్షతైస్తర్పయేత్తం పర్జన్యం

పదగం తతః. 2

ఉత్పలాద్భిర్జయన్తం చ ద్విపదస్థం పతాకయా| మహేన్ద్రం చైకకోష్ఠస్థం సర్వరక్తైః పదే రవిమ్‌. 3

వితానేనార్ధపదగం సత్యం పాదే భృతం ఘృతైః| వ్యోమశాకునమాంసేన కోణార్ధపదసంస్థితమ్‌. 4

స్రుచా చార్ధపదే వహ్నిం పూషణం లాజయైకతః| స్వర్ణేన వితథం ద్విష్ఠం మన్థనేన గృహక్షతమ్‌. 5

మాంసోదనేన ధర్మేశ##మేకైకస్మిన్‌ స్థితం ద్వయమ్‌ | గన్ధర్వం ద్విపదం గన్ధైర్భృశం శాకునజిహ్వయా. 6

ఏకస్థమర్ధసంస్థం చ మృగనీలపటైస్తథా| పితౄన్‌ కృశరయార్ధస్థం దన్తకాష్ఠైః పదస్థితమ్‌. 7

దౌవారికం ద్విసంస్థం చ సుగ్రీవం యావకేన తు |

భగవంతుడైన హయగ్రీవుడు చెప్పెమ : ఓ బ్రహ్మదేవా! పూర్వము సమస్తప్రాణులకును భయంకరమైన ఒక మహాభూత ముండెను. దానిని దేవతలు భూమిలో పాతిపెట్టిరి. దానికే వాస్తపురుషుడని పేరు. అరువదినాలుగు పదములు క్షేత్రమునందు అర్ధకోణమునందున్న ఈశుని ఘృతాక్షతలచే తృప్తిపరుపవలెను. ఒక పదమునందున్న పర్జన్యుని కమ-జ ముంచేతను. రెండు పదములలో ఉన్న జయంతుని పతాకచేతను, రెండు కోష్ఠముల దున్న ఇంద్రుని కూడ అదే విధమునను, రెండుపరములలో నున్న సూర్యుని ఎఱ్ఱని అన్ని పదార్థములచేతను, రెండు పదములపై నున్న సత్యుని వితానము (చాందని) చేతను, ఒక పరము నందున్న భృశుని ఘృతముచేతను, అగ్ని కోణమునందిలి అర్ధకోణమునందున్న ఆకాశమును శాకున మను ఓషం జగురుచేతను, ఆ కోణమునందే రెండవ ఆర్ధపదమున దున్న అగ్నిదేవుని స్రుకు-చేతను, ఒక పదమునం దున్న పూషుని లాజించేతను, రెండు పదములపై నున్న వితథునిస్వర్ణము చేతను, ఒక పదముపై నున్న గృహక్షతుని వెన్నచేతను, ఒక పదముపై నున్న యమధర్మరాజును మాంసాన్నముచేతను, రెండు పదము పై ఉన్న గంధర్వుని గంధముచేతను. ఒక పరముపై నున్న భృంగుని శాకునిజిహ్వ అను ఓషధిచేతను, అర్ధపరముపై ఉన్న మగమును నీలబట్టచేతను, అర్థకోష్ఠము నిన్నుభాగమునందున్న పితృగణమును పులగముచేతను, ఒక పరముపైనున్న ద్వారవాలకుని దంతకాష్ఠముచేతను, రెండుపరములపై నున్న సుగ్రీవుని యవలతో చేసిన పదార్థము చేతను తృప్తి పరుపవలెను.

పుష్పదన్తం కుశస్తమ్బైః పద్త్మెర్వరుణమేకతః. 8

అసురం సురాయా ద్విష్ఠం పదేశాయ ఘృతామ్భసా |

యవై ః పాపం పదార్ధస్థం రోగం మధ్యే చ మణ్డకైః. 9

నాగపుషై#్పః పదే నాగం ముఖ్య భ##క్ష్యై ర్హి సంస్థితమ్‌| ముద్గోదనేన భల్లాటం పదే సోమం పదే తథా. 10

మధునా పాయసేనాథ శాలూకేన ఋషిం ద్వయే | పదే దితింలోపికాభిరర్ధే దితిమంథాపరమ్‌. 11

పూరికాభిస్తతశ్చాపమీశాధఃపయసా పదే| తతో7ధశ్చాపవత్సన్తు దధ్నా చైకపదే స్థితమ్‌.

12

లడ్డుకైశ్చ మరీచిం తు పూర్వకోష్ఠచతుష్టయే| సవిత్రే రక్తపుష్పాణి

బ్రహ్మాధఃకోణకోష్ఠకే. 13

తదధః కోష్ఠకే దద్యాత్సవిత్రే చ కుశోదకమ్‌ | వివస్వతే7రుణం దద్యాచ్చన్దనం చతురఙ్ఘ్రిషు. 14

రక్షో7ధః కోణకోష్ఠే తు ఇన్ద్రాయార్ఘ్యం నిశాన్వితమ్‌ |

ఇన్ద్రం జయాయ తస్యాధో ఘృతార్థం కోణకోష్ఠకే. 15

చతుష్పదే చ దాతవ్యమిన్ద్రాయ గుడపాయసమ్‌| వాయ్వధః కోణదేశే తు రుద్రాయ పక్వమాంసకమ్‌. 16

తదధః కోణకోష్ఠే తు యక్షాయార్ధం సలం తథా| మహీధరాయ మంసాన్నం మాషం చ చతురఙ్గ్రిషు. 17

మధ్యే చతుష్పదే స్థాప్యా బ్రహ్మణ తిలతణ్డులాః| చరకీం మాషసర్పిర్భ్యాం స్కన్దం కృశరయాసృజా. 18

రక్తపత్త్రెర్విదారీం చ కన్దర్పం రచ పలోదనైః |

పూతనాం పలపిత్తాభ్యాం మాంసాసృగ్భ్యాం రచ జమ్భకమ్‌. 19

పిత్తాసృగస్థిభిః పాపం పిలిపిఞ్జం స్రజాసృజా| ఈశాద్యాన్రక్త మాంసేన అభావాదక్షతైర్యజేత్‌. 20

రక్షౌమాతృగణభ్యశ్చ పిశాచాదిభ్య ఏవ చ| పితృభ్యః క్షేత్రపాలేభ్యో బలీన్దద్యాత్‌ ప్రకామతః. 21

రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న అసురుని సురచేతను, ఒక పదముపై నున్న ఆదేశేషుని నేయి కలిపిన జలముచేతను. అర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతను, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదముపై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్థపదముపై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలెమ. ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై నున్న మరీచిని లడ్డూలచే తృప్తిపరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు అర్ధపదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకము లీయవలెను. నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును, నైరృతిదిక్కున నున్న కోణముందలి అర్ధకోష్ఠముందున్న సురాధిపతి యైన ఇంద్రనకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్ఠమునం దున్న ఇద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలెను. వాయవ్య కోణమున అర్ధకోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను. దాని క్రింద అర్ధకోష్ఠమునం దున్న యక్షునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలెను. చతుష్పదమునందున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ఠములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను. చరకిని మాంసఘృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారిని రక్తకమలముచేతను, కందుర్పుని ఒక ఫలము అన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసరక్తములచేతను, పాపరక్షసుని పిత్త-రక్త-అస్థులచేతను, పలిపిత్సుని మాలికలచేతను, రక్తముచేతను తృప్తిపరుపవలెను. పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాసంమును, సమర్పింపవలెను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలెను. రాక్షస-మాతృకా. గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.

అహుత్త్వెతాన సంతర్ప్య ప్రాసాదదీన్న కారయేత్‌| 22

బ్రహ్మస్థానే హరిం లక్ష్మీం గణం పశ్చాత్సమర్పయేత్‌.

మ హేశ్వరం వాస్తుమయం వర్ధన్యాసహితం ఘటమ్‌|

బ్రహ్మాణం మధ్యతః కుమ్భే బ్రహ్మాదీంశ్చదిగీశ్వరాన్‌. 23

దద్యాత్పూర్ణాహుతిం పశ్చాత్స్వస్తి వాచ్యప్రణమ్యచ | ప్రగృహ్యకర్కరీం సమ్యఙ్మఙ్గలం తు ప్రదక్షిణమ్‌. 24

సూత్రమార్గేణ హే బ్రహ్మం స్తోయధారాంచ భ్రామయేత్‌ | పూర్వవత్తేన మార్గేణ సప్తబీజాని వాపయేత్‌. 25

ప్రారమ్భం తేనమార్గేణ తస్యఖాతస్య కారయేత్‌ | తతోగర్తం ఖనే న్మధ్యే హస్తమాత్రప్రమాణతః. 26

చతురఙ్గలకంచాధశ్చోపలిప్యార్చయేత్తతః | ధ్యాత్వాచతుర్భుజం విష్ణుమర్ఘ్యం దద్యాత్తుకుమ్భతః. 27

కర్కర్యా పూరయే చ్ఛ్వభ్రం శుక్లపుష్పాణిచన్యసేత్‌ | దక్షిణావర్తకం శ్రేష్ఠం బీజైర్మృద్భిశ్చపూరయేత్‌. 28

అర్ఘ్యదానం వినిష్పాద్య గోవస్త్రాదీన్‌ దదేద్గురౌ | కాలజ్ఞాయ స్థపతయే వైష్ణవాదిభ్య అర్చయేత్‌. 29

తతస్తు ఖానయేద్యత్నాజ్జలాన్తం యావదేవతు | పురుషాధః స్థితం శల్యం న గృ హేదోషదం భ##వేత్‌. 30

అస్థిశ##ల్యేభిద్యతేవై భిత్తిర్వై వగృహిణోసు7రామ్‌| యన్నామశబ్దం శృణుయాత్తత్ర శల్యం తదుద్భవమ్‌. 31

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అర్ఘ్యదానశల్యయోః కథనం నామ చత్వారింశో7ధ్యాయః.

వాస్తు హోమ బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రాసాదాదినిర్మాణు చేయరాదు.

బ్రహ్మస్థానమును శ్రీహరి-లక్ష్మీ-గణదేవతలను పూజింపవలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్తకలశములను పూజింపవలెను. కలశమధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తివాచనముచేసి, ప్రణమించి, పూర్ణహుతి చేయవలెను. ఓబ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్రహస్తమున ధరించి విధిపూర్వకముగా దక్షిణావర్తమండలములుచేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటి వలె అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. అదే మార్గమున గొయ్యిత్రవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్యయందు ఒక హస్తము వెడల్పు నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి త్రవ్వవలెను. దానిని అలికి పూజాప్రారంభము చేయవలెను. అన్నింటికంటున ముందగ నాలుగుభుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశతో అర్ఘ్యప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లు పోసి ఆ గొయ్యినింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్ఠమైన అదక్షిణావర్తగర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్యప్రదానకార్యము ముగించి, ఆచార్యునకు గోవస్త్రాదిదానము లీయవలెను. జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్నపూర్వకముగ, నీరువచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్నచో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువుపేరు వినబడునో జంతువు శల్యమే అక్కడ నుండునని తెలియవలెను.

అగ్నేయమహాపురాణమునందు అర్ఘ్యదాన-శల్యముల కథనమన నలువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters