Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్విచత్వారింశో7ధ్యాయః అథ ప్రాసాదలక్షణమ్. హయగ్రీవ ఉవాచ: ప్రాసాదం సంప్రవక్ష్యామి సర్వసాధారణం శృణు | చతురస్రీకృతం క్షేత్రం భోజేత్షోడశధా బుధః. 1 మధ్యేతస్య చతుర్భిస్తు కుర్యాదాయ సమన్వితమ్ | ద్వాదశైవతు భాగాంశ్చ భిత్త్యర్థం పరికల్పయేత్. 2 జంఘోచ్ఛ్రాయస్తు కర్తవ్యశ్చతుర్భాగేణచాయతః | జంఘాయాద్విగుణోచ్ఛ్రాయం మఞ్జర్యాః కల్పయేద్భుధః. తుర్యభాగేన మఞ్జర్యాః కార్యః సమక్ప్రదక్షిణః | తన్మాననిర్గమః కార్య ఉభయోః పార్శ్వయోః సమః . 4 శిఖరేణ సమం కార్యమగ్రే జగతి విస్తరమ్ | ద్విగుణనాపి కర్తవ్యం యథాశోభానురూపతః. 5 విస్తారాన్మణ్డపస్యాగ్రే గర్భసూత్రద్వయేన తు | దైర్ఘ్యాత్పాదాధికం కుర్యాన్మధ్త్యస్తమ్భై ర్వి భూషితమ్. 6 ప్రాసాదగర్భమానం తు కుర్వీత ముఖమణ్డపమ్ | ఏకాశీతి పదైర్వాస్తుం పశ్చాన్మణ్డపమారభేత్. 7 శుకాన్ప్రాగ్ద్వార విన్యాసే పాదాన్తస్థాన్ యజేత్ సురాన్ | తథాప్రాకారవిన్యాసే యజేద్ద్వాత్రింశదన్తగాన్. 8 సర్వసాధారణం చైతత్ప్రాసాదస్యచలక్షణమ్ | మానేన ప్రతిమాయా వా ప్రాసాదమపరం శృణు. 9 హయగ్రీవుడు పలికెను. - ఇపుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పదను, వినుము, దేవాలయమును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదునారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు భాగములతో ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి, మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను. శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయపరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వములందును ఉన్న మార్గముల (ద్వారముల) కొలత ఈ కొలతను బట్టియే ఉండవలెను. ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖరముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖతము కంటె రెటింపు ఉండునట్లు కూడ చేయవచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భసూత్రమునకు రెట్టింపు ఉండవలెను. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభముల మర్చి అందముగా ఉండు నట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భ ప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్కపదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను. మొదట ద్వారన్యాసము దగ్గరనున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకారవిన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానాను సారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము. ప్రతిమాయాః ప్రమాణన కర్తవ్యా పిణ్డికా శుభా | గర్భస్తు పిణ్డికార్ధేన గర్భమానాస్తు భిత్తయః. 10 భిత్తేరాయామ మానేన ఉత్సేధం తు ప్రకల్పయేత్ | భిత్త్యుచ్ఛ్రాయాత్తు ద్విగుణం శిఖరం కల్పయేద్భుధః. 11 శిఖరస్యతు తుర్యేణ భ్రమణం పరికల్పయేత్ | శిఖరస్య చతుర్థేన అగ్రతో ముఖమణ్డపమ్. 12 ఆష్టమాంశేన గర్భస్యరథకానాంతునిర్గమః | మరిధేర్గుణభాగేన రథకాం స్తత్ర కల్పయేత్. 13 తత్తృతీయేన వాకుర్యాద్రథకానాం తు నిర్గమః | వామత్రయం స్థాపనీయం రథకత్రితయే సదా. 14 ప్రతిమ ఎంత పెద్దది ఉండునో, అంత పెద్ద అందమైన పిండి నిర్మింపవలెను. పిండిలో సగము ప్రమాణము గల గర్భమును నిర్మించి, గర్భమానాను సారముగ గోడలు పెట్టవలెను. గోడల ఎత్తు వాటి వెడల్పును అనుసరించి ఉండవలెను. విద్వాంసుడు శిఖరము ఎత్తు గోడ ఎత్తుకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తున ఆలయమునకు పరిక్రమ ఏర్పరుపవలెను. ఆలయము ముందున్న ముఖ మండపము గూడ అదే ఎత్తుతో నిర్మింపవరెను. గర్భము ఎనిమిదవ వంతు ప్రమాణముండు నట్లు రథకములు బైటకు వచ్చు మార్గము నిర్మింపవలెను. లేదా పరిధి మూడభాగమును అనుసరించి రథకములను (చిన్ని రథములను) నిర్మింపలెను. వాటి మూడవ వంతు ప్రమాణమున రథ నిర్గ మద్వార మేర్పరుపవలెను. మూడు రథకములపై సర్వదా మాడు వామములను స్థాపింపవలెను. శిఖారార్థంహి సూత్రాణి చత్వారివినిపాతయేత్ | శుకనాసోర్ధ్వతః సూత్రం తిర్యగ్భూతం నిపాతయేత్. 15 శిఖర స్యార్థ భాగస్థం సింహం తత్రతు కారయేత్ | శుకనాసాం స్థిరీకృత్య మధ్యసన్దౌ నిధాపయేత్. 16 అపరేచ తథా పార్శ్వే తద్వత్సూత్రం నిధాపయేత్ | తదూర్ధ్వం తుభ##వేద్వేది సకణ్ఠాసన సారకమ్. 17 స్కన్ధభగ్నం నకర్తవ్యం వికరాలం తథైవచ | ఊర్ద్వంచ వేదికామానాత్కలశం పరికల్పయేత్. 18 విస్తారార్ద్విగుణం ద్వారం కర్తవ్యం తు సుశోభనమ్ | ఉదుమ్బరౌ తదూర్ధ్వం చ న్యసేచ్ఛాఖాం సుమఙ్గలైః ద్వారస్య తు చతుర్థాంశే కార్యౌచణ్డ ప్రచణ్డకౌ | విష్వక్సేనో వత్సదణ్డో శాఖార్దోదుమ్బరే శ్రియమ్ః 20 దిగ్గజైః స్నాప్యమానాం తాం ఘటైః సాబ్జాం సరూపికామ్ | ప్రాసాదస్య చతుర్థాంశేప్రాకారస్యోచ్ఛ్రయోభ##వేత్. ప్రాసాదాత్పాదహీనస్తు గోపురస్యోచ్భ్రయో భ##వేత్ | పఞ్చహస్తస్య దేవస్య ఏకహస్తాతు పీఠికా. 22 గారుడంమణ్డపం చాగ్రే ఏకం భోమాదిదామచ | కుర్యాద్ధి ప్రతిమాయాం తు దిక్షుచాష్టాసు చోపరి. 23 పూర్వేవరాహం దక్షేచ నృసింహం శ్రీధరం జలే | ఉత్తరేతు హయగ్రీవ మగ్నేయ్యాం జమదగ్న్యకమ్. నైరృత్యాం రామకం వా¸° వామనం వాసుదేవకమ్| ఈశేప్రాసాదరచనా దేయావస్వర్కకాదిభిః | ద్వారస్య చాష్టమాద్యంశం త్వక్త్వానదోషభాక్. 25 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రాసాదలక్షణం నామ ద్విచత్వారింశో7ధ్యాయః శిఖరము కొరకు నాలుగు సూత్ర పాతములు చేయవలెను. శుకనాసపైనుండి సూత్రము అడ్డముగా పడవేయవలెను. శిఖరము సగము భాగమున సింహ ప్రతిమను నిర్మింపవలెను. శుకనాసపై సూత్రము స్థిరముగానుంచి దానిని మధ్యసం ధివరకును తీసికొనివెళ్ళవలెను. రెండవ పార్శ్యమునందు గూడ ఈ విధముగానే సూత్రపాతము చేయవలెను. శుకనాసపై వేది నిర్మించి, దానిపై అమలసారమను పేరుగల, కంఠముతో కూడిన కలశము నిర్మింపవలెను. అది వికరాలముగ ఉండగూడదు. వేదిమానము ఉన్నంతవరకునే కలశను నిర్మింపవలెను. ఆలయద్వారము వెడల్పు ఎంత ఉండునో దానికి రెట్టింపు ఎత్తు ఉండవలెను. ద్వారము చాల అందముగా శోభాసంపన్నముగా ఉండునట్లు నిర్మింపవలెను. ద్వారముల పై భాగమున సుందరములును, మంగళకరమునులు అగు వస్తువులతోపాటు రెండు ఉదుంబర శాఖలు నిర్మింపవలెను. ద్వారము నాల్గవ భాగమున చందుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వార పాలకుల మూర్తులను నిర్మింపవలెను | ఉందుంబరశాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీవిగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించు చుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవవంతు ఉంచవలెను. ఆలయ గోపురముఎత్తు ఆలయము ఎత్తకంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము ఐదు హస్తముల విగ్రహమైన చోదాని పీఠిక ఒక హస్తముండవలెను. విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములను నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహామునకు చుట్టు, ఎనిమిదివైపులందును విష్ణుప్రతిమకంటె రెట్టింపు ప్రమాణముగల అవతారమూర్తులను నిర్మింపలెను. తూర్పున వరాహాము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయవ్యమున వామనుడు, ఈశానమున వానుదేవుడు-వీరిమూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము అష్టమాద్యంశలు తప్ప కలుగు వేధచేదోష మేమియును ఉండదు. అగ్ని మహాపురాణమునందు ప్రాసాదలక్షణమును నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.