Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుశ్చత్వారింశో7ధ్యాయః అథవాసుదేవాది ప్రతిమాలక్షణాని. భగవానువాచ : వాసుదేవాది ప్రతిమాలక్షణం ప్రవదామితే | ప్రాసాదస్యోత్తరే పూర్వముఖేవా చోత్తరాననామ్ . 1 సంస్థాప్య పూజ్యచ బలిం దత్త్వాథో మధ్యసూత్రకమ్ | శిలాం శిల్పీతు నవధా విభజ్యనవమేంశ##కే. 2 సూర్యేభ##క్తే శిలాయాంతు భాగం స్వాజ్గులముచ్యతే | ద్వ్యంగులం గోలకం నామ్నా కలానేత్రం తదుచ్యతే. 3 భాగమేకం త్రిధా భక్త్వా పార్షిభాగం ప్రకల్పయేత్ | భాగమేకం తథా జానౌ గ్రీవాయాం భాగమేవచ. 4 ముకుటం తాలమాత్రం స్యాత్తాలమాత్రం తథాముఖమ్ | తాలేనైకేన కణ్ఠంతు తాలేనహృదయం తథా. 5 నాభిమేఢ్రా న్తరంతాలం ద్వితాలవూరుకౌతథా | తాలద్వయేన జంఘాస్యాత్సూ త్రాణి శృణు సామ్ప్రతమ్. 6 కార్యంసూత్రద్వయం పాదే జంఘామధ్యే తథాపరమ్ | జౌనౌసూత్రద్వయం కార్యమూరుపమధ్యేతథాపరమ్ . 7 మేఢ్రే తథాపరం కార్యం కట్యాంసూత్రం తథాపరమ్. | మేఖలాబన్ధ సిద్ధ్యర్థం నాభ్యాం చైవాపరంతథా. 8 హృదయేచ తథాకార్యం కణ్ఠ సూత్రద్వయం తథా | లలాటే చాపరం కార్యం మస్తకే చ తథాపరమ్ . 9 ముకుటోపరి కర్తవ్యం సూత్రమేకం విచక్షణౖః | సూత్రాణ్యూర్ధ్వం ప్రదేయాని సపై#్తవ కమలోద్భవ. 10 హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము చెప్పదను వినుము. ఆలయమును పూర్వాభిముఖముగ గాని, ఉత్తరాభి ముఖముగగాని శిలనుంచి, దానికి పూజచేసి. శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము అతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళముము ''గోలకము'' దీనికి ''కాలనేత్ర'' మని కూడ పేరు. పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలు కొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించ ఉంచుకొనవలెను. ముకుటమునకు ఒక జానెడు, ముఖమునకు ఒక జానెడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచవలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జానలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళపై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను. లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలెను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచవలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగంచవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటముపై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను. కక్షాత్రికాన్తరేణౖవ షట్ సూత్రాణి ప్రదాపయేత్ | మధ్యసూత్రం తసన్త్యజ్య సూత్రేణ్యవ నివేదయేత్ . 11 లలాటం నాసికావక్త్రం కర్తవ్యంం చతురజ్గులమ్ | గ్రీవా కర్ణౌతు కర్తవ్యావాయామా చ్చతురజ్గులౌ. 12 ద్వ్యజ్గులే హనుకే కార్యే విస్తారాచ్చిబుకంతథా | అష్టాజ్గులం లలాటంతు విస్తారేణప్రకీర్తితమ్. 13 పరేణద్వ్యజ్గులేశ##జ్ఖే కర్తవ్యావలకాన్వితౌ | చతురజ్గుల మాఖ్యాతమన్తరం కర్ణనేత్రయోః . 14 ద్వ్యజ్గులౌ పృథుకౌ కర్ణౌ కర్ణపాజ్గార్దపఞ్చమే | భ్రూసమేన తుసూత్రేణ కర్ణస్రోతః ప్రకీర్తితమ్. 15 విద్ధం షడజ్గులం కర్ణమవిద్దం చతురఙ్గులమ్ | చిబుకేన సమం విద్ద మవిద్ధంవా షడజ్గులమ్. 16 ఆరు సూత్రములను మూడు కక్షల అంతరముచే ఉంచవలెను. మరల మధ్య సూత్రమును విడిచివేసి కేవల సూత్రములను మాత్రమే ఉపయోగింపవలెను. లలాట-నాసికా-ముఖముల విస్తారము నాలుగు అంగుళములుండవలెను. కంఠ విస్తారము చెవుల విస్తారము కూడా నాలుగు అంగుళములే ఉండవలెను. రెండు ప్రక్కల చెక్కిళ్ళు రెండేసి అంగుళముల వెడల్పు ఉండవలెను. బుగ్గ కూడ రెండు అంగుళము లుండవలెను. పూర్తి విస్తారము ఆరు అంగుళములుండవలెను. లలాట విస్తారము ఎనిమిది అంగుళములుండవలెను. రెండు ప్రక్కల శంఖ ప్రదేశములు రెండేసి అంగుళముల విస్తారము కలిగియుండి వాటిపై వెండ్రుకలు కూడ ఉండవలెను. చెవులకు నేత్రములకు మధ్య నాలుగు అంగుళముల వ్యవధానముండవలెను. చెవులు పృథుకములు రెండేసి అంగుళములు నిర్మింపవలెను. కనుబొమ్మలకు సమాన సూత్రముననున్న భాగమునకు "కర్ణ స్రోతస్సు" అనిపేరు. గుచ్చిన (కుట్టిన) చెవులు ఆరు అంగుళములు, కుట్టనివి నాలుగు అంగుళములు ఉండవలెను. లేదా కుట్టిన, చెవులైనను కుట్టనిచెవులైనను , బుగ్గతో సమానము ఆరు అంగుళములు ఉండవలెను. గన్దపాత్రం తథావర్తం శష్కులీం కల్పయేత్తథా | అజ్గులే నాధరః కార్యస్తస్యార్దేనో త్తరాధరః. 17 అర్ధాజ్గులం తథానేత్రం వక్త్రంతు చతురజ్గులమ్ | ఆయామేన తు వైపుల్యాత్సార్ద మజ్గుల ముచ్యతే. 18 అవ్యాత్తమేవం స్యాద్వక్త్రం వ్యాత్తంత్య్రజ్గులముచ్యతే | నాసావంశ సముచ్ఛ్రాయం మూలేత్వేకాజ్గులం మతమ్. 19 ఉచ్ఛ్రాయాద్వ్యజ్గులం చాగ్రే కరవీరోపమాస్మృతా | అన్తరం చక్షుషోః కార్యం చతురజ్గుల మానతః. 20 ద్వ్యజ్గులం చాక్షికోణంచ ద్వ్యజ్గులం చాన్తరం తయోః | తారానేత్రత్రిభాగేణ దృక్తారాపఞ్చమాంశికా. 21 త్య్రజ్గులం నేత్రవిస్తారం ద్రోణీచార్ధజ్గులామతా | తత్ప్రమాణాభ్రువోర్లేఖా భ్రువౌచైవ సమేమతే . 22 భ్రూమధ్యంద్వ్యజ్గులం కార్యం భ్రూదైర్ఘ్యం చతురజ్గులమ్ | గంధ పాత్రము, ఆ వర్తము, శష్కులి (చెవి రంధ్రము) కూడ నిర్మింపవలను. క్రింది పెదవి ఒక అంగులము, పైపెదవి అర అంగుళము ఉండవలెను. నేత్రవిస్తారము అర అంగుళము, ముఖ విస్తారము నాలుగు అంగుళములు ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని అకారము కరవీరకుసుమమువలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల అవకాశముండవలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంక రెండు అంగుళముల వ్యవధానముండును. నేత్రములోని మూడవ వంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగ్రుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళములు, ద్రోణి అర అంగుళము ఉండవలెను. కను బొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కను బొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళములు ఉండవలెను. షట్త్రింశ దజ్గులాయామం మస్తకస్యతువేష్టనమ్. మూర్తీనాం కేశవాదీవాం ద్వాత్రింశ##ద్వేష్టనం భ##వేత్ | పఞ్చనేత్రాత్వధోగ్రీవా విస్తారాద్వేష్టనం పునః . 24 త్రిగుణం తు భ##వేదూర్ద్వం విస్తృతాష్టాజ్గులం పునః | గ్రీవాత్రిగుణమాయామంగ్రీవావక్షోన్తరం భ##వేత్ . 25 స్కన్ధావష్టాజ్గులౌ కార్యౌ త్రికలావంసకౌ శుభౌ | సప్త నేత్రౌస్మృతౌ బాహూ ప్రబాహూ షోడశాజ్హులౌ. 26 త్రికలే విస్తృతౌ బాహూ ప్రబాహూ చాపి తత్సమౌ | బాహుదణ్డోర్ద్వతో జ్ఞేయః పరిణాహః కలానవ. 27 సప్తదశాజ్గులోమధ్యే కూర్పరో7ర్థేచ షోడశ | కూర్పరస్య భ##వేన్నాహ స్త్రిగుణః కమలోద్భవ. 28 నాహః ప్రబాహుమధ్యేతు షోడశాజ్గుల ఉచ్యతే | అగ్రహస్తే పరీణాహో ద్వాదశాజ్గుల ఉచ్యతే. 29 విస్తారణ కరతలం కీర్తితంతు షడజ్గులమ్ | దైర్ఘ్యం సప్తాజ్గులం కార్యం మధ్యాపఞ్చాజ్గులామతా. 30 తర్జన్యనామికాచైవ తస్మాదర్ధాజ్గులం వినా | కనిష్ఠాఙ్గుష్ఞకౌ కార్యౌ చతుర్గజ్గులసంమితౌ. 31 ద్విపర్వో7జ్గుష్ఠకః కార్యః శేషాజ్గుల్యస్త్రి పర్వికాః | సర్వాసాం పర్వణో7ర్ధేన నఖమానం విధీయతే. 32 వక్షసో యత్ప్రమాణం తు జఠరం తత్ప్రమాణతః | అజ్గు లైకా భ##వేన్నాభీ వేధేన చ ప్రమాణతః . 33 తతో మేఢ్రాన్తరం కార్యం తాలమాత్రః ప్రమాణతః | కేశవాది మూర్తుల శిరస్సు మొత్తము తిరుగుడు ఇరువదియారు లేదా ముప్పది అంగుళము లుండవలెను. క్రింద కంఠము పది అంగుళములు, దాని తిరుగుడు ముప్పది అంగుళము, క్రిందినుండి పైకి కంఠ విస్తారము ఎనిమిది అంగుళములు, కంఠమునకును. వక్షస్థలమునకును మధ్యనున్న అవకాశము కంఠముకంటె మూడు రెట్లు విస్తారముతో ఉండవలెను. స్కంభములు ఎనిమిదేసి అంగుళములు, అంసములు మూడేసి అంగుళములు ఉంచవలెను. బాహువులు మోచేయివరకు పదునాలుగేసి అంగుళములు, ప్రబాహువులు (మోచేతి క్రింద) పదునారేసి అంగుళములు, బాహువులు వెడల్పు ఆ రంగుళములు. ప్రబాహువుల వెడల్పు కూడ దానితో సమానముగా ఉండవలెను. బాహుదండము తిరుగుడు పై నుండి తొమ్మిది కలలు లేదా పదునేడు ఆంగుళము లుండవలెను. బాహు మధ్యమున కూర్పురము (మోచేయి) ఉండును. కూర్పరము తిరిగుడు పదునాలుగు అంగుళములు, ప్రబాహుమధ్యమున దాని విస్తారము పదునారు అంగుళములు, చేతి అగ్ర భాగము విస్తారము పండ్రెండు అంగుళములు, దాని మధ్య అరచేతి విస్తారము అరంగుళములు అరచేయి వెడల్పు ఏడంగుళములు, మధ్యవ్రేలు పొడవు ఐదు అంగుళములు, తర్జనీ-అనామికల పొడవు దానికంటె అర అంగుళము. తక్కువగా ఉండవలెను. కనిష్ఠకా-అంగుష్ఠముల పొడవు నాలుగు అంగుళములు. బొటనవ్రేలికి రెండుకణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలెను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభిరంధ్రము ఒక అంగుళముండవలెను. నాభినుండి లింగము వరకు జానెడు దూరముండవలెను. నాభిమధ్యే పరీణాహో ద్విచత్వారింశదజ్గులః. 34 అన్తరం స్తనయోః కార్యం తాలమాత్రం ప్రమాణతః | చూచుకేయవమానౌతు మణ్డలం ద్విపదం భ##వేత్. 35 చతుఃషష్ట్యజ్గులం కార్యం వేష్టనం వక్షసః స్పుటమ్ | చతుర్ముఖంచ తదధో వేష్టనం పరికీర్తితమ్. 36 పరిణాహస్తథాకట్యాశ్చతుః పఞ్చదశాజ్గులైః | విస్తారశ్చోరుమూలే తు ప్రోచ్యతే ద్వాదశాజ్గులః. 37 తస్మారభ్యధిం మధ్యేతతో నిమ్నతరం క్రమాత్ | విస్తృతాష్టాజ్గులం జానుస్త్రిగుణా పరిణాహతః. 38 జఙ్ఘామధ్యేతు విస్తారః సప్తాజ్గుల ఉదాహృతః | త్రిగుణః పరిధిశ్చాస్య జఙ్ఘాగ్రే పఞ్చవి స్తరాత్. 39 త్రిగుణః పరిధిశ్చాస్య పాదౌ తాల ప్రమాణకౌ | ఆయామాదుత్థితౌ పాదౌ చతురజ్గుల మేవచ. 40 గుల్ఫాత్పూర్వం తు కర్తవ్యం ప్రమాణాచ్చతురజ్గులమ్ | ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానెడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలను. స్తనముల తిరుగుడు రెండు పదములుండవలెను. వక్షస్థలము తిరుగుడు అరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాల్గువైపుల తిరుగుడు "కువేష్టనము" అనిపేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళము. ఊరు మూలముల విస్తారము పండ్రెండేసి అంగుళములు దానిపైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్య భాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గవలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్క విస్తారము మూడు రెట్లుండవలెను. పిక్క మధ్యభాగము విస్తారము ఏడు అంగుళము లుండవలంను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క అగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు నాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళము లుండవలెను. త్రికలం విస్త్రతౌ పాదౌ త్య్రజ్గులోగుహ్యకః స్మృతః. 41 పఞ్చాజ్గులస్తు నాహో7స్య దీర్ఘాతద్వత్ప్రదేశినీ | అష్టమాష్టాం శతోన్యూనాః శేషాజ్గుల్యః క్రమేణతు. 42 సపాదాజ్గుల ముత్సేధమజ్గుష్ఠస్య ప్రకీర్తితమ్ | తదేవ ద్విగుణం కార్యమజ్గుష్ఠస్య నఖం తథా. 43 అర్దాఙ్గులం తథాన్యాసం క్రమాన్న్యానంతు కారయేత్ | ద్వ్యజ్గులౌ పృషణౌ కార్యౌ మేఢ్రంతు చతురజ్గులమ్ . పరిణాహో7త్ర కోషాగ్రం కర్తవ్యం చతురజ్గులమ్ | షడజ్గుల పరీణాహౌ వృషణౌ పరికీర్తితౌ. 45 ప్రతిమా భూషణాఢ్యా స్యాదేతదుద్దేశలక్షణమ్ | అనయైవ దిశాకార్యంలోకే దృష్ట్వాతు లక్షణమ్. 46 దక్షిణ తు కరే చక్రమధస్తాత్పద్మమేవచ | వామే శంఖం గదా7ధస్తాద్వాసుదేవస్య లక్షణాత్. 47 శ్రీపుష్టీ చాపిక ర్తవ్యే పద్మవీణాకరన్వితే | ఊరూమాత్రోచ్ఛ్రితాయామే మాలావిద్యాధరౌ తథా. 48 ప్రభామణ్డలసంస్థౌతౌ ప్రభాహస్త్యాది భూషణౌ | పద్మాభం పాదపీఠం తు ప్రతిమాస్వేవమాచరేత్. 49 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాసుదేవాది ప్రతిమాలక్షణం నామ చతుశ్చత్వారింశో7ధ్యాయః. పాదముల విస్తారము అరంగుళములు, గుహ్యకము మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవ్రేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వ్రేళ్ళ మధ్య భాగవిస్తారము క్రమముగా మొదటి వ్రేలు ఎనిమిదవ భాగము తక్కువగా ఉండవలెన. బొటన వ్రేలు ఎత్తు ఒకటిన్నర అంగుళము లుండవలెను, దీని గోరు ప్రమాణమును మిగిలిన వ్రేళ్ళ ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలి గోరు విస్తారము అర అంగుళము, ఇతరమైన వ్రేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెకొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను, దానిపై భాగము నాలుగు అంగుళము లుండవలెను. అండకోశములు పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంత మాత్రమేకాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదే విధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్ణిలో నుంచుకొని, ప్రతిమపై అలక్షణములను నిర్మింపవలెను. పైకుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలెను. ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్నములు గాన ఆప్రతిమ యందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున హస్తమునందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించి యున్న పుష్టిదేవిని నిర్మించవలెను. ఈ ప్రతిమల ఎత్తు భగవత్ప్రతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండములో ఉన్న మాలధర-విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో అలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింద భాగమును (పాదపీఠమును) పద్మాకారమును నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణము లుండునట్లు కూర్చవలెను. అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిమా లక్షణమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.