Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథపఞ్చచత్వారింశోధ్యాయః అథపిణ్ణికాది లక్షణమ్. భగవానువాచ: పిణ్డికాలక్షణం వక్ష్యే దైర్ఘ్యణ ప్రతిమాసమాః | ఉచ్ఛ్రాయే ప్రతిమార్ధం తు చతుః షష్టిపుటాంచతామ్. 1 త్యక్త్వాప ఙ్త్కిద్వయం చాధస్తదూర్ధ్వం యత్తు కోష్ఠకమ్ | సమన్తాదుభయోః పార్శ్వే ఆన్తస్థం పరిమార్జయేత్. ఊర్ద్వం పఙ్త్కిద్వయం త్యక్త్వా అధస్తాద్యత్తు కోష్ఠకమ్ | అన్తః సంమార్జయేద్యత్నాత్పార్శ్వయోరుభయోః సమమ్. 3 తయోర్మధ్యగతౌ తత్ర చతుష్కౌమార్జయేత్తతః | చతుర్దా భాజయిత్వాతు ఊర్ద్వపఙ్త్కిద్వయంబుధః. 4 మేఖలా భాగమాత్రాస్యాత్ ఖాతం తస్యార్ధమానతః | భాగం భాగం పరిత్యజ్య పార్శ్వయోరుభయోః సమమ్. 5 దత్త్వాచైకం పదం బాహ్యే ప్రమాణం కారయేద్బుధః | త్రిభాగేన చ భాగస్యాగ్రే స్యాత్తోయనిర్గమః. 6 హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను పిండిక పొడవు ప్రతిమతో సమానముగ నుండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగముండును. పిండికకు అరువది నాలుగు కోష్ఠకము లేర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దానిపైన ఉన్న కోష్ఠము నాలుగు వైపుల, రెండు పార్శ్వములందును, లోపలి నుండి తుడిచి వేయవలెను. అట్లే పై రెండు పంక్తులు విడచి దాని క్రిందనున్న కోష్టమును లోపలినుండి తుడిచి వేయవలెను. ఈ విధముగ రెండు పార్శ్వములందును చేయవలెను. రెండు పార్శ్వముల మధ్యనున్న రెండు రెండు చతుష్కములను గూడ తుడిచివేయవలెను. పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణములో సగము ప్రమాణముండునట్లు దాని యందు గొయ్యి తవ్వవలెను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడిచి జైటపదమును నాలి (తూము) నిర్మించుటకై విడవలెను. దానియందు తూమునిర్మింపవలెను. మూడు భాగములలోని ఒక భాగమునకు ముందు నీరు ముందుకు పోటవుటకై మార్గముండవలెను. నానాప్రకారభేదేన భ##ద్రేయం పిణ్డకా శుభా | అష్టతాలాతుక ర్తవ్యా దేవీ లక్ష్మీస్తథా స్త్రియః . 7 భ్రువౌ యవాధికే కార్యేయవహీనాతు నాసికా | గోలకేనాధికం వక్త్రమూర్ద్వంతిర్యగ్వివర్జితమ్. 8 ఆయతే నయనే కార్యే త్రిభాగోనై ర్యవైస్త్రిభిః | తదర్ధేన వైపుల్యం నేత్రయోః పరికల్పయేత్. 9 కర్ణపాశో7ధికః కార్యః సృక్విణీ సమసూత్రతః | నమ్రంకలావిహీనం తు కుర్యాదం శద్వయం తథా. 10 గ్రీవాసార్ధకలా కార్యా తద్విస్తారోపశోభితా | నేత్రం వినాతు విస్తారౌ ఊరూజానూచ పిణ్డికా. 11 అఙ్ఘ్రిపృష్ఠౌస్ఫిచౌ కట్యాం యథాయోగం ప్రకల్పయేత్ | సప్తాంశోనాస్తథాజ్గుల్యో దీర్ఘవిష్కమ్భనాహతమ్. నేత్త్రెకవర్జితా యామాజజ్ఘోరుశ్చతథాకటిః | మధ్యపార్శ్వం తు యద్వృత్తం ఘనం పీనం కుచద్వయమ్. తాలమాత్రౌస్తనౌ కార్యౌకటిః సార్ధకలాధికా | లక్ష్మశేషం పురావత్స్యాద్దక్షిణ చామ్భుజంకరే. 14 వామే బిల్వం స్త్రి¸° పార్శ్వే శుభేచామరహస్తకే | దీర్ఘకోణన్తు గరుడశ్చక్రాఙ్గా ద్యానధోపదే. 15 ఇత్యాది మహాపురాణ అగ్నేయే పిణ్డికాది లక్షణం నామ పఞ్చచత్వారింశో7ధ్యాయః. వివిధాకారముగల ఈ పిండికకు ''భద్ర'' అని పేరు. లక్ష్మీదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతర దేవుల ప్రతిమలు కూడ ఇట్లే ఉండవలెను. రెండుకను బొమ్మలును నాసిక కంటె ఒక యవ అధికముగా ఉండవలెను. నాసిక వాటి కంటె ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకము నేత్ర గోలకముకంటె పెద్దదిగా ఉండవలెను. ఇది ఎత్తుగాను, వంకర టింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావుయవల ప్రమాణములో నుండ వలెను. ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రములో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము కంటె కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కల తగ్గినట్లు చయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవుండవలెను. వెడల్పు కూడ అంతలో ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠము కంటె ఒక నేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యముగ కల్పంపవలెను. చేతి వ్రేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్దవ్రేలి కంటె చిన్న వ్రేళ్లు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి-వీటి పొడవు క్రమముగా ఒక్కొక్క నేత్రము తక్కువ ఉండవలెను. శరీర మధ్య ప్రాంతము గుండ్రముగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండవలెను. కటి ప్రదేశము వాటికంటె ఒకటిన్నర కలలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వములందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాలగ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను. అగ్నిపురాణమునందు పిండికాది లక్షణమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.