Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అష్టచత్వారింశో7ధ్యాయః అథ చతుర్వింశతిమూర్తిస్తోత్రమ్ శ్రీ భగవానువాచ: ఓం రూపః కేశవః పద్మశఙ్ఖ చక్రగదాధరః | నారాయణః శఙ్ఖ పద్మ గదాచక్రీ ప్రదక్షిణమ్. 1 నతోగదీమాధవో7రిశఙ్గపద్మీ సమామితమ్ | చక్రకౌమోదకీ పద్మ శఙ్ఖీ గోవిన్ద ఊర్జితః . 2 మోక్షదః శ్రీగదీపద్మీ శఙ్ఖీవిష్ణుశ్చ చక్రధృక్ | శఙ్ఖచక్రాబ్జగదినం మధుసూదన మానమే. 3 భక్త్యాత్రివిక్రమః పద్మగదీ చక్రీచ శఙ్ఖ్యపి | శఙ్ఖ చక్రగదా పద్మీ వామనః పాతుమాంసదా. 4 హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! ఓంకార రూపుడగు కేశవుడు తన హస్తములో (క్రింది కుడి చెయ్యి, పై కుడి చెయ్యి, పై ఎడమ చెయ్యి, క్రింద ఎడమ చెయ్యి అనుక్రమమున అని ఒక మతము, పై కుడి చెయ్యి మొదలు క్రింద కుడి చెయ్యి వరకును అని మరొక మతము) పద్మ-శంఖ-చక్ర-గదలను ధరించి యుండును. నారాయణుడు అదే వరుసలో శంఖ-పద్మ-గదా-చక్రములను ధరించును. ప్రదక్షిణ పూర్వకముగా ఆ భగవంతుని పాదములకు నమస్కరించుచున్నాను. మాధవుడు గదా-చక్ర-శంఖ-పద్మములను ధరించును. నే నాతనికి నమస్కరించుచున్నాను. గోవిందుడు చక్ర-గదా-పద్మ-శంఖములను ధరించును. బలశాలియై యుండును. శ్రీ విష్ణువు గదా- పద్మ-శంఖ-చక్రములను ధరించును. ఆతడు మోక్షప్రదాత మధుసూదనుడు శంఖ-చక్ర-పద్మ-గదలను ధరించును. నేనాతని ఎదుట భక్తితో వంగి నమస్కరించుచున్నాను. త్రివిక్రముడు పద్మ-గదా-చక్ర-శంఖములను ధరించును వామనుడు శంఖ-చక్ర-గదా-పద్మములతో ప్రకాశించుచుండును. అతడు సర్వాదా నన్ను రక్షించుగాక. గతిదః శ్రీధరః పద్మీచక్రీ శార్జీ చ శఙ్ఖ్యపి | హృపీకేశో గదీ చక్రీ శఙ్ఖీచ పాతునః. 5 వరదః పద్మనాభస్తు శఙ్ఖాబ్జారి గదాధరః | దామోదరః పద్మశఙ్ఖ గదాచక్రీ నమామితమ్. 6 తేనేగదీ శఙ్ఖచక్రీ వాసుదేవో7బ్జభృజ్జగత్ | సఙ్కర్షణో గదీ శఙ్ఖీ పద్మీ చక్రీచ పాతువః . 7 శ్రీధరుడు కమల-శంఖ-చక్ర-శార్జధనస్సులను ధరించి యుండును. ఆతడు అందరికిని సద్గతి ఇచ్చువాడు. హృషీకేశుడు గదా-చక్ర -పద్మ-శంఖములను ధరించును. అతడు మనల నందరిని రక్షించుగాక. వరదాతయగు పద్మ నాభుడు శంఖ-పద్మ-చక్ర-గదలను ధరించును. దామోదరుడు పద్మ-శంఖ-గదా-చక్రములు ధరించి విరాజిల్లు చుండును. ఆతనికి నమస్కరించుచున్నాను. గదా-శంఖ-చక్ర-పద్మ ధారియైన వాసుదేవుడు సంపూర్ణ జగమును సృజించెను. గదా. శంఖ-పద్మ-చక్రములను ధరించిన సంకర్షణుడు క్షమ్ముల నందరిని రక్షించుగాక. వాదీ చక్రీ శఙ్ఖగదీ ప్రద్యుమ్నః పద్మభృత్ ప్రభుః | అనిరుద్ధశ్చక్రగదీ శఙ్ఖీ పద్మీచ పాతునః . 8 సురేశో7ర్యబ్జ శఙ్ఖడ్య శ్రీగదీ పురుషోత్తమః | అధోక్షజః పద్మగదీ శఙ్ఖీ చక్రీచ పాతువః . 9 దేవోనృసింహశ్చక్రాబ్జ గదీశఙ్ఖీ నమామితమ్ | అచ్యుతః శ్రీగదీపద్మీ చక్రీ శఙ్ఖీ చ పాతువః 10 వాలరూపీ శఙ్ఖగదీ ఉపేన్ద్ర శ్చక్ర పద్మ్యపి | జనార్దనః పద్మచక్రీ శఙ్ఖదారీ గదాధరః. 11 యజ్ఞః శఙ్ఖీ పద్మ చక్రీ హరిః కౌమోదకీధరః | కృష్ణః శఙ్ఖీ గదీ పద్మీ చక్రీ మే భుక్తి ముక్తిదః 12 యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడు చక్ర-శంఖ-గదా-పద్మములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతుడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడైన పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మ-గదా-శంఖ-చక్రములను ధరించును. అతడు ఘమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర- పద్మ - గదా - శంఖములను ధరించును. నేను అతనికి నమస్కరించుచున్నాను. గదా-పద్మ-చక్ర-శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ములను రక్షించుగాక. శంఖ-గదా-చక్ర-పద్మములను ధరించు, బాలవటుడైన వామనుడు, పద్మ-చక్ర-శంఖ-గదలను ధరించు జనార్దనుడు, శంఖ-గదా-చక్ర-గదలను ధరించు, యజ్ఞస్వరూపుడైన శ్రీహరి, శంఖ-గదా-పద్మ-చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగములను, మోక్షమును ప్రసాదించుగాక. ఆదిమూర్తిర్వాసుదేవస్తస్మాత్సఙ్కర్షణో7భవత్ | సఙ్కర్షణాచ్చ ప్రద్యుమ్నః ప్రద్యుమ్నాద నిరుద్దకః. కేశవాది ప్రభేదేన ఏకైకః స్యాత్త్రిధాక్రమాత్ | ద్వాదశాక్షరకం స్తోత్రం చతర్వింశతి మూర్తిమత్. 14 యఃపఠేచ్ఛృణుయాద్వాపి నిర్మలః సర్వమాప్నుయాత్ | ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ చతుర్వింశతిమూర్తి స్తోత్రం నామాష్టచత్వారింశో7ధ్యాయః వాసుదేవుడు ఆదిమూర్తి. వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుంéడి ప్రద్యుమ్నడు, ప్రద్యుమ్నుని నుండి అనిరుద్ధుడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశవాదిమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద- విష్ణు - మధుసూదనమూర్తులు, ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధరమూర్తులు, అనిరుద్ధుని నుండి హృషీకేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి). ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును. వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు. విశేషాంశము: ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినోచో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను ద్వానశాక్షరి ఏర్పడును అందుచే దానికి "ద్వాదశాక్షరీ స్తోత్రము" అనియు, "చతుర్వింశతి మూర్తి స్తోత్రము" అనియు పేర్లు. అగ్ని మహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.