Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ పంచమో7ధ్యాయః. అథ శ్రీ రామావతారవర్ణనమ్. అగ్ని రువాచ :- రామాయణమహం వక్ష్యే నారదేవనోదితం పురా| వాల్మీకయమే యథా తద్వత్పఠితం భుక్తిముక్తిదమ్. 1 అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నాదరుడు వాల్మీకి చెప్పన విధమున చెప్పెదను. నారద ఉవాచ :- విష్ణునాభ్యబ్జజో బ్రహ్మా మరీచిర్ర్బహ్మణః సుతః | మరీచేః కశ్యపన్తస్మాత్సూర్యో వైవస్వతో మనుః. 2 తత స్తస్మాత్తథేక్ష్వాకుస్తస్య వంశే కకుత్థ్సకః | కకుత్థ్సస్య రఘస్తస్మాదజో దశరథస్తతః. 3 విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును అతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కకుత్థ్సడు పుట్టెను. కకుత్థ్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను. రావణాదేర్వధార్థాయ చతుర్ధాభూత్స్వయం హరిః | రాజ్ఞో దశరథాద్రామః కౌసల్యాయాం బభూవ హ. 4 కై కేయ్యాం భరతః పుత్రః సుమిత్రాయాం చ లక్ష్మణః | శత్రుఘ్నః ఋష్యశృఙ్గేణ తాసు నంద త్తపాయసాత్. 5 ప్రాశితాద్యజ్ఞసంసిద్ధాద్రామాద్యాశ్చ సమాః పితుః | శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కై కేయియందు బరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నలుగను జనించెను. బుష్యశృంగుని సాహాయ్యముచే యజ్ఞమునందు లభిలంచిన పాయసమును కౌసల్యాదుల కీయగా, వారు దానిని భూజింపగా, తండ్రితో సమానులైన రామాదులు జనించిరి. యజ్ఞవిఘ్నవినాశాయ విశ్వామిత్రార్థితో నృపః. రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ | విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను. రామో గతో7స్త్రశస్త్రాణి శిక్షితస్తాడకాన్తకృత్. 7 మారీచం మానవాస్త్రేణ మోహితం దూరతో7నయత్ | సుబాహుం యజ్ఞహన్తారం సబలం చావధీద్బలీ. 8 తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను. సిద్ధాశ్రమనివాసీ చ విశ్వామిత్రాదిభిః సహ | గతః క్రతుం మైథిలస్య ద్రష్టుం చాపం సహానుజః. 9 సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను. శతానన్దనిమిత్తేన విశ్వామిత్రప్రభావతః | రామాయ కథితే రాజ్ఞా స మునిః పూజితః క్రతౌ. 10 శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను. ధనురాపూరయామాస లీలయా స బభజ్ఞ తత్ | వీర్యశుల్కాం చ జనకః సీతాం కన్యాం త్వయోనిజామ్. 11 దదౌ రామాయ రామో7పి పిత్రాదౌ హి సమాగతే | ఉపయేమే జానకీం తామూర్మిలాం లక్ష్మణ స్తథా. 12 శ్రుతకీర్తిం మాణ్డవీం చ కుశధ్వజసుతే తథా | జనకస్యానుజస్త్యెతే శత్రుఘ్నభరతావుభౌ. 13 కన్యే ద్వే ఉపయేమాతే - రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి. జనకేన సుపూజితః | రామో7గాత్స వసిష్ఠాద్యైర్జామదగ్న్యం విజిత్య చ | అయోధ్యాం భరతో7ప్యాగాత్సశత్రుఘ్నో యుధాజితః. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే రామాయణ బాలకాణ్డ వర్ణనం నామ పఞ్చమోధ్యాయః. ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను. అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.