Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్విపఞ్చాశత్తమో7ధ్యాయః అథ చతుష్షష్టి యోగిన్యాదిలక్షణమ్. శ్రీ భగవానువాచ : యోగిన్యష్టాకం వక్ష్యే ఐన్ద్రాదీశనాతః క్రమాత్ | అక్షోభ్యా రుక్షకర్ణీచ రాక్షసీ కృపణాక్షయా. 1 పిఙ్గాక్షీచాక్షయాక్షేయా ఇలానీలాలయా తథా | లోలాలక్తా బలా కేశి లాలసావిమలా పునః . 2 హుతాశా చ విశాలాక్షీహుఙ్కారా వడవాముఖీ | మహాక్రూరా క్రోధనా తు భయఙ్కరీ మహననా. 3 సర్వజ్ఞాతరలాతారా బుగ్వేదాతు హయాననా | సారాఖ్యా రుద్రసంగ్రాహీ శమ్బరాతాల జఙ్ఘికా. 4 రక్తాక్షీ సుప్రసిద్ధాతు విద్యుజ్జిహ్వాకరఙ్కిణీ | మేఘనాదా ప్రచణ్డోగ్రా కాలకర్ణీ వరప్రదా. 5 చన్ద్రా చన్ద్రావరా చైవ ప్రపఞ్చాప్రలయాన్తికా | శిశువక్త్ర పిశాచీచ పిశితాశాచలోలుపా. 6 ధమనీ తాపనీచైవ రాగిణీ వికృతాననా | వాయువేగా బృహత్కుక్షిర్వికృతావిశ్వరూపికా. 7 యమజిహ్వా జయన్తీచ దుర్జయాచ జయన్తికా | బిడాలీ రేవతీచైవ పూతనా విజయాన్తికా. 8 అష్టహస్తశ్చాతుర్హస్తా ఇచ్ఛాస్త్రాస్సర్వసిద్దిదాః | భైరవశ్చార్కహస్తః స్యాత్కూర్పరాస్యో జటేన్దుభృత్. 9 ఖడ్గాజ్కుశ కుఠారేషు విశ్వాభయ భృదేకతః | చాపత్రిశూల ఖట్వాజ్గ పాశకార్ద వరోద్యతః . 10 గజచర్మదరో ద్వాభ్యాం కృత్తివాసో7హిభూషితః | ప్రేతాసనో మాతృమధ్యే పూజ్యః పఞ్చాననో7థవా.11 హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పునుండి ఈశాన్య పర్యంతము ఉండును. యోగినుల పేర్లు : అక్షోభ్య, రూక్షకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ, ఇల, నీలాలయ, లోల, అలక్త, బలాకేశి, లాలస, విమల, హుతాశ, విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సార, హుద్రసంగ్రాహి, శబర, తాలజింఘిక, రక్తాక్షి, సుప్రసిద్ద, విద్యుజ్జిహ్వ, కరఁకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కాలకర్ణి, వరప్రడ, చంద్ర చంద్రావలి, ప్రపంచ, ప్రలయాంతిక, శిశువక్త్ర, పిశాచి పిశితాశ, లోలుప, ధమని, తపని, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహృత్కుక్షి, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతిక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులుండును. ఇచ్ఛానుసారముగ ఆయుధములను ధరించు చుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్ధులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సుపై జటా-చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ-అంకుశ-కుఠార-బాణ-జగదభయప్రదాన ముద్రలును రెండవ ప్రక్కనున్న ఐదుచేతులలో ధనుష్ - త్రిశూల-ఖట్వాంగ (మంచము కోడు) పాశకార్ధ - వరముద్రలను ధరించి యుండును. మిగిలిన రెండు చేతులలో గజ చర్మ యుండును. గజ చర్మమే వస్త్రము. సర్పాలంకారములచే అలంకృతుడై యుండును. మాతృకల మధ్య ప్రేతముపై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును. అవిలోమాగ్ని పర్యన్తం దీర్ఘాష్టకైక బేదితమ్ | తత్షడఙ్గాని జాత్యన్తైరన్వితం చక్రమాద్యజేత్. 12 మన్దిరాగ్నిదలారూఢం సువర్ణరకాన్వితమ్ | నాదబిన్ద్విన్దు సంయుక్తం మాతృనాథాఙ్గదీపితమ్. 13 వీరభద్రో వృషారూఢో మాత్రగ్రే స చతుర్ముఖః | గౌరీతు త్రిభూజా త్ర్యక్షా శూలినీ దర్పణాన్వితా. 14 శూలంగలన్తికాకుణ్డీ వరదాచ చతుర్భుజా | అబ్జస్థా లలితా స్కన్ద గణాదర్శ కలాకయా. 15 చణ్డికా దశహస్తా స్యాత్ఖడ్గ శూలారి శక్తిధృక్ | దక్షే వామే నాగపాశం చర్మాజ్కు శకుఠారాకమ్. 16 ధనుఃసింహే చ మహిషః శూలీన ప్రహతో7గ్రతః | ఇత్యాది మహాపురాణ అగ్నేయే చతుఃషష్టియోగిన్యాది లక్షణం నామ ద్విపఞ్చాశత్తమో7ధ్యాయఃé తూర్పుదిక్కు నుండి అగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్క దానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తము చేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర 'సమః' చేర్చవలెను. ఉదా. ''ఓం హ్రాం భైరవాయనమః - ప్రాచ్యామ్, ఓం హ్రీం భైరవాయనమః- ఐశాన్యామ్; ఓం హ్రూం భైరవాయనమః- ఉదీచ్యామ్; ఓం హ్రేం భైరవాయ నమః - వాయవ్యే; ఓం హ్రైం భైరవాయ నమః-ప్రతిచ్యామ్ ఓం హ్రోం భైరవాయనమః -నైరృత్యామ్; ఓం హ్రౌం బైరవాయ నమః అవాచ్యామ్; ఓం హః అగ్నేయ్యామ్'' ఈ విధముగ మంత్రోచ్చారణ చేయుచు ఆయా దిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ అంగముల పూజ చేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. ''భైరవుడు అగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుకతోడను, నాద-బిందు, చంద్రులతోడను, మాతృకాధిపత్యంగముతోడను ప్రకాశించుచున్నాడు. (అట్టి బైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు. మాతృకామండల మధ్యమున నుండును. నాలుగు హస్తములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తము నందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితా దేవి కమలముపై కూర్చుండను. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి యుండును. స్కందుని అనుసరించి యుండు మాతృకా గణము చేతులలో దర్పణము. శలాక ఉండును. చండికకు పది భుజములుండును. కుడి చేతులలో బాణ - ఖడ్గ - శూల - చక్ర, శక్తులను ధరించి యుండును. వానుహస్తములలో నాగపాశ - చర్మ - అంశుశ - కుఠార - ధనస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడి యుండును. అగ్ని మహా పురాణమునందు చతుఃషష్టి యోగిన్యాది లక్షణమును ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.