Sri Madhagni Mahapuranamu-1 Chapters
అథ షష్ఠో7ధ్యాయః.
అథ అయోధ్యాకాణ్డవర్ణనమ్.
నారద ఉవాచ :
భరతే7థ గతే రామః పిత్రాదీనభ్యపూజయత్ | రాజా దశరథో రామమువాచ శృణు రాఘవ. 1
భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలగువారిని భక్తితో సేవించెను. దశరథమహారాజు రామునితో ఇట్లనెను -- ''రామా ! వినుమ''
గుణానురాగాద్రాజ్యే త్వం ప్రజాభిరభిషేచితః | మనసా7హం ప్రభాతే తే ¸°వరాజ్యం దదామిహ. 2
రాత్రౌ త్వం సీతయా సార్దం సంయతః సువ్రతో భవ | రాజ్ఞశ్చ మన్త్రిణశ్చాష్టౌ సవసిష్ఠాస్తథాబ్రువన్. 3
సృష్టర్జయన్తో విజయః సిద్దార్థో రాష్ట్రవర్ధనః | అశోకో ధర్మపాలశ్చ సుమన్త్రః సవసిష్ఠకః. 4
''నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతఃకాలమున నీకు ¸°వరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము'' వసిష్ఠుడు, సృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్దనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, అను ఎనమండుగురు మంత్రులను రామునితో ఆ విధముగనే పలికిరి.
పిత్రాదివచనం శ్రుత్వా తథేత్యుక్త్వా స రాఘవః | స్థితో దేవార్చనం కృత్వా కౌసల్యాయై నివేద్య తత్. 5
రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, అట్లే చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.
రాజోవాచ వసిష్ఠాదీన్ రామరాజ్యాభిషేచనే | సంభారాన్ సంభరన్తు స్మ ఇత్యుక్త్వా కైకయిం గతం. 6
దశరథుడు -- ''రాముని పట్టాభిషేకమునకు కావలసిన సంభారము లన్నియు సమకూర్చుడు'' అని వసిష్ఠాదులతో చెప్పి కై కేయి వద్దకు వెళ్ళెను.
అయోధ్యాలఙ్కృ దృష్ట్వా జ్ఞాత్వా రామాభిషేచనమ్ | భవిష్యతీత్యాచచక్షే కై కేయిం మన్థరా సఖీ. 7
కై కేయికి సఖురా లగు మంథర అయోధ్యానగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభిషేకము జరుగనున్నదను విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.
పాదౌ గృషీత్వా రామేణ కర్షితా సాపరాధతః | తేన వైరేణ సా రామవనవాసం చ కాఙ్క్షతి. 8
ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆయె ఆతనిని వనమునకు పంపవలె నని అనుకొనెను.
కై కేయి త్వం సముత్తిష్ఠ రామరాజ్యాభిషేచనమ్ | మరణం తవ పుత్రస్య మమ తే నాత్ర సంశయః. 9
ఓ! కై కేయి ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేక మనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే ఇందులో సందేహము లేదు.
కుబ్జయోక్తం చ తచ్ర్ఛుత్వా ఏకమాభరణం దౌ | ఉవాచ మే యథా రామస్తథా మే భరతః సుతః. 10
ఉపాయం తు న పశ్యామి భరతో యేన రాజ్యభాక్ | కై కేయి మబ్రవీత్కృద్ధా హారం త్యక్త్వాథ మన్థరా. 11
కై కేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి ఇట్లు పలికెను -- నాకు భరతుడెంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయ మేదియు కానరాకున్నది. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కై కేయితో ఇట్లనెను.
మన్థరోవాచ :
బాలిశే రక్ష భరతమాత్మానం మాం చ రాఘవాత్ | భవితా రాఘవో రాజా రాఘవస్య తతః సుతః. 12
రాజవంశస్తు కై కేయి భరతాత్పరి హాస్యతే | దేవాసురే పురా యుద్ధే శమ్బరేణ హతాః సురాః. 13
రాత్రౌ భర్తా గత స్తత్ర రక్షితో విద్యయా త్వయా | వరధ్వయం తదా ప్రాదాద్యాచేదానీం నృపం చ తత్. 14
రామస్య చ వనే వాసం నవ వర్షాణి పఞ్చ చ | ¸°వరాజ్యం చ భరతే తదిదానీం ప్రదాస్యతి. 15
మంథర పలికెను -- ''ఓ తెలివితక్కువదానా ! భరతుని, నిన్ను, నన్ను కూడ రామునినుండి రక్షించుము. రాముడు రాజు కాగలడు. అతని పిమ్మట ఆతని కూమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతడు రాజవంశమును కోల్పోవును. పూర్వము దేవాసుర యుద్ధమునందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అచట నున్న నీ భర్తను నీవు విద్యా ప్రభావముచే రక్షించితివి. అపు డాతడు రెండు వరముల నిచ్చెను. ఇపుడు ఆ రెండు వరములను కోరుము. ఒక వరముచే, పదునాలుగు సంవత్సరములు రాముడు వనములో నివసింపవలె ననియు, రెండవ వరముచే భరతునికి ¸°వరాజ్యమీయవలె ననియు కోరుము. అతడు దానినీయగలడు.
ప్రోత్సాహితా కుబ్జయా సా అనర్థే చార్థదర్శినరీ | ఉవాచ సదుపాయం మే కచ్చిత్తం కారయిష్యతి. 16
క్రోధాగారం ప్రవిష్టథ పతితా భువి మూర్ఛితా |
ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కై కేయి, అనర్థమును లాభకర మని భావించినదై ''ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా ?'' అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలె భూమిపై పడి యుండెను.
ద్విజాతీనర్చయిత్వాథ రాజా దశరథస్తదా. 17
దదర్శ కై కయిం రుష్టామువాచ కథమీదృశీ | రోగార్తా కం భయోద్విగ్నా కిమిచ్ఛసి కరోమి తత్. 18
యేన రామేణ హి వినా న జీవామి ముహూర్తకమ్ | శపామి తేన కుర్యాం వై వాఞ్ఛీతం తవ సున్దరి. 19
రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కై కేయిని చూచి ఇట్లు పలికెను. '' ఇట్లున్నావేమి? రోగముతో బాదపడుచున్నావా ? భయపడినావా ? నీ కేమి కావలెను. చెప్పుము. అది చేసెదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాల మైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టుపెట్టుచున్నాను. ఓ సుందరీ ! నీ కోరికను నెరవేర్చెదను.''
సత్య బ్రూహీతి సోవాచ నృప మహ్యం దదాసి చేత్ |
వరద్వయం పూర్వదత్తం సత్యాత్తవ్వం దేహి మే నృప. 20
చతుర్దశ సమా రామో వనే వసతు సంమతః | సంబారై రేభిరద్యైవ భరతో7 త్రాభిషేచ్యతామ్. 21
విషం పీత్వా మరిష్యామి దాస్యసి త్వం న చేన్నృఫ |
ఆమె పలికెను. ''ఓ రాజా ! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని పూర్వము నా కిచ్చిన రెండు కరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంబారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషమ త్రాగి మరణించెదను.
తచ్ర్ఛుత్వా మూర్ఛితో భూమౌ వజ్రాహత ఇవాపతత్. 22
ముహూర్తాచ్చేతనాం ప్రాప్య కై కేయి మిదమబ్రవీత్.
ఆ మాట విని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమిపై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.
దశరథ ఉవాచ :
కిం కృతం తవ రామణ మయా వా పావనిశ్చయే.
యన్మామేవం బ్రవీషి త్వం సర్వలోకాప్రియం కరి | కేవలం త్వత్ర్పయం కృత్వా భవిష్యామి సునిన్దితః. 24
యా త్వం భార్యా కాలరాత్రిర్భరతో నేదృశః సుతః | ప్రశాధి విధవా రాజ్యం మృతే మయి గతే సుతే. 25
ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను ? సకల ప్రపంచకమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యచమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.
సత్యపాశనిబద్ధ స్తు రామమాహూయ చాబ్రవీత్ | కై కేయ్యా వఞ్చీతో రామ రాజ్యం కురు నిగృహ్య మామ్. 26
త్వయా వనే తు వస్తవ్యం కై కేయి భరతో నృపః |
సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. ''రామా ! నేను కై కేయిచే వంచింపబడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కై కేయీ కుమారు డైన భరతుడు రాజు అగును. ''
పితరం చైవ కై కేయిం నమస్కృత్య ప్రదక్షిణమ్ . 27
కృత్వా నత్వా చ కౌసల్యాం సమాశ్వాస్య సలక్ష్మణః |
సీతయా భార్యయా సార్థం సరథః ససుమన్త్రకః. 28
దత్త్వా దానాని విప్రేభ్యో దీనానాథేభ్య ఏవ సః |
మాతృబిశ్చైవ విప్రాద్యైః శోకార్తైర్నిర్గతః పురాత్. 29
రాముడు తండ్రికిని, కై కేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రినతో కూడినవాడై, రథము నెక్కి శోకార్తులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలువెడలెను.
ఉషిత్వా తమసాతీరే దాత్రౌ పౌరాన్ విహాయ చ | ప్రభాతే తమపశ్యన్తో7యోధ్యాం తే పునరాగతాః. 30
రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.
రుదన్రాజాపి కౌసల్యాగృహమాగాత్సుదుఃఖితః | పౌరా జనాః స్త్రియః సర్వా రురుదూ రాజయోషితః. 31
మిక్కిలి దుంఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌసల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును. స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.
రామో రథస్థశ్చీరాఢ్యః శృఙ్గబేరపురం య¸° | గుహేన పూజిత స్తత్ర ఇఙ్గదీమూలమాశ్రితః. 32
నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. ఆచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.
లక్ష్మణః సగుహో రాత్రౌ చక్రతుర్జాగరం హితౌ | సుమన్త్రం సరథం త్యక్త్వా ప్రాతర్నావాథ జాహ్నవీమ్.
రామలక్ష్మణసీతాశ్చ తీర్ణా ఆపుః ప్రయాగకమ్ | భరద్వాజం నమస్కృత్య చిత్రకూటం గిరిం యయుః. 34
లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి. పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతఃకాలమున నావచే జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కనరించి చిత్రకూటపర్వతము చేరిరి.
వాస్తుపూజాం తతః కృత్వా స్థితా మన్దాకినీ తటే | సీతాయై దర్శయామాస చిత్రకూటం చ రాఘవః. 35
పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీతీరమున నివసించిరి.ప రాముడు సీతకు చిత్రకూటపర్వతమును చూపెను.
నఖై ర్విదారయన్తం తాం కాకం తచ్చక్షురాక్షిపత్ | ఐషీకాస్త్రేణ శరణం ప్రాప్తో దేవాన్విహాయసః. 36
గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది.
రామే వనం గతే రాజా షష్ఠే7హ్ని నిశి చాబ్రవీత్ |
కౌసల్యాం స కథాం పౌర్వాం యదాజ్ఞానాద్దతః పురా. 37
కౌమారే సరయూతేరే యజ్ఞదత్తకుమారకః | శబ్దభేదాచ్చ కుమ్భేన శబ్దం కుర్వంశ్చ తత్పితా. 38
శశాప విలపన్మాత్రా శోకం కృత్వా రుదన్ముహుః | పుత్రం వినామరిష్యావస్త్వం చ శోకాన్మరిష్యసి. 39
పుత్రం వినా స్మరన్ శోకాత్ కౌసల్యే మరణం మమ | కథాముక్త్వా7థ హా రామేత్యుక్త్వా రాజా దివం గతః.
రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.
సుప్తం మత్వాథ కౌసల్యా సుప్తా శోకార్తమేవ సా | సుప్రభాతే శయానం తం సూతమాగధబన్దినః. 41
ప్రబోధకా బోధయన్తి న చ బుధ్యత్యసౌ మృతం | కౌసల్య తం మృతం జ్ఞాత్వా హా హాతాస్మీతి చాబ్రవీత్.
అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను.
నరా నార్యో7థ రురుదురానీతో భరత స్తదా | వసిష్ఠాద్యైః సశత్రుఘ్నః శీఘ్రం రాజగృహాత్ పురీమ్. 43
పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి.
దృష్ట్వా సశోకాం కైకేయీం నిన్దయామాస దుఃఖితః | అకీర్తిః పతితా మూర్థ్ని కౌసల్యాం స ప్రశస్య చ. 44
పితరం తైలద్రోణిస్థం సంస్కృత్య సరయూతటే | వసిష్ఠాద్యైర్జన్తెక్తో రాజ్యం కుర్వితి సో7 బ్రవీత్. 45
శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.
వ్రజామి రామమానేతుం రామో రాజా మతో బలీ | శృఙ్గిబేరం ప్రయాగం చ బరద్వాజేన భోజితః. 46
నమస్కృత్వ భరధ్వాజం రామం లక్ష్మణమాగతః | పితా స్వర్గం గతో రామ అయోధ్యాయాం నృపో భవ.
అహం వనం ప్రయాస్యామి త్వదాదేశ ప్రతీక్షక ః | రామః శ్రుత్వా జలం దత్వా గృహీత్వా పాదకే వ్రజ. 48
రాజ్యయా7హం న యాస్యామి సత్యాచ్చీరజటాధరః | రామోక్తో భరతశ్చాయాన్నన్దిగ్రామే స్థితో బలీ. 49
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ7యోధ్యాకాణ్డ వర్ణనం నామ షష్ఠోధ్యాయః.
రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను. రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.
ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.