Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తషష్టితమో7ధ్యాయః అత జీర్ణోద్ధార విధానమ్. శ్రీ భగవానువాచ: జీర్ణోద్ధారవిధిం వక్ష్యే భూషితాం స్నపయే ద్గురుః | అచలాం విన్యసేద్గేహే అతిజీర్ణాం పరిత్యజేత్. 1 వ్యఙ్గాం భగ్నాం చ శైలాఢ్యాం న్యసేదన్యాం చ పూర్వవత్ | సంహారవిధినా తత్ర తత్త్వాన్ సంహృత్య దేశికః సహస్రం నారసింహేన హుత్వా తాముద్ధరేద్గురుః | దారవీం దాహయేదాద్వహ్నౌ శైలజాం ప్రక్షిపేజ్జలే. 3 ధాతుజాం రత్నజాం వాపి అగాధే వా జలే7మ్బుధౌ | యానమారోప్య జీర్ణాఙ్గం ఛాద్య వస్త్రాదినా నయేత్. వాదిత్రైః ప్రక్షి పేత్తోయే గురవే దక్షిణాం దదేత్ | యత్ప్రమాణా చ యద్ద్రవ్యా తన్మానాం స్థాపయేద్దినే. 5 కూపవాపీతడాగాదేర్జీర్ణోద్ధారే మహాఫలమ్. | ఇత్యాది మహాపురాణ అగ్నేయే జీర్ణోద్దార విధాన కథనం నామ సప్త షష్టితమోధ్యాయః. హయగ్రీవుడు చెప్పెను - ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చెప్పెను. ఆచార్యుడు మూర్తికి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగవిహీనము, భగ్నమైనది, శిలామాత్రావశిష్టమైనది, అగు ప్రతిమను పరిత్యజించవలెను. దీని స్థానమునందు వెనుకటి వలెనే నవీనమైన స్థిరమూర్తిని స్థాపింపవలెను. ఆచార్యుడు భూతశుద్ధిప్రకరణములో చెప్పిని విధమున, సంహారవిధిచే సకల తత్త్వముల సంహారము చేయవలెను. నృసింహా మంత్రముతో వేయి హోమము చేసి మూర్తిని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తియైనచో యైనచో జలములు విడువలెను. ధాతుమయమూర్తి గాని, రత్నమయమూర్తి గాని ఐనచో సముద్రములో ఆగాధ జలములో పడవేయవలెను. జీర్ణప్రతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాథ్యములతో తీసికొని వెళ్ళి నీటిలో విడువవలెను. పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. అదివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణము కలదో అదే ద్రవ్యముతో, అంతే ప్రమాణము గల మూర్తిని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప-వాపీ-తడాగాదుల ఉద్ధారముచేయుటచే గొప్ప ఫలము లభించును. శ్రీ అగ్నిమహాపురాణమునందు జీర్ణోద్ధారవిధి కథనమను ఆరువది యేడవ అధ్యాయము సమాప్తము.