Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోనసప్తతితమో7ధ్యాయః అథ స్నానవిధానమ్ అగ్ని రువాచ: బ్రహ్మన్ శృణు ప్రవక్ష్యామి స్నపనోత్సవవిస్తరమ్ |ప్రాసాదస్యాగ్రతః కుమ్భాన్ మణ్డపే మణ్డలే న్యసేత్. కుర్యాద్ధ్యానార్చనం హోమం హరేరాదౌ చ కర్మసు | సహస్రం వా శతం వాపి హోమయేత్పూర్ణయా సహ స్నానద్రవ్యాణ్యథాహృత్య కలశాంశ్చాపి విన్యసేత్ | అధివాస్య సూత్రకణ్ఠాన్ ధార యేన్మణ్డలే ఘటాన్. 3 అగ్నిదేవుడు పలికెను.: 'బ్రహ్మదేవా! ఇపుడు నేను స్నానోత్సవమునుగూర్చి సవిస్తరముగా చెప్పెదను. ప్రాసాదము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయు నపుడును శ్రీహరి ధ్యానము పూజహోమములు చేయవలెను. పూర్ణాహుతితో పాటు వెయ్యి లేక నూటఎనిమిది హోమములు చేయవలెను. స్నానద్రవ్యములు తీసికొని వచ్చి కలశవిన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను అధివాసనము చేసి మండలముపై ఉంచవలెను. చతురస్రం పురం కృత్వా రుద్త్రెస్తం ప్రవిభాజయేత్. | మధ్యేన తు చరుం స్థాప్య పార్శ్వే పఙ్త్కిం ప్రమార్జయేత్. 4 శాలిచూర్ణాదినా పూర్వ పూర్వాదినవకేషు చ | కమ్భముద్రాం తతో బద్ధ్వా ఘటం తత్రానయేద్భుధః. 5 పుణ్డరీకాక్షమన్త్రేణ దర్భాంస్తాంస్తు విసర్జయేత్ | అద్భిః పూర్ణం సర్వరత్నయుక్తం మధ్యే న్య సేద్ఘటమ్. 6 యవవ్రీహి తిలాంశ్చైవ నీవారశ్యామకాన్ క్రమాత్ | కులిత్థముద్గసిద్ధార్థాన్ముక్త్వాన్యానష్టదిక్షు చ. 7 ఐన్ద్రే తు నవకే మధ్యే ఘృతపూర్ణం ఘటం న్యసేత్ | పలాశాశ్వత్థన్యగ్రోధ బిల్వోదుమ్బర క్షీరిణామ్. 8 జమ్బూ శమీ కపిత్థానాం త్వక్కషాయైర్ఘటాష్టకమ్ | అగ్నేయనవకే మధ్యే మధుపూర్ణం ఘటం న్యసేత్. 9 గోశృఙ్గ నగగఙ్గామ్బుగజేన్ద్ర దశ##నేషు చ | తీర్థ క్షేత్రఖలేష్వష్టౌ మృత్తికా స్యుర్ఘటాష్టకే. 10 చతురస్రమండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలెను. ప్రక్క నున్న రేఖను తుడిచివేయువలెను. ఈ విధముగ ఆ మండలమపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కష్ఠకములు స్థాపించి వాటిని పూర్వాదిక్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులందున్న నవకమునందు కలశ లుంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భ లుంచవలెను. సర్వరత్నములును ఉంచి ఉదకపూర్ణకుంభమును మధ్యభాగమునందుంచి. మిగిలిన ఎనిమిది కుంభములో క్రమముగ యవ-వ్రీహి-తిల-నీవార-శ్యామాక-కులత్థ-ముద్గ-శ్వేత సర్షపములు వేసి ఎనిమిది దిక్కులందును. స్థాపింపవలెను. పూర్వదిక్కునందున్న నవకమునందు మధ్య ఘృతపూర్ణకుంభ ముంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ-అశ్వత్థ-వట-బిల్వ-ఉదుంబర-ప్లక్ష-జంబూ-శమీ-కపిత్థ వృక్షముల బెరుడునుండి తీసిన రసము పోయవలెను. అగ్నేయమునందున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ-పర్వ-గంగాజల-గజశాలా-తీర్థ-క్షేత్ర(పొలము) ఖల (కల్ళము) ములమట్టి ఉంచవలెను. యామ్యే తు నవకే మధ్యే తిలతైలఘటం న్యసే త్ | నారఙ్గమథజమ్బీరం ఖర్జూరం మృద్వికాం క్రమాత్. 11 నారికేలం న్యసేత్పూగం దాడిమం పనసం ఫలమ్ | నైరృతీ నవకే మద్యే క్షీరపూర్ణం ఘటం న్యసేత్. 12 కుఙ్కుమం నాగపుష్పం చ చమ్పకం మాలతీం క్రమాత్ | మల్లికామథ పున్నాగం కరవీరం మహోత్పలమ్.13 పుష్పాణి చాన్యే నవకే మధ్యే వై నారికేలకమ్ | నాదేయమథ సాముద్రం సారసం కౌపమేవ చ. 14 వర్షజం హిమతోయం చ నైర్ఘరం గాఙ్గమేవ చ | ఉదకాన్యథ వాయవ్యే నవకే కదలీఫలమ్. 15 సహదేవీం కుమారీం చ సింహీం వ్యాఘ్రీం తథామృతామ్ | విష్ణుపర్ణీం శతశివాం వచాం దివ్యౌషధీర్న్యసేత్. 16 పూర్వాదౌ సౌమ్యనవకే మద్యే దధిఘటం న్యసేత్ | పత్రమేలాం త్వచం కుష్ఠం బాలకం చన్దనద్వయమ్. 17 లతాం కస్తూరికాం చైవ కృష్ణాగరుమనుక్రామాత్ | సిద్దద్రవ్యాణి పూర్వాదౌ శాన్తితోయమథైకతః. 18 చన్ద్రతారం క్రమాచ్ఛుక్లం గిరిసారం త్రపుం న్యసేత్ | ఘనసారం తథా శీర్షం పూర్వాదౌ రత్నమేవ చ . 19 ఘృతేనాభ్యర్చ్య చోద్వర్త్య స్నపయేన్మూలమన్త్రతః | గన్ధద్యైః పుజయేద్వహ్నౌ హుత్వా పూర్ణాహుతిం చరేత్. 20 బలిం చ సర్వభూతేభ్యో భోజయేద్దత్తదక్షిణః | దేవైశ్చ మునిభిర్భూపైర్దేవం సంస్థాప్య చేశ్వరాః . 21 బభూవుః స్నయిత్వేత్థం స్నపనోత్సవకం చరేత్ | అష్టోత్తరసహస్రేణ ఘటానాం సర్వభాగ్భవేత్. 22 యజ్ఞావభృథస్నానేన పూర్ణ సంస్నాపనం కృతమ్ | గౌరీలక్ష్మీ వివాహాది చోత్సవం స్నానపూర్వకమ్. 23 ఇత్యాదిమహాపురాణ అగ్నేయే యజ్ఞావభృథస్నానం నామైకోనసప్తతితమో7ధ్యాయః దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగజంబీర-నింబ-ఖర్జూర-మృత్తికా-నారికేళ-పూగ-దాడిమ-పనసఫలము లుంచవలెను. నైరృతిదిక్కున నవకమునందు మద్యక్షీర పూర్ణకుంభ ముంచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక-మాలతీ-మల్లికా-పున్నాగ-కరవీర-కమలకుసుమములుంచవలెను. పశ్చిమ నవక మధ్యమున నారికేలజాలపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర-కూప-వర్షా-హిమ, నిర్ఘర-దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య ననకమునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ-సింహీ-వ్యాఘ్రీ-అమృతా-విష్ణుపర్ణీ-దుర్వా-వచా అను దివ్యౌషదుల నుంచవలెను. పూర్వాది సౌమ్యనవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశములందు. పత్ర-ఏలా-త్వక్-కూట-బాలక చందనద్వయలతా-కస్తూరీ-కృష్ణాగురు-సిద్ధద్రవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలెను. మిగిలిన కలశములతో క్రమముగ చంద్ర-తార-రజత-లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు ఘృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించవలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయవలెను. అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను. సకలభూతములకు బలిప్రదానముచేసి బ్రహ్మణునకు, దక్షిణాపూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకముచేయటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నానసిద్ది కలుగును. పార్వతీలక్ష్మ్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును. అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.