Sri Madhagni Mahapuranamu-1 Chapters
అథ ఏకస ప్తతితమో7ధ్యాయః
అథ గణశపూజావిధిః
ఈశ్వర ఉవాచ :
గణపూజాం ప్రవక్ష్యామి నిర్విఘ్నామఖిలార్థదామ్ | గణాయ స్వాహా హృదయ మేకదంష్ట్రాయ వై శిరః .1
గజకర్ణినే చ శిఖా గజవక్త్రాయ వర్మ చ | మహోదరాయ స్వదన్తహస్తాయాక్షితథాస్త్రకమ్. 2
గణో గురుః పాదుకా చ శక్తానన్తౌ చ ధర్మకః | ముఖ్యాస్థిమణ్డలం చాధ శ్చోర్ధ్వ చ్ఛదనమర్చయేత్. 3
పద్మకర్ణిబీజం చ జ్వలినీం నన్దయార్చయేత్ | సూర్యేశా కామరూపా చ ఉదయా కామవర్తినీ. 4
సత్యా చ విఘ్ననాశా చ అసనం గన్ధమృత్తికా | యం శోషా రం చ దహనం ప్లవో లం వం తథామృతమ్.
లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి | తన్నో దన్తిః ప్రచోదయాత్.
గణపతిర్గణాధిపో గణశో గణనాయకః | గణక్రీడో వక్రతుణ్డ ఏకదంష్ట్రో మహోదరః . 6
గజవక్త్రోలమ్బకుక్షిర్వికటో విఘ్ననాశనః | ధూమ్రవర్ణోమహేన్ద్రాద్యాః పూజ్యాగణపతేః స్మృతాః. 7
ఇత్యాది మహాపురాణ అగ్నేయే వినాయకపూజాకథనం నామైకసప్తతితమోధ్యాయః.
ఈశ్వరుడు పలికెను; విఘ్నవినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను. ఇది సకలాభీష్టములను ఇచ్చును. ''గణంజయాయస్వాహా హృదయాయనమః; ఏకదంష్ట్రాయ హుం ఫట్ శిరసే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయై నమః, గజవక్త్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చణ్డాయ నమః నేత్రాభ్యాం నమః, సుదణ్డహస్తాయనమః అస్త్రాయనమః'' అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్యకమలమండలముపైదళములందు, క్రిందిదళములందును గణ - గురు - గురుపాదుకా - శక్తి - అనంత - ధర్మములను, పూజించి కమలకర్ణికమీద బీజమును పూజింపవలెను. తీవ్రా, జ్వాలినీ, నందా! భోగదా, కామరూపిణీ, ఉగ్రా-తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అను తొమ్మిది పీఠశక్తులను పూజించవలెను. పిమ్మట చందన చూర్ణను అసనముగ సమర్పించవలెను. 'యం' అనునది శోషకవాయుబీజము, 'రం'అగ్ని బీజము. 'లం' పృథివీబీజము, 'వం' అమృతబీజము, '' ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తిః ప్రచోదయాత్'' అనునది గణశగాయత్రీ మంత్రము, గణపతి-గణాధిప-గణశ-గణనాయక-గణక్రీడ-వక్రతుండ-ఏకదంష్ట్ర-మహోదర-గజవక్త్ర - లంబోదర-వికట-విఘ్ననాశన-ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతిపూజంగముగ పూజించవలెను.
శ్రీ అగ్ని మహాపురాణమునందు గణపతిపూజావిధికథన మను డెబ్బదియొకటవ అధ్యాము సమాప్తము.