Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తసప్తతితమో7ధ్యాః అథ కపిలాపూజాది విధానమ్ ఈశ్వరఉవాచ : కపిలాపూజనం వక్ష్యే ఏభిర్మన్త్రైర్యజేచ్చగామ్ | ఓం కపిలే నమో నమః కఓం కపిలే భద్రికే నమః. 1 ఓం కపిలే సుశీలే నమః కపిలే సురభి ప్రభే | ఓం కపిలే సుమనసే నమః ఓం భుక్తి ముక్తిప్రదే నమః. 2 సౌరభేయి జగన్మాతర్దేవానామమృతప్రదే | గృహాణ వరదే గ్రాసమీప్సితార్థం చ దేహి మే. 3 వన్దితాస వసిష్ఠేన విశ్వామిత్రేణ ధీమతా | కపిలే హర మే పాపం యన్మయా దుష్కృతం కృతమ్. 4 గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ | గావో మే హృదయే చాపి గవాం మధ్యే వసామ్యహమ్ 5 రత్తం గృహ్ణస్తు మే గ్రాసం జప్త్యాస్యాం నిర్మలః శివః | ప్రార్చ్య విద్యాపుస్తకాని కురుపాదౌ నమేన్నరః 6 యజేత్స్యాత్వా ఙ్గాతు మధ్యాహ్నే అష్టపుష్టికయా శివమ్| పీఠమూర్తిశివాఙ్గానాం పూజా స్యాదష్టపుష్పికా. 7 మధాహ్నే భోజనాగారే సులిప్తే పాకమానయేత్ | తతో మృత్యుఞ్జయేనైవ వౌషడన్తేన సప్తధా. 8 జపై#్తః సదర్భఙ్జస్థైః సిఞ్చేత్తం వారిబన్దుభిః | సన్వపాకా గ్రముద్ధృత్య శివాయ వినివేదయేత్. 9 ఈశ్వరుడు పలికెను. : "ఇపుడు కపిలాపూజన విధానము చెప్పెదను ఈ క్రింది మంత్రములతో గోపూజ చేయవలెను. ఓం కపిలే నమోనమః; ఓం కపిలే భద్రికే నమః ఓం కపిలే సుశీలే నమః ఓం కపిలే సురభిప్రభేనమః ఓం కపిలే సుమనసే నమః ఓం కపిలే భుక్తిముక్తి ప్రదేనమః" ఈ విధముగ పూజించిన పిమ్మట-"దేవతలకు అమృతము నిచ్చుదానా! వరముల నిచ్చుదానా! జగన్మాతా! సౌరభేయీ! ఈ గ్రాసమును స్వీకరించి నాకు మనోవాంఛితవస్తువుల నిమ్ము. ఓ కపిలా! బ్రహ్మర్షి యైన వసిష్ఠుడును, బుద్ధిశాలి యగు విశ్వామిత్రుడును నీకు నమస్కరించినాడు, నేను ఏ యే దుష్కర్మలు చేసితినో ఆ పాపములనన్నింటిని హరింపుము, గోవులు సర్వదా నీ ముందు, వెనుక, హృదయమున నివసించు గాక, నేను సర్వదా గోవులమధ్య నివసింతునుగాక ఓ గోమాతా! నే నిచ్చిన ఈ గ్రాసమును స్వీకరింపును" అని ప్రార్థించవలెను. ఈ విధముగ గోమాతను ప్రార్థించువాడు పాపరహితుడై శివస్వరూపు డగును. విద్యాభ్యాసము చేయువాడు ప్రతిదినము పుస్తకములకు పూజచేసి గురుచరణములకు నమస్కరించవలెను. గృహస్థుడు నిత్యము మధ్యాహ్నకాలమున స్నానముచేసి అష్టపుష్పికా విధానమున శివునిపూజించవలెను. యోగపీఠమును దానిపైన స్థాపించిన శివుని మూర్తిని, శివుని మోకాళ్లను, పాదములను, హస్తములను, వక్షస్థలమును శిరస్సును, వాక్కును, దృష్టిని, బుద్ధిని-శ్రీ ఎనిమిది అంగములను పూజించుటయే "అష్టపుష్పికాపూజ" మధ్యాహ్నమున చక్కగా అలికిన భోజనగృహములోనికి వండిన భోజనపదార్థములను తీసికొనివచ్చి, 'వౌషట్' మంత్రము చివర చేర్చిన మృత్యుంజయ (త్య్రమ్బకం యజామహే) ఇత్యాది మంత్రము ఏడు పర్యాయములు జపించి కుశయుక్త శంఖమునం దుంచిన ఉదకము ఆ అన్నముపై చల్లి, అన్ని పదార్థముల అగ్రభాగములను శివునకు నివేదన చేయవలెను. అథార్ధం చుల్లికాహోమే విధానాయోపకల్పయేత్ | విశోధ్య విధినా చుల్లీం తర్వహ్నిం యేరకాహుతిమ్ 10 హుత్వానాభ్యాగ్ని నా చైకం తతో రేచకవాయునా | వహ్నిబీజం సమాదాయ కాదిస్ధానగతితక్రమాత్. 11 శివాగ్నిస్త్వమితి ధ్యాత్వా చుల్లికాగ్నౌ నివేశ##యేత్| ఓం హాం అగ్నయే నమో వై హాం సోమాయ వై నమః. 12 సూర్యాయ బృహస్పతయే ప్రజానాం పతయే నమః | సర్వేభ్యశ్చైవ దేవేభ్యః సర్వవిశ్వేభ్యా ఏవ చ. 13 హామగ్నయే స్విష్టకృతే పూర్వాదావర్చయే దిమాన్ | స్వాహాన్తామాహుతిం దత్వా క్షమయిత్వా విసర్జయేత్. పిమ్మట సగమ అన్నమును చుల్లికాహోమకొరకు తీసి ఉంచవలెను. విధిపూర్వకముగ పొయ్యి శార్ధము చేసి దాని అగ్నిలో పూరకద్రావణాయామముతో ఒక హోమము చేయవలెను. జఠరానలమును ఉద్ధేశించి ఒక ఆహుతి ఇచ్చి రేచకప్రాణా యామముచే లోపలినుండి బైటకు వచ్చుచున్నవాయువుతో అగ్ని బీజమును (రం)గ్రహించి, క్రమముగ, కకారాద్యక్షరముల ఉచ్చారణస్థానము లగు కంఠాదుల ద్వారా బైటకు తీసికొని వచ్చి, "నీవు శివస్వరూపుడ వగు అగ్నివి" అని చింతించుచు దానిని పొయ్యిలో నున్న అగ్నితో కలిపి నట్లు భావన చేయవలెను. పిమ్మట పొయ్యికిపూర్వాదిదిశలందు "ఓం హాం అగ్నయే నమః' ఓం హాం సోమాయ నమః ఓం హాం సూర్యాయ నమః ఓం హాం బృహస్పతయే నమః, ఓం హాం ప్రజాపతయే నమః, ఓం హరాం సర్వేభ్యోదేవేభ్యోనమః, ఓం హాం సర్వవిశ్వేభ్యోనమః ష ఓం హాం అగ్నయే స్విష్టకృతే నమః" అను ఎనిమిది మంత్రములతో ఎనమండుగురు దేవతలను పూజింపవలెను. పిదప ఈ మంత్రముల చివర 'స్వాహా' చేర్చి ఒక్కొక్క ఆహతి ఇచ్చి, ఆపరాధములను క్షమింపుడని ప్రార్థించి అందరిని విసర్జన చేయవలెను. చుల్ల్యా దక్షిణబాహౌ యజేద్ధర్మాయ వై నమః | వామబాహావధర్మాయ కాఞ్జికాదికభాణ్డకే. 15 రసపరివర్తమానాయ వరుణాయ జలాగ్నయే | విఘ్నరాజో గృహద్వారే షేషణ్యాం సుభ##గే నమః. 16 ఓం రౌద్రికే నమో గిరికే నమశ్చోలుఖలే యజేత్ | బలప్రియాయాయుధాయ నమస్తే ముసలీ యజేత్. 17 పొయ్యికి కుడిప్రక్క "ధర్మాయ నమః" అను మంత్రముతో ధర్మమును, ఎడమప్రక్క 'అధర్మాయ నమః' అను మంత్రముతో అధర్మమును పూజించవలెను. గంజి మొదలగునవి పోయుట కుపయోగించు పాత్రలందును, జలము నుంచు ఘటాదులందును "ఓం రసపరివర్తమానాయ వరుణాయ నమః" అను మంత్రముతో వరుణుని, వంటింటిద్వారమున "విఘ్నరాజాయ నమః" అని విఘ్నేశ్వరుని, తిరుగలిపై "సుభగాయై నమః" అని సుభగను, రోటియందు ''రౌద్రికే గిరికే నమః" అను మంత్రముచే రౌద్రికా- గిరికలను, రోకలయందు "బలప్రియాయుధాయ నమః" అను మంత్రముతో బలిరాముని ఆయుధమును పూజించవలెను. సంమార్జన్యాం దేవతో క్తే కామాయ శయనీయకే | మధ్యస్తమ్భే చ స్కన్దాయ దత్త్వా వాస్తుబలిం తతః. 18 భఞ్దీత పాత్రే సౌవర్ణే పద్మిన్యాదిదలాదికే | ఆచార్యః సాధకః పుత్రః సముయీ మౌనమాస్థితః. 19 వటాశ్వత్థార్కవాతావిసర్జభల్లాతకాం స్త్యజేత్ | ఆపౌశానం పురాదాయ ప్రాణాద్యైః ప్రణవాన్వితైః. 20 స్వాహాన్తేనాహుతీః పఞ్చ దత్త్వా దీప్యోదరానలమ్ | నాగః కూర్మోథ కృకరో దేవదత్తో ధనుఞ్జయః. 21 ఏతేభ్య ఉపనాయుభ్యః సాహా పోశానవారిణా | భక్తాదికం నివేద్యాథ పిచ్ఛేషోదకం నరః. 22 అమృతోపస్తరణమసి ప్రాణాహుతీస్తతో దధేత్ | ప్రాణాయ స్వాహా పానాయ సమానాయ తతస్తథా. 23 ఉదానాయ చ వ్యానాయ భక్త్వా చుల్లకమాచరేత్ | అమృతాపిధానమసేతి నరీరే7న్నాదివాయవః. 24 ఇత్యాదిమహాపురాణ అగ్నేయే కపిలాపూజావిధానం నామ సప్తసప్తతితమో7ధ్యాయః చీపురు పైన పూర్వోక్తదేవతలను (రౌద్రికాగిరికలను), శయ్యపై కామదేవుని. మధ్యనున్న స్తంభముపై స్కందుని పూజింపవలెను. పిమ్మట వ్రతపాలనము చేయు సాధకుడును, పురోహితుడును వాస్తుదేవతకు బలి సమర్పించి, బంగారు పాత్రలో గాని, లేదా తామారాకులలో గాని భోజనము చేయవలెను. మఱ్ఱి, రావి, జిల్లేడు,వాతావి| సర్జము, భల్లాతకము ఈ ఆకులలో భోజనము చేయగూడదు. ముందు ఆచమనము చేసి, 'ప్రాణ' మొదలగు శబ్ధములకు మొదట 'ఓం' కారము చివర "స్వాహా" చేర్చి అన్నము ఐదు ఆహుతులు తీసికొని, జఠరాగ్నిని ఉద్దీప్తము నిసిన పిమ్మట భోణనము చేయవలెను. నాగ-కూర్మ-కృకల-దేవదత్త-లేనంజయములు ఉపవాయువులు "ఏతేభ్యోనాగాదిభ్య ఉవాయుభ్యః స్వాహా" అను మంత్రముతో ఆచమనము చేసి, అన్నాదులను నివేదము చేసి, చివర మరల ఆచమము చేసి "ఓం అమృతోపస్తరణసి స్వాహా" అని చెప్పి, "ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా,ఓం సమానాయస్వాహా" అను మంత్రములతో పంచప్రాణములకును పంచాహును తన ముఖమునందు ఈయవలెను. పిమ్మట పూర్తిగా భోజనముచేసి, చులుకము నీటితో ఆచమనము చేసి, "ఓం అమృతాపిధానమసి స్వాహా" అని చెప్పవలెను. ఈ అచమనము శరీరములోపల నున్న అన్నమును అచ్ఛాదించుటకు ఉపయోగించును. అగ్నిమహాపురాణమునందు కపిలా పూజాది విధాన మను డెబ్బదియేడవ అధ్యాయము సమాప్తము.