Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోనాశీతితమో7ధ్యాయః అథ పవిత్రారోహణవిధిః. ఈశ్వర ఉవాచ: అథ ప్రాతః సముత్థాయ కృతస్నానః సముహితః | కృతసన్ధ్యార్చనో మన్త్రీ ప్రవిశ్య ముఖమణ్డపమ్. 1 సమాధాయ పవిత్రాణి అవిసర్జితదైవతః | ఐశాన్యాం భాజనే శుద్ధే స్థాపయేత్ కృతమణ్డలే. 2 తతో విసర్జ్య దేవేశం నిర్మాల్యమపనీయ చ | పూర్వమద్భుతలే శుద్దే కృతాహ్నికమథ ద్వయమ్. 3 ఆదిత్యద్వారదిక్పాలకుమ్భేశానౌ శివే7నవే | నైమిత్తికం సవిస్తారాం కుర్యాత్పూజాం విశేషతః. 4 మన్త్రాణాం తర్పణం ప్రాయశ్చిత్తహోమం శరాత్మనా | అష్టోత్తరశతం కృత్వా దధ్యాత్పూర్ణాహుతిం శ##నైః. 5 పిమ్మట ఉపాసకుడు ప్రాతఃకాలముననే లేచి, స్నానమాచరించి, సమాహిత చిత్తుడై, సంధ్యావందన మాచరించయజ్ఞమండపము ప్రవేశించి, పరిత్రములను గ్రహించి, దేవతా విసర్జనము చేయకుండగనే వాటిని ఈశాన్యదిక్కునందు, మండలముపై నున్న శుధ్ధ మగు పాత్రలో ఉంచవలెను. పిమ్మట దేవేశ్వరుడగు శివుని విసర్జించి, నిర్మాల్యమును తొలగించి, వెనుకటి వలెనే పరిశుద్ధ మగు భూమిమీద రెండు పర్యాయములు అహ్నికకృత్యములు చేయవలెను. పిదప శివాగ్నియందు సూర్య-ద్వారపాల-దిక్పాల-కలశ-ఈశ్వరులకు విశేషరూపమున నైమిత్తికపూజ చేయవలెను. పిమ్మట మంత్రతర్పణమును, అస్త్రమంత్రముతో నూడ ఎనిమిది పర్యాయములు ప్రాయశ్చిత్తహోమములను చేసి మంత్రము మెల్లగ పఠింపుచు పూర్ణాహుతి చేయవలెను. పవిత్రం భాననే దత్త్వా సమాచమ్య దదీత చ | ద్వారపాలాది దిక్పాలకుమ్భవర్దనికాదిషు. 6 సన్నిధానే తతః శమ్భోదుపవిశ్య నిజాసనే | పవిత్రమాత్రమనేదద్యాద్గణాయ గురువహ్నయే. 7 ఓం కాలాత్మనా త్వయా దేవ యద్దృష్టం మామకే విధౌ | కృతం క్లిష్టం సముత్సృష్టం కృతం గుప్తం చ యత్కృతమ్. 8 తదస్తు క్లిష్టముక్లిష్టం కృతం క్లిష్టమసంస్కృతమ్ | సర్వాతన్మా7మునా శమ్భో పవిత్రేణ త్వదిచ్ఛయా. 9 ఓం పూరయ మఖవ్రతం నియమేశ్వరాయ స్వాహా | ఆత్మతత్త్వేప్రకృత్యన్తే పాలితే పద్మయోనినా. 10 పిమ్మట సూర్యునకు పవిత్రకము సమర్పించి, ఆచమనము చేసి, ద్వారపాలాదులకును, దిక్పాలకులకును, కుంభ వర్ధనికాదికములకును గూడ వవిత్రకము సమర్పించవలెను. శివుని సమీపమున తన అసనముపై ఉపవిష్ణుడై, తనకును, గణమునకును, గురువునకును, అగ్నికిని పవిత్రకముల నీయవలెను. శివుని ఇట్లు ప్రార్థించవలెను. "దేవా! నీవు కాలస్వరూపుడవు. నాకర్తవ్యము విషయమున నీవు ఇచ్చిన ఆజ్ఞను సరిగ పాలింపజాలక నేను ఏవైన లోపములను చేసి యున్నచో, చేయదగిన దానిని చేయకున్నచో, ప్రకట మైనదానిని గుప్తము చేసినచో, అట్టి సంస్కారశూన్య మగు నే చేసినకర్మ అంతయు ఈ పవిత్రారోపణముచే పరిపూర్ణమగుగాక. శంభూ! నీవు ఈ పవిత్రకముచే పూర్తిగ ప్రసన్నుడవై, నా నియమమును పరిపూర్ణము చేయుము" "ఓం పూరయ పూరయ మఖవ్రతం నియమేశ్వరాయ స్వాహా" అను మంత్రము నుచ్చరించవలెను. మూలం లయాన్తముచ్చార్య వవిత్రేణార్చయేచ్ఛివమ్ | విద్యాతత్త్వే చ విద్యాన్తే విష్ణుకారణపాలితే. 11 ఈశ్వరాన్తం సముచ్చార్య పవిత్రమధిరోపయేత్ | శివాన్తే శివతత్త్వే చ రుద్రకారణపాలితే. 12 శిణాన్తం మన్త్రముచ్చార్య తసై#్మ దేయం పవిత్రకమ్ | సర్వకారణపాలేషు శివముచ్చార్య సువ్రతః. 13 మూలం లతాన్తముచ్చార్య దద్యాద్గఙ్గావతారకమ్ | ఆత్మవిద్యా శివః ప్రోక్తంముముక్షూణాం పవిత్రకమ్. 14 వినిర్దిష్టం బుభుక్షూణాం శివతత్త్వాత్మభిః క్రమాత్ | స్వాహాన్తం వా నమోన్తం వా మన్త్రమీషాముదీరయేత్. ఓం హం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా. ఓం హాం విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా. ఓం హౌం శివతత్త్వాధిపతయే శివాయ స్వాహా. ఓం హౌ సర్వతత్త్యాధిపతయే శివాయ స్వాహా. నత్వా గఙ్గావతారం తు ప్రార్ధయేత్తం కృతాఙ్జలిః | ఓ పద్మయోనిపాలితాత్మ తత్త్వేర్వరాయ ప్రకృతిలయాయ ఓం నమః శివాయ" అను మంత్రముచ్ఛరించి పవిత్రకముతో శివుని పూజించవలెను. "విష్ణుకారణ పాలితవిద్యాతత్త్వేశ్వరాయ ఓం నమః శివాయ" అను మంత్రముచ్చరించి పవిత్రకమును సమర్పించవలెను. "రుద్రకారణపాలిత శివతత్త్వేశ్వరాయ ఓం నమః శివాయ" అను మంత్రముచ్చరించుచు శివునకు పవిత్రకమును నివేదించవలెను. సువ్రతుడైన ఉపాసకుడు "సర్వకారణపాలాయ శివాలయ లయాయ ఓం నమః శివాయ" అను మంత్రముచ్చరించుచు శివునకు గంగావతార మను సూత్రమును సమర్పింపవలెను, ముముక్షువులు ఆత్మతత్త్వ-విద్యాతత్త్వ-శివతత్త్వముల క్రమమున మంత్రోచ్చారణము చేయుచు పవిత్రకములను సమర్పించవలెను. బుభుక్షువులు (భోగేచ్ఛకలవారు) వరుసగ శివతత్త్వ-విద్యాతత్త్వ-ఆత్మతత్త్వములకు అధిపతియగు శివునకు మంత్రోచ్ఛారణ పూర్వకముగ పవిత్రకమును సమర్పించవలెను. ముముక్షువు స్వాహాంతమంత్రమును, భోగేచ్ఛగలవాడు నమోంతమంత్రమును ఉచ్చరించవలెను. "ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా" "ఓం హాం విద్యాతత్త్వాధిపతయే శివాయస్వాహా" ఓం హాం శివతత్త్వాధిపతయే శివాయస్వాహా" అనునవి స్వాహాంతమంత్రములు ("స్వాహా"కు బదులు "నమః" చేర్చినచో నమోంతమంత్రములు.) గంగావతారకమును సమర్పించిన పిదప శివునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థింపవలెను. త్వం గతిః సర్వభూతానాం సంస్థితిస్త్వం చరాచరే. 16 అన్తశ్చారేణభూతానాం ద్రష్టా త్వం పరమేశ్వర | కర్మణా మనసా వాచా త్వత్తో నాన్యా గతిర్మయ. 17 మన్త్రహీనం క్రియాహీనం ద్రవ్యహీనం చ యత్కృతమ్ | జపహోమార్చనైర్హీనం కృతం నిత్యం మయా తవ. 18 అకృతం వాక్యహీనం చ తత్పూరయ మహేశ్వర | సుపూస్త్వం పరేశాన పవిత్రం పాపనాశనమ్. 19 త్వయా పవిత్రితం సర్వం జగత్ స్థావరజఙ్గమమ్ | ఖడ్ణితం యన్మయా దేవ వ్రతం వైకల్యయోగతః. 20 ఏకీభవతు తత్సర్వం త్వదాజ్ఞాసూత్రగుమ్భితమ్ | "పరమేశ్వరా! నీవే సమస్తప్రాణులకును గతివి. చరాచరజగత్తునకు ఆశ్రయమైన వాడవు నీవే. నీవు సమన్త ప్రాణులలోపల సంచరించుచు వారికి సాక్షిగా ఉన్నావు. మనోవాక్కాయములచే నీవు తప్ప నాకు వేరొక గతి లేదు . నీకు నేను ప్రతి దినము చేయు పూజలో మంత్ర - ప్రియా - ద్రవ్య - జప - హోమ - అర్చనాదులలో ఏ లోపములు జరిగినవో శుద్ధము లగు వాక్యములు లేని ఏ కర్మ చేసితినో ఆ లోపముల నన్నింటిని మన్నించి, నే చేసిన కర్మను పరిపూర్ణము చేయుము. పరమేశ్వరా! నీవు పరమ పవిత్రుడవు, నీకు సమర్పించిన ఈ పవిత్రకము సమస్తపాపములు నశింపచేయునది. నీవు అంతటను వ్యాపించి ఈ సకల చరాచర జగత్తును పవిత్రిము చేసితివి. వ్యాకులత్వముచేత గాని, అంగవైకల్యముచే గాని నేను ఏ వ్రతమును ఖండితము చేసితినో, అది నీ అజ్ఞయనెడు సూత్రముచే గ్రుచ్చబడి అఖండమగుగాక. జపం నివేద్య దేవస్య భక్త్యా స్తోత్రం విధాయ చ. 21 నత్వాతు గురుణా దిష్టం గృహ్ణీయాన్ని యమం నరః | చతుర్మాసం త్రిమాసం వా త్య్రహమేకాహమేవ వా. ప్రణమ్య క్షమయిత్వేశం గత్వా కుణ్డాన్తికం వ్రతే| ప్రావకస్థే శివే7ప్యేవం పవిత్రాణాం చతుణాష్టయమ్. 23 సమారోప్య సమాభ్యర్చ్య పుష్పధూపాక్షతాదిభిః | అన్తర్భలిం పవిత్రం చ రుద్రాదిభ్యో నివేదయేత్. 24 ప్రవిశ్యాన్తః శివం స్తుత్వా సప్రణామం క్షమాపయేత్. | ప్రాయశ్చిత్తకృతం హోమం కృత్వా హుత్వా చ వపాయసమ్. 25 శ##నైః పూర్ణాహుతిం దత్వా వహ్నిస్థం విసృజేచ్ఛివమ్ | హోమం వ్యాహృతిభిః కృత్వా రున్థ్యాన్నిఫ్థురయానలమ్ | 26 అగ్న్యాదిభ్యోస్తతో దద్యాదాహుతీనాం చతుష్టయమ్ | దికృతిభ్యస్తతో దద్యాత్పపవిత్రం బహిర్బలిమ్. 27 సిద్ధాన్తపుస్తకే వద్యాత్సప్రమాణం పవిత్రకమ్. ఓం హాం స్వాహా. ఓం హాం భువః స్వాహా. ఓం హాం స్వః స్వాహా. ఓం హాం భూర్భువః స్వాహా. హోమం వ్యాహృతిభిః కృత్వా దత్త్వాహుతిచతుష్టయమ్. 28 ఓం హాం అగ్నయే స్వాహా. ఓం హాం సోమాయ స్వాహా. ఓం హాం అగ్నిషోమాభ్యాం స్వాహా. ఓం హాం అగ్నయే స్విష్టకృతే స్వాహా గురుం శివమివాభ్యర్చ్య వస్త్రభూషాదివిస్తరైః | సమగ్రం సఫలం తస్య క్రియాకాణ్డాదివార్షికమ్. 29 యస్య తుష్టో గురుః నమ్యగిత్యాహ రవమేశ్వరః | ఇత్థం గురోః సమారోప్య హృదాలమ్బి పవిత్రకమ్. 30 ద్విజాదీన్ భోజయిత్వా తు భక్త్యా వస్త్రాదికం దదేత్ | దానేనానేన దేవేశః ప్రియతాం మే సదాశివః. 31 పిమ్మట ఉపాసుకుడు జపనివేదనము చేసి, భక్తి పూర్వకముగ భగవంతుని స్తుతించి, నమస్కరించి, గురువు అనుమతితో నాలుగు మాసములు, లేదా మూడు మాసములు . లేదా మూడు దినములు లేదా ఒక్కదినము వ్రతనియమము స్వీకరించవలెను. శివునకు నమస్కరించి, లోపములను క్షమింపు మని ప్రార్థించి, కుండము వద్దకు వెళ్ళి, అగ్నిలో నున్న శివునకు గూడ నాలుగు పవిత్రకములు అర్పించి పుష్ప-ధూప-అక్షతాదులతో పూజించవలెను, రుద్రాయలకు అంతర్బలి, పవిత్రకములు, సమర్పించవలెను. పూజామండపములోనికి ప్రవేశించి, శివుని స్తుతించి, నమస్కరించి, క్షమాప్రార్ధన చేసి, ప్రాయశ్చిత్తహోమము చేసి, పాయసమును ఆహుతిగా ఈయవలెను. మందస్వరముతో మంత్రముచ్చరించుచు పూర్ణాహుతి చేసి అగ్నిలో నున్న శివుని విసర్జించవలెను. వ్యాహృతిహోమములు చేసి, నిష్ఠురతో అగ్ని నిరోధముచేసి అగ్న్యాదులకు "ఓం హాం భూం స్వాహా" ఓం హాం భువః స్వాహా, ఓం హాం స్వః స్వాహా, ఓంహాం భూర్భవః స్వాహా" అను మంత్రములతో ఆహుతులు సమర్పించి; దిక్పాలకులకు పవిత్రములను, బాహ్యబలులను ఇవ్వవలెను. సిద్ధాంత గ్రంథముపై దాని ప్రమాణము గల పవిత్రకము నుంచవలెను. "ఓం హాం అగ్నయే స్వాహా, ఓం హాం సోమాయ స్వాహా, ఓం హాం అగ్నిషోమాభ్యాం స్వాహా, ఓం హాం అగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రములతో అగ్న్యాదులను నాలుగు హోమములు చేసి, గురువునకు, శివునకు వలె వస్త్రభూషణాదులను సమర్పించి పూజిచంవలెను. ఎవని విషయమున గురువు పూర్తిగా సంతోషించునో అతని కాండ మంతయు సఫలమగును అనే పరమేశ్వరుడు చెప్పి యున్నాడు. ఈ విధముగ గురువును పూజించి ఆయనకు హృదయమువరకును వ్రేలాడు పవిత్రకము సమర్పించి, బ్రాహ్మణాదులకు భోజనము పెట్టి, వస్త్రాదు లిచ్చి "దేవేశ్వరుడై సదాశివుడు నేనుచేసిన ఈ దానాదలచే సంతసించును గాక" అని ప్రార్థించవలెను. భక్త్యా స్నానాదికం ప్రాతః కృత్వా శమ్భోః సమాహరేత్ | పవిత్రాణ్యాష్టపుషై#్ప స్త పూజయిత్వా విసర్జయేత్. 32 నిత్యం నైమిత్తికం కృత్వా విస్తరేణ యథా పురా | పవిత్రాణి సమారోప్య ప్రణమ్యాగ్నౌ శివం యజేత్. 33 ప్రాయశ్చిత్తం తతోస్త్రేణ హత్యా పూర్ణాహుతిం యజేత్. | భుక్తికామః శివాయాథ కుర్యాత్కర్మ సమర్పణమ్. 34 త్వత్ప్రసాదేన కర్మేదం మమాస్తు ఫలసాధకమ్ | ముక్తికామస్తు కర్మేదం మాస్తు మే నాథ బన్ధకమ్. 35 వహ్నిస్థం నాడియోగేన శివం సంయోజయేచ్ఛివే | హృది న్యస్యాగ్నిసంఘాతం పావకం చ విసర్జయేత్. 36 సమాచమ్య ప్రవిశ్యాన్తః కుమ్భానుగతసంవరాన్ | శివం సంయోజ్య సాక్షేపం క్షమస్వేతి విసర్జయేత్. 37 విసృజ్య లోకపాలాదీనాదాయేసాత్పవిత్రకమ్ | సతి చణ్డస్వరీ పూజాం కృత్వా దత్త్వా పవిత్రకమ్. 38 తన్నిర్మాల్యాదికం తసై#్మ సపవిత్రం సమర్పయేత్ | అథవా స్థణ్డిలే చణ్డం విధినా పూర్వవద్యజేత్. 39 యత్కిఞ్చిధ్వార్షికం కర్మ కృతం న్యూనాధికం మయా | తదస్తు పరిపూర్ణం మే చణ్డనాథ తవాజ్ఞయా . 40 ఇతి విజ్ఞాప్య దేవేశం నత్యా స్తుత్వా విసర్జయేత్ | త్యక్తనిర్మాల్యకః శుద్ధః స్నాపయిత్వా శివం యజేత్. 41 పఞ్చయోజన సంస్థో7పి పవిత్రం గురుసన్నిధౌ | ఇత్యాది మహాపురాణ అగ్నేయే పవిత్రారోహణ విధిర్నామైకోనాశీతితమో7ధ్యాయః ప్రాతఃకాలము భక్తి పూర్వకముగ స్నానాదికము చేసి శివుని విగ్రహమునుండి పవిత్రకములను ప్రోగుచేసి, శివునకు అష్టపుష్పపూజ చేసి విసర్జన చేయవలెను. పిదప వెనుకటివలెనే సవిస్తరముగ నిత్యనైమిత్తిక పూజ చేసి పవిత్రకములు సమర్పించి, నమస్కరించి, అగ్నిలో శివపూజ చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రముతో ప్రాయశ్చిత్త హోమము చేసి పూర్ణాహుతి ఈయవలెను. భోగేచ్ఛకలవాడు తాను చేసిన కర్మ నంతను శివునకు సమర్పించి - "ప్రభో! నీ అను గ్రహముచే ఈ కర్మవలన నాకు మనోవాంచిత ఫలములు లభించుగాక" అని ప్రార్థించవలెను. మోక్షకాముడు - "ఓనాధా నా కర్మ బంధహేతువు కాకుండగాక" అని ప్రార్థించవలెను. పిదప అగ్నిలో నున్న శివునకు నాడీయోగముచే అంతరాత్మల నున్న శివునితో ఐక్యమును కల్పింపవలెను. అణుసముదాయమును హృదయముగ న్యసించి అగ్నిని విసర్జించి, అచమనము చేసి పూజామండపమును ప్రవేశించి, కలశములోని జలమును నలుమూలల చల్లుచు, శివునితో సంయుక్త మగునట్లు చేసి - 'ప్రభూ! నా లోపములను క్షమించుము" అని ప్రార్థించి విసర్జించవలెను. పిమ్మట లోకపాలాదులను విసర్జించి, శివుని విగ్రహమునుండి పవిత్రకములను తీసి, చండేశ్వర పూజానంతరము, వాటిని శివనిర్మాల్యాదులతో పాటు ఆయనకు సమర్పించవలెను. లేదా వీరి మీద, వెనుకటి వలె, చండేశ్వురుని పూజ చేసి - "చండనాథ! నేను చేసిన వార్షిక కర్మయందు న్యూనత్వరూప దోషముగాని అధికత్వరూపదోషముగాని ఉన్నచో దానిని తొలగించి, ఆకర్మ సాంగో పాంగముగ సంపూర్ణమగు నట్లు చేయుము" అని ప్రార్థించవలెను. పిదప చండేశ్వరుని స్తుతించి, నమస్కరించి, విసర్జించవలెను. నిర్మాల్యమును తొలగించిన పిమ్మట శుద్ధుడై, శివునకు స్నానము చేయించి, పూజించవలెను. గురువు ఐదు యోజనముల దూరము నున్నను ఆయనవద్దకు వెళ్ళి పవిత్రారోహణకర్మ చేయవలెను. అగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధి యను డెబ్బదితొమ్మిదవ అథ్యాయము సమాప్తము.