Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోననవతి తమో7ధ్యాయః ఏకతత్త్వదీక్షీవిధిః ఈశ్వర ఉవాచ : అథైకతాత్త్వికీ దీక్షా లఘుత్వాదుపదిశ్యతే | సూత్రబన్దాది కుర్వీత యథయోగం నిజాత్మనా. 1 కాలాగ్న్యాది శివాన్తాని తత్త్వాని పరిభావయేత్ | సమతత్త్వే సమగ్రాణి సూత్రే మణిగణానివ. 2 ఆవాహ్య శిష్య తత్త్వాది గర్భాధానాది పూర్వవత్ | మూలేన కిన్తు కుర్వీత సర్వశుల్కసమర్పణమ్. 3 ప్రదదీత తతః పూర్ణాం తత్త్వవ్రాతోపగర్భితామ్ | ఏకయైవ మయా శిష్యో నిర్వాణమధిగచ్ఛతి. 4 యోజనాయై శివేచాన్యాం స్థిరత్వాపాదనాయ చ | దత్వా పూర్ణాం ప్రకుర్వీత శివకుమ్భాభిషేచనమ్. 5 ఇత్యాది మహాపురాణ అగ్నేయే ఏకతత్త్వదీక్షావధిర్నామైకోన నవతితమోధ్యాయః. పరమేశ్వరుడు చెప్పెను - ఇపుడు చిన్న దగుటచే ఏకతాత్త్విక దీక్షను గూర్చి చెప్పుచున్నాను. సమయానుగుణముగా, యథోచితరీతిని స్వీయమంత్రముతో సూత్రంబంధాదికము చేయవలెను. పిమ్మట కాలము, అగ్ని మొదలు శివపర్యంత మైన సమస్తతత్త్వముల చింతనము చేయవలెను. సూత్రములో మణులు గ్రుచ్చబడి యున్నట్లు అన్ని తత్త్వములును శివతత్త్వములో గ్రుచ్చబడి యున్నవి. శివతత్త్వాద్యావాహనము చేసి, వెనుకటివలె గర్భాధానాది సంస్కారములు చేయవలెను.కాని సర్వశుల్క సమర్పణమును మాత్రము మూలమంత్రముతో చేయవలెను. పిమ్మట తత్త్వసమూహగర్భిత మైన పూర్ణాహుతి ఈయవలెను. ఆ ఒక్క ఆహుతి చేతనే శిష్యుడు నిర్వాణము పొందగలుగును. శివునియందు నియోజనము, స్థిరత్వాపాదనము చేయుటకును రెండవ పూర్మహుతి కూడ చేయవలెను. పిమ్మట శివకలశజలముతో శిష్యునకు స్నానము చేయించవలెను. అగ్నిమహాపురాణమునందు ఏకతత్త్వదీక్షావిధివర్ణన మను ఎనుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.