Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

చతుర్థోధ్యాయః

(శివగంగాతీర్థవర్ణనము)

శ్లో|| దేవాగారభువోన్తర స్తిశివగఙ్గేతి ప్రసిద్ధం సరః

తీరే తస్య చ దక్షిణ స నటరాడానన్దనృత్తోద్యతః|

శ్రుత్వా తస్య చ దర్శనేన మనుజా నిర్దూతపాప వ్రజాః

అత్రానుష్ఠితదానయజ్ఞతపసాం సాయుజ్యముక్తిర్భవేత్‌||

దేవాలయ ప్రాంగణము లోపల శివగంగ యను ప్రసిద్ధమైన సరస్సు గలదు. దాని దక్షిణ తీరమున నటరాజు ఆనంద తాండవము చేయుట కుద్యుక్తుడై యుండెను. దానిని విని, చూచి మనుష్యులు పాపములు పోయినవారగుదురు. అచ్చట దానములు, యజ్ఞములు, తపస్సులు చేసినవారికి సాయుజ్యముక్తి లభించును.

ఈశ్వరః :

శ్లో|| యోత్ర నృత్యతి దేవేశః స్వాత్మానన్దప్రకాశకః|

సోహమేవ సదా గౌరీ తత్ర మాం పరివశ్యతి||

ఈశ్వరుడు :

స్వాత్మానందమును ప్రకాశింప జేయుచు నచట నృత్యము చేయు దేవదేవుడను నేను. గౌరి ఎల్లపుడు నచటనన్ను జూచుచుండును.

శ్లో|| తత్ర భక్తిమతాం నౄణాం ప్రసన్నోహమనుక్షణమ్‌|

జగన్మాం తత్ర నృత్యన్తం దృష్ట్య్వా పాపైః ప్రముచ్యతే||

అక్కడ భక్తిగల జనులకు నేనెల్లప్పుడు ప్రన్నుడ నగుదును. అచ్చట నృత్యము చేయుచున్న నన్ను జూచిలోకము పాపమునుండి విముక్త మగును.

శ్లో|| స్థానానామపి సర్వేషాం తన్మేస్థానం ప్రియంసదా|

తత్ర జప్తం హుతం దత్తమసంఖ్యేయగుణం భ##వేత్‌||

అన్ని స్థానములలో నా కాస్థాన మెల్లప్పుడు ప్రియమైనది. అక్కడ జపము చేసినను హోమము చేసినను దానము చేసినను లెక్క లేనన్ని రెట్లు ఫలము గలుగును.

శ్లో|| తటాకమ స్తి తత్రాగ్ర్యం శివగఙ్గాభిధానకమ్‌|

తస్య దక్షిణతీరేహం కరోమ్యానన్దతాణ్డవమ్‌||

అచ్చట ఉత్తమమైన శివగంగయనుపేరుగల తటాకము గలదు. దాని దక్షిణ తీరమున నేను ఆనంద తాండవమును జేయుచుందును.

శ్లో|| శ్రవణాదేవ యస్యాశు పాపరాశిః ప్రణస్యతి|

మర్త్యానాం భవమగ్నానాం కోటిజన్మసమార్జితః||

ఆతీర్థమును వినినమాత్రముననే సంసారములో మునిగిన మానవులకు కోటి జన్మలనుండి ప్రాప్తించిన పాపరాశి వెంటనే నశించును.

శ్లో|| ఉత్తమం సర్వతీర్థానాం పుణ్య వృద్ధికరం శుభమ్‌|

యత్తీర్థం మజ్జతాం సద్యో మమ సాయుజ్యకారణమ్‌||

సర్వతీర్థములలో నుత్తమమైనది. పుణ్యమును వృద్ధిచేయునది, శుభ##మైనదియునగు ఆతీర్థము స్నానము చేయువారలకు వెంటనే నా సాయుజ్యమును గలుగజేయును.

శ్లో|| దృష్ట్వావతరతో యస్మిన్‌ లీలార్థమపి మానవాన్‌|

కమ్పతే హృదయం నిత్యం యమస్య చ భయోత్తరమ్‌||

విలాసముగానైనను ఆతీర్థమున స్నానము చేయు మానవులను జూచిన యముని హృదయము భయముతో కంపించును.

శ్లో|| యస్మింస్తు మజ్జతస్తీర్థే లీలయైవ కదాచన|

ఆలోక్య మామకో లోకో వాఞ్ఛత్యేవ విశాలతామ్‌||

విలాసముగానైనను ఒకప్పుడైనను ఆతీర్థమున స్నానముచేయు వారలను జూచి నాలోకము విశాలతను గోరుచునే యున్నది.

శ్లో|| తీర్థేయస్మిన్‌ కృతస్నానః కదాచిదపి మానవః|

అన్యత్రాపి మృతో మర్త్యో మమ లోకే మహీయతే||

ఒకప్పుడైనను ఆతీర్థమున స్నానము చేసిన మానవుడు మరియొక చోట చనిపోయినను నా లోకమున విరాజిల్లును.

శ్లో|| యస్మిం స్తీర్థవరే దివ్యే స్నాత్వా యః ప్రమథోత్తమ!

తత్ర దభ్రసభానాథం మాం విలోక్య మూదాసహ||

అష్టోత్తరసహస్రం తు మన్త్రమాద్యం షడక్షరమ్‌|

జపతి ప్రీతిసంయుక్తః సర్వపాపైః ప్రముచ్య తే||

ప్రమథో త్తమ! దివ్యమైన ఆ తీర్థ శ్రేష్ఠమున నెపడు స్నానము చేసి అక్కడ దభ్ర సభానాథుడనైన నన్ను జూచిసంతోషముతో ఆరక్షరములుగల మొదటిదైన మంత్రమును ప్రీతి గలవాడై అష్టోత్తర సహస్రము జపము చేయునో వాడు సమస్త పాపములనుండి విముక్తుడగును.

శ్లో|| ఆదిత్యే మేషమాయాతే తీర్థేస్నిన్నతిపావనే|

స్నానం కుర్వన్నరః పాపైః సర్వైః సద్యః ప్రముచ్యతే||

సూర్యుడు మేషరాశిని పొందగనే మిక్కిలి పవిత్రమైన యీ తీర్థమున స్నానముచేయు మనుష్యుడు సర్వపాపములు నుండి వెంటనే విముక్తుడగును.

శ్లో|| ప్రాప్తే తు మిధునం భానౌ తటాకే పుణ్యజన్మని|

కృష్ణాష్టమ్యాం నరః స్నాత్వా పుణ్యమాశు సమశ్నుతే||

సూర్యుడు మిథునరాశిగతుడైనపుడు కృష్టాష్టమియందు పవిత్ర జన్మగల ఈ తటాకమున మనుజుడు స్నానము చేసిన వెంటనే పుణ్యమును పొందును.

శ్లొ|| తులాం ప్రాప్తే సహస్రాంశౌ భగదేవే తు తారకేః

ప్రాతస్స్నాత్వా తటాకేస్మిన్‌ భవభీత్యా ప్రముచ్యతే||

సూర్యుడు తులారాశిని పొందినపుడు సూర్య దేవతాకమైన ఉత్తరా నక్షత్రమున ప్రాతఃకాలమం దీతటాకమున స్నానము చేసినవాడు సంసార భయమునుండి విడువబడును.

శ్లో|| సప్తాశ్వే మకరం ప్రాప్తే పుష్యరే వార్కవాసరే|

సకృత్స్నాత్వా తటాకేస్మిన్‌ రవిలోకే మహీయతే||

సూర్యుడు మకరరాశిగతుడై నపుడు పుష్యమీ నక్షత్రమునగాని ఆదివారమునగాని ఈ తటాకమున నొక్కపర్యాయము స్నానము చేసినచో సూర్యలోకమున పూజింపబడును.

శ్లో|| మాఘమాసి మఘర్షే చ తటాకేస్మిన్మహత్తరే|

అనిచ్చాయాపి యస్న్సాతి విబుధేశోభ##వేన్నరః||

మాఘ మాసమున మఘానక్షత్రమున మహత్తరమైన ఈ తటాకమున కోరిక లేకున్నను స్నానము చేసినవాడు దేవప్రభు వగును.

శ్లో|| ఫాల్గునే మాసి యో మర్త్యః తటకేభానుదైవతే|

స్నానం కుర్వన్భవాన్ముక్తఃమమ రూపం సమశ్నుతే||

సూర్య దేవతాకమైన ఫాల్గుణ మాసమున ఈ తటాకమున స్నానము చేసినవాడు సంసారమునుండి ముక్తుడైనా రూపమును పొందును.

శ్లో|| భృగువారే తు శైలాదే స్నానం తస్మిన్‌ కరోతి యః|

మయాపి తస్య మహాత్మ్యం ప్రౌచ్యతే నైవ వాగ్మినా||

శైలాదీ! ఆ తీర్థమున శుక్రవారమున స్నానము చేసిన వానియొక్క మాహాత్మ్యమును వక్తనైన నేను కూడ చెప్పలేను.

శ్లో|| మాఘమాస్యసితే పక్షేప్యష్టమీసంయుతే దినే|

శివగఙ్గాభిధానే తు సర్వతీర్థో త్తమో త్తమే||

కృతస్నానవిధిశ్ర్శాద్ధం యః కరోతి కృతాదరః|

పితృమాతృకులోద్భూతాన్‌ తర్పయేత్స శతం పితృన్‌||

మాఘమాసమున కృష్ణపక్షమునగూడ అష్టమీ తిథియందు తీర్థము లన్నిటిలో నుత్తమోత్తమమైన శివగంగయను తీర్థమున స్నానము చేసి ఆదరముతో శ్రాద్ధము చేసినవాడు పితృమాతృకులములలో బుట్టిన నూరు మంది పితరులను తృప్తిరపరచును.

శ్లో|| శ్రావణ మాసి యశ్ర్శాద్ధం కురుతే తత్ర మానవః|

త్రిస్సప్తకృత్వస్స పితృన్‌ తర్పయేత్షణమాత్రతః||

అక్కడ శ్రావణ మాసమున శ్రాద్ధముచేయు మానవుడు క్షణములో నిరువదియొక్క తరము పితరులను తృప్తి నొందించును.

శ్లో|| మాసేచ మార్గశీర్షాఖ్యేసితే పక్షే సితేపి వా|

కరోతి తత్ర యశ్ర్శాద్ధం స పితృన్‌ సప్త తర్పయేత్‌||

మార్గశీర్ష మాసమున కృష్ణ పక్షమునగాని శుక్ల పక్షమునగాని అక్కడ శ్రాద్ధము చేయువాడు ఏడు తరముల పితరులను తృప్తి పరచును.

శ్లో|| అర్కగ్రహణకాలే తు శివగఙ్గాసమీపతః|

నక్షత్రే మామకే నన్దిన్‌! కరోతి శ్రాద్ధమాదరాత్‌||

కులదీపోయమగతిం క్షుద్దుఃఖపరిపీడితమ్‌|

ఉత్తారయేత్షణనైవ కులమాబ్రహ్మమాత్మనః||

నందీ! సూర్యగ్రహణ కాలమున శివగంగా సమీపమున నా నక్షత్రమగు ఆర్ద్రా నక్షత్రమున ఆదరముతో శ్రాద్ధము నెవడు చేయునో ఆ కులదీపుడు గతిలేక ఆకలి దుఃఖముతో బాధపడుచున్న కులమును బ్రహ్మనుండి తన వరకు క్షణములో తరింపజేయును.

శ్లో|| బ్రాహ్మణాన్భోజయే త్తస్యాస్తీరే యః కేవలం ముదా|

స్వవంశసంయుతస్సద్యో ముక్తిమాప్నోత్య నుత్తమామ్‌||

దాని తీరమున కేవలము సంతోషముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు తన వంశముతో కూడ వెంటనే సర్వోత్తమమైన ముక్తిని పొందును.

శ్లో|| తత్తేన సదృశం స్థానం విశ్వే నా స్తిగణోత్తమ|

తత్రైవ వర్తమానస్తు ముచ్యతే భవబన్ధనాత్‌||

గణోత్తమ! కనుక దానితో సమానమైన స్థానము ప్రపంచమున లేదు. అక్కడనే నివసించువాడు సంసార బంధమునుండి విడుదల చెందును.

శ్లో|| తత్రాన్నం సహపానీయం బ్రాహ్మణభ్యో దదాతియః|

సర్వపాపవినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్‌||

అక్కడ అన్న పానీయములను బ్రాహ్మణుల కిచ్చువాడు సర్వ పాపములనుండి విముక్తుడై పరమ గతిని పొందును.

శ్లో|| గృహం వా మఠికాం వాపి యోగిభ్యస్తత్రయే దదేత్‌|

భవభీతివినిర్ముక్తో భవత్యేవ న సంశయః||

అక్కడ గృహమునుగాని యోగులకు చిన్న మఠమును గాని దానము చేయువాడు సంసార భయమునుండి విముక్తుడగును. సందేహము లేదు.

శ్లో|| స్థానం తస్మాన్మనుష్యాణాం సర్వదోషనివృత్తయే|

మయైవ నిర్మితం నన్దిన్‌! కేవలం తత్కృపా బలాత్‌||

కనుక నందీ! మనుష్యుల సమస్త దోషములు తొలగుట కాస్థానమును నేనే కేవలము వారి యందలి కృపాబలముచే నిర్మించితిని.

శ్లో|| అనేకకోటిభిః కల్పైరార్జితైః పుణ్యరాశిభిః|

నజ్జనానాం పరం స్థానం లభ్యతేత్యన్తశోభనమ్‌||

అనేక కోటి కల్పములనుండి సంపాదించిన పుణ్యరాసులచే సజ్జనులకు మిక్కిలి శుభ##మైన ఉత్తమస్ధానము లభ్యమగును.

శ్లో|| సర్వముక్తం మయా నన్దిన్‌ తస్య స్థానస్య వైభవమ్‌|

మత్ర్పీత్యర్థం సదా దివ్యం స్థానం తత్సేవ్యతే జనైః||

నన్దీ! ఆ స్థానముయొక్క వైభవము సంతను చెప్పితిని. నా ప్రీతి కొరకు జనులు దివ్యమైన యాస్థానము నెల్లపుడు సేవించెదరు.

శ్లో|| వక్ష్యామి శ్మణు తే కించిత్ర్పభావం తద్ద్విజన్మనామ్‌|

శృణ్వతాం యత్సదా నన్దిన్‌! కర్ణయోరమృతాయతే||32

నందీ! అచ్చటి బ్రాహ్మణుల ప్రభావమును కొంచెము నీకు జెప్పెదను వినుము. అది వినువారల చెవుల కెల్లపుడు నమృతమువలె నుండును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

మహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

శివగఙ్గాప్రశంసనం నామ చతుర్థోధ్యాయః

--0--

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters