Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ అష్టమో7ధ్యాయః

(పుల్కసచరితము)

శ్లో || పూర్వం పాపరతో7త్ర పుల్కస ఇతి ఖ్యాతోద్విజానర్దయన్‌|

తేషాం ద్రవ్యమపాహరన్నథ సుహృద్విప్రస్య వాక్యాత్పరమ్‌|

త్యక్త్వా పాపమశేషమప్యతితరాం భక్త్యాథ దభ్రం సదో|

వీక్ష్యాన్తే పరిపూత ఏవ విజహౌ దేహం చ ముక్తో 7భవత్‌||

పూర్వమిక్కడ పాపము చేయుటయందాసక్తి గల పుల్కనుడనువాడు బ్రాహ్మణులను పీడించుచు వారి ధన మపహరించుచు మిత్రుడగు బ్రాహ్మణుని మాట వినిన పిమ్మట పాపము నంతను విడచి మిక్కిలి భక్తితో దభ్రసభను జూచి తుదకు పరిశుద్ధుడై శరీరమును విడచి ముక్తుడయ్యెను.

పితా :

శ్లో || పుత్ర కించ ప్రవక్ష్యే7హం తస్య క్షేత్రస్య వైభవమ్‌|

శృణు త్వం శ్రద్ధయోపేతః సద్యః పాపప్రణాశనమ్‌||

తండ్రి :

కుమారా! వెంటనే పాపమును బోగొట్టు ఆక్షేత్రము యొక్క వైభవము నింకను జెప్పెదను, నీవు శ్రద్ధతో వినుము.

శ్లో || యేన స్థానవిశేషేణ సర్వం పాపం ప్రణస్యతి|

యద్వాసేన నిమేషార్థం లభ్యతే సకలం శుభమ్‌||

ఆస్థానవిశేషముచే సమస్త పాపము నశించును. రెప్పపాటు కాలములో సగము కాలమచ్చట నివసించుటచే సకల శుభములు లభించును.

శ్లో || ఆసీత్కశ్చిత్పురా పాపీ పుల్కసో నామ మానవః |

కృపాణన సుతీక్‌ష్ణే న కులం హత్వా ద్విజన్మనామ్‌||

మార్గే7పి ధనమాహృత్య ప్రాణిహింసాపురస్సరమ్‌|

స్వేచ్ఛావృత్తిశ్చిరం భూమౌ చచారైష హి నిష్కృపః ||

పూర్వము పుల్కనుడను పేరుగల పాపాత్ముడగు మానవుడొకడుండెను. అతడు పదనైన కత్తితో బ్రాహ్మణసమూహమును చంపియు దారిలోగూడ ప్రాణులను హింసించియు ధనము సంపాదించి తన యిచ్చ వచ్చినట్లు తిరుగుచు దయలేనివాడై భూమియందు చిరకాలము సంచరించెను.

శ్లో || ధూర్త ః కశ్చిదభూన్మి త్రం ద్విజన్మా తస్య నిర్ఘృణః |

హృతాదర్ధధనం ప్రీతః పుల్కసో7సై#్మ ప్రదత్తవాన్‌||

వానికి దయాహీనుడు, వంచకుడనగు నొక బ్రాహ్మణుడు మిత్రుడుగా నుండెను. పుల్కనుడు దొంగిలించిన ధనములో సగము ప్రీతితో వానికిచ్చెను.

శ్లో || ధనలాభేన సన్తుష్టః కృపణో7పి చ స ద్విజః|

దదౌ తసై#్మ మతిం శాన్తాం పుల్కసాయ సుఖావహామ్‌||

ఆ బ్రాహ్మణుడు క్షుద్రుడైనను ధనలాభముచే సంతసించి యా పుల్కనునకు సుఖమును గలిగించు శాంతబుద్ధినుపదేశించెను.

బ్రాహ్మణః:

శ్లో || పాపశీలేన దుర్బుద్ధే! త్వయా పాపాని నిర్ఘృణ

కృతాని సర్వదా మూఢ నానుతాపం కరోషి చ||

బ్రాహ్మణుడు :

దుర్బుద్ధీ! దయాహీనుడా! మూఢ! పాపస్వభావముతో నీవెల్లప్పుడు పాపములను చేసితివి పశ్చాత్తాపమునైన పొందవైతివి.

శ్లో || ఇత్యేవం బోధితస్తేన దురాత్మా స హి పుల్కసః |

దైవాదాసీ త్తదా పుత్ర! భృశం నిర్విణ్ణమానసః ||

కుమారా! దుష్టాత్ముడగు నా పుల్కను డీవిధముగా నాతడు బోధింప దైవయోగమున నపుడు ప్రపంచమున హేయబుద్ధిగలవాడయ్యెను.

శ్లో || అహో పాపాని ఘోరాణి కృతాన్యేవ మయాద్విజ|

కిం కరోమి ప్రమూఢో7హమద్య నిష్కృపమా నసః ||

విప్రా! నేను ఘోరపాపములనే చేసితిని, అయ్యో! దయలేని మహా మూఢుడను. ఇపుడు నేనేమి చేయుదును.?

శ్లో || ఉపాయం పాపనాశాయ వద త్వం ద్విజపుఙ్గవ |

చిన్తావిష్టన్తు మే చిత్తం నైవ జానాతి కిఞ్చన ||

బ్రాహ్మణశేష్ఠ! నీవు నాపాపము నశించుట కుపాయము చెప్పుము. విచారముతో నిండిన నామనస్సున కేమియు తోచుటలేదు.

బ్రాహ్మణః:

శ్లో || #9; సాధుసాధు త్వయా పృష్టమత్ర వక్ష్యే హితం శృణు|

పుణ్యక్షేత్రో త్తమే దివ్యే పురాణ వసుధాతలే||

మునిభిస్సిద్ధగన్థర్వై రమరైశ్చ నిషేవితే |

శ్రీమత్తిల్లవనే యత్ర ప్రనృత్యమ్బికాపతిః ||

తత్ర త్వం శ్రద్ధయోపేతః ప్రాతః స్నాత్వాయథావిధి|

దూరే దభ్రసభాం దృష్ట్వా ప్రణమ్య భువి దణ్డవత్‌||

యోగినాం భోగినాం నౄణాం దత్యా సర్వస్వమార్జితమ్‌|

స్థానమేతద్భయే జాతే రక్ష నిత్యం ప్రయత్నతః ||

బ్రాహ్మణుడు :

నీవు చాల బాగుగా నడిగితివి. ఈవిషయమున నీకు హితమును చెప్పెదను వినుము. పుణ్యక్షేత్రములలో నుత్తమమైనది, దివ్యమైనది, భూతలమున ప్రాచీనమైనది, మునుల చేతను, సిద్ధులచేతను, గంధర్వులచేతను, దేవతలచేతను, సేవింపబడినది, అంబికాపతి నృత్యము చేయుచోటునగు శ్రీ తిల్లవనమున నీవు శ్రద్ధతో ఉదయమున యథావిధిగా స్నానము చేసి దూరమున దభ్రసభను జూచి సాష్టాంగముగా నమస్కరించి సంపాదించిన ధనము నంతను యోగులకు భోగులగు మానవులకు దానము చేసి ఆపద సంభవించినపు డాస్థానము నెల్లప్పుడు ప్రయత్నముతో గాపాడుము.

శ్లో || ఏవముక్తో ద్విజేన్ద్రేణ పుల్కసః ప్రీతమానసః|

శ్రీమత్తిల్లవనం పుణ్యం శ్రద్ధయా సహితో య¸° ||

బ్రాహ్మణపుంగవు డీవిధమున జెప్పగా పుల్కనుడు మనస్సున సంతోషించి శ్రద్ధతో పవిత్రమైన శ్రీతిల్లవనముకేగెను.

శ్లో || ద్విజన్మాపి సమం తేన సాదర స్తదవాప సః |

పుల్కసో7సౌ ప్రహృష్టాత్మా జ్ఞాత్వా సదయమా నసః ||

యోగిభ్యశ్చ తథాన్యేభ్యో దత్వా సర్వస్వమార్జితమ్‌|

శ్రీమద్దభ్రసభాం దివ్యాం నిత్యమద్భుతవైభవామ్‌||

దృష్ట్వా దూరే నమస్కృత్య పఞ్చక్రోశాద్బహి క్వచిత్‌|

ఉవాస పరమప్రీతిరేవం కుర్వాన్‌ దినేదినే||

బ్రాహ్మణుడు నాదరమున వానితోగూడ నక్కడకు చేరెను. ఆపుల్కనుడు హృదయమున సంతసించి తెలిసిదయతో యోగులకు నితరులకు నార్జించిన సమస్త ధనమును దానము చేసి ఎల్లపుడద్భుతవైభవముగల దివ్యమైన శ్రీదభ్రసభను దూరమున జూచి నమస్కరించి మిక్కిలి ప్రీతి జెంది ప్రతిదినమున నీవిధముగా జేయుచు ఐదు క్రోసులకు బయటనొకచోట నివసించెను.

శ్లో || ఇతి కాలే కతివయే సమతీతే స పుల్కసః |

స్థానసంరక్షణవ్యాజా త్తత్రైవ మరణం గతః ||

ఈ విధముగా కొంతకాలము గడచినపిమ్మట ఆపుల్కనుడాస్థానమును రక్షించు నెపముతో నక్కడనే మృతి జెందెను.

శ్లో || శ్రీమానసౌ తతః పుణ్యాత్‌ భుక్త్వా భోగాన్యథేప్సి తాన్‌|

శ్రీమద్వ్యాఘ్రపురేశస్య ప్రసాదాదమ్బికాపతేః ||

అత్ర ముక్తిం పరాం లేభే సచ్చిదానన్దలక్షణామ్‌|

పుణ్యాత్ముడగు నాపుల్కను డాపుణ్యమువలన ఇష్టమైన భోగముల ననుభవించి శ్రీవ్యాఘ్రపు రేశుడైన శివుని యనుగ్రహమువలన సచ్చిదానందలక్షణమైన యుత్తమముక్తి నచటపొందెను.

శ్లో || #9; బ్రాహ్మణో7పి తథైవైతత్‌ స్థానం ప్రాప్య మహా మతిః |

స్నానం కృత్వా మహాదేవమమ్బికాపతిమవ్యయమ్‌|

పూజయామాస పూర్వోక్తప్రకారేణ నటేశ్వరమ్‌||

మహాబుద్ధిమంతుడగు నాబ్రాహ్మణుడు నట్లే యాప్రదేసమునకు చేరి స్నానముచేసి నాశరహితుడు, మహాదేవుడు, నంబికాపతియగు నటేశ్వరుని పూర్వము చెప్పిన విధమున బూజించెను.

శ్లో || #9; పూజాం కృతవతే తసై#్మ ద్విజేన్ద్రాయ దయానిధిః |

శ్రీమద్దభ్రసభానాథః ప్రదదౌ ముక్తిముత్తమామ్‌||

పూజచేసిన బ్రాహ్మణ శ్రేష్ఠునకు కరుణానిధియగు శ్రీదభ్రసభానాథు డుత్తమమైన ముక్తినిచ్చెను.

సూతః :

శ్లో || #9; ఇత్యుక్త్వాత నయంప్రీతం తపసే కృతనిశ్చయమ్‌|

ఆలోక్య భస్మ విన్యస్య తత్ఫాలే విమలే శుభే||

ఆశీర్భిరేవ నితరాం కృత్వా సాభిసరం వరమ్‌|

పరిష్వజ్య సమాఘ్రాయ శిరసి ప్రాహిణోత్పితా||

సూతుడు :

తండ్రి యీవిధముగా జెప్పి సంతసముతో తపస్సునకు నిశ్చయించుకొనిన కుమారుని జూచి శుభ##మై స్వచ్ఛమైన వాని నుదుట భస్మముంచి ఆశీస్సులనే మిక్కిలి శ్రేష్ఠమైన సహచరునిగా జేసి కౌగిలించుకొని శిరమున నాఘ్రాణించి పంపెను.

శ్లో || సో7పి తత్ర ప్రసన్నాత్మా పుల్లపద్మసమాననః |

ప్రణిపత్య తదా సమ్యక్‌ పితరం మాతరం తథా||

హితాయ సర్వలోకానాం ప్రాప్తజన్మా మునేస్సుతః |

ధ్యాయన్నీశపదామ్భోజం తపసే తద్వనం య¸° ||

సర్వలోకముల శ్రేయస్సుకొరకు జన్మించిన యాముని కుమారుడును ప్రసన్నమనస్కుడై విడిచిన తామరపువ్వు వంటి ముఖముతో నపుడచ్చట తలితండ్రులకు బాగుగా నమస్కరించి యీశ్వరుని పాదపద్మమును ధ్యానించుచు తపస్సు కొర కాతిల్లవనమున కేగెను.

శ్లో || తారకాపం క్తిసచ్ఛాయముక్తాజాలసుశోభినా|

తటేనోపగతం సిన్ధోః తపోమూలమనుత్తమమ్‌||

మృగేన్ద్రైశ్చ కరీన్ద్రైశ్చ తథాన్యైరపి జన్తుభిః |

సర్వతో దుర్గమోద్దేశం నృణాం సంత్రాసకారణమ్‌||

చన్దనాగరుమాకన్దచమ్పకాసనశోభితమ్‌|

ఋతూనాం సర్వదా షణ్ణాం లీలోద్యానమనుత్తమమ్‌||

తమాలతాలపాలీభిరలఙ్కృతమితస్తతః |

పంక్తిభిర్వారివాహానాం నిశ్చలాభిరివామ్బరమ్‌||

లోచనానాం చ సర్వేషామగమ్యం విపులాశయమ్‌|

అనేకాభిస్స్రవ న్తీభిస్సమన్తాత్ర్పాపితా న్తరమ్‌|

ఉద్యానం పుణ్యవల్లీనాం నిత్యముల్లాసకారణమ్‌|

వినశ్వరం నదీతీరం మహతాం పాపశాభినామ్‌|

అదృష్టపూర్వం విస్తీర్ణం మనోభిరపి దుర్గమమ్‌|

పఞ్చాక్షరసహాయో7యం ప్రాప తద్వనమాదరాత్‌||

నక్షత్రముల వరుసలను బోలిన ముత్యపు సమూహములదే నలంకరింపబడిన సముద్రపుటొడ్డుకు చేరియున్నది, తపస్సుకు మూలమైనది, సర్వోత్తమమైనది, అంతట సింహముల చేతను ఏనుగులచేతను ఇతర మృగములచేతను ప్రవేశింపరానిది, మనుష్యులకు భయమును గలిగించునది, చందనము, అగరు, మామిడి, సంపెంగ, వేగిస చెట్లచే అందముగా నున్నది, ఆరు ఋతువులకు నెల్లప్పుడు నుత్తమమైన విలాసోద్యానము, కదలని మేఘముల వరుసలచే అలంకరింపబడిన ఆకాశమువలె తమాల తాల వృక్షముల వరుసలచే నిటు నటు నలంకరింపబడినది, కన్నులకు వేనికి ప్రవేశింపరాని విశాల మైన ప్రదేశముగలది, చుట్టున అనేక నదులు ప్రవహించుమధ్య ప్రదేశముగలది, పుణ్యమను లతలకు నిత్యము ఆనందమును గలిగించు నుద్యానము, పాపమనెడు పెద్ద వృక్షములకు నశింపజేసెడు నదీతీరము, పూర్వ మెన్నడు చూడనిది, విశాలమైనది, మనస్సులచేత గూడ చొరరానిదియునగు నావనము నతడాదరముతో పంచాక్షర సహాయుడై ప్రవేశించెను.

శ్లో || తస్య మధ్యే చ మహితే వేదధ్వనిపవిత్రితమ్‌|

సంగీతమురజాభోగం సమస్తముని సేవితమ్‌||

ప్రస్యన్దమధుపూర్ణాభిః భ్రమరీరమ్యపంక్తిభిః|

లతికాభిరనేకాభిరలంకృతమ లేకధా ||

హేమపద్మతటాకాఖ్యతీర్థరాజపరిష్కృతమ్‌|

నదీపర్యన్తకహ్లారరజోభిః పరివారితమ్‌||

పురం దివ్యం సమాలోక్య పరమానన్దకారణమ్‌|

మేనే చ శుద్ధమాత్మానం ముదమాప తథా పరామ్‌||

పవిత్రమైన దాని మధ్య వేదధ్వనిచే పవిత్రముగా జేయబడినది, అధికమైన సంగీత వాద్యములతో నొప్పునది, ఋషులందరిచేతను సేవింపబడినది, తేనెను స్రవించుచు తుమ్మెదలచే అందమైన వరుసలుగల బాలలతలచే అనేక విధముల నలంకరింపబడినది, హేమపద్మ తటాకమను తీర్థశ్రేష్ఠముచే నలంకరింపబడినది, నదీ సమీపమందలి యెఱ్ఱ కలువల పుప్పొడివ్యాపించినది, మిక్కిలి యానందమునకు కారణమునగు దివ్యమైన పురమును జూచి తాను పరిశుద్ధుడనని తలచి ఎక్కువ సంతసించెను.

శ్లో || తతశ్చ సర్వపాపానాం సద్యో నాశకరం శుభమ్‌|

హేమపద్మతటాకాఖ్యం తీర్థం తత్ప్రణిపత్య చ||

తస్య దక్షిణతీరేణ జన్మసాఫల్యకారిణా|

శనకైరన్తరం గత్వా తత్ర స్థానం దదర్శ సః |

మూలం సమస్తజగతాం మూలస్థానాభిధం పరమ్‌|

స్మృతే యస్మిన్‌ ప్రణస్యన్తి పాపాన్యాశు తపో ధనాః ||

తపోధనులారా! పిమ్మట సమస్త పాపములను వెంటనే నశింపజేయు శుభ##మైన హేమపద్మ తటాకమను నా తీర్థమునకు నమస్కరించి పుట్టుకకు ఫలమును గలుగజేయు దాని దక్షిణ తీరము వెంట మెల్లగా లోపలికి ప్రవేశించి యచ్చట సమస్త లోకముల కాధారము, స్మరించిన మాత్రమున పాపములను వెంటనే పోగొట్టునది, మూలస్థానమను పేరుగలదియునగు శ్రేష్ఠమైన స్థానమును జూచెను.

శ్లో|| తస్య మధ్యే మహాదేవం శశాఙ్కకృతశేఖరమ్‌|

లిఙ్గే స్వయంభువి వ్యక్తం లీలయా పరమేశ్వరమ్‌||

గఙ్గాతరఙ్గమాలాభిః పరిశోభిజటాభరమ్‌|

ఆనన్దవల్లరీమూలం కోటిసూర్యసమప్రభమ్‌||

మన్దస్మితప్రభాలోకైః సమన్తాత్పరిశోభిభిః |

జ్యోత్స్నాయితవనాభోగం దృష్ట్వాజ్యోతిర్మయం విభుమ్‌||

ఆనన్దనిర్భరస్సోయం ప్రణిపత్య పునః పునః |

జగన్మూర్తిం మహేశానమస్తౌషీదమ్బికాపతిమ్‌||

దాని మధ్యయందు మహాదేవుడు, చంద్రుని శిరోభూషణముగా ధరించినవాడు, స్వయంభూ లింగమున లీలగా వ్యక్తమైనవాడు, పరమేశ్వరుడు, గంగా తరంగము లనెడు మాలలచే అందముగానుండు జటాసమూహముగలవాడు, ఆనందమనెడు తీగకు మూలమైనవాడు, కోటిసూర్యుల కాంతి గలవాడు, అంతట ప్రకాశించు చిరునవ్వు కాంతి వెలుగులచే వన ప్రదేశమును వెన్నెలగలదిగా జేసినవాడు, జ్యోతి స్వరూపుడునగు ప్రభువును జూచి యానందముతో నిండిన యతడు మరల మరల సమస్కరించి జగత్స్వరూపుడు పార్వతీపతియునగు నామహేశ్వరుని స్తుతించెను.

శ్లో || దేవదేవ జగన్నాథ జగతీభారధారక|

ప్రసీద త్వం విరూపాక్ష ప్రణౌమి త్వాం మహేశ్వర||

దేవదేవ! జగద్రక్షక! ప్రపంచ భారమును భరించువాడా! విషమ నేత్రములు కలవాడా! మహేశ్వర! నీకు నమస్కరించుచున్నాను. అనుగ్రహింపుము.

శ్లో || బ్రహ్మ విష్ణురుమానాథ ఇతి లోకవివృద్ధయే|

త్రేధాకృతస్వరూపాయ శూలపాణ! నమో7స్తుతే||

లోకము వృద్ధికొరకు బ్రహ్మయని విష్ణువని శివుడని మూడు విధములుగానైన శూలపాణీ! నీకు నమస్కారము.

శ్లో || యస్య సేవా పరం బ్రహ్మ సద్యః ప్రస్తౌతి నిర్మలమ్‌|

కరుణారూపిణ నిత్యం శూలపాణ! నమో7స్తు తే||

ఎవని సేవ వెంటనే నిర్మలమగు పరబ్రహ్మతత్త్వమును ప్రస్తావించునో అట్టి కరుణామూర్తివగు శూలపాణీ! నీకు నిత్యము నమస్కారము.

శ్లో || వసన్నపి పురాత్రైవ మమ హేతోర్విశేషతః|

శోభ##తే యః ప్రసన్నాత్మా శూలపాణ! నమో7స్తు తే||

పూర్వ మిక్కడనే యున్నను నాకొరకు విశేషముగా ప్రసన్నుడవై ప్రకాశించుచున్న శూలపాణీ! నీకు నమస్కారము.

శ్లో || ఇతి స్తుత్వా మహేశానం ప్రణిపత్య పునః పునః |

ఉవాచ మూర్ధ్ని దేవేశం కృతాఞ్జలిపరిగ్రహః ||

అని యీశ్వరుని స్తుతించి మరల మరల నమస్కరించి తలమీద దోసిలొగ్గి దేవదేవుని గూర్చి పలికెను.

శ్లో || క్రియతే యా మయా పూజా తవ పాదసరోరు హే|

న్యూనా వాప్యధికా వాపి ప్రీతయే భవతో7స్తు సా ||

నేను నీ పాదపద్మములయందు పూజ ఎక్కువ చేసినను తక్కువ చేసినను అది నీకు ప్రీతిని కలిగించుగాక.

శ్లో || #9; ఇతి ప్రార్ధ్య తమీశానం పూజయిత్వా చ సాదరమ్‌|

తతో నిర్గత్య శకకైః సుకృతిర్మునిపుఙ్గవః||

తసై#్యవ శూలినః పశ్చాత్‌ నాతిదూరే సువిస్తృతే|

తటాకస్యోత్తరే భాగే పుష్పవృక్షసమాకులే||

నిర్మాయ మఠికాం రమ్యాం తపసే కృతనిశ్చయః|

తస్య మధ్యే చ దేవేశం ప్రతిష్ఠాప్య విధానతః ||

నియతం తం చ విశ్వేశం శ్రీమూలస్థానవాసినమ్‌|

పూజయన్‌ పరయా భక్త్యా తప స్తీవ్రం చకార సః || 55

అని యా యీశ్వరుని ప్రార్థించి ఆదరముతో బూజించి అక్కడనుండి పుణ్యాత్ముడగు నాముని పుంగవుడు మెల్లగా బయలుదేరి ఆశివునకు వెనుకనే సమీపమున విశాలమై పుష్పవృక్షములతో నిండిన తటాకపుటు త్తరభాగమున సుందరమైన పర్ణశాలను నిర్మించి తపస్సునకు నిశ్చయించుకొని దానిమధ్య యథావిధిగా దేవ దేవుని ప్రతిష్ఠించి నియమముగా వానిని మూలస్థానముననున్న విశ్వేశ్వరునిగూడ పూజించుచు పరమభక్తితో తీవ్రమైన తపస్సుచేసెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కురమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

వ్యాఘ్రపాదతపఃప్రసంగోనామ అష్టమో7ధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters