Sambhoormoorthi Chapters Last Page
ప్రకాశకుల మాట
ప్రాతఃస్మరణీయనామధేయు లైన శ్రీ కాంచీకామకోటి పీఠపరమాచార్యులు సాక్షాత్తు పరమశివుని అవతారమే అని ప్రతిపాదిస్తూ శ్రీ జనార్దనానందసరస్వతీస్వాముల వారు సంస్కృతంలో రచించిన ''శమ్భోర్మూర్తిః'' అను గ్రంథాన్ని సర్వాంధ్రజనోపయుక్తంగా ఉండే టట్లు తెలుగులోనికి అనువదించవలసినదిగా కొందరు కామకోటిపీఠభక్తులు కోరగా ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆ విధంగా అనువదిస్తున్నారని తెలిసినది. ఈ విషయం తెలియగానే ఈ గ్రంథాన్ని ముద్రింపచేసి జగద్గురువు లైన పరమాచార్యుల యథార్థ తత్త్వాన్ని తెలుగువారికి తెలిపి ధన్యుణ్ణి కావా లని సంకల్పం కలిగినది. మా కుటుంబానికి శ్రీకామకోటిమఠంతో సంబంధం దాదాపు ముపై#్ఫ - ముపై#్ఫ అయిదు సంవత్సరాలకు పూర్వం ప్రారంభ##మై, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూన్నది.
జగద్గురువులు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వాములవారి దర్శనం చేసికొనే మహాభాగ్యం నాకు మొట్టమొదట బందరులో లభించినది. ఉద్యోగరీత్యా దూరప్రదేశాలలో ఉండడంచేత అవకాశంవచ్చినప్పుడల్లా శ్రీచరణుల దర్శనం సకుటుంబంగా చేసుకొంటూండే వాడను.
నేను 1978లో ఉద్యోగం చేస్తున్న బరోడాలోని ఒక కంపెనీలో ఒక కొత్త రసాయనిక పదార్థాన్ని తయారుచేసే ఒక విభాగం ప్రారంభించవలసి వచ్చినది. దీనివల్ల ఎవ్వరికీ అపాయం జరగకుండా ఆశీర్వదించవలసిందిగా శ్రీచరణులను ప్రార్థించాను. వారు ప్రసాదం పంపారు. దానిని యంత్రాలమీద చల్లి ఆ పదార్థం తయారుచేయడం ప్రారంభించాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎట్టి ఆటంకాలూ లేకుండా ఆ ఫ్యాక్టరీ నడుస్తున్నది. ఒకసారి దర్శనము చేసుకొనుటకు వెళ్లినపుడు నా ఉద్యోగం గురించి అనేక ప్రశ్నలు వేసి, భిన్నమతస్థుల మధ్య గుజరాత్లో జరిగిన ఘర్షణల గురించి చాలా విషయాలు నన్ను అడిగి తెలుసుకున్నారు.
సాధారణంగా కుటుంబసభ్యులం అందరమూ కలిసి వారిదర్శనానికి వెడుతూండేవాళ్లం. వెళ్లినప్పుడల్లా మా యోగక్షేమాలు తెలుసుకొని ప్రసాదాదులు ఇచ్చి ఆశీర్వదించేవారు వారి ఆశీఃప్రభావం మాకుటుంబసభ్యుల దైనందిన జీవితంలో స్పష్టంగా అనుభవగోచరం అవుతున్నది.
పుస్తక ప్రచురణంవిషయమై నా అభిప్రాయమును తెలుపగా మా కుటుంబసభ్యు లందరూ హర్షాతిరేకంతో అమితోత్సాహం ప్రదర్శించారు. వెంటనే శ్రీజనార్దనానంద సరస్వతీ స్వాములవారి సంనిధికి వెళ్లి ఈ పుస్తకాన్ని ముద్రించడానికి మా కుటుంబానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థించాను. వారు అమితమైన వాత్సల్యంతో అనుజ్ఞ ఇచ్చినారు. వారి అనుజ్ఞాఫలంగా తమహస్తాలను అలంకరిస్తూన్న ఈ గ్రంథం చదివి ఆంధ్రదేశంలోని ఆస్తికజను లందరూ ధన్యులు కాగల రని ఆశిస్తున్నాను.
ఈ అవకాశము నాకు లభించటమనేది పరమాచార్యుల వారి అనుగ్రహపూర్వక ఆశీస్సులవల్లనే వచ్చిందని భావిస్తున్నాను.
ఈ గ్రంథమును శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీ స్వాములవారు ఆవిష్కరించుటకు దయతో అంగీకరించినందులకు వారికి నా కృతజ్ఞతాపూర్వక అనేక ప్రణామములు.
హైదరాబాదు మాగంటి సత్యనారాయణమూర్తి
వృషగురుపూర్ణిమా #9; #9; #9; ''శ్రీకామకోటినిలయం''
(5-7-2001) ; ; ; జూబిలీహిల్సు