Kathakanchiki    Chapters    Last Page

 

మైత్రీం భజత అఖిలహృజ్జేత్రీమ్‌

అత్మవదేవ పరానపి పశ్యత

యుద్ధం త్యజత స్పర్థాం త్యజత

త్యజత పరేష్వక్రమమాక్రమణమ్‌.

జననీ పృథివీ కామదుఘాస్తే

జనకో దేవః సకలదయాళుః

దామ్యత, దత్త, దయధ్వం జనతాః

శ్రేయో భూయాత్‌ సకలనానామ్‌.

స్నేహం చెయ్యి, అందరి

మనస్సులూ లోబరుచుకో.

అందరినీ నీతో సమానంగా చూచుకో.

యుద్ధాలు చెయ్యకు, స్పర్ధలు మాను.

అక్రమంగా దురాక్రమణ చెయ్యటం తప్పు.

పుడమితల్లి మనం కోరినవన్నీ యిస్తోంది.

తండ్రి భగవానుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు.

ప్రపంచ జనులారా, నిగ్రహం అలవరుచుకోండి.

ఇవ్వటంలో ఆనందం పొందండి. దయను వర్షించండి.

అందరూ సుఖంగా సంతోషంగా వుండండి.

ఐక్యరాజ్యసమితిని ఆశీర్వదిస్తూ కంచికామకోటి పీఠాధిపతులు, చంద్రశేఖరేంద్రసరస్వతీ పరమాచార్య శ్రీ పాదులవారు 1966 లో ఈ రెండు శ్లోకాలు వ్రాసి పంపారు. ఆ సంవత్సరం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో శ్రీమతి యం.యస్‌. సుబ్బలక్ష్మిగారు వాటిని గానం చేశారు.

Kathakanchiki    Chapters    Last Page