Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

సాధన గ్రంథ మండలి, 91

జగద్గురు బోధలు

చతుర్థ సంపుటము

శ్రీ కంచి కామకోటి జగద్గురు

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి

*

ఆంధ్రానువాదము ః

'వి శా ఖ'

 

పరిశోధకులు ః

శతావధానులు ః శ్రీ వేలూరి శివరామశాస్త్రి

*

''ఆంధ్రప్రభ'' నుండి పునర్ముద్రితం

ప్రకాశకులు ః

సాధన గ్రంథమండలి, తెనాలి.

కాపీరైటు వెల ః 25-00

సాధన గ్రంథ మండలివి

__________________________________________________

తృతీయ ముద్రణ

''జగద్గురుబోధలు'' ఈ 4 వ భాగము కాపీలు

నిండుకొని చిరకాలమయినది. పేపరు - ప్రింటింగు ధరలు విపరీతముగా పెరుగుట, ఇతర కారణముల వలన వెంటనే ముద్రించుటకు వీలుకలుగలేదు. శ్రీ కంచి పరమాచార్యుల వారి అనుగ్రహముతో నేటికి ప్రచురించుచున్నాము.

ఈగ్రంథముద్రణకు గౌరవపురస్సరమైన సహకార మందించిన-

శ్రీ చల్లా శేషాచలశర్మగారు, మదరాసు

శ్రీ గణపవరపు అంబేశ్వరశాస్త్రిగారు, తెనాలి

శ్రీ వి. గోపాలకృష్ణగారు, నల్లజర్ల

శ్రీ జి. చెట్టెయ్యగారు, నల్లజర్ల

ఈ వదాన్యులందరకి నా హృదయపూర్వక ధన్యవాదములు.

 

భావ - మార్గశిరము

25 - 12- 1994

__________________________________________________

న్యూ విజయ ఆర్టు ప్రెస్‌,

తెనాలి.

ఓమ్‌

సర్వమంగళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాధికే,

శరణ్య! త్య్రంబకే! దేవి! నారాయణి నమోస్తుతే||

మూడవభాగం వెనువెంటనే ఈనాలుగవ భాగంకూడ వెలువడినది. 'సర్వమాప్నో త్యయత్నతః'.

నాలుగేళ్ళక్రితం ఈఅనువాదాలు ప్రారంభించాను. అవి వరుసగా ఆంధ్రప్రభలో వెలువడినవి. శ్రీయుతులు నీలంరాజు వెంకట శేషయ్యగారు ఒక ఉత్తరంలో - 'ఈ ఉపన్యాసాలను లక్షలాది జనంచదివి ఆనందించారు. వారి వారి సంస్కారం కొద్దీ కొద్దిగనో గొప్పగనో ప్రజానీకంపై ఈ ఉపన్యాసాలు పనిచేసినవి. నేను చేసిన కొన్ని మంచిపనులలో ఈ వ్యాసాలను ప్రచురించడం ఒకటి అని భావిస్తున్నాను.' - అని వ్రాసినారు. కార్యాంతరాలచే సకాలంలో అనువాదాలను నేను అందించలేకపోయినా వారు నాయెడచూపిన ఓర్పుకూ, ఈవ్యాసాలు పుస్తకరూప మొందించటంలో వారు నాకిచ్చిన సలహాలకూ, నేనెంతో కృతజ్ఞుడను.

స్వామివారి జీవితచరిత్రనువ్రాసిన సాంబమూర్తిశాస్త్రి గారుకూడా, ఈఉపన్యాసాలు ఆంధ్రదేశంలో తాత్త్వికచింతన కల్గించడంలో ఎంతో సాయపడిందనీ, ఇంతకు క్రితం ఆంధ్రదేశంలో స్వామివారిని,ఒక్క శిష్టులూ పండితులూ మాత్రమే ఎరిగి ఉంటె, ప్రస్తుతం ఆంధ్రప్రభ మూలకంగా స్వామివారిని గూర్చిఆబాలగోపాలమూ తెలిసికోవడానికి అవకాశ##మేర్పడినదనీ చాలామంది స్వామివారిని 'ఆంధ్రప్రభ-ఆదివారంస్వాములవారు' అనికూడ వ్యవహరించడం జరిగిందనీ చెప్పారు. ఒక్కమారు నాతో స్వామివారే సెలవిచ్చారు. ఒకరు ఆంధ్రదేశంనుంచి ఎకాయకీ స్వామివారి దర్శనంకోసం బయలుదేరి వెళ్ళారట. వారికాప్రోత్సాహంకల్గటం ప్రభలో ప్రకటింపబడినవ్యాసమట. ''అహిమాంశు రివాత్ర విభాసిగురో'' అని తోటకాచార్యులన్నట్టు స్వామివారి ప్రతిభను ప్రభ ప్రకటించడం సమంజసమే కదా!

ప్రస్తుతం శ్రీవారు శ్రీశైలోన్ముఖుడై ఆంధ్రదేశ పర్యటనార్ధం విచ్చేస్తున్నారు. ఈ శుభసమయానికి ప్రాతిపదికగా, ప్రభలో స్వామివారి ఉపన్యాసప్రభలు వెలువడటం-సాధకానుకూలంకోసం పుస్తకరూప మొందటం-ఎంతో ముదావహం. ఈశ్వరవ్యాపారంలో మనం నిమిత్తమాత్రులం. ''ప్రదీపజ్వాలాభిర్దివసకర నీ రాజనవిధిః''-నిజానికి మన పాత్రలను ఏదో ఛాయారూపంగా మనం నిర్వహిస్తుంటాం.

ఈ సందర్భంలో మరొక్కమాట. ఈ అనువాదాలకు మూలం తమిళం. మాతృకనుండి తెనుగు చేస్తున్నప్పుడు ఈ బోధలు ఆర్షం అన్న అభిప్రాయం మనస్సులో దృఢంగానాటుకొన్న కారణంచేత చాలవఱకు యధాతధంగా అనువదించ వలసివచ్చి భాషలో సారళ్యం కుంటుపడి, కొన్ని చోట్ల భావం కూడా అవ్యక్తమైంది. ఈలోపనివృత్తికి, భాషాసంస్కారంతో పాటు భావశుద్ధిని కూడా పరిష్కారం చేసే భారంవహించి బ్రహ్మశ్రీ వేలూరి శివరామశాస్త్రులవారు నేను మలచిన బోధరూప శిలలకు ఒక ఉదాత్తశిల్పం పరికల్పించారు. అంతటితో ఆగక వ్యాసములలో ఉదాహృతములైన శ్లోకములకు అర్థవివరణలు అద్వితీయంగానూ, మనోజ్ఞంగానూ వ్రాసి ఈ గ్రంథాల కొక విశిష్టాలంకారం కలుగచేశారు. నా కృతజ్ఞతను ఆరికి మాటలలో తెలుపలేను.

ఈ అనువాదముల భారం స్వామివారు నాపై ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు, వారి అవ్యాజకరుణ ఏమో అనితోస్తుంది. ఈ విషయం తలచినపుడెల్లా - యామునాచార్యులు వ్రాసిన శ్లోకం మనస్సులో మెదలుతూ ఉంటుంది.

న ధర్మనిష్ఠోస్మి న చాత్మవేది

న భక్తిమాం స్త్వచ్చరణారవిందే,

అకించనో నాన్యగతి శ్శరణ్య

త్వత్పాదమూలం శరణం ప్రపద్యే ||

'వాసుదేవ స్సర్వమ్‌'

బొంబాయి ''వి శా ఖ''

2-4-1965 (యం. వి. బి. యస్‌. శర్మ)

శ్రీ జగద్గురు కటాక్షము

ధన్యోస్మి సద్గురు పదాంబుజ దర్శనేన

పూతోస్మి సద్గురు పదోదక సేచసేన,

తీర్ణోస్మి సద్గురు సుబోధ వశా ద్భవాబ్ధిం

బ్రహ్మాస్మి సద్గురు కృపా సమవీక్షణన ||

'శంకరశ్శంకరసాక్షాత్‌' శివావతారము ఆదిశంకరులు, శంకరులే జగద్గురు శ్రీకంచికామకోటి పీఠాధీశ్వరులు. ఆర్తలోకమునకు శ్రీవారి దర్శనము శాంతిదాయకము. తాపత్రయహరము. శ్రీవారి కటాక్షము సర్వకామఫలప్రదము. ఎందరెందరో తమసందేహములను తీర్చికొనుటకునిత్యముతీర్థప్రజలా వచ్చుచుందురు. వారి దర్శనమాత్రాన ప్రజలు అసలు విషయం మఱచి ప్రతిమలవలె నిలబడిపోతారు. శ్రీవారిచల్లని చూపులు ప్రసరిస్తాయి. భక్తులు ఏదోలోకంలో నుంచి ఈ లోకంలోకి వస్తారు. జగద్గురువుల వాగమృతముచే ఫ్లావితులై సంశయనిర్ముక్తులై ధన్యోస్మి యని ప్రతివారూ సాగిలపడతారు.

శ్రీవారి బోధలు వట్టిమాటలుకావు. ఆమాటలు చైతన్యవంతములు. ఈబోధలు 'ఆంధప్రభ' మూలముగా చదివి, విని వేలాదిజనులు తమ జీవితములను సంస్కరించికొని, సన్మార్గగాములై మానవజన్మ చారితార్థ్యమును పొందుదురనుట అతిశయోక్తికాదు. జగద్గురు బోధలద్వారా జగద్గురువుల కటాక్షమునకు ఆంధ్రులెల్లరు ప్రాత్రులగుదురు గాక!

శ్రీ జగద్గురువుల బోధలు అచిరకాలమునందే నాలుగవ సంపుటము వెలువరించుటకు శ్రీజగద్గురువుల కరుణాకటాక్షము, ఆంధ్రప్రభా సంపాదకులు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారి ఆదరాభిమానములు - ఆధారములు.

అనువాదకుల అనురోధముచే ఆంధ్రప్రభలో అచ్చుపడిన వ్యాసములలోని భాషను వ్యావహారిక భాషలోనికి శతావధానులు బ్ర.శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారుమార్చిరి. మరియు ఒకటి, రెండు మూడు సంపుటములలోని శ్లోకాదులకు అర్థము వ్రాసినటులే ఈ సంసుటమున గల శ్లోకాదులకును విశేష అర్థవివరణమును వ్రాసిరి. శ్రీ శాస్త్రిగారికి మా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు.

జిజ్ఞాసువులు ముముక్షువులు అయిన ఆంధ్ర మహాజనులకు ఈ ''జగద్గురుబోధలు'' అందించగలుగుటకు హర్షించుచున్నాము. 1, 2, 3, సంపుటములవలె ఇదియు ఆదరాభిమానములతో స్వీకరించి మా యీ కృషికి సహకరింతురుగాక యని కోరుచున్నాము.

తెనాలి, ఇట్లు

విశ్వావసు-ఉగాది బులుసు సూర్యప్రకాశశాస్త్రి,

1965. వ్యవస్థాపకుడు : సాధనగ్రంథమండలి.

Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page