Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకాదశో7ధ్యాయః - పదకొండవ అధ్యాయము

గంగోత్పత్తిః - గంగామాహాత్మ్యమ్‌.

నారద ఉవాచ :-

అహో హ్యత్యద్భుతం ప్రోక్తం త్వయా భ్రాతరిదం మమ, స వహ్నిరదితిం ముక్త్వా కథం తానదహత్‌ క్షణాత్‌. 1

వదాదితేరమహాసత్త్వం విశేషాశ్చర్యకారణమ్‌, పరోపదేశనిరతాః సజ్జనా హి మునీశ్వరాః. 2

నారదమహర్షి పలికెను:- ''ఓ భ్రాతా! చాల ఆశ్చర్యకరమైన విషయమును చెప్పితిరి. ఆ యగ్ని అదితిని వదిలి రాక్షసులను ఎట్లు క్షణములో దహించి వేసెను? మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు అదితి మహాత్మ్యము ను తెలుపుము. సజ్జనులైన మునీశ్వరులు పరులకు ఉపదేశించుట యందే ఆసక్తి కలిగియుందురు కదా !'' 1-2

సనక ఉవాచ:-

శృణు నారద మాహాత్మ్యం హరిభక్తిరతాత్మనామ్‌, హరిధ్యానపరాన్సాధూన్కస్సమర్థః ప్రభాధితమ్‌. 3

హరిభక్తిపరో యత్ర తత్ర బ్రహ్మహరిశ్శివః, దేవా సిద్ధా మునీశాశ్చ నిత్యం తిష్ఠన్తి సత్తమాః. 4

హరిరాస్తే మహాభాగ హృదయే శాన్తచేతసామ్‌, హరినామపరాణాం చ కిము ధ్యానరతాత్మనామ్‌. 5

శివపూజారతో వాపి విష్ణుపూజాపరో7 పి వా, యత్ర తిష్ఠతి తత్రైవ లక్ష్మీ స్సర్వాశ్చ దేవతాః. 6

యత్ర పూజాపరో విష్ణుర్వహ్నిస్తత్ర న బాధతే, రాజా వా తస్కరో వాపి వ్యాధయశ్చ న సన్తిహి. 7

ప్రేతాః పిశాచా కుష్మాండగ్రహో బాలగ్రహాస్తథా, డాకిన్యో రాక్షసాశ్చైవ న బాధన్తే7 చ్యుతార్చకమ్‌. 8

పరపీడారతా యే తు భూతవేతాలకాదయః, నశ్యన్తి యత్ర సద్భక్తో హరిలక్ష్మ్యర్చనేరతః. 9

జితేన్ద్రియః సర్వహితో ధర్మకర్మపరాయణః, యత్ర తిష్ఠతి తత్రైవ సర్వతీర్థాని దైవతాః. 10

నిమిషం నిమిషార్థం వా యత్ర తిష్ఠన్తి యోగినః, తత్రైవ సర్వశ్రేయాంసి తత్తీర్థం తత్తపోవనమ్‌. 11

యన్నామోచ్చారణాదేవ సర్వే నశ్యన్త్యుపద్రవాః, స్తోత్రైర్వాప్యర్హణాభిర్వా కిముధ్యానేన కథ్యతే. 12

ఏవం తేనాగ్నినా విప్ర దగ్ధం సాసురకాననమ్‌, సాదితిర్నైవ దగ్ధాభూద్విష్ణుచక్రాభిరక్షితా. 13

సనకమహర్షి పలికెను:- ''ఓ నారదా! హరిభక్తియందు ఆసక్తిగల మనసు కలవారి మహాత్మ్యమును వినుము. శ్రీహరి ధ్యానమునందు మనసునుంచిన సాధువులను ఎవరు బాధించగలరు? హరి భక్తిపరుడున్న ప్రదేశమున బ్రహ్మ , శివుడు, శ్రీహరి, దేవతలు , సిద్ధులు మునీశ్వరులు ఎల్లపుడు నివసింతురు. శాంత చిత్తులైన వారి హృదయమున శ్రీహరి నివసించును. హరి నామ కీర్తనము చేయువారికి ధ్యానము నందాసక్తికలవారి విషయమునేమి చెప్పువలయును. శివపూజ చేయువాడు కాని. శ్రీమహావిష్ణువును పూజించువాడు కాని ఉన్న ప్రదేశముననే లక్ష్మీ, దేవతలందరు నివసించెదరు. విష్ణుపూజాపరుడున్న ప్రదేశమున అగ్ని బాధించదు. రాజు కాని, చోరులు కాని, వ్యాధులు కాని బాధించవు. ప్రేతములు, పిశాచములు, కూష్మాండ గ్రహములు, బాలగ్రహములు. డాకినులు, రాక్షసులు అచ్యుతుని పూజించువానిని బాధించజాలవు. పరులను పీడించు స్వభావము కల భూతభేతాలాదులు లక్ష్మీనారాయణులను పూజించు సద్భక్తులున్నచోట నశించుపోవును, ఇంద్రియజయము కలవారు, అందరి హితమును కోరువారు, ధర్మబద్ధమైన కర్మలను ఆచరించువారు ఉన్న ప్రదేశముననే అన్ని తీర్థములు, దేవతలు ఉందురు. ఒక నిమిషము గాని నిమిషార్ధము కాని యోగులున్న ప్రదేశముననే అన్ని శ్రేయస్సులు కలుగును. ఆ ప్రదేశ##మే పుణ్యతీర్థము. అదియే తపోవనము. శ్రీహరినామమును కీర్తించినంతనే అన్ని ఉపద్రవములు నశించును. స్తోత్రములచే పూజలచే నశించును. ధ్యానము చేసినచో నశించునని విడిగా చెప్పవలెయునా? ఇట్లు రాక్షసులు సృష్టించిన అగ్నిచే రాక్షసులతో కూడియున్న అరణ్యమంతయూ కాలిపోయెను. విష్ణుచక్రముచే రక్షించబడిన అదితి మాత్రమే దగ్ధము కాలేదు." 3-13

తతః ప్రసన్నవదనః పద్మపత్రాయతేక్షణః, ప్రాదురాసీత్సమీపే7స్యాః శంఖచక్రగదాధరః. 14

ఈషద్ధాస్యస్ఫురద్దన్తప్రభాభాసితదిఙ్ముఖః, స్పృశన్కరేమ పుణ్యన ప్రాహ కశ్యపవల్లభామ్‌. 15

తరువాత ప్రసన్నమైన ముఖము కలవాడు, పద్మదళమువలె విశాలమైన నేత్రములు కలవాడు, శంఖ చక్ర గదాధ్యాయుధములను ధరించినవాడు, చిరునవ్వుతో వెలుగుచున్న దన్తముల కాంతితో దిక్కులను ప్రకాశింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణుడు ఆదితి సమీపములో ప్రత్యక్షమాయెను. పరమ పవిత్రమైన తన చేతితో అదితిని తాకుచు ఇట్లు పలికెను. 14-15

శ్రీ భగవానువాచ :-

దేవమాతః! ప్రసన్నో7 స్మి తపసారాధితస్త్వయా . చిరం శ్రాంతాసి భద్రం తే భవిష్యతి న సంశయః. 16

వరం వరయ దస్యామి యత్తే మనసి రోచతే , మా భీర్భద్రే మహాభాగే ధ్రువం శ్రేయా భవిష్యతి. 17

ఇత్యుక్తా దేవమాతా సా దేవదేవేన చక్రిణా , తుష్టావ ప్రణిపత్యైనం సర్వలోకసుఖావహమ్‌. 18

శ్రీమన్నారాయమ భగవానుడు పలికెను:- ''ఓ దేవమాతా !నీవు తపస్సుచే నన్ను ఆరాధించితివి. నేను నీకు ప్రసన్నుడనైతిని. చాల కాలము అలసిఉంటివి నీకు సుభము కలుగును. సంశయించవలసిన పనిలేదు. నీకు నచ్చిన వరమును కోరుకొనుము. ఈయగలను. ఓ మహానుభావులారా! భయపడకుము. తప్పక మేలు జరుగును''. ఇట్లు శ్రీహరి పలుకగా శ్రీహరికి నమస్కరించి అన్ని లోకములకు ఆనందమును కలిగించు శ్రీహరిని స్తోత్రము చేసెను. 16-18

అదితిరువాచ:-

సమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్‌ జనార్దన! సత్త్వా దిగుణభేదేన లోకవ్యాపారకారణ ! 19

నమస్తే బహురూపాయరూపాయ చ మహాత్మనే, సర్వైకరూపరూపాయ నిర్గుణాయ గుణాత్మనే. 20

నమస్తే లోకనాథాయ పరమజ్ఞానరూపిణ, సద్భక్తజనవాత్సల్యశాలినే మంగలాత్మనే. 21

యస్యావతారరూపాణి హ్యర్చయన్తి మునీశ్వరాః, తమాదిపురుషం దేవం నమామి హ్యర్ధసిద్ధయే. 22

శ్రుతయో యం న జానన్తి న జానన్తి చ సూరయః, తం నమామి జగద్ధేతుం సమాయం చాప్యమాయినమ్‌. 23

యస్యావలోకనం చిత్రం మయోపద్రవకారణమ్‌, జగద్రూపంజగద్ధేతుం తం వన్దే సర్వవందితమ్‌. 24

యత్పాదాంబుజకిల్క సేవారక్షితమస్తకాః, అవాపుః పరమాం సిద్ధిం తం వన్దే

కమాలాధన మ్‌. 25

యస్య బ్రహ్మాదయో దేవా మహిమానాం న వై విదుః, అత్యాపన్నం చ భక్తానాం తం వన్దే భక్తసంగినమ్‌. 26

యో దేవస్త్యక్తసంగానాం శాంతానాం కరుణార్ణవః, కరోతి హ్యాత్మనః సంగం తం దేవం సంగవర్జితమ్‌. 27

యజ్ఞేశ్వరం యజ్ఞకర్మ యజ్ఞకర్మసు నిష్ఠితమ్‌, నమామి యజ్ఞఫలదం యజ్ఞకర్మప్రభోధకమ్‌. 28

అజామిలో7 పి పాపాత్మా యన్నామోచ్చారణాదను. ప్రాప్తవాన్పరమంధామ తం వన్దే లోకసాక్షిణమ్‌. 29

హరిరూపీ మహాదేవః శివరూపీ జనార్దనః, ఇతి లోకస్య నేతా యస్తం నమామి జగద్గురమ్‌. 30

బ్రహ్మాద్యా అపి దేవేసా యన్మాయాపాశాయన్త్రితాః, నజానన్తి పరం భావం తం వన్దే సర్వనాయకమ్‌. 31

హృత్పద్మస్థో7 ప్యయోగ్యానాం దూరస్థ ఇవ భాసతే, ప్రమాణాతీతసద్భావస్తం వన్దే జ్ఞానసాక్షిణమ్‌. 32

యన్ముఖాద్బ్రాహ్మణో జాతో బాహుభ్యాం క్షత్రియో 7జని, ఊర్వోర్వైశ్య స్సముత్పన్నః పద్భ్యాం శూద్రో 7భ్యజాయత. 33

మనసశ్చన్ద్రమా జాతో జాతస్సూర్యశ్చ చక్షుషః , ముఖాదగ్నిస్తథేన్ద్రేస్చ ప్రాణాద్వాయురజాయత. 34

ఋగ్యజుస్సామరూపాయ సప్తస్వరగతాత్మనే, షడంగరూపిణ తుభ్యం భూయో భూయో నమో నమః. 35

త్వమిన్ద్రః పవనస్సోమప్త్వమీశానస్త్వమన్తకః, త్వమగ్నిర్నైఋతిశ్చైవ వరుణస్త్వం దివాకరః. 36

దేవాశ్చస్థావరాశ్చైవ పిశాశ్చైవ రాక్షసాః, గిరయ స్సిద్ధగంధర్వా నద్యో భూమిశ్చ సాగరాః. 37

త్వమేవ జగతామీశో యత్రాసి త్వం పరాత్పరః, త్వద్రూపమఖిలం దేవ తస్మాన్నిత్యం నమో7స్తుతే. 38

అనాథనాథ! సర్వజ్ఞ భూతదేవేన్ద్రవిగ్రహ !దైతేయైర్బాధితాన్పున్మము పాహి జనార్దన ! 39

ఇతి స్తుత్వా దేవమాతాం దేవం నత్వా పునః పునః ఉవాచ ప్రాంజలిర్బూత్వా హర్షాశ్రుక్షాలితస్తనీ. 40

అదితి పలికెను:- ''దేవతలకు దేవుడవు, ప్రభువువు, అంతటా వ్యాపించియుండు వాడవు. సత్త్వరజస్తమో గుణభేదములచే లోకవ్యాపారములకు కారణభూతుడవు అయిన ఓ జనార్దనా! నీకు నమస్కారము. అనేక రూపములు గలవాడవు, రూపమలేనివాడవు, మహానుభావుడవు అన్నిటిలో ఒకే రూపముతో నుండువాడవు, గుణరహితుడవు, అనన్తకళ్యాణగుణస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. అన్ని లోకములకు నాధుడవు. పరమజ్ఞానస్వరూపుడవు, సజ్జనులగు భక్తులను వాత్సల్యముతో చూచు స్వభావము కలవాడవు. మంగళస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. మునీశ్వరులు పూజించి అవతార రూపములు గల ఆదిపురుషుని నా కోరిక సిద్ధించుటకు నమస్కరించుచున్నాను. శ్రుతులకు.జ్ఞానులకు తెలియ శక్యము కానివాడు జగత్కారణభూతుడు, మాయతో కూడియుండువాడు, మాయకు వశము కానివాడు అయిన పరమాత్మకు నమస్కరించుచున్నాను. ఆశ్చర్యమును కలిగించు నా దర్శనము మాయను పారద్రోలుటకు కారణము. జగత్స్వరూపుడు, జగత్కారమ భూతుడు అయిన అందరిచే నమస్కరించబడు వానిని నమస్కరించుచున్నాను. నీ పాదపద్మముల పరాగములను సేవించుటచే తమ మస్తకములను కాపాడు కొనుచు పరమసిద్ధిని పొందుచున్నారు. కమలాపతివైన నీకు నమస్కారము. బ్రహ్మాదులకు కూడా తెలియ శక్యము కాని మహిమ కలవాడు, భక్తులకు సన్నిహితముగా నుండువాడు, భక్తులతో కలిసి ఉండువాడు అయిన స్వామి ని నమస్కరించుచున్నాను. అన్ని సంగములను వదలి శాంతచిత్తులయిన వారికి ఆత్మసంగతుని కలిగించు కరిణాసముద్రుడు, సంగరహితుడు, యజ్ఞములకు ప్రభువు యజ్ఞక్రమస్వరూపుడు, యజ్ఞకర్మలయందు ఉండువాడు, యజ్ఞఫలములనిచ్చువాడు యజ్ఞకర్మలను బోధించువాడు అయిన ఆదిదేవునికి నమస్కరించుచున్నాను. కేవలము నామసంకీర్తనముచే అజామిలునికి పరమపదమును ప్రసాదించిన లోకసాక్షిని నమస్కరించుచున్నాను. హరిరూపములో నున్న మహాదేవుడుగా, శివరూపములో నున్న జనార్దనుడుగా, లోకాధిపతిగానున్న జగద్గురువునకు నమస్కరించుచున్నాను. నీ మాయాపాశముతో బంధించబడి బ్రహ్మాదిదేవాధిపతులు కూడా పరస్వరూపమును తెలియలేకున్నారు. అట్టి సర్వనాయకుడవగు నీకు నమస్కారము. అయోగ్యులకు హృదయపద్మములో నున్ననూ దూరమున నున్నవాని వలె తోచుచున్నావు. ప్రమాణములకు అందని సత్త (ఉనికి) గల జ్ఞాన సాక్షికి నమస్కారము.నీ ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువులనుండి క్షత్రియులు పుట్టిరి. ఊరువులనుండి వైశ్యులు పుట్టిరి. పాదములనుండు శూద్రులు పుట్టిరి. మనసు నుండిం చంద్రుడు, నేత్రము నుండు సూర్యుడు, ముఖము నుండి అగ్ని, ఇంద్రుడు, ప్రాణము నుండి వాయువు, పుట్టెను. ఋగ్యజుస్సామ స్వరూపునకు సత్యవాక్స్వరూపునకు షడంగరూపునకు మాటిమాటికి నమస్కారములు అన్నియు నీవే. జగత్తునకు ఈశ్వరుడవు. నీవే వరములన్నిటికి పరుడవు నీవే. ఈ ప్రపంచమంతయూ నీరూపమే. కావున నీకు సర్వకాలములందు నమస్కారము. దిక్కులేని వారికి నీవే దిక్కు. సర్వజ్ఞుడవు. భూతముల, దేవతల, అధిపతుల స్వరూపుడవు నీవే ఓ జనార్దనా! రాక్షసులచే బాధించబడు నా పుత్రులను కాపాడుము''. ఇట్లు దేవమాతయగు అదితి జనార్దనుని స్తుతించి, మాటిమాటికి నమస్కరించి చేతులు జోడించి ఆనందాశ్రువులతో తడిసిన స్తనములు కరదై మరల ఇట్లు పలికెను. 19-40

అనుగ్రహ్యాస్మి దేవేశ త్వయా సర్వాదికారణ, అకంటకాం శ్రియం దేహి మత్సుతానాం దివౌకసామ్‌. 41

అన్తర్యామినే జగద్రూప సర్వజ్ఞ పరమేశ్వ !అజ్ఞాతం కిం తవ శ్రీశ! కి మామీహయసి ప్రభో. 42

తథాపి తవ వక్ష్యామి యన్మే మనసి రోచతే, వృధాపుత్రాస్మి దేవేశ! దైతేయైః పరిపీడితా. 43

తాన్న హింసితు మిచ్ఛామి యతస్తే 7పి సుతా మమ, తానహత్వా శ్రియం దేహి మత్సుతేభ్యస్సురేశ్వర! 44

ఇత్యకో దేవదేవేశ:- పునః ప్రీతిముపాగతః, ఉవాచ హర్షయన్విప్ర !దేవమాతరమాదరాత్‌. 45

''అన్నిటికి ఆదికారణభూతుడవైన ఓ దేవేశా! నీ అనుగ్రహమునకు పాత్రురాలగుదునేని స్వర్గవాసులగు నా పుత్రులకు అడ్డులేని ఐశ్వర్యమును ప్రసాదించుము. ఓ అంతర్యామీ! జగత్స్వరూపా! సర్వజ్ఞుడా !పరమేశ్వరా !నీకు తెలియనిదేమున్నది? నన్ను పరీక్షించుచుంటివా ?అయిననూ నా మనసునకు నచ్చిన దానిని నీకు చెప్పెదను. నా పుత్రులు వ్యర్థులై ఉన్నారు. దైత్యుల చేత పీడింపబడుచున్నారు. అయిననూ నేను దితిపుత్రులను హింసించదలచలేదు. వారు కూడా నా పుత్రులే . వారికి హాని కలుగకుండా నా పుత్రులకు ఐశ్వర్యమును ప్రసాదింపుము. ''ఇట్లు అధితి పలుకగా దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు మరల ప్రీతిచెంది అదితిని సంతోషింపచేయుచు ఆదరముతో దేవమాతను గూర్చి ఇట్లు పలికెను. 41-45

శ్రీభగవానువాచ:-

ప్రీతో7స్మి దేవి భద్రం భవిష్యామి సుతో హ్యహమ్‌, యతస్సపత్నీపుత్రేషు, వాత్సల్యం దేవి !దుర్లభమ్‌. 46

త్వయా తు యత్తృతం స్తోత్రం యత్పఠన్తి నరాస్తు యే, తేషాం సంపద్వరాః పుత్రా న హీయన్తే కదాచన. 47

ఆత్మజే వాన్యపుత్రే లా యస్సమత్వేన వర్తతే, న తస్య పుత్రశోకః స్యాదేష ధర్మస్సనాతనః. 48

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- ''ఓ దేవమాతా! నేను సంతోషించితిని, నీకు శుభమగు గాక. నేను నీకు పుత్రుడనగుదును. సవతి కొడుకుల యందు దుర్లభమగు వాత్సల్యమును నీవు చూపితివి. నీవు చేసిన స్తోత్రమును చదివిన మానవులకు ఐశ్వర్యముతో కూడిన పుత్రులు తరుగకుండా ఉందురు. తన పుత్రునియందు ఇతరుల పుత్రుని యందు సమభావముతో నుండు వారికి పుత్రశోకము కలుగదు. ఇది సనాతన ధర్మము. 46-48

అదితిరువాచ:-

నాహం వోఢుం క్షమా దేవ త్వామాద్యం పురుషం పరమ్‌, అసంఖ్యాతాండరోమాణం సర్వేసం సర్వకారణమ్‌. 49

యత్ప్రభాలం న జానన్తి శ్రుతయస్సర్వదేవతాః తమహం దేవదేవేశం ధారయామి కథం ప్రభో. 50

అణోరణీయాంసముజం పరాత్పరతరం ప్రభుమ్‌. ధారయామి కథం దేల త్వామహం పురుషోత్తమ్‌. 51

మహాపాతకయుక్తో7 పి యన్నామస్మృతిమాత్రతః, ముచ్యతే స కథం దేవో గ్రామ్యేషు జనిమర్హతి. 52

యథా సూకరమాత్స్యద్యా అవతారాస్తవ ప్రభో, తథాయమపి కో వేద తవ విశ్వేశ చేష్టితమ్‌. 53

త్వత్పాదపద్మప్రణతా త్వన్నామస్మృతితత్పరా, త్వామేవ చింతయే దేవ యథేచ్ఛసి తథా కురు. 54

''అదితి పలికెను:- ఆదిపురుషుడవు పరమపురుషుడవు అయిన నిన్ను నేను మోయలేను. నీవు లెక్కలేనన్ని బ్రహ్మాండములు రోమకూపములుగా గలవాడవు. సర్వేశ్వరుడవు సర్వకారణుడవు. దేవతలందరూ శ్రుతులన్నియూ నీ ప్రభాలమును తెలియజాలవు. అట్టి దేవదేవేశుడవైన నిన్ను నేనెట్లు ధరించగలను? అణువుకంటె అణువు, పుట్టుకలేని వాడవు, పరమ కంటే పరుడవు, ప్రభువువు, పురుషోత్తముడవైన నిన్ను నేనెట్లు ధరించగలను? నీ నామస్మరమ మాత్రముననే మహాపాతకములతో కూడి యున్నవాడు కూడా పాతకముల నుండి విడివడును. అట్టి దేవదేవుడవైన నీవు గ్రామ్యులమైన (అజ్ఞానులు) మాయందెట్లు పుట్టెదవు ?మత్స్యవరాహాద్యవతారములవలె ఇది కూడా ఒక అవతారమే. నీవిశేష చేష్టలనెవరు తెలియగలరు ?నీ పాదపద్మములకు వందనములాచరించుచు, నీ నామమును స్మరించుచు నిన్నే ధ్యానించుచుందును. నీ సంకల్పము ప్రకారము చేయుము. 49-54

సనక ఉవాచ:-

తయోక్తం వతనం శ్రుత్వా దేవదేవో జనార్దనః దత్త్వా భయం దేవమాతురిదం వచనమబ్రవీత్‌ . 55

సనకమహర్షి పలికెను:- దేవదేవుడగు జనార్దునుడు అదితి పలికిన మాటలను విని దేవమాతకు అభయమిచ్చి ఇట్లు పలికెను. 55

శ్రీ భగవానువాచ:-

సత్యముక్తం మహాభాగే! త్వయా నాస్త్యత్ర సంశయః, తథాపి శృణు వక్ష్యామి

గుహ్యాద్గుహ్యతరం శుభే! 56

రాగద్వేషవినాహీనా యే మద్భక్తా మత్పరాయణాః వహన్తి సతతం తే మాం గతాసూయా అదాంభికాః. 57

పరోపతాపవిముఖాః శివభక్తిపరాయణాః, మత్కథాశ్రవణాసక్తా వహన్తి సతతం హి మామ్‌. 58

పతివ్రతాః పతిప్రాణాః పతిభక్తిపరాయణాః వహన్తి సతంత దేవి! స్త్రియో7 పి త్యక్తమాత్సరాః. 59

మాతాపిత్రోశ్చ శుశ్రూషుర్గురుభక్తో7 తిథిప్రియః, హితకృద్బ్రాహ్మణానాం యఃస మాం వహతి సర్వదా. 60

పుణ్యతీర్థరతా నిత్యం సత్సంగనిరతాస్తథా, లోకనుగ్రహశీలాశ్చ సతతం తే వహన్తి మామ్‌. 61

పరోపకారనిరతాః పరద్రవ్యపరాఙ్ముఖాః, నవుంసకాః పరస్త్రీషు తే వహన్తి త మాం సదా. 62

తులస్యుపాసనిరతాః సదా నామపరాయణాః, గోరక్షణాపరా యే చ సతతం మాం వహన్తి తే. 63

ప్రతిగ్రహనివృత్తా యే పరాన్నవిముఖాస్తథా, అన్నోదకప్రదాతారో వహన్తి సతతం హి మామ్‌. 64

త్వం తు దేవి !పతిప్రాణా సాధ్వీ భూతహితే రతా, సంప్రాప్య పుత్రభావం తే సాధయుష్యే మనోరథమ్‌. 65

ఇత్యుక్త్వా దేవదేవేశో హ్యదితం దేవమాతరమ్‌, దత్వా కంఠగతాం మాలామభయం చ తిరోదధే. 66

సా తు సంహృష్టమనసా దేవసూర్దక్షనందినీ, ప్రణమ్య కమలాకాన్తం పునస్స్వస్థానమావ్రజత్‌. 67

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- '' మహానుభావులారా! నీవు నిజమునే చెప్పితివి. ఈ విషయమున సంశయమే లేదు. అయిననూ రహస్యములన్నింటి కంటె పరన రహస్యమును నేను చెప్పుచున్నాను. వినుము, రాగద్వేషములు లేనివారు. అసూయను పోగొట్టినవారు, డాంబికము లేని వారు, నా భక్తులు నాయందే మనసును నిలిపిన వారు, న్ను ధరించగలరు( మోయగలరు). ఇతరులను బాధించుటలో వైముఖ్యము కలవారు, శివభక్తి పరాయణులు, నా కథను వినుటలో ఆసక్తి కలవారు నన్ను మోయగలరు. పతివ్రతలు, పతియందు ప్రేమ గల వారు, పతిభక్తి పరాయణులు మాత్సర్యమును విడిచిన స్త్రీలు కూడా నన్ను మోయగలరు. తల్లిదండ్రులను సేవించువారు, గురుభక్తి కలవారు, అతిథియందు ప్రీతిని చూపువారు. బ్రహ్మణులకు హితమునుచేయువారు నన్ను మోయగలరు. పుణ్యతీర్థములను సేవించుటయందాసక్తి కలవారు. సత్సంగమునందు కోరిక గలవారు. లోకులను అనుగ్రహించు స్వబాలము కలవారు నన్ను మోయగలరు. ఇతరులకు ఉపకారము చేయువారు. ఇతరుల ద్రవ్యమును ఆశించనివారు. ఇతరుల స్త్రీల విషయమున నపుంసకుల వలె నుండు వారు నన్ను మోయగలరు. తులసిని ఉపాసించువారు, నామసంకీర్తనము చేయువారు, గోవులను రక్షించువారు నన్ను మోయగలరు. ఇతరుల నుండి దానమును గ్రహించనివారు. ఇతరుల అన్నమును భుజించనివారు, ఇతరులకు అన్నమును జలమును ఇచ్చువారు నన్ను మోయగలరు. ఓ దేవీ! నీవు భర్తయందు అనురాగము కలవాదనవు. సాధ్వివి. ప్రాణులహితమును కోరుదానవు. కావున నీకు పుత్రునిగా జన్మించి నీ కోరికను తీర్చగలను''. దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి దేవమాతయగు అదితికి తన మెడలో పుష్పమాలను , అభయమునిచ్చి అంతర్ధానమును చెందెను. దక్షప్రజాపతి పుత్రిక దేవమాతయగు అదితి సంతోషముతో నిండిన మనసుగలదై శ్రీమన్నారాయణునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళెను. 56-67

తతో7 దితిర్మహాభాగా సుప్రీతా లోకవందితా, అసూత సమయే పుత్రం సర్వలోకనమస్కృతమ్‌. 68

శంఖచక్రధరం శాన్తం చంద్రమండలమధ్యగమ్‌, సుధాకలశదధ్యన్నకరం వామనసంజ్ఞితమ్‌. 69

సహస్రాదిత్యసంకాశం వ్యాకోశకమలేక్షణమ్‌. సర్వాభరణసంయుక్తం పీతామ్బరధరం హరిమ్‌. 70

స్తుత్యం మునిగణౖర్యుక్తం సర్వలోకైకనాయకమ్‌, ఆవిర్భూతం హరిం జ్ఞాత్వా కశ్యపో హర్షవిహ్వలః, 71

ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా స్తోతుం సముపచక్రమే.

మహానుభావురాలు, సంతోషయక్తురాలు, లోకములచే నమస్కరించదగినది. అయిన అదితి కొంతకాలమునకు సరిఅయిన సమయమున అన్ని లోకములచే నమస్కరించబడు శ్రీమన్నారాయణుని పుత్రునిగా ప్రసవించెను. శంఖచక్రములను ధరించినవాడు, శాంతుడు, చంద్రమండల మధ్యమున గోచరించువాడు, అమృతకలశమును, పెరుగన్నమును, చేత ధరించువాడు, వామనుడను పేరుగలవాడు, వేయి సూర్యుల ప్రకాశము కలవాడు, వికసించిన కమలముల వలె విశాలములైన నేత్రములు కలవాడు, అన్ని ఆభరణముల కలవాడు, పచ్చని వస్త్రమును ధరించిన వాడు , స్తోత్రము చేయదగినవాడు, మునిగణములతో కూడియుండువాడు, అన్ని లోకములకు ఒకడే నాయకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించుట చూచిన కశ్యప మహర్షి ఆనందముతో తడబడుచు నమస్కరించి చేతులు జోడించి స్తోత్రము చేయుటకు ఉపక్రమించెను. 68-71

కశ్యప ఉవాచ:-

నమో నమస్తే 7ఖిలకారణాయ నో నమస్తే 7శిలపాలకాయ, 72

నమో నమస్తే 7మరనాయకాయ నమో నమో దైత్యవినాశకాయ.

నమో నమో భక్తజనప్రియాయా నమో నమస్సజ్జనరంజితాయ,

నమోనమో దుర్జననాశనాయ నమో7స్తు తసై#్మ జగదీశ్వరీయ. 73

నమో నమః కారణవామనాయ నారాయణాయామితవిక్రమాయ.

సశార్‌ఙ్గచక్రాసిగదాధరాయ నమో7స్తు తసై#్మ పురుషోత్తమాయ. 74

నమః పయోరాశినివాసనాయ నమో7స్తు సద్ధత్కమలస్థితాయ,

నమో7స్తు సూర్యాద్యమిత్రప్రభాయ నమో నమః పుణ్యకథాగతాయ. 75

నమోనమో7ర్కేన్దువిలోచనాయ నమో7స్తు తే యజ్ఞఫలప్రదాయ,

నమో7స్తు యజ్ఞాఙ్గవిరాజితాయా నమో7స్తు తే సజ్జనవల్లభాయ. 76

నమోజగత్కారణకారణాయ నమో7స్తు శబ్దాదివిర్జితాయ,

నమో7స్తు తే దివ్యసుఖప్రదాయ నమో నమో భక్తమనోగతాయ. 77

నమో7స్తు తే ధ్వాన్తవినాశకాయ నమో7స్తు తే మన్దరధారకాయ,

నమో7స్తు యజ్ఞవరాహనామ్నే నమో హిరణ్యాక్షవిదారకాయ. 78

నమో7స్తు తే వామనరూపభాజే నమో7స్తు తే క్షత్త్రకులాంతకాయ,

నమో7స్తు తే రావమమర్దనాయ నమో7స్తు తే నన్దసుతాగ్రజాయ. 79

నమస్తే కమలాకాన్త! నమస్తే సుఖదాయినే, స్మృతార్తినాశినే తుభ్యం భూయో భూయో నమః. 80

యజ్ఞేశ యజ్ఞవిన్యాస యజ్ఞవిఘ్నవినాశన, యజ్ఞరూప యజద్రూప యజ్ఞాంగం త్వాం యజామ్యహమ్‌. 81

ఇతి స్తుతప్స దేవేశో వామనో లోకపావనః ఉవాచ ప్రహన్హర్షం వర్థయన్కశ్యపస్య సః. 82

కశ్యపమహర్షి పలికెను:- సమస్తజగత్తునకు కారణభూతునకు నమస్కారము. సమస్త లోకములను రక్షించు వానికి నమస్కారము. దేవతల నాయకునికి నమస్కారము. దైత్యులను నశింపచేయువానికి నమస్కారము, భక్తజన ప్రియునికి సజ్జనరంజకునికి, దుర్జననాశకునికి, జగదీశ్వరునికి నమస్కారము. కారణార్ధము వామనుడైన వానికి, అమిత పరాక్రమము కలవానికి శార్థము చక్రము ఖడ్గము గదను ధరించిన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణునకు నమస్కారము. సముద్రమున నివసించువానికి, సజ్జనహృదయకమలముల యందు నివసించు వానికి, సూర్యాదితేజోరాసులను మించిన తేజస్సు కలవానికి, పుణ్యకథలలో నివసించువానికి నమస్కారము. సూర్యచంద్రులు నేత్రములుగా గలవానికి, యజ్ఞఫలము నిచ్చువానికి, యజ్ఞాంగములతో ప్రకాశించువానికి, సజ్జనప్రియునికి నమస్కారము. జగత్కారణములకు కారణమైన వానికి, శబ్దాదిగుణములు అంటని వానికి, దివ్యానందమును నిచ్చివానికి, భక్తుల మనసులో నుండు వానికి నమస్కారము. చీకటిని తొలగించువానికి, మందరపర్వతమును మోసిన వానికి, యజ్ఞవరాహమను పేరుగల వానికి, హిరణ్యాక్షుని చీల్చిన వానికి నమస్కారము. వామన రూపమున ధరించిన వానికి, క్షత్రియ కులాంతకునికి, రావణాసురుని మర్దించిన వానికి, నందసుతునికి నమస్కారము. కమలాకాంతునకు, ఆనందము నిచ్చువానికి, తలచిన వారి ఆర్తిని తొలగించువానికి, మాటి మాటికి నమస్కారము.యజ్ఞేశునకు, యజ్ఞవిన్యాసునకు, యజ్ఞవిఘ్ననాశునకు, యజ్ఞరూపునకు, పూజారూపునకు, యజ్ఞాంగునకు నమస్కారము. నిన్ను పూజింతును. లోకపావనుడైన వామనుడు ఇట్లు స్తుతించబడి చిరునవ్వుతో కశ్యపునికి ఆనందమున పెంచుచు ఇట్లు పలికెను. 72-82

శ్రీ భగవానువాచ:-

తాత! తుష్టో7స్మి భద్రం తే భవిష్యతి సురార్చిత !అచిరాత్సాధయిష్యామి నిఖిలం త్వన్మనోరథమ్‌. 83

అహం జన్మద్వయే త్వేవం యువయోః పుత్రతాంగతః, ఆస్మి న్జన్మన్యపి తథా సాధయామ్యుత్తమం సుఖమ్‌. 84

అత్రాంతరే బలిర్దైత్యో దీర్ఘసత్రం మహాసుఖమ్‌. ఆరేభే గురుణా యుక్తః కావ్యేన చ మునీశ్వరైః. 85

తస్మిన్మఖే సమాహుతో విష్ణుర్లక్ష్మీ సమన్వితః హివిస్స్వకరణార్థాయ ఋషిభిర్బ్రహ్మవాదిభిః. 86

ప్రవృద్ధైశ్వర్యదైత్యస్య వర్తమానే మహాక్రతౌ, ఆమన్త్య్ర మాతాపితరౌ స వటుర్వామనో య¸°. 87

స్మితేన మోహయన్‌ లోకం వామనో భక్తవత్సలః, హవిర్భోక్తుమివాయాతో బలేః ప్రత్యక్షతో హరిః. 88

దుర్వృత్తో వా సువృత్తో వా జడో వాయం హితో 7పి వా , యో భక్తియుక్తస్తస్యన్తః సదా సన్నిహితో హరిః. 89

ఆయాన్తం వామనం దృష్ట్వా ఋషయో జ్ఞానచక్షుషః జ్ఞాత్వా నారాయణం దేవముద్యయుః సభ్యసంయుతాః. 90

ఏతద్‌ జ్ఞాత్వా దైత్వా గురురే కాంతే బలిమబ్రవీత్‌, స్వసారమవిచార్యైవ ఖలాః కార్యాణి కుర్వతే. 91

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:-'' ఓ తండ్రీ! దేవతలచే పూజించబడువాడా! నీ విషమున సంతోషించితిని. నీకు శుభము కలుగును. త్వరలోనే నీ కోరికను సాదించగలను. నే నిదివరకు రెండు జన్మలలో మీకు పుత్రుడినైతిని. అట్లే ఈ జన్మలో

కూడా మీకు ఉత్తమానందమును ఆందించగలను''.

ఇంతలో బలిచక్రవర్తి గురవైన శుక్రాచార్యులతో, ఇతర మునీశ్వరులతో కలిసి దీర్ఘసత్రమను గొప్పయజ్ఞము నారంభించెను. ఆ యజ్ఞమున హివిస్సును స్వీకరించుటకు లక్ష్మీనారాయణుని ఋషులు ఆహ్వానించిరి. వృద్ధిచెందిన ఐశ్వర్యముకల బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞములో పాల్గొనుటకు తల్లిదండ్రుల ఆజ్ఞను పొంది బ్రహ్మచారి అయిన వామనుడు భక్తవత్సలుడు కావున చిరునవ్వుతో లోకమును మోహింప చేయుచు శ్రీహరి ప్రత్యక్షముగా హవిస్సును స్వీకరించుటకు వచ్చెనా అనునట్లు అచటికి వచ్చెను. చెడునడక గలవాడుకాని, మంచి నడక గలవాడుకాని, జడుడు కాని హితుడు కాని భక్తి కలవానిలో హరి వేంచేసి యుండును. జ్ఞాననేత్రము గల ఋషులు వచ్చుచున్న వామనుని చూచి శ్రీమన్నారాయణ దేవునిగా తెలిసి సభ్యులతే కలిసి లేచిరి. దైత్యగురవైన శుక్రాచార్యులు ఈ విషయమును తెలుసుకొని ఏకాన్తమున బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. మూర్ఖులు తన బలమును తెలియకనే కార్యములను చేతురు కదా. 83-91

శుక్ర ఉవాచ:-

భో !భో !దైత్యపతే !సౌమ్య! హ్యపహర్తా తవ శ్రియమ్‌, విష్ణుర్వామన రూపేణ హ్యదితేః పుత్రతాం గతః. 92

తవాధ్వరం స ఆయాతి త్వయా తస్యాసురేశ్వర! న కించిదపి దాతవ్యం మన్మతం శృణు పండిత! 93

ఆత్మబుద్ధిస్సుఖకరీ !గురుబుద్ధిర్విశేషతః, పరబుద్ధిర్వినాశాయ స్త్రీ బుద్ధిః ప్రలయంకరీ. 94

శత్రూణాం హితకృద్యస్తు స హన్తవ్యో విశేతః. 95

శుక్రాచార్యులు పలికెను:- ''ఓ దైత్యరాజా! సౌమ్యుడా! శ్రీమహావిష్ణువు వామనరూపముతో అదితి పుత్రుడై నీ సంపదను హరించబోవుచున్నాడు. ఇపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నడు. కావున నీవు అతనికి ఏ కొద్దిదైనను ఈయకుము. ఓ పండితుడా! నా అభిప్రాయమును వినుము. తన బుద్ధిసుఖము నిచ్చును. గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును. పరబుద్ధి వినాశనము కలిగించును. స్త్రీబుద్ధి ప్రళయమునే కలిగించును, శత్రువులకు హితమును చేయువానిని చంపియే తీరవలయును. '' 92-95

బలిరువాచ:-

ఏవం గురో న వక్తవ్యం ధర్మమార్గలోరోధతః, యదాదత్తే స్వయం విష్ణుః కిమస్మాదధికం పరమ్‌. 96

కుర్వన్తి విదుషో యజ్ఞాన్విష్ణుప్రీణనకారణాత్‌ , స చేత్సాక్షాద్థవిర్భోగీ మత్తః కో 7భ్యధికో భువి. 97

దరిద్రేణాపి యత్కించి ద్దీయతే విష్ణవే గురో !తదేవ పరమం దానం దత్తం భవతి చాక్షయమ్‌. 98

స్మృతో7పి పరయా భక్తా 7పునాతి పురుషోత్తమః యేన కేనాప్యర్చితశ్చేద్దాదాతి పరమాం గతిమ్‌. 99

హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః, అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. 100

జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయమ్‌. స విష్ణులోకమాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌. 101

గోవిందేతి సదా ధ్యాయేద్యస్తు రాగాదివర్జితః, స యాతి విష్ణు భవనమితి ప్రాహుర్మనీషిణః. 102

అగ్నౌ వా బ్రాహ్మణ వాపి హుయాతే యద్ధవిర్గురో, హరిభక్త్యా మహాభాగ తేన విష్ణుః ప్రసీదత. 103

అహం తు హరితుష్ట్యర్థం కరోమ్యధ్వరముత్తమమ్‌, స్వయమాయాతి చేద్విష్ణుః కృతార్థో7 స్మి న సంశయః. 104

ఏవం వదతి దైత్యేన్ద్రే విష్ణుర్వామనరూపధృక్‌, ప్రవివేశాధ్వరస్థానం హుతవహ్నిమనోరమమ్‌. 105

తం దృష్ట్వా కోటిసూర్యాభం యోగ్యావయసుందరమ్‌, వామనం సహసోత్థాయ ప్రత్యగృహ్ణత్కృతాంజలిః. 106

దత్త్వాసనం చ ప్రక్షాల్య పాదౌ వామనరూపిణమ్‌, సకుటుంబో వహన్మూర్ధ్నా పరమాం ముదమాప్తవాన్‌. 107

విష్ణవే7 సై#్మ జగద్ధామ్నే దత్త్వార్ఘ్యం విధివద్బలిః, లోమాంచితతనుర్భూత్వా హర్షాశ్రునయనో 7బ్రవీత్‌. 108

బలిచక్రవర్తి పలికెను:- ''ఓ గురువర్యా! ఇట్లు ధర్మమార్గవిరోధముగా చెప్పవద్దు. స్వయముగా శ్రీమహావిష్ణువే స్వీకరించినచో ఇంతకన్నా ఎక్కువ కావలసినదేమున్నది.

శ్రీమహావిష్ణువునకు ప్రీతి కలిగించుటకే విద్వాంసులు యజ్ఞమును చేసెదరు. ఆ శ్రీ మహావిష్ణువే స్వయముగా హవిస్సును స్వీకరించినచో ఈ భూమండలమున నన్ను మించినవాడెవడుండును? దరిద్రుడైనను శ్రీమహావిష్ణువునకు ఏ కొంచెమర్పించిననూ అదియే ఉత్తమమైన, అక్షయమైన దానమనబడును. పురుషోత్తముని పరమభక్తిచే స్మరించిననూ ఏదో విధముగా ఆర్చించినను ఉత్తన గతిని ప్రసాదించును. దుష్టచిత్తులు స్మరించినను శ్రీహరి పాపములను హరింపచేయును. అనుకోకుండా తాకిననూ అగ్ని కాల్చును కదా! శ్రీహరి నామము నాలుక చివర నుంచుకొనినవాడు మళ్ళీ తిరిగి రాని విష్ణులోకమును పొందగలడు. రాగద్వేషాదులను వదలి ఎప్పుడూ గోవిందనామస్మరమము చేసిన వారు విష్ణుభవనమును చేరునని పండితులు చెప్పెదరు. శ్రీహరియందు భక్తిచే అగ్నియందు కాని, బ్రాహ్మణునియందు కాని హవిస్సును అర్పించినచో శ్రీహరి ప్రసన్నుడగును. నేను శ్రీహరి సంతోషము కొఱకే ఉత్తమ యాగమును చేయుచున్నాను. ఈ యాగమునకు స్వయమయుగా శ్రీమహావిష్ణువే వచ్చినచో కృతార్థుడనగుదును. సంశయములేదు''. ఇట్లు బలిచక్రవర్తి చెప్పుచుండగా వామన రూపమును ధరించిన శ్రీమహావిష్ణువు హవిస్సులచే జ్వలించుచున్న అగ్నిచే సుందరమైన యాగస్థానమునకు వచ్చెను. కోటిసూర్యుల కాంతి గల వాడు తగిన విధముగా అవయముల పొందికతో అందముగా నున్న వామనుని చూచి తొందరలో లేచి చేతులు జోడించి స్వాగతము పలికెను. అసనము నర్పించి వామనరూపముతో నున్న శ్రీమహావిష్ణువునకు పాదప్రక్షాళనము చేసి కుటుంబముతోపాటు పాదోదమకమును శిరస్సును ధరించి పరమానందమును చెందెను. బలిచక్రవర్తి జగన్నివాసుడగు శ్రీమహావిష్ణువునకు యథావిధిగా అర్ఘ్యమునిచ్చి శరీరమున పులకలు, కన్నుల ఆనందబాష్పములు రగా ఇట్లు పలికెను. 96-108

బలిరువాచ:-

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలో మఖః, జీవితం సఫలం మే7 ద్య కృతార్థో7 స్మి న సంశయః. 109

అమోఘామృతవృష్టిర్మే సమాయాతాతిదుర్లభా, త్వదాగమనమాత్రేణ హ్యనాయాసో మహోత్సవః. 110

ఏతే చ ఋషయస్సర్వే కృతార్థా నాత్రసంశయః, యై పూర్వం చ తపస్తప్తం తదద్య సఫలం ప్రభో . 111

కృతార్థో 7స్మి కృతార్థో7 స్మి కృతార్థో7 స్మి న సంశయః , నమస్తుభ్యం నమస్తుభ్యం

నమస్తుభ్యం నమో నమః. 112

త్వదాజ్ఞయా త్వన్నియోగం సాధయామీతి మన్మనః, అత్యుత్సాహసమాయుక్తం సమాజ్ఞపయ మాం ప్రభో! 113

ఏవముక్తో దీక్షితేనే ప్రహసన్వామనో 7బ్రవీత్‌, దేహి మే తపసి స్థాతుం త్రిపదసంమితామ్‌. 114

ఏతచ్ఛ్రుత్వా బలిః ప్రాహ రాజ్యం యాచితవాన్నహి, గ్రామం వా నగరం చాపి ధనం వా కిం కృతం త్వయా. 115

తన్నిశమ్య బలిం ప్రాహ విష్ణుస్సర్వశరీరభృత్‌ , ఆసన్నభ్రష్టరాజ్యస్య వైరాగ్యం జనయన్నివ. 116

బలిచక్రవర్తి పలికెను:- ''ఈ వేళ నా జన్మ సఫలమైనది. ఈ వేళ నా యజ్ఞము సఫలమైనది. నాజీవితము ధన్యమైనది. నేను కృతార్థుడనైతిని. సంశయములేదు. ఎంత శ్రమించిననూ లబించని సఫలమైన అమృతవర్షము నాకు లభించినది. నీ రాకచే శ్రమలేకనే గొప్ప పండుగ వచ్చినది. ఈ ఋషులందరూ కృతార్థులైరి. సంశయములేదు. వీరు మొదట చేసిన తపస్సు ఈ వేళ సఫలమైనది. నేను ముమ్మాటికీ కృతార్థుడనైతిని. నీకు ముమ్మారు వందనములు. నీఆజ్ఞచే నీ పనిని చేయవలయునని నా సంకల్పము. మిక్కిలి ఉత్సాహముతో నున్న నన్ను ఆజ్ఞాపించుము.'' ఇట్లు బలిచక్రవర్తు పలుకగా వామనుడు నవ్వుచు పలికెను. తపస్సు చేసుకొనుటకు నాకు మూడడుగుల భూమి నిమ్ము. ఈ మాటలను వినిన బలి ''రాజ్యమునో, నగరమునో, గ్రామమునో కోరక, చివరకు ధనమునైన కోరిక ఇది యేమి ఇట్లు అడిగితిరి''. అని పలికెను. ఆ మాటలను వినిన వామనుడు రాజ్యభ్రష్టుడు కానున్న వానికి వైరాగ్యమును కలిగించునట్లు ఇట్లు పలికెను. 109-116

శ్రీ భగవానువాచ:-

శృణు దైత్యేన్ద్ర వక్ష్మామి గుహ్యాద్గుహ్యతరం పరమ్‌, సర్వసంగవిహీనానాం కిమర్థైః సాధ్యతే వద. 117

అహం తు సర్వభూతానామన్తర్యామీతి భావయ మయి, సర్వమిదం దైత్య కిమన్యైః సాద్యతే వద! 118

రాగద్వేషవిహీనానాం శాంతానాం త్యక్తమాయినామ్‌, నిత్యానందస్వరూపాణాం కిమన్యై స్సాధ్యతే ధనైః. 119

ఆత్మవత్సర్వభూతాని పశ్యతాం శాంతచేతసామ్‌, అబిన్నమాత్మనస్సర్వం కో దాతా దీయతే చ కిమ్‌. 120

పృథ్వీయం క్షత్రియవశా ఇతి శాస్త్రేషు నిశ్చితమ్‌, తదాజ్ఞాయాం స్థితాస్సర్వే లభ##న్తే పరమం సుఖమ్‌. 121

దాతవో మునిభిశ్చాపి షంష్ఠాశో భూభుజే బలే! మహీయం బ్రహ్మణానాం తు దాతవ్యా సర్వయత్నతః. 122

భూమిదానస్య మాహాత్మ్యం న భూతం న భవిష్యతి, పరం నిర్వాణమాప్నోతి భూమిదో నాత్ర సంశయః. 123

స్వల్పామపి మహీం దత్వా శ్రోత్రియాయాహితాగ్నయే, బ్రహ్మలోకమవాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌. 124

భూమిదస్సర్వదః ప్రోక్తో భూమిదో మోక్షభాగ్భవేత్‌, అతిదానం తు తద్‌జ్ఞేయం సర్వపాపప్రణాశనమ్‌. 125

మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః దశహస్తాం మహీం దత్వా సర్వపాపైః ప్రముచ్యతే. 126

సత్పాత్రే భూమిదాతా యః సర్వదానఫలం లభేత్‌, భూమిదానసమం నాన్యత్‌ త్రిషు లోకేషు విద్యతే. 127

ద్విజాయ వృత్తి హీనాయ యః ప్రదద్యాన్మ హీం బలే, తస్య పుణ్యఫలం వక్తుం న క్షమో7బ్దశ##తైరహమ్‌. 128

సక్తాయ దేవపూజాసు వృత్తి హీనాయ దైత్యప, స్వల్పామపి మహీం దద్యాద్యస్స విష్ణుర్న సంశయః. 129

ఇక్షుగోధూమతువరీ పూగవృక్షాదిసంయుతా, పృథ్వీ ప్రదీయతే యేన స విష్ణుర్నత్ర సంశయః. 130

వృత్తిహీనాయ విప్రాయ దరిద్రాయ కుటుంబినే, స్వల్పామపి మహీం దత్వా విష్ణుసాయుజ్యమాప్నుయాత్‌. 131

సక్తాయ దేవపూజాసు విప్రాయాఢకికాం మహీమ్‌, దత్వా లబేత్‌ గంగాయాం త్రిరాత్రస్నానజం ఫలమ్‌. 132

విప్రాయ వృత్తిహీనాయ సదాచారరతాయ చ, ద్రోణికాం పృథివీం దత్వా యత్ఫలం లభేత్‌ శృణు. 133

గంగాతీర్థాశ్వమేధానాం శతాని విదివన్నరః, కృత్వా యత్ఫలమాప్నోతి తదాప్నోతి స పుష్కలమ్‌. 134

దదాతి ఖారికాం భూమిం దరిద్రాయ ద్విజాయ యః, తస్య పుణ్యం ప్రవక్ష్యామి వదతో మే నిశామయ. 135

అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ, విధాయ జాహ్నవీ తీరే యత్ఫలం తల్లభేద్ధ్రువమ్‌. 136

భూమిదానం మహాదానమతి దానం ప్రకీర్తితమ్‌, సర్వపాపప్రశమనమపవర్గఫరప్రదమ్‌. 137

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- ''అన్ని రహస్యములలో పరమ రహస్యమును చెప్పెదను. ఓ దైత్యరాజా !వినుము. ఏ సంగము లేనివారికి అర్ధములతో ఏమి ప్రయోజనమో చెప్పుము. నేను అన్ని ప్రాణులలో అన్తర్యామిగా ఉందునని భావించుము. అట్లే ఈ జగత్తంతయూ నాలోనే ఉన్నది. కావున ఇతరులతో నేను సాధింతవలసినదేమున్నదో చెప్పుము. రాగద్వేషములు లేక శాంతులై కపటమును వదిలి నిత్యానంద స్వరూపులుగా నున్నవారు ఇతర ధనములతో నేమి సాదించగలరు? తన వలె అన్ని ప్రాణులు అని చూచువారికి ఇందియంతయు ఆత్మకంటే భిన్నము కానిదే అయినపుడు ఇచ్చువాడెవడు? ఇచ్చునదేమి? ఈ భూమి క్షత్రియాధీనములో నుండును అని శాస్త్రనిర్ణయము. రాజాజ్ఞలో నుండువారికి పరమానందము లభించును. ఓ బలిచక్రవర్తీ! మునులు కూడా తమ తపస్సులో ఆరవభాగమును రాజునకీయవలయును. అన్నివిధములుగా ప్రయత్నించి ఈ భూమిని బ్రాహ్మణునికి దానమును చేయవలయును. బీదానము యొక్క మాహాత్య్మము ఇంకొకదానికి లేదు. ఉండబోదు. భూదానమును చేయువలారు. పరమానందమును పొందుదురు. ఈ విషయమున సంశయములేదు. నిత్యాగ్నిహోత్రుడు, శ్రోత్రియుడు అయిన బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ పునరావృత్తి రహితమైన బ్రహ్మలోకమునకు వెళ్ళును. బూమిదానమును చేసినవాడు అన్ని దానములు చేసినవాడగును. భూదానము చేసినవారు మోక్షమును పొందెదరు. భూదానము సర్వశ్రేష్ఠమైన దానము. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మహాపాతకములతో కూడియున్ననూ అన్ని పాతకములున్ననూ పదిమూరలు భూమిని దానము చేసిన వారు అన్ని పాపములనుండి విముక్తుడగును. యోగ్యునికి భూదానము చేయువాడు అన్ని దానములు చేసిన ఫలితమును పొందును. భూదానముతో సమానమైనది మరియొకటి ఈ మూడు లోకములలో లేదు. బ్రతుకు తెరువు లేని బ్రాహ్మణునకి భూమిని దానము చేసినవానికి కలుగు పుణ్యఫలమును నేను కూడా నూరు సంవత్సరములలో కూడ చెప్పజాలను. దేవపూజలయందాసక్తుడై బ్రతుకుతెరువులేని బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ వాడు విష్ణువే. ఇచట సంశయములేదు. చెఱుకు, గోధుమ, కంది, పోకచెట్టు గల భూమిని దానము చేసినవాడు విష్ణువే సంశయములేదు. బ్రతుకు తెరువు లేనివాడు, దరిద్రుడు, కుటుంబము కలవాడు అయిన బ్రహ్మణునికి కొంచెము భూమిని దానము చేసిననూ విష్ణుసాయుజ్యమును పొందును. దేవపూజలయందు ఆసక్తుడైయున్న బ్రాహ్మణునకు

ఒక అడ్డ ధాన్యము (నాలగు కిలోలు) విత్తుటకు యోగ్యమైన భూమిని దానమును చేసినవాడు మూడు రోజుల గంగా స్నానమును చేసిన ఫలమును పొందును. బ్రతుకుతెరువు లేనివాడు సదాచాల పరాయణుడు అయిన బ్రాహ్మణునకు నాలుగు బస్తాల ధాన్యమును విత్తుటకు తగిన భూమిని దానము చేసిన వానికి నూరు అశ్వమేధ యాగముల ఫలమును నూరు గంగా స్నానముల ఫలము లభించును. దరిద్రుడైన బ్రాహ్మణునకు పుట్టెడు ధాన్యమును (8 బస్తాలు) విత్తుటకు తగిన భూమిని దానము చేసినవానికి , వేయి అశ్వమేధములను నూరు వాజపేయములను గంగాతీరమున చేసిన ఫలము లభించును. అన్ని దానములలో గొప్ప దానము సాటిలేని దానము భూదానమని చెప్పబడినది. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మోక్షమును ప్రసాదించును. 117-137

అత్రేతిహాసం వక్ష్యామి శృణు దైత్యకులేశ్వర, యచ్ఛ్రాత్వా శ్రద్ధయా యుక్తో భూమిదానఫలం లభేత్‌ . 138

ఆసీత్పురా ద్విజవరో బ్రాహ్మకల్పే మహామతిః, దరిద్రో వృత్తిహీనస్చ నామ్నా భద్రమతిర్బలే. 139

శ్రుతాని సర్వశాస్త్రాణి తేన వేదవిదా బలే, శ్రుతాని చ పురాణాని ధర్మశాస్త్రాణి సర్వశః. 140

అభవంస్తస్య ట్పత్న్యః శ్రుతిస్సింధుర్యశోవతీ, కామినీ మాలినీ చైవ శోబా3చేతి ప్రకీర్తితాః. 141

ఆసు పత్నిసు తస్యాసఞ్ఛత్వారింశచ్ఛతద్యయమ్‌, పుత్రాణామసురశ్రేష్ఠ సర్వే నిత్యం బుభుక్షితాః. 142

అకించనో భద్రమతిః క్షుధార్తానాత్మజాన్ప్రియాః పశ్యన్స్వయం క్షుధార్తశ్చ విలలాపాకులేన్ద్రియః. 143

ధిగ్జన్మ భాగ్యరహితం ధిగ్జన్మ ధనవర్జితమ్‌, ధిగ్జన్మ ధర్మరహితం ధిగ్జన్మ ఖ్యాతివర్జితమ్‌. 144

నరస్య బహ్వపత్యస్య ధిగ్జన్మైస్వర్యవర్జితమ్‌, అహో గుణాస్సౌమ్యతా చ విద్వతా జన్మ సత్కులే. 145

దారిద్య్రామ్బుధిమగ్నస్య సర్వమేతన్న శోభ##తే, ప్రియాః పుత్రాశ్చ పౌత్రాశ్చ బాంధవా భ్రాతరస్తథా. 146

శిష్యాశ్చ సర్వమనుజాస్త్యజన్త్యైశ్వర్యవర్జితమ్‌. చాండలో వా ద్విజోవాపి భాగ్యవానేన పూజ్యతే. 147

దరిద్రః పురుషో లోకే శవవల్లోకనిన్దితః, అహో సంపత్సమాయుక్తో నిష్ఠురో వాప్యనిష్ఠురః. 148

గుణహీనో7 పి గుణవాన్‌ మూర్ఖో వాప్యధ పండితః, ఐశ్వర్యగుణయుక్తశ్చేత్పూజ్య ఏవ న సశయః. 149

ఆహో దరిద్రతా దుఃఖం తత్రావ్యాశాతిదుఃఖితా, ఆశాభిభూతాః పురుషాః కుఃఖమశ్నువతే 7క్షయమ్‌.150

ఆశాయా దాసా యే దాసాప్తే సర్వలోకస్య, ఆశా దాసీ యేషాం తే,%ాం దాసాయతే లోకః. 151

మానో హి మాహతాం లోకే ధనమక్షయముచ్యతే , తస్మిన్నాశాక్యరిపుణా మానే నష్టే దిరద్రతా. 152

సర్వశాస్త్రార్థవేత్తాపి దరిద్రో భాతి మూర్ఖవత్‌, నైష్కించన్యమహాగ్రాహగ్రస్తానాం కో విమోచకః. 153

అహో దుఃఖమహోదుఃఖం అహో దుఃఖం దరిద్రతా, తత్రాపి పుత్రభార్యాణాం బాహుల్యమతి దుఃకదమ్‌. 154

ఏవముక్త్వా భద్రమతిస్సర్వశాస్త్రర్ధపారగః అన్యమైశ్వర్యదం ధర్మం మనసా చిన్తయత్తదా. 155

ఓ దైత్యరాజా !ఈ విషయమున ఒక ఇతిహాసమును చెప్పెదను. వినుము. ఈ ఇతిహాసమును శ్రద్ధగా వినిన వానికి భూదానఫలము లభించును. పూర్వకారమున బ్రాహ్మకల్పమున మహామతి, దరిద్రుడు, వృత్తిహీనుడగు బ్రాహ్మణుడు, భద్రమతి అని పేరుగల వాడుండెను. ఇతను అన్ని శాస్త్రములను, అన్ని వేదములను అన్నిపురాణములను, ధర్మశాస్త్రములను ఆభ్యసించెను. భద్రమతి ఆరుగురు భార్యలుండిరి. శ్రుతి , సింధు, యశోవతి, కామినీ, శోభా అని పేర్లు. ఈ భార్యలయందు ఇతనికి రెండు వందల నలభైమంది పుత్రులు కలిగిరి. ఈ పుత్రులు భార్యలు చివరికి తాను కూడా ఆకలిచే పీడించబడుచు ఆకులమైన మనస్సుతో విలపించెను. భాగ్యరహితమైన జన్మ, ధనములేని జన్మ వ్యర్థము. సౌమ్యత, వైదుష్యము, సత్కుల జన్మ మొదలగు సద్గుణముల దారిద్య్రసాగరములో మునిగిన వారికి శోభించవు. ఐశ్వర్యము లేనివానిని ప్రియులు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు, సోదరులు, శిష్యులు అందరూ విడచెదరు. చండాలుడైనను, బ్రాహ్మణుడైనను భాగ్యవంతుడే పూజింపబడును. దరిద్రుడైన పురుషుడు శవము వలె శోకముచే నిందించబడును. ,సంపద కలవాడు కఠినుడైనను మృదుస్వభావము కలవాడే. గుణహీనుడైననూ గుణవంతుడే యమూర్ఖుడైననూ పండితుడే . ఐశ్వర్యగుణములతో కూడినవాడు పూజింపదగినవాడే . సంశయము లేదు. దారిద్య్రము దుఃఖప్రదము.అందులో ఆశ పరమదుఃఖప్రదము. ఆశతో కూడినవారు అంతులేని దుఃఖమును పొందెదరు. ఆశకు దాసులైనవారు లోకమంతటికి దాసులగుదురు. ఆశను దాసిగా చేసుకొన్నవారికి లేకమే దాస్యము చేయను, మహాత్ములకు అభిమానమే తిరుగలేని ధనము. ఆశ##చే అభిమానము నశించినచో దారిద్య్రము ప్రాప్తించును. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడైనను దరిద్రుడైనచో మూర్ఖుని వలె అనిపించును. దారిద్య్రమను గొప్ప మొసలి పట్టినవానికి మోక్షము లేదు. దరిద్రత చాలా దుఃఖమును కలిగించును. ఆ దారిద్య్రములో బహుపుత్రత, బహుభార్యాత్వము మరీ దుఃఖప్రదము. ఇట్లు సర్వశాస్త్రములు తెలిసిన భద్రమతి విలపించి ఐశ్వర్యము నిచ్చు మరియొక ధర్మమును గూర్చి ఆలోచించచచెను. 138-155

భూమి దానం వినిశ్చిత్వం సర్వదానోత్తమోత్తమమ్‌, దానేన యో 7నుమంతేతి స ఏవ కృతవాన్పురా. 156

ప్రాపకం పరమం ధర్మం సర్వకామఫలప్రదమ్‌, దానానాముత్తమం దానం భూదానం పరికీర్తితమ్‌. 157

యద్దత్వా సమవాప్నోతి యద్యదిష్టతమం నరః, ఇతి నిశ్చిత్య మతిమాన్ధీరో భద్రమతిర్భలే .158

కౌశామ్బీం నామ నగరీం కలత్రాపత్యయుగ్య¸°, సుఘోషనామ విప్రేన్ద్రం సర్వైశ్వర్యసమన్వితమ్‌. 159

గత్వా యాచితవాన్భూమిం పంచహస్తాయతాం బలే! సఘోషా ధర్మనిరతస్తం నిరీక్ష్య కుటుంబినమ్‌. 160

మనసా ప్రీయమాణన సమభ్యర్బ్యేదమబ్రవీత్‌, కృతార్థో7 ర్థో7 హం భద్రమతే సఫలం మమ జన్మ చ. 161

మత్కులం పావనం జాతం త్వదనుగ్రహతో ద్విజ, ఇత్యుక్త్వా తం సమభ్యర్చ్య సఘోషో ధర్మతత్పరః. 162

పంచహస్తమితాం భూమిం దదౌ తసై#్మ మహామతిః. పృథవీ వైష్ణవీ పుణ్యా పృథివీ విష్ణుపాలితా. 163

పృధివ్యాస్తు ప్రదానేన ప్రీయతాం మే జనార్దనః , మంత్రేణానేన దైత్యేన్ద్ర సుఘోషస్తం ద్విజోత్తమమ్‌. 164

విష్ణుబుద్ధ్యా సమభ్యర్బ్య తాపతీం పృథివీం దదౌ, సో 7పి భద్రమతిర్విప్రో ధీమతా యాచితాం భువమ్‌. 165

దత్తవానహరిభక్తాయ శ్రోత్రియాయ కుటుంబినే, సుఘోషో భూమిదానేన కోటివంశసమన్వితః. 166

ప్రపేదే విష్ణుభవనం యత్ర గత్వా న శోచతి , బలే భద్రమతిశ్చాపి యతః ప్రార్థితవాన్‌ శ్రియమ్‌. 167

స్థితవాన్విష్ణుభవనే సకుంటుంబో యుగాయుతమ్‌. తధైవ బ్రహ్మసదనే స్థిత్వా కోటియుగాయుతమ్‌. 168

ఐన్ద్రం పదం సమాసాద్య స్థితవాన్కల్పపంచకమ్‌. తతో భువం సమాసాద్య సర్వైశ్వర్యసమన్వతః. 169

జాతిస్మరో మహాభాగే బుభ##జే భోగముత్తమమ్‌, తతో భద్రమతిర్దైత్య నిష్కా మో విష్ణుత్పరః. 170

పృథివీం వృత్తిహీనేభ్యో బ్రాహ్మణభ్యః ప్రదత్తవాన్‌, తస్య విష్ణుః ప్రసన్నాత్మా దత్తైశ్వర్యమనుత్తమమ్‌. 171

కోటివంశసమేతస్య దదౌ మోమనుత్తమమ్‌, తస్మాద్దైత్యపతే మహ్యం సర్వధరమపరాయణ. 172

తపశ్చరిష్యే మోక్షాయ దేహి మే త్రిపదాం మహీమ్‌, వైరోచనిస్తతో హృష్టః కలశం జలపూరితమ్‌. 173

అదదే పృథీలీం దాతుం వర్ణినే వామనాయ వై.

అన్ని దానములలో ఉత్తమ దానము భూదనమని నిశ్చయించి, దానము నిచ్చువాడెవడో అతడే వరిష్ఠుడు అని, పరమ ధర్మమను పొందించునది అన్ని కోరికలను నెరవేర్చునది దానములలో ఉత్తమదానము భూదానమని ప్రశంసించబడినది. భూదానము చేసి కావలసిన దానినంతటిని పొందవచ్చను అని నిశ్చయించి బుద్ధిమంతుడు ధైర్యము గలవాడయిన భద్రమతి భార్యాపుత్రులతో కౌశాంబియను నగరమునకు వెళ్ళెను. సుఘోషుడను పేరుగల ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంటికి వేళ్ళి అయిదు మూరల భూమిని యాచించెను. సుఘోషుడు ధర్మము యందాసక్తి కలవాడు కావున కుటుంబి అయిన భద్రమతి ని చూచి ప్రీతి గల మనసుతో చక్కగా పూజించి ఇట్లు పలికెను. ''ఓ భద్రమతి! నేను కృతార్థుడనైతిని. నా జన్మ సఫలమైనది. నీయనుగ్రహముతో నా కులము పావనమైనది ''. అని పలికి భద్రమతి బాగుగా పూజించి ధర్మతత్పరుడైన సుఘోషుడు అతనికి అయిదు మూరల భూమిని దానము చేసెను. విష్ణువునకు సంబంధించిన పృథివి, విష్ణువుచే పాలించబడు పృథివి. అట్టి పృథ్విని దానము చేయుటచే నాకు జనార్దనుడు ప్రసన్నడగు గాక అను మంత్రముచే సఘోషుడు ఆ బ్రాహ్మణోత్తముని విష్ణుభావనచే పూజించి అతనడిగినంత భూమిని దానము చేసెను. అట్లు భూదానమును స్వీకరించిన భద్రమతి హరిభక్తుడు శ్రోత్రియుడు కుటుంభిజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు యాచించగా దానము చేసెను. ఇట్లు భూదానము చేసిన సుఘోషుడు కోటి వంశములతో కూడిన వాడై వెళ్ళిన తరులాత దుఃఖించని విష్ణుభవనమును చేరెను. సుఘోషుని నుండి భూమిని స్వీకరించిన భద్రమతి కూడా కుటుంబముతో పదివేల యుగములు విష్ణుభవనమున నివసించి, కోటియుగములు బ్రహ్మభవనమున నివసించి, అయిదు కల్పములు ఇంద్రపదవిని అధిష్ఠించి తరువాత భూలోకమున చేరి అన్ని ఐశ్వర్యములతో మహానుభావుడై ఉత్తమభోగములను అనుభవించెను. అయినను. భద్రమతి కామ రహితుడై విష్ణువునందు భక్తిగలవాడై బ్రతుకుతెరువు లేని బ్రాహ్మణులకు భూమిని దానము చేసెను. భద్రమతి శ్రీమహావిష్ణువు ప్రనన్నుడై సాటిలేని తత్త్వసంపదను ప్రసాదించి కోటి వంశములతో కూడిన వానికి సాటిలేని మోక్షము నిచ్చెను. కావున సర్వధర్మ పరాయణుడవైన ఓ దైత్యపతీ !మోక్షము తపస్సు చేయుటకు మూడడుగుల భూమినిమ్ము. అపుడు బలి చక్రవర్తి సంతోషించినవాడై జలపూర్ణమైన కలశమును తీసుకొని బ్రహ్మచారియైన వామననకు భూదానమును చేయుటకు సిద్ధపడెను. 156-173

విష్ణుః సర్వగతో జ్ఞాత్వా జలధారావరోధినమ్‌, 174

కావ్యం హస్తస్థదర్భాగ్రం తచ్ఛిరే సంన్యవేశయత్‌, దర్భాగ్రే 7భూన్మహాశస్త్రం కోటి సూర్యసమప్రభమ్‌. 175

అమోఘం బ్రాహ్మమత్యుగ్రం కావ్యాక్షిగ్రాసలోలుపమ్‌, శశాప భార్గవః శూరానసురానేవ చక్షుషా. 176

సశ్యేతి వ్యాదిదేశ చ దర్భాగ్రం శస్త్రసన్నిభమ్‌, బలిర్దదౌ మహావిష్ణోర్మ హీం త్రిపదసంమితామ్‌. 177

వవృధే సో7 పి విశ్వాత్మా ఆబ్రహ్మభువనం తదా, అమిమీత మహీం ద్వాభ్యాం పద్భ్యాం విశ్వతనుర్హరిః. 178

స ఆబ్రహ్మకటాహాంతపదాన్యేతాని స ప్రభుః, పాదాంగుష్ఠాగ్రనిర్భిన్నం బ్రహ్మాండం బిభిధే ద్విధా. 179

తద్వారా బాహ్యసలిలం బహుధారం సమాగతమ్‌, ధౌతవిష్ణుపదం తోయం నిర్మలం లోకపావనమ్‌. 180

అజాండబాహ్యనిలయం ధారారూపమవర్తత, తజ్జలం పావనం శ్రేష్ఠం బ్రహ్మాదీన్పావయత్సురాన్‌. 181

సప్తర్షిసేవితం చైవ న్యపతన్మేరుమూర్ధని, 182

ఏతద్దృష్ట్వా ద్భుతం కర్మ బ్రహ్మాద్యా దేవతాగణాః, ఋషయో మునయశ్చైవ హ్యస్తువన్‌ హర్ష విహ్వలాః. 183

అపుడు అంతటా వ్యాపించియున్న శ్రీమహావిష్ణువు జలధారనడ్డుచున్న శుక్రాచార్యుని తెలిసికొని తన చేతిలో నున్న ధర్భాగ్రమున బ్రహ్మాస్త్రమును అనుసంధించెను. అపుడు ధర్భాగ్రమున కోటి సూర్యకాంతి గల అమోఘమైన అత్యుగ్రమైన బ్రహ్మస్త్రము శుక్రాచార్యుల కన్నును మ్రింగవలయునని అసక్తి కలదాయెను. ఒంటి కన్నుగల శుక్రాచార్యుడు శూరులైన ఆ అసురులను శపించెను. 'చూడుము' అని శస్త్రమువంటి ఆ దర్భాగ్రమును చూపెను. తరువాత బలి చక్రవర్తి శ్రీమహావిష్ణువునకు మూడడుగుల భూమిని ధారవోసెను. విశ్వాత్మకుడైన శ్రీమహావిష్ణువు బ్రహ్మలోకము వరకు పెరిగెను. విశ్వశరీరుడైన శ్రీహరి ఈ భూమిని రెండు అడుగులతో కొలిచెను. చివర వరకు శ్రీహరి పాదము కాంతివంతమై సాగగా కాలి బొటనవ్రేలు గోరు చివరతో బ్రహ్మాండము రెండుగా చీలిపోయెను. ఆ బ్రహ్మాడమునుండి జలము బహుధారలుగా బయటకు వచ్చెను. అట్లు వచ్చి విష్ణుపాదమును కడిగి నిర్మలము లోకములను పావనము చేయ దాయెను. బ్రహ్మాండము వెలుపలనున్న జలము ధారారూపముగా నుండెను. అట్లు పావనమైన ఆ జలము బ్రహ్మాదిదేవతలను పావనము చేసెను. సప్తర్షులతో సేవించబడి మేరుపర్వత శిఖరముపై పడెను. ఇట్లు అత్యాశ్చర్యకరమైన ఈ కార్యమును చూచిన బ్రహ్మాదిదేవతలు, ఋషులు, మనువులు ఆనందముతో పరవశులై స్తోత్రమును చేసిరి. 174-183

దేవా ఊచు:-

నమః పరేశాయ పరాస్తరూపిణ పరాత్పరాయాపరరూరధారిణ,

బ్రహ్మత్మనే బ్రహ్మారతాత్మబుద్ధయే నమో7స్తు తే 7వ్యాహతకర్మశీలినే. 184

పరేశ పరమానన్ద పరమాత్మన్పరాత్పర, సర్వాత్మనే జగన్మూర్తే ప్రమాణాతీత తే నమః. 185

విశ్వతశ్చక్షుషే తుభ్యం విశ్వతో బాహవే నమః , విశ్వతశ్శిరసే చైవ విశ్వతో గతయే నమః. 186

ఏవం స్తుతో మహావిష్ణుర్బ్రహ్మాద్తైస్సర్దివోకసామ్‌, దత్త్వా భయం చ ముముదే దేవదేవస్సనాతనః. 187

విరోచనాత్మజం దైత్యం పదైకార్థం బబన్ధ హ, తతః ప్రసన్నం తు బలిం జ్ఞాత్వా చాసై#్మ రసాతలమ్‌. 188

దదౌ తద్ద్వారపాలశ్చ భక్తవశ్యో బభూవ హ.

దేవతలు పలికిరి:- పరేశునికి, పరాత్మరూపునికి, పరాత్పరునికి, అపర రూపధారికి, బ్రహ్మస్వరూపునికి, బ్రహ్మయందు ఆసక్తుడైన వాని బుద్ధిలో నుండువానికి నమస్కారము. అడ్డులేని కర్మలు చేయు స్వభావము కలవానికి నమస్కారము. ఓ పరేశా! పరమానన్ద స్వరూపా! పరమాత్మా !పరాత్పరా! సర్వాత్మా !జగత్స్వరూపా! ప్రమాణములకు అందనివాడా !నీకు నమస్కారము. అనేక నేత్రముల గల వానికి, అనేక బాహువులు గల వానికి, అనేక శిరస్సులు గల వానికి, అనేక గతులు గల వానికి నమస్కారములు. ఇట్లు బ్రహ్మాదులచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు సనాతనుడైన దేవదేవుడు స్వర్గవాసులైన దేవతలకు అబయమునిచ్చి ఆనందించెను. విరోచమును పుత్రుడైన బలి చక్రవర్తిని మిగిలిన ఒక అడుగు భూమి కొఱకు బంధించెను. తరువాత బలి చక్రవర్తి శరణువేడునవాడని తెలుసకొని బలి చక్రవర్తికి రసాతల రాజ్యమును ప్రసాదించి, ఙక్తవత్సలుడైన శ్రీహరి ఇతనికి ద్వారపాలకునిగా ఉండెను. 184-188

నారద ఉవాచ:-

రసాతలే మహావిష్ణుర్విరోచనసుతస్య వై, కిం భోజ్యం కల్పయామాప ఘోరే సర్వభయాకులే. 189

నారద మహర్షి పలికెను:- భయంకరము సర్పముల భయముతో ఆకులము అయిన రసాతలమున శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ఆహారముగా ఏ పదార్థమునను ఏర్పరిచెను ? 189

ఆమన్త్రితం హవిర్యత్తు హుయతే జాతవేదసి, అపాత్రే దీయతే యచ్చ తద్ఘోరం భోగసాధనమ్‌. 190

హుతం హవిరశుచినా దత్తం సత్కర్మం యత్కృతమ్‌, తత్సర్వం తత్ర భోగార్హమధః పాతఫలప్రదమ్‌. 191

ఏవం రసాతలం విష్ణుర్బలయే సాసురాయ తు, దత్వాభయం చ సర్వేషాం సురాణాం త్రిదివం దదౌ. 192

పూజ్యమానో7మరగణౖస్త్సూయమానో మహర్షిభిః, గంధర్వైర్గీయమానశ్చ పునర్వామనతాం గతః. 193

ఏతద్దృష్ట్వా మహత్కర్మ మునయో బ్రహ్మవాదినః, పరస్పరం స్మితముఖాః ప్రణముః పురుషోత్తమమ్‌. 194

సర్వభూతాత్మకో విష్ణుర్వామనత్వముపాతగతః, మోహయన్నఖిలం లోకం ప్రపేదే తపసే వనమ్‌. 195

ఏవం ప్రభాలా సా దేవీ గంగా విష్ణుపదోద్భవా , యస్యాః స్మరణమాత్రేణ ముచ్యతే సర్వపాతకైః. 196

ఇదంతు గంగామాహాత్మ్యం యః పఠేచ్ఛృణుయాదపి , దేవాలయే నదీతీరే సో7 శ్వమేథఫలం లభేత్‌. 197

ఇతి శ్రీబృహన్నారదీయ పురాణ పూర్వభాగే

ప్రథమ పాదే గంగోత్పత్తిర్గంగామాహాత్మ్యం నామ

ఏకాదశో7ధ్యాయః

సనక మహర్షి పలికెను:- అగ్నిహోత్రములో మంత్ర పఠనము లేకనే హోమము చేయబడిన హవిస్సు, అయోగ్యునికిచ్చిన దానము, అపవిత్రునిచే అర్పించబడిన హవిస్సు, చేయబడిన దానము, సుకృతము ఇది అంతయు అధఃపతనఫలప్రదమై రసాతలమున బలి చక్రవర్తకి భోగ సాధనము. ఇట్లు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి రసాతలము నిచ్చి, దేవతలకు అభయమును స్వర్గము నిచ్చెను. దేవతలు పూజించుచుండగా, మహర్షులు స్తోత్రము చేయుచుండగా, గంధర్వులు గానము చేయుచుండగా మరల వామనత్వమును పొందెను. ఆశ్చ్రయకరమైన ఈ పనిని చూచి బ్రహ్మావాదులగు మునులు ఒకరినొకరు చిరునవ్వుతో చూచుచు పురుషోత్తముని నమస్కరించిరి. సర్వప్రాణి స్వరూపుడైన శ్రీమహావిష్ణువు వామనత్వమును పొంది సమస్తలోకమును మోహింపచేయుచు తపస్సునకు అరణ్యమునకు వెళ్ళెను. విష్ణుపాదమునుండి పుట్టిన గంగ ఇంతటి ప్రబ్వము కలది. గంగను స్మరించుట వలన అన్ని పాపములు నశించును. ఈ గంగామాహాత్మ్యమును దేవాలయమున, నదీతీరమున చదివిన వారికి, వినిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. 190-197

ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున

గంగోత్పత్తి గంగామాహాత్మ్యము అను పేరుగల

పదకొండవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page