Sri Naradapuranam-I    Chapters    Last Page

నారద పురాణము

ఆంధ్రానువాద సహితము

ప్రథమభాగము

అనువాదకులు

డా|| కందాడై రామానుజాచార్య

ఎం.ఎ.పిహెచ్‌.డి. (సంస్కృతం)

ప్రిన్సిపల్‌

శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్థిని సంస్కృత కళాశాల,

బోయిన్‌ పల్లి, సికింద్రాబాద్‌.

ప్రకాశకులు

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 020.

సర్వస్వామ్యములు ప్రకాశకులవి

ప్రథమ ముద్రణము : 1999

ప్రతులు : 1000

మూల్యము : రూ. 100/-

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినవి

ఆడపడుచులు అత్తవారింటికి వెళ్ళునపుడు సారెపెట్టవలసినవి

ఆచంద్రార్కము మనుమల మునిమనమల ఆయురారోగ్య భాగ్యసౌభాగ్యసమృద్ధికి

ధర్మము ధనము భోగము మోక్షమును కోరి చదివి చదివించి

విని వినిపించవలసినవి వేద వేదాంతరహస్యసుబోధకములైనవి

వ్యాసప్రోక్తఅష్టాదశ(18) మహాపురాణములు.

వానిని సంస్కృతమూల - సరళంధ్రానువాద - పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అందించుచున్నది

 

ప్రతులకు : ముద్రణ:

శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ శ్రీ కళా ప్రింటర్స్‌

గురుకృప, గాంధీనగర్‌,

1-1-140 /1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 080

హైదరాబాద్‌ - 500 020 . ఫోన్‌ : 7611864

శ్రీః

ఉపోద్ఘాతము

అష్టాదశ మహాపురాణములలో మహత్తరమైనది నారద మహాపురాణము. దాదాపు 25,000 శ్లోకములు ఉండడం వలన ఈ పురాణము మిగిలిన పురాణములలో విశిష్టముగా గణించబడినది. సనకమహర్షి, నారద మహర్షికి చెప్పినది ఈ పురాణము. నారదునికి చెప్పినది కావున నారదీయమని ఈ పురాణమునకు పేరు. ఉత్తర భాగమున మాత్రము మాంధాత పృచ్ఛకుడు, వసిష్ఠమహర్షి వక్త.

నారదపురాణము పూర్వభాగము, ఉత్తరభాగము అని రెండు భాగాలుగా విభజించబడినది. పూర్వార్థమున ప్రధానమైన అఖ్యానములతోబాటు వేదాంగముల, మంత్రముల, కవచముల వర్ణన యున్నది. ఉత్తరార్థమున ప్రధానముగా మోహినీ రుక్మాంగద చరితము వర్ణింపబడినది. దీనికి బృహన్నారదీయ మహాపురాణమని కూడా నామాంతరమున్నది. ఇందులో అయిదు పాదములు, 207 అధ్యాయములు ఉన్నాయి. పాదములలో అధ్యాయములుండడం దీని విశిష్టత. ఇతర గ్రథములలో సాధారణముగా అధ్యాయములలో పాదములుండును. ఇందులో వేదాంగముల సంక్షిప్త వివరణ కూడా చేయబడినది. అందునా జ్యోతిశ్శాస్త్రము ఎక్కువ సమగ్రముగా వివరించబడినది. అంతేగాక పూర్వభాగమున అరువది నాలుగవ అధ్యాయము నుండి తొంబది ఒకటవ అధ్యాయము వరకు ఇరువది ఎనిమిది అధ్యాయములలో మహామంత్ర శాస్త్రము పేర్కొనబడినది. అందుకే దీనికి ' మంత్రసారసంగ్రమహని' కూడా వ్యవహారమున్నది. ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, అను పంచాయతనము, నవగ్రహమంత్రములు, కార్తవీర్యమంత్రము, కవచము హయగ్రీవ మంత్రోపాసన మొదలైనవి చెప్పబడినవి. హనుమన్మంత్రము, కవచములు కూడా ఇవ్వబడినవి. మహాపురాణముల అను క్రమణికలు ఇవ్వబడినవి. మోహినీరుక్మాంగద కథ, వ్రతములు ఈ నారదీయపురాణములో వర్ణించబడినవి. ఇవికాక ఉత్తరార్థములో కాశీ, గయ, ప్రయాగ, పురుషోత్తమక్షేత్ర, పుష్కరక్షేత్ర, గోకర్ణక్షేత్ర, రామేశ్వరసేతు, నర్మదా తీర్థ సంగ్రహ, అవన్తికాక్షేత్ర, మధురాక్షేత్ర, బృన్దావనక్షేత్రముల మహాత్మ్యమివ్వబడినది. ద్వాదశీ విద్ధమైన ఏకాదశీ వ్రతము యొక్క ఫలితముతో ఉత్తరఖండము ముగియుచున్నది.

శ్రీవెంకటేశ్వరార్షభారతీట్రస్ఠ్‌ ద్వారా ఇప్పటికే కొన్ని పురాణాలు ఆంధ్రానువాదంతో ప్రకటింపబడి ఉన్నాయి. ఈ నారదీయమహాపురాణాన్ని మూడు సంపుటాలుగా వెలవరించవలెనని ట్రస్ట్‌ వారి సంకల్పం. నారదీయ మహాపురాణంలోని మొదటి సంపుటం (59 అధ్యాయములు) డా|| కందాడై రామానుజాచార్యగారి ఆంధ్రానువాదంతో ఆస్తికుల కరకమలాలలో ఉంచుతున్నందుకు సంతోషిస్తున్నాము. చక్కని ఆంధ్రానువాదం సమకూర్చిన డా|| కందాడై రామానుజాచార్య గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పండితుల సహాయంతో ఇతర పురాణములను కూడా అనువదింపచేసి అచిరకాలములో భారతీయ సంస్కృతి ప్రియులకు అందజేయగల మని ఆశిస్తున్నాము. నారదీయపురాణం మిగిలిన రెండు సంపుటములను కూడా త్వరలోనే ప్రకటించగలము.

శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు

 

Sri Naradapuranam-I    Chapters    Last Page