Sri Naradapuranam-I
Chapters
Last Page
త్రయోదశో7ధ్యాయః= పదమూడవ అధ్యాయము ధర్మానుకథనమ్ ధర్మఉవాచ: దేవతాయతనం యస్తు కురతే కారయత్యపి, శివస్యాపి హరేర్యాపి తస్య పుణ్యఫలం శృణు. 1 మాతృతః పితృతశ్చైవ లక్షకోటికులాన్వితః, కల్పత్రయే విష్ణుపదే తిష్ఠత్యేవ న సంశయః. 2 మృదైవ కురతే యస్తు దేవతాయతనం నరః, యావత్పుణ్యం భ##వేత్తస్య తన్మే నిగదతశ్శృణు. 3 దివ్యదేహధరో భూత్వా విమానవరస్థితః, కల్పత్రయే విష్ణుపదే తిష్ఠత్యేవ న సంశయః, 4 కల్పత్రయం విష్ణుపదే స్థిత్వా బ్రహ్మపురం వ్రజేత్. 5 కల్పద్వయం స్థితస్తత్ర పునః కల్పం వసేద్దివి, తతస్తు యోగినామేవ కులే జాతో దయాన్వితః. 6 వైష్ణవం యోగమాస్థాయ ముక్తిం వ్రజతి శాశ్వతమ్, దారుభిః కురుతే యస్తు తస్య స్యాద్ద్విగుణం ఫలమ్. 7 త్రిగుణం చేష్టకాభిస్తు శిలాభిస్తచ్చతుర్గుణమ్, స్ఫటికాభిశ్శిలాభిస్తు జ్ఞేయం దశగుణోత్తరమ్. 8 తామ్రీభిస్తచ్ఛతగుణం హేమ్నా కోటిగుణం భ##వేత్, దేవాలయం తటాకం వా గ్రామం వా పాలయేత్తు యః. 9 కర్తుః శతగుణం తస్య పుణ్యం భవతి భూపతే, దేవాలయస్య శుశ్రూషాం లేపసేచనమండనైః. 10 కుర్యాద్యస్సతతం భక్త్యా తస్య పుణ్యమనన్తకమ్, వేతనాదిష్టతో వాపి పుణ్యకర్మప్రవర్తితాః. 11 తే గచ్ఛన్తి ధరాధరాః శాశ్వతం వైష్ణవం పదమ్, తడాగర్ధఫలం రాజన్కాసారే పరికీర్తితమ్.12 కూపే పాదఫలం జ్ఞేయం వాప్యాం పద్మాకరోన్మితమ్, వాపీ శతగుణం ప్రోక్తం కుల్యాయాం భూపతే ఫలమ్. 13 దృషద్భిస్తు ధనీ కుర్యాన్మృదా నిష్కించనో జనః, తయోః ఫలం సమానం స్యాదిత్యాహ కమలోద్భవః. 14 ధర్మరాజు పలికెను:- శివాలయమున కాని విష్ణ్వాలయమును స్వయముగా నిర్మిచింననూ, నిర్మింప చేసినను అతను మాతృవంశమున పితృవంశమున లక్షకోట్ల కులములతో మూడు కల్పములు విష్ణులోకమున నివసించును. సందేహములేదు. మట్టితో దేవాలయమును నిర్మించిన వాడు దివ్యదేహమును ధరించి ఉత్తమవిమానమధిరోహించి మూడు కల్పములు విష్ణులోకమును నివసించి బ్రహ్మలోకమును కేగును. అచట రెండు కల్పములు నివసించి స్వర్గమును చేరి ఒక కల్పము నివసించి తరువాత యోగుల కులమున జన్మించి దయకలవాడై వైష్ణయోగమును అవలంబించి శాశ్వతమైన ముక్తిని పొందును. చెక్కతో దేవాలయమును నిర్మించిన వానికి రెట్టింపు ఫలితము కలుగును. ఇటుకలతో నిర్మించిన పదిరెట్లధికముగా ఫలము లభించును. రాగితో నిర్మించిన నూరురెట్లు ఫలితము, బంగారముతో నిర్మించినచో కోటిరెట్లధికముగా ఫలము కలుగును. దేవాలయమును కాని తటాకమును కాని గ్రామమును కాని పరిపాలించువానికి నిర్మించు వానికన్నా నూరురెట్లు ఫలితము కలుగును. దేవాలయమున నీరుచల్లి, అలికి ముగ్గులు వేసి శుశ్రూషచేయువారికి కలుగు పుణ్యఫలమునంతయు వేతనము తీసుకొని కాని, ఇష్టముతో కాని పుణ్యకార్యములలో ప్రవర్తించువారు ఈ భూమికి ఆధారభూతులై శాశ్వతమైన విష్ణులోకమును పొందెదరు. సరస్సును నిర్మించినచో తటాకమును నిర్మించుదానిలో సగము ఫలమును పొందును. కూపమును నిర్మించినచో నాలుగవ భాగము ఫలము కలుగును. దిగుడు బావి నిర్మించినచో పద్మసరస్సును నిర్మించిన ఫలము కలుగును. కాలువ నిర్మించినచో వానికి నూరురెట్లు ఫలము కలుగును. ధనవంతుడు రాళ్ళతో నిర్మించినను, దరిద్రుడు మట్టితో నిర్మించిననూ ఫలము సమానముగా కలుగునని బ్రహ్మ చెప్పెను. 1-14 దద్యాదాఢ్యస్తు నగరం హస్తమాత్రమకించనః, భువం తయోస్సమఫలం ప్రాహుర్వేదవిదో జనాః. 15 ధనాఢ్యః కురుతే యస్తు తడాగం ఫలసాధనమ్, దరిద్రః కురుతే కూపం సమం పుణ్యం ప్రకీర్తితమ్. 16 ఆశ్రమం కారయేద్యస్తు బహుజన్తూపకారకమ్, స యాతి బ్రహ్మ భువనం కులత్రయసమన్వితః. 17 ధేనుర్వా బ్రాహ్మణో వాపి యో వా కో వాపి భూపతే, క్షణార్థం తస్య ఛాయాయాం తిష్ఠన్స్వర్గం నయత్యముమ్. 18 అరామకారకా రాజన్దేవతాగృహకారిణః, తడాగగ్రామకర్తారః పూజ్యన్తే హరిణా సహ. 19 సర్వలోకోపకారార్ధం పుష్పారామం జనేశ్వర, కుర్వతే దేవతార్థం తేషాం పుణ్యఫలం శృణు. 20 తత్ర యావన్తి పర్ణాని కుసుమాని భవన్తి చ, తావద్వార్షాణి నాకస్థో మోదతే కులకోటిభిః. 21 ప్రాకారకారిణస్తస్య కంటకావరణప్రదాః, ప్రయాన్తి బ్రహ్మణః స్థానం యుగానామేకసప్తతిమ్. 22 తులసీరోపణం యే తు కుర్వతే మనుజేశ్వర, తేషాం పుణ్యఫలం రాజన్వదతో మే నిశామయ. 23 సప్తకోటికులైర్యుక్తో మాతృతః పితృతస్తథా, వసేత్కల్పశతం సాగ్రం నారాయణపదం నృప. 24 ఊర్ధ్వపుండ్రధరో యస్తు తులసీమూలమృత్స్నయా, గోపికాచన్దనేనాపి చిత్రకూటమృదాపి వా, గంగామృత్తికయాచైవ తస్య పుణ్యఫలం శృణు. 25 విమానవరమారూఢో గంధర్వాప్సరసాం గణౖః, సంగీయామానచరితో మోదతే విష్ణుమందిరే. 26 పత్రాణి తులసీమూలాద్యావన్తి పతితాని వై, తావన్తి బ్రహ్మహత్యాదిపాతకాని హతాని చ. 27 తులస్యాం సేచయేద్యస్తుం జలం చులుకమాత్రకమ్, క్షీరోదవాసినా సార్థం వసేదాచన్ద్రతారకమ్. 28 దదాతి బ్రహ్మణానాం యః కోమలం తులసీదళమ్, స యాతి బ్రహ్మసదన్ కులత్రితయసంయుతః. 29 శాలగ్రామే7 ర్పయేద్యస్తు తులస్యాస్తు దలాని చ, స వసేద్విష్ణుభవనే యావదాభూతసంప్లవమ్. 30 కంటకావరణం యస్తు ప్రాకారం వాపి కారయేత్, సో7 ప్యేకవింశతికులైర్మోదతే విష్ణుమందిరే. 31 యోర్చయేద్ధరిపాదాబ్జం తులస్యాః కోమలైర్దలైః, న తస్య పునరావృత్తిర్విష్ణులోకాన్నరేశ్వర ! 32 ధనవంతుడు నగరమును, దరిద్రుడు ఒక మూర భూమిని దానము చేసినచో వారిరువురికి సమానఫలము లభించును అని వేదపండితులు చెప్పెదరు. ఫలమునిచ్చు తటాకమును ధనవంతుడు నిర్మించినను, దరిద్రుడు కూపమును తవ్వించిననూ పుణ్యము సమానముగా లభించును. పలు ప్రాణులకుపకరించు ఆశ్రమమును నిర్మించినవాడు మూడు తరముల వరకు బ్రహ్మలోకమును పొందును. ఆ యాశ్రమవృక్షచ్ఛాయలో ఒక ఆవుకాని, బ్రహ్మణుడు కాని అరక్షణము నిలిచినచో కర్త దేహాంతమున స్వర్గమును పొందును. ఆరామమును నిర్మించిన వారు, దేవాలయమును నిర్మించిన వారు, తటాకమును గ్రామమును నిర్మించినవారు శ్రీహరితో సమానముగా పూజించబడుదురు. ప్రజలందరికొఱకు కాని దేవతల కొఱకు కాని పూలతోటను ఏర్పరచినవారు కోటికులముల వలకు ఆ తోటలో నున్న ఆకుల పండ్ల సంఖ్యతో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. ముళ్ళు బాధించనట్లు ఆ తోటలో ఆవరణమును నిర్మించినవారు, పూలతోటకు ప్రాకారమును నిర్మించినవారు డెబ్బది యొకటి యుగములు బ్రహ్మలోకమున నివసింతురు. తులసీ వృక్షమును నాటిన వారు ఏడు కోట్లకులములవరకు మాతృవంశమున పితృవంశమున నుండువారితో నూరు కల్పములు నారాయణుని లోకమున నివసించును. తులసీ మూలమృత్తికతో కాని, గోపీ చన్దనముతో కాని, చిత్రకూట మృత్తికతో కాని గంగా మృత్తికతో కాని ఊర్థ్వపుంజ్రమును ధరించినవారు గంధర్వాప్సరోగణములతో కలిసి గానము చేయబడుచు విష్ణు మందిరమున ఆనందింతురు. తులసీ మూలములనుండి ఎన్ని ఆకులు రాలుచుండునో అన్ని బ్రహ్మహత్యాది పాతకములు నశించును. ఒక చుళుక మాత్రము జలమును తులసీ మూలమున తడిపినచో సూర్యచంద్రులున్నంతవరకు శ్రీమహావిష్ణువుతో కలిసి యుండును. బ్రాహ్మణులకు తులసీ దళమును ఇచ్చినవారు మూడు తరముల వరకు బ్రహ్మలోకమున నివసింతురు. తులసీదళములను శాలగ్రామమున అర్పించినవారు ప్రళయకాలము వరకు విష్ణు భవనమున నివసించును. తులసీ వృక్షమునకు ముళ్ళతీగ ఆవరణముగా, ప్రాకారము కాని చేయించినవారు ఇరువది యొక్కతరములు విష్ణులోకమున ఆనందింతురు. తులసీదళములతో శ్రీహరి పాదపద్మములను అర్చించినవారు విష్ణులోకమును చేరి శ్వాశ్వతముగా మరల తిరిగి రాక అచటనే నివసింతురు. 15-32 ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం యః క్షీరేణ స్నాపయేద్ధరిమ్, కులాయుతయుతః సో7పి మోదతే వైష్ణవే పదే. 33 ప్రస్థమాత్రేణ పయసా యః స్నాపయతి కేశవమ్, కులాయుతాయుతయుతస్సో7పి విష్ణుపురే వసేత్. 34 ఘృతప్రస్థేన యో విష్ణుం ద్వాదశ్యాం స్నాపయేన్నరః, కులకోటియుతో రాజన్సాయుజ్యం లభ##తే హరేః. 35 పంచామృతేన యః స్నానమేకాదశ్యాం తు కారయేత్ , విష్ణోః సాయుజ్యకం తస్య భ##వేత్కులశతాయుతైః. 36 ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం ద్వాదశ్యాం వా నృపోత్తమ, నాలికేరోదకైర్విష్ణుం స్నాపయేత్తతఫలం శృణు. 37 దశదన్మార్జితైః పాపైర్విముక్తో నృపసత్తమ! శతద్వయకులైర్యుక్తో మోదతే విష్ణునా సహ. 38 ఇక్షుతోయేన దేవేశం యస్స్నాపయతి భూపతే !కేశవం లక్షపితృభిస్సార్థం విష్ణుపదం వ్రజేత్. 39 పుష్పోదకేన గోవిన్దం తథా గంధోదకేన చ, స్నాపయిత్వా హరిం భక్త్యా వైష్ణవం పదమాప్నుయాత్. 40 జలేన వస్త్రపూతేన యస్స్నాపయతి మాధవమ్, సర్వపాపవినిర్ముక్తో విష్ణునా సహ మోదతే. 41 క్షీరాద్యైస్స్నాపయేద్యస్తు రవిసంక్రమణ హరిమ్, స వసేద్విష్ణుసదనే త్రిసప్తపురుషైస్సహ. 42 శుక్లపక్షే చతుర్దశ్యామష్టమ్యాం పూర్ణినా దినే, ఏకాదశ్యాం భానువారే ద్వాదశ్యాం పంచమీతిథౌ. 43 సోమసూర్యోపరాగే చ మన్వాదిషు యుగాదిషు, అర్ధోదయే చ సూర్యస్య పుష్యార్కే రోహిణీ బుధే. 44 తథైవ శనిరోహిణ్యాం భౌమాశ్విన్యాం తథైవ చ, శనౌ భృగుమృగే చైవ భృగురేవతిసంగమే. 45 తథా బుధానురాధాయాం శ్రవణార్కే తథైవ చ. తథా చ సోమశ్రవణ హస్తయుక్తే బృహస్పతౌ. 46 బుధాష్టమ్యాం బుధాషాడే పుణ్య చాన్యే దినే తథా, స్నాపయేత్పయసా విష్ణుం శాన్తియాన్ వాగ్యతశ్శుచిః. 47 ఘృతేన మధునా వాపి దధ్నా వా తత్ఫలం శృణు. 48 సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వపాపవివర్జితః, వసే ద్విష్ణుపురే సార్ధం త్రిసప్తపురుషైర్నృప. 49 తత్రైవ జ్ఞానమాసాద్య యోగినామపి దుర్లభమ్, మోక్షమాప్నోతి నృపతే పునరావృత్తిదుర్లభమ్. 50 ద్వాదశీతిథియందు పూర్ణిమాతిథి యందు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో పదివేల తరములతో విష్ణులోకమున ఆనందించును. ఒక గరిటెడు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములతో విష్ణులోకమున నివసించును. ద్వాదశినాడు గరిటెడు నెయ్యితో శ్రీహరిని స్నానము చేయించినచో కోటితరములతో శ్రీహరి సాయుజ్యమును పొందును. ఏకాదశీతిథిన పంచామృతముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిలక్షల తరములతో శ్రీహరిసాయుజ్యము లభించును. ఏకాదశి, పూర్ణిమ, ద్వాదశీతిథులలో నాలికేర జలముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిజన్మలలో చేసిన పాపములు తొలగి రెండువందల తరములతో శ్రీమహావిష్ణువుతో ఆనందించును. చెఱకు రసముతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములతో విష్ణులోకమున నివసించును. పుష్పోదకముతోకాని, గంధోదకముతో కాని శ్రీహరిని స్నానము చేయించిన విష్ణులోకము లభించును. వస్త్రముచే వడపోసిన జలముచే శ్రీహరిని స్నానము చేయించునచో అన్ని పాపములు తొలగి శ్రీమహావిష్ణువుతో ఆనందించును. సూర్యసంక్రణమున క్షీరాదులతో శ్రీహరిని స్నానము చేయించినచో ఇరువదియొక్కతరములతో శ్రీవిష్ణులోకమున నివసించును. శుద్ధచతుర్దశి యందు అష్టమీ తిథి యందు పూర్ణిమాతిథి యందు ఏకాదశీతిథి యందు, ఆదివారమునందు, ద్వాదశీతిథి యందు పంచమీ తిథి యందు సోమ సూర్యగ్రహమములలోను, మన్వాదియుగాది సమయమునందు, సూర్యుని అర్ధోదమున, సూర్యుడు పుష్యమీ నక్షత్రమున ఉన్నప్పుడు, బుధుడు రోహిణీ నక్షత్రమున నుండగా, శని రోహిణీలో, కుజుడు అశ్వినిలో, శని అశ్వనిలో, శుక్రుడు మృగశిరలో రేవతిలో, బుధుడు అనూరాధలో, సూర్యుడు శ్రవణములో, చంద్రుడు శ్రవణములో, బృహస్పతి హస్తలో ఉన్నప్పుడు, బుధాష్టమియందు, బుధాషాడలో , ఇతర పుణ్యదినములలో శాంతి కలిగి వాఙ్నియమముతో శ్రీహరిని పాలతో స్నానము చేయించవలయును. నేయితో, తేనెతో, పెరుగుతో నైనను స్నానము చేయించినచో అన్ని యజ్ఞములు ఆచరించిన ఫలమును పొంది, అన్ని పాపములనుండి విముక్తితని పొంది ఇరువది ఒకటి తరములతో విష్ణుపురమున నివసించి అచటనే జ్ఞానమును పొంది యోగులకు కూడా దుర్లభము పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును. 33-50 కృష్ణపక్షే చతుర్దశ్యాం సోమవారే చ భూపతే, శివం సంస్నాప్య దుగ్ధేన శివసాయుజ్యమాప్నుయాత్. 51 నాలికేరోదకేనాపి శివం సంస్నాప్య భక్తితః, అష్టమ్యామిందువారే వా శివసాయుజ్యమశ్నుతే. 52 శుక్లపక్షే చతుర్దశ్యామష్టమ్యాం వాపి భూపతే, ఘృతేన మధునా స్నాప్య శివం తత్సామ్యతాం వ్రజేత్. 53 తిలతైలేన సంస్నాప్య విష్ణుం వా శివమేవ చ, స యాతి తత్తత్సారూప్యం పితృభిస్సహ సప్తభిః. 54 శివమిక్షురసేనాపి యస్స్నాపయతి భక్తితః, శివలోకే వసేత్కల్పం స సప్తపురుషైస్సహ. 55 ఘృతేన స్నాపయేల్లింగముత్థానే ద్వాదశీదినే, క్షీరేణ వా మహాభాగ తత్ఫలం శృణు మద్గిరా. 56 జన్మాయుతకృతైః పాపై ర్విముక్తో మనుజో నృప, కోటిసంఖ్యం సముద్ధృత్య స్వకులం శివతాం వ్రజేత్. 57 సంపూజ్య గన్ధకుసుమైర్విష్ణుం విష్ణుతిథే నృప, జన్మాయుతార్జితైః పాపైర్ముక్తో వ్రజతి తత్పదమ్. 58 పద్మపుష్పేణ యో విష్ణుం శివం వా పూజయేన్నరః, స యాతి విష్ణుభవనం కులకోటిసమన్వితః. 59 హరిం చ కేతకీపుషై#్పశ్శివం ధత్తూరజైర్నిశి, సంపూజ్య పాపనిర్ముక్తో వసేద్విష్ణుపురే యుగమ్. 60 హరిం తు చంపకైః పుషై#్పరర్కపుషై#్పశ్చ శంకరమ్, సమభ్యర్చ్య మహారాజ తత్తత్సాలోక్యమాప్నుయాత్. 61 శంకరస్యాథవా విష్ణో ర్ఘృతయుక్తం చ గుగ్గులుమ్, దత్వా ధూపే నరో భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే. 62 తిలతైలాన్వితం దీపం విష్ణోర్వా శంకర్య వా. దత్త్వా నరః సర్వకామాన్సంప్రాప్నోతి నృపోత్తమ. 63 ఘృతేన దీపం యో దద్యాచ్ఛంకరాయాథ విష్ణవే, స ముక్తస్సర్వపాపేభ్యో గంగాస్నానఫలం లభేత్. 64 గ్రామేణ్య వాపి తైలేన రాజన్నన్యేన వా పునః , దీపం దత్వా మహావిష్ణోః శివస్యాపి ఫలం శృణు. 65 సర్వపాపవినిర్ముక్తః సర్వైశ్వర్యసమన్వితః, తత్తత్సాలోక్యమాప్నోతి త్రస్సప్తపురుషాన్వితః. 66 యద్యదిష్టతమం భోజ్యం తత్తదీశాయ విష్ణవే, దత్త్వా తత్తత్పదం యాతి చత్వారింశత్కులాన్వితః. 67 యద్యదిష్టతమం వస్తు తత్తద్విప్రాయ దాపయేత్ , స యాతి విష్ణుభవనం పునరావృత్తుదుర్లభమ్. 68 కృష్ణపక్షచతుర్దశీతిథి యందు సోమవారమునాడు శివుని పాలతో అభిషేకము చేసినచో శివసాయుజ్యమును పొందును. అష్టమీతిథి యందు కాని, సోమవారమునాడు కాని నారికేర జలముచే శివాభిషేకము చేసిననూ శివసాయుజ్యమును పొందును. శుక్లపక్షచతుర్దశినాడు, అష్టమినాడు నేతితో కాని తేనేతో కాని శివాభిషేకము చేసినచో శివసామ్యమును పొందును. నువ్వుల నూనెతో శివుని కాని విష్ణువును కాని అభిషేకము చేసినచో ఏడు తరములతో శివవిష్ణు సారూప్యమును పొందును. చెరకు రసముతో శివుని స్నానము చేయించినచో ఏడు తరములతో శివలోకమున ఒక కల్పము నివసించును. ఉత్థానద్వాదశీనాడు పాలతో కాని నేతితో కాని అభిషేకము చేసినచో పదివేల జన్మలలో చేసిన పాపములనుండి విముక్తుడై కోటి తరములతో శివసామ్యమును పొందును. ఏకాదశితిథినాడు గంధపుష్పములతో శ్రీవిష్ణువును ఆరాధించి పదివేల జన్మలలోని పాపముల నుండి విముక్తుడై శ్రీవిష్ణుపదమును పొందును. పద్మములతో శివుని కాని శ్రీమహావిష్ణువును కాని పూజించినచో కోటి తరములతో విష్ణుభవనమును చేరును. శ్రీహరిని మొగలి పుష్పములతో , శివుని ఉమ్మెంత పూవులతో రాత్రిపూట పూజించినచో పాపములు నశించి శ్రీవిష్ణు నగరమున ఒక యుగమున నివసించును. సంపెంగ పూలతో శ్రీహరిని , జిల్లెడు పూలతో శంకరుని పూజించి హరి శివసాలోక్యములను పొందును. శంకరునికి కాని విష్ణువునకు కాని నేతితో సాంభ్రాణి ధూపమును వేసినచో అన్ని పాపములనుండి విముక్తుడగును. నువ్వుల నూనెతో దీపమును శ్రీమహావిష్ణువునకు కాని శంకరునికి కాని అర్పించినచో అన్ని కోరికలు తీరును. శంకరునికి కాని శ్రీమహావిష్ణువునకు కాని నేతితో దీపము పెట్టినచో అన్ని పాపముల నుండి విముక్తుడై గంగా స్నానఫలమును పొందును. గ్రామ్యములైన ఏ నూనెలతో నైనను శ్రీమహావిష్ణువునకు, శివునికి దీపమును వెలిగించినచో అన్ని పాపముల నుండి విముక్తుడై సర్వైస్వర్యములతో కూడి విష్ణుశివసాలోక్యములను పొందును. అత్యంతము ఇష్టమైన భోజనమును విష్ణువునకు కాని శివునికి కాని అర్పించి విష్ణులోకమును శివలోకమును చేరును. అత్యంతము ఇష్టమైన వస్తువును బ్రాహ్మణునకు దానము చేసినచో పునరావృత్తిరహితమైన వైకుంఠమును చేరును. 51-68 భ్రూణహా స్వర్ణదానేన శుద్ధో భవతి భూపతే, అన్నతోయసమం దానం న భూతం న భవిష్యతి. 69 అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశ్చాపి సర్వదః, సర్వదానఫలం యస్మాదన్నదస్య నృపోత్తమ !70 అన్నదో బ్రహ్మసదనం యాతి వంశాయుతాన్వితః, న తస్య పునరావృత్తిరితి శాస్త్రేషు నిశ్చితమ్. 71 సద్యస్తుష్టికరం జ్ఞేయం జలదానం యతో 7ధికమ్, అన్నదానాన్న పశేష్ఠ నిర్దిష్టం బ్రహ్మవాదిభిః. 72 మహాపాతకయుక్తో వా యుక్తో వప్యుపపాతకైః, జలదో ముచ్యతే తేభ్య ఇత్యాహ కమలోద్భవః73 శరీరమన్నజం ప్రాహుః ప్రాణానప్యన్నజాన్విదుః, తస్మాదన్నప్రదో జ్ఞేయంః ప్రాణదః పృథివీపతే. 74 సద్యస్తుష్టికరం దానం సర్వకామఫలప్రదమ్, తస్మాదన్నసమం దానం నాస్తి భూపాల భూతలే. 75 అన్నదస్య కులే జాతా ఆసహస్రం నృపోత్తమ నరకం తే న పశ్యన్తి తస్మాదన్నప్రదో వరః. 76 పాదాభ్యంగం భక్తియుక్తో యో7తిథేః కురుతే నరః, స స్నాతః సర్వతీర్థేషు గంగాస్నానపురస్సరమ్. 77 తైలాభ్యంగం మహారాజు బ్రహ్మణానాం కరోతి యః, సస్నాతో 7ష్టశతం సాగ్రం గంగాయాం నాత్ర సంశయః. 78 రోగితాన్బ్రాహ్మణాన్యస్తు ప్రేవ్ణూరక్షితి రక్షకః, స కోటికుల సంయుక్తో వసేద్బ్రహ్మపురే యుగమ్. 79 యో రక్షేత్పృథివీపాల! రంకం వా రోగిణం నరం, తస్య విష్ణుః ప్రసన్నాత్మా సర్వాన్కామాన్ప్పయచ్ఛతి. 80 మనసా కర్మణా వాచా యో రక్షేదామయాన్వితమ్, సర్వాన్కామానవాప్నోతి సర్వపాపవివర్జితః. 81 గర్భస్థ శిశువును చంపినవాడు సువర్ణమును దానము చేసినచో ఆ పాపము తొలగి పరిశుద్ధుడగును. అన్నదానముతో జలదానముతో సమానమైన దానము ఇదివరకు లేదు. ఇంకముందుండబోదు. అన్నదానము చేసినవాడు ప్రాణదానము చేసిన వానితో సమానుడు. ప్రాణదానము చేసినవాడు అన్నిదానములు చేసిన వానితో సమానుడు. కావున అన్నదానము చేసినవాడు సర్వదానములు చేసిన వాని ఫలితమును పొందును. అన్నదానమును చేసినవాడు తన పదివేల మంది వంశస్థులతో బ్రహ్మలోకమును చేరును. మరల తిరిగి రాడని శాస్త్రములు నిశ్చయించినవి. జలదానము వెంటనే తృప్తి కలిగించునది కావున అన్నదానము కంటే జలదానము ఉత్తమమని బ్రహ్మవాదులు నిర్దేశించిరి. మహాపాతకములతో కూడియున్నను ఉపపాతకములతో కూడియున్ననూ జలదానము చేసినవాడు విముక్తుడగునని బ్రహ్మ చెప్పెను. శరీరము అన్నము వల్లనే పుట్టును. ప్రాణములు కూడా అన్నము వల్లనే కలుగును. కావున అన్నదానము చేసిన వాడు ప్రాణదానము చేసిన వాడే యగును. అన్నదానము వెంటనే తృప్తి కలిగించునది. అన్ని కోరికలను తీర్చునది. కావున ఈ భూలోకమున అన్నదానముతో సమానమైన దానము మరియొకటి లేదు. అన్నదానము చేసిన వారి కులములో పుట్టిన వారు వేయి తరముల వరకు నరకమును చూడరు. కావున అన్నదానము చేసినవాడు సర్వశ్రేష్ఠుడు. అతిథికి పాదప్రక్షాళనము చేసినవాడు గంగాస్నానముతోపాటు అన్ని పుణ్యతీర్థములలో స్నానముచేసిన ఫలము పొందును. బ్రాహ్మణులకు తైల్యాభ్యంగనమును చేయించినవాడు గంగలో నూట ఎనిమిది స్నానములు చేసినవాడగును. వ్యాధిగ్రస్తులైన బ్రాహ్మణులను ప్రేమతో రక్షించువాడు కోటితరములతో బ్రహ్మలోకమున నివసించును. పేదవానిని కాని రోగిని కాని రక్షించువానికి విష్ణువు ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. రోగముతో నున్న వానిని మనసుతో వాక్కుతో కర్మతో త్రికరణ శుద్ధిగా రక్షించువాడు అన్ని పాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలను నెరవేర్చుకొనును. 69-81 యో దదాతి మహీపాల నివాసం బ్రహ్మణాయ, వై తస్య ప్రసన్నో దేవేశః స్వలోకం సంప్రయచ్ఛతి. 82 బ్రాహ్మణాయ బ్రహ్మవిదే యో దద్యాద్గాం పయస్వినీమ్, స యాతి బ్రహ్మ సదనమన్యేషామతిదుర్లభమ్. 83 అన్యేభ్యః ప్రతిగృహ్యాపి యో దద్యాద్గాం పయస్వినీమ్, తస్య పుణ్యఫలం వక్తుం నాహం శక్తో7స్మి పండిత. 84 కపిలాం వేదువిదుషే యో దదాతి పయస్వినీమ్, స ఏవ రుద్రో భూపాల సర్వపాపవివర్జితః. 85 విప్రాయ వేదవిదుషే యో దద్యాదుభయతో ముఖీమ్, యస్తస్య పుణ్యం సంఖ్యాతుం న శక్తో7బ్దశ##తైరపి. 86 తస్య పుణ్యఫలం రాజన్ శృణు వక్ష్యామి తత్త్వతః, ఏకతః క్రతవస్సర్వే సమగ్రవరదక్షిణాః. 87 ఏకతో భయభీతస్య ప్రాణినః ప్రాణరక్షణమ్, సంరక్షతి మహీపాల యో విప్రం భయవిహ్వలమ్. 88 స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షీతః, వస్త్రదో రుద్రభవనం కన్యాదో బ్రహ్మణః పదమ్. 89 హేమదో విష్ణుభవనం ప్రయాతి స్వకులాన్వితః, యస్తు కన్యామలంకృత్య దదాత్యధ్యాత్మవేదినే. 90 శతవంశసమాయుక్తస్సవ్రజేద్బ్రహ్మణః పదమ్, కార్తిక్యాం పౌర్ణమాస్యాం వా ఆషాఢ్యాం వాపి భూపతే. 91 వృషభం శివతుష్ట్యర్థం ఉత్సృజేత్తత్ఫలం శృణు, సప్తజన్మార్జితైః పాపై ర్విముక్తో రుద్రరూపభాక్. 92 కులసపత్తిసంయుక్తో రుద్రేణ సహ మోదతే, శివలింగాంకితం కృత్వా మహిషం యస్సముత్ప్సజేత్. 93 న తస్య యాతనాలోకో భ##వేన్నృపతిసత్తమ, తామ్బూలదానం యః కుర్యాచ్ఛక్తితో నృపసత్తమః. 94 తస్య విష్ణుః ప్రసన్నాత్మా దదాత్యాయుర్యశశ్శ్రియమ్, క్షీరదో ఘృతదశ్చైవ మధుదో దధిదస్తథా. 95 దివ్యాబ్దాయుతపర్యన్తం స్వర్గలోకే మహీయతే, ప్రయాతి బ్రహ్మసదనమిక్షుదాతా నృపోత్తమ. 96 గన్ధదః పుణ్యఫలదః ప్రయాతి బ్రాహ్మణః పదమ్, గుడేక్షురసదశ్చైవ ప్రయాతి క్షీరసాగరమ్. 97 బ్రాహ్మణునకు గృహదానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై తన లోకమునిచ్చును. వేదాధ్యయనపరుడైన బ్రాహ్మణునకు పాలిచ్చు ఆవును దానము చేసినవాడు ఇతరులకు దుర్లభ##మైన బ్రహ్మలోకమున కేగును. తన వద్ద లేనిచో ఇతరుల నుండి తీసుకొనైనను పాలిచ్చు ఆవును బ్రాహ్మణునకు దానము చేసిన వానికి కలుగు పుణ్యఫలమును నేను చెప్పజాలము. వేదములు తెలిసిన బ్రాహ్మణునికి కపిలగోవిను దానము చేసినవాడు అన్ని పాపములనుండి విముక్తుడై స్వయముగా రుద్రుడే యగును. వేదములు చక్కగా తెలిసిన బ్రాహ్మణునికి ప్రసవించుచున్న ఆవును దానము చేసిన వానికి కలుగు ఫలమును నూరు సంవత్సరములలో కూడా లెక్కించలేరు. సంపూర్ణముగా ఉత్తమ దక్షిణలిచ్చు అన్ని యాగములు, ప్రాణభయముతో నున్న ప్రాణి ప్రాణములను కాపాడుట ఈ రెంటి వలన కలుగు ఫలితము ప్రసవింతు ఆవును దానము చేసిన వానికి కలుగును. భయముతో వణుకుచున్న బ్రాహ్మణుని రక్షించిన వానికి సర్వతీర్థస్నానఫలము సర్వయజ్ఞదీక్షాఫలము కలుగును. వస్త్రదానము చేసిన వానికి రుద్రలోకము, కన్యాదానము చేసిన వానికి బ్రహ్మలోకము కలుగును. బంగారుము నిచ్చినవాడు విషణ్ణలోకమును పొందును. అలంకరించిన కన్యను అధ్యానత్మ జ్ఞానము కలవానికి దానము చేసినవాడు నూరుతరములతో బ్రహ్మలోకమున కేగును. కార్తీక పూర్ణిమనాడు, ఆషాడ పూర్ణిమనాడు శివుని ప్రీతి కొఱకు వృషభమును విడిచినవాడు ఏడు జన్మల పాపములనుండి విముక్తుడై రుద్రరూపమును పొంది డెబ్బది తరములతో రుద్రునితో కలసి ఆనందించును. శివలింగ చిహ్నమును చిత్రించి మహిషణమును వదలినవ వానికి యాతలనా లోకము (నరకము) కలుగదు. తాంబుల దానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై ఆయుష్యమును కీర్తిని సంపదను ఇచ్చును. పాలు పెరుగు నెయ్యి తేనెలను దానము చేయువారు పదివేల దివ్యవర్షములు స్వర్గమున నివసింతురు. చెరుకును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరును. గంధమును పుణ్యఫలమును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరుదురు. గుడమును చెరుకు రసమును దానము చేయువారు క్షీరసాగరమునకే గెదరు. భటానాం జలదో యాతి సూర్యలోకమనుత్తమమ్, విద్యాదానేన సాయుజ్యం మాధవకస్య ప్రజేన్నరః. 98 విద్యాదానం మహీదానం గోదానం చోత్తమోత్తమమ్, నరకాదుద్ధరన్తేవ జపవాహనదోహనాత్. 99 సర్వేషాపపి దానానాం విద్యాదానం విశిష్యతే, విద్యాదానేన సాయుజ్యం విష్ణోర్యాతి నృపోత్తమ. 100 నరస్త్విన్ధనదానేన ముచ్చతే హ్యుపపాతకైః శాలగ్రామశిలదానం మహాదానం ప్రకీర్తిత మ్. 101 యద్దత్వా మోక్షమాప్నోతి లింగదానం తథా స్మృతమ్, బ్రహ్మాండకోటిదానేన యత్ఫలం లభ##తే నరః. 102 తత్ఫలం సమవాప్నోతి లింగదానాన్న సంశయః శాలగ్రామశిలాదానే తతో7 పి ద్విగుణం ఫలమ్. 103 శాలగ్రామశిలారూపీ విష్ణురేవేతి విశ్రుతః యో దదాతి నరో దానం గృహేణు మహతాం ప్రభో. 104 గంగాస్నాఫలం తస్య నిశ్చితం నృప జాయతే, రత్నాన్వితసువర్ణస్య ప్రదానేన నృపోత్తమ. 105 భుక్తిం ముక్తిమవాప్నోతి మహాదానం యతస్య్మృతమ్, నరో మాణిక్య దానేన పరం మోక్షమవాప్నుయాత్. 106 ధ్రువలోకమవాప్నోతి వ్రజ్రదానేన మానవః, స్వర్గం విద్రుమదానేన రుద్రలోకమవాప్నుయాత్. 107 ప్రయాతి యానదునేన ముక్తాదానేన చైందవమ్, వైడూర్యదో రుద్రలోకం పుష్పరాగప్రదస్తథా. 108 పుష్పరాగప్రదానేన సర్వత్ర సుఖమశ్నుతే, అశ్వదో హ్యశ్వసాన్నిధ్యం చిరం ప్రజతి భూమిప. 109 గజదానేన మహాతా సర్వాన్కామానవాప్నుయాత్, ప్రయాతి యానదేనేన స్వర్గం స్వర్యానమాస్థితః. 110 మహిషీదో జయత్యేవ హ్యపమృత్యం న సంశయః, గవాం తృణప్రదానేన రుద్రలోకమవాప్నుయాత్. 111 వారుణం లోకమాప్నోతి మహీశ లవణప్రదః, స్వాశ్రమాచారనిరతా స్సర్వభూకూతహితే రతాః. 112 అదాంభికా గతాసనరూయా ప్రయాంతి బ్రహ్మణః, పదమ్, పరోపదేశనిరతా వీతరాగా విమత్సరాః. 113 హరిపాదార్చ నరతాః ప్రయాతి సదనం హరేః, సత్సంగాహ్లాదనిరతా సత్క్కర్మసు సదోద్యతాః. 114 పరాపవాదవిముఖా ప్రయాన్తి హరిమందిమ్, నిత్యం హితకదా యే తు బ్రాహ్మణషు చ గోషు చ. 115 పరస్త్రీసంగవిముఖా న పశ్యన్తి యమాలయమ్, జితేన్ద్రియా జితాహారా గోషు క్షాన్తాస్సుశీలినః. 116 బ్రాహ్మణషు క్షమాశీలాః ప్రయాన్తి భవనం హరేః, అగ్నిశుశ్రూషవశ్చైవ గురుశుశ్రూషకాస్తథా. 117 పతిశుశ్రూషణరతా న వైన సంసృతిభాగినః, సదా దేవార్చనరతా హరినామపరాయతణాః. 118 ప్రతిగ్రహనివృత్తాశ్చ ప్రయాంతి పరమం పదమ్, అనాథం విప్రకుణపం యే దహేయుర్నృపోత్తమ, 119 అశ్వమేధసహస్రాణం ఫలమశ్నువతే సదా. 120 రాజభటులకు మంచినీరిచ్చిన వారు సూర్యలోకమును పొందును. విద్యాదానము చేసినవారు హరి సాయుజ్యమును పొందెదరు. విద్యాదానము, భూదానము, గోదానము, పరమోత్తమములు, కావున నరకమును తప్పించును. అన్ని దానములలో విద్యాదానము విశిష్టమైనది. విద్యాదానముతో విష్ణు సాయుజ్యమును పొందును. వంట చెరకును దానము చేసినచో ఉపపాతకములనుండి విముక్తి లభించును. శాలగ్రామశిలాదానము మహాదానమని చెప్పబడుచున్నది. కావున శాలగ్రామదానమును చేసిన వారు మోక్షమును పొందెదరు. లింగదానమును చేసిన వారు కోటి బ్రహ్మాండములను దానము చేసినవారికంటే రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామదానమును చేసినవారు లింగదానమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామ శిలారూపమున నున్నది శ్రీమహావిష్ణువేనని ప్రసిద్ధి కలదు. కావున ఇంటిలో దానముచేసిన వారు గంగా స్నాన ఫలమును పొందును. రత్నములతో కూడిన బంగారమును దానము చేయుట మహాదానము కావున ఆ దానమును చేసినవారు భోగమును మోక్షమును పొందెదరు. మాణిక్యదానముతో మోక్షమును పొందును. వజ్రదానముతో ధ్రువలోకమును పొందును. పగడమును దానముచేసినచో స్వర్గమును, వాహనమును దానము చేసినచో రుద్రలోకమును, ముత్యములను దానము చేసినచో చంద్రలోకమును, వైడూర్యదానమున రుద్రలోకమును పొందెదరు. పుష్పరాగ దానముతో ఇహపరములో సుఖమును పొందెదరు. అశ్వదానమున అశ్వలోకమును గజదానమున సర్వకామములను పొందును. వాహనమును దానము చేసినచో దివ్యవిమానమునుధిరోహించి స్వర్గమును పొందును. గెదెను దానము చేపసిన వారు అపమృత్యువును జయించును. గోవులకు తృణము నొసనగిన వారికి రుద్రలోకము లభించును. లవణ దానముచే వరుణలోకమును పొందెదరు. తమ తమ ఆశ్రమాచారములలో నుండువారు అన్ని ప్రాణుల హితమును కోరువారు, డంబాచారములు లేనివారు, అసూయ తొలగివనవారు బ్రహ్మలోకమును పొందెదరు. ఇతరులకు మంచిని ఉపదేశించువారు, రాగములేనివారు, మత్సర్యము తొలగినవారు, శ్రీహరి పాదములను అర్చించువారు శ్రీహరి లోకమును పొందెదరు. సజ్జనులతో కలిసి యుండవలయునుని అభిలషించువారు, సత్కర్మలను చేయువారు ఇతరులపై అపవాదు వేయనివారు శ్రీహరి మందిరమును పొందెదరు. బ్రాహ్మణులకు , గోవులకు ఎప్పుడూ హితమునే చేయువారు, పరస్త్రీ సంగమును కోరని వారు యమలోకమును చూడరు. ఇంద్రియ జయము, ఆహారజయము కలవారు, గోవుల విషయమున క్షమాపరులు, సౌశీల్యము కలవారు, బ్రాహ్మణుల విషయమున క్షమాశీలురు శ్రీహరి లోకమును చేరెదరు. అగ్నిని, గురువులను, భర్తను సేవించువారలు సంసారమున బడరు. ఎపూడు దైవార్చనను, కోరువారు హరినామ సంకీర్తనమును చేయువారు, ఎవరినుండి దేనిని గ్రహించనివారు పరమపదమును పొందెదరు. దిక్కులేని బ్రాహ్మణ శవమును దహనము చేసిన వారికి వేయి అశ్వమేధయాగముల ఫలము లభించును. 98-120 పత్రైః పుషై#్పః ఫలైర్వాపి జలైర్వా మనుజేశ్వర. 121 పూజయా రహితం లింగమర్చయేత్తత్ఫలం శృణు, అస్సరోగణగంధర్వైస్సూయమానో విమానగః. 122 ప్రయాతి శివసాన్నిధ్యమిత్యాహ కమలోద్భవః, చులుకోదకమాత్రేణ లింగం సంస్నాప్న భూమిప. 123 లక్షాశ్వమేధజం పుణ్యం పంప్రాప్నోతి న సంశయ్, పూజయా రహితం లింగం కుసుమైర్యో 7ర్చయేత్సుధీః. 124 అశ్వమేధాయుతఫలం భ##వేత్తస్య జనేశ్వర ! భ##క్ష్యైర్భోజ్యైఃఫలైర్వాపి శూన్యం లింగం ప్రపూజ్య చ. 125 శివసాయుజ్యమాపస్నోతి పునారావృత్తివర్జితమ్, పూజయా రహితం విష్ణుం యో7 ర్చయేదర్కవంశజ.126 జలేనా పి స సాలోక్యం విష్ణోర్యతి నరోత్తమ, దేవతాయతనే యస్తు కుర్యాత్సంమార్జనం సుధీః127 యావత్సాంసుయుగావాసం వైష్ణవే మందిరే లభేత్, శీర్ణం స్ఫటికలింగం తు యస్సందాధ్యాన్నృపోత్తమ.128 శతజన్నార్జితైః పాపైర్ముచ్యతే స తు మానవః, యస్తు దేవాలయే రాజన్నపి గోచర్మమాత్రకమ్. 129 జలేన సించేద్భూభాగం పో7పి స్వర్గం లభేన్నరః, గంధోదకేన యస్సించేద్దేవతాయతనే భువమ్. 130 యవత్కణానుకల్పం తు స తిష్ఠేద్దేవసన్నిధౌ, మృదా ధాతువికారరైర్వాయో లింపేద్దేవతాగృహమ్.131 స కోటికులముద్ధృత్య యాతి సామ్యం మధుద్విషః, శిలాచూర్ణేన యో మర్త్వా దేవాగారం తు లేపయోత్.132 స్వస్తికాదీని వా కుర్యాత్తస్య పుణ్యమనన్తకమ్, యః కుర్యాద్దీపరచనాం దేవతాయతనే నృప. 133 తస్య పుణ్యం ప్రసంఖ్యాతులం నోత్సహేబ్దశ##తైరపి, అఖండ దీపం యః కర్వాద్విష్ణోర్వా శంకరస్య చ. 134 క్షణ క్షణశ్వమేధస్య ఫలం తస్య న దుర్లభమ్, ఆర్చితం శంకరం దృష్ట్వా విష్ణుం వాపి నమేత్తు యః. 135 స విష్ణుభవనం ప్రాప్య మోదతే చ యుగాయుతమ్, దేవ్యాః ప్రదక్షిణామేకాం సప్తసూర్యసయ భూమిప. 136 తిస్రో వినాయకస్యాపి చతస్రో విష్ణుమందిరే, కృత్వా తత్తద్గృహాం ప్రాప్త మోదతే యుగలక్షకమ్. 137 యో విష్ణోర్భక్తిభావేన తథైవ గోద్విజస్య చ, ప్రదక్షిణాం చరేత్తస్య హ్యశ్వమేధః పదేపదే. 138 కాశ్యాం మాహేశ్వరం లింగం సంపూజ్య ప్రణమేత్తు యః, న తస్య విద్యతే కృత్యం సంసృతిర్నైవ జాయతే. 139 శివం ప్రదక్షిణం కృత్వా సవ్యేనైనవ విధానతః, నరో న చ్యవతే స్వర్గాచ్ఛంకరస్య ప్రసాదతః. 140 పూజలులేని లింగమును పత్రములతో పుష్పములతో ఫలములతో జలముతో పూజించినవారు దివ్య విమానము నధిరోహించి గంధర్వాస్పసరోగణముతచే స్తుతించబడుచు శివసాన్నిధ్యమును చేరెదరని బ్రహ్మ చెప్పియుండెను. చారెడు నీటితో శివలింగమునకు అభిషేకమును చేసిన వారికి లక్షాశ్వమేధయాగముల ఫలము లభించి తీరును, సంశయముతో పనిలేదు. పూజలు లేని శివలింగమును పుష్పములతో పూజించిన వారికి పదివేల అశ్వమేధయాగముల ఫలితము లభించును. భక్ష్య భోజ్యఫలములతో పూజలులేని శివలింగమును పూజించినవారికి పునరావృత్తిరహితమైన శివలోకము లభించును. పూజలు లేని శ్రీహరిని జలముతో పూజించిననూ విష్ణుసాలోక్యమును పొందును. దేవాలయమున మార్జనము చేసినచో ధూళిరేణువుల సంఖ్యగల సంవత్సరములు విష్ణులోకమున నివసించును. భిన్నమైన స్ఫటిక లింగమును సంధానమము చేసినవారు నూరు జన్మల పాపములనుండి విముక్తడగును. దేవాలయమున గో చర్మ మాత్రమైనను భూమిని నీటితో చల్లి తడిపినచో స్వర్గమును పొందును. దేవాలయమున గంధోదకమును చల్లినచో తడిసిన ధూళికణముల సంఖ్యగల సంవత్సరములు దేవలోకమున నివసించును. మట్టితో కాని, రంగురంగుల ధాతువులచే కాని దేవాలయమును అలికినచో కోటి తరములనుద్ధరించి విష్ణుసామ్యమును పొందెదరు. దేవాలయమున ముగ్గులు దిద్దినచో స్వస్తికాదులను చిత్రించినచో వారికి లభించెడు పుణ్యము అనంతము దేవాలయమున దీపమునుంచిన వాని పుణ్యమును నూరు సంత్సరములలో కూడా లెక్కించలేము. విష్ణువునకు కాని, శంకరునకు కాని అఖండదీపమునుంచిన వారికి ప్రతిక్షణము అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. పూజించిన శంకరుని కాని, విష్ణువును కాని చూచి నమస్కరించినవారు శ్రీవిష్ణులోకమును చేరి మహావిష్ణువుతో కలిసి ఆనందింతురు. దేవికి ఒక ప్రదక్షిణమును, సూర్యునికి ఏడు ప్రదక్షణములును, వినాయనికి మూడు ప్రదక్షణములు, విష్ణువునకు నాలుగు ప్రతక్షాణములు చేసి వారి వారి లోకములను చేరి లక్షయుగములు ఆనందింతురు. భక్తి భావముతో విష్ణువునకు, గోవునకు, బ్రాహ్మణులకు ప్రదక్షిణమును చేసినవారికి అశ్వమేధయాగఫలము లభించును. కాశీలోని మహేశ్వర లింగమును పూజించి నమస్కరించిన వారికి కర్మ, సంసారము ఉండదు. యథావిధిగా సవ్యముగా శివునికి ప్రదక్షిణము చేసినవారు శివుని అనుగ్రహమును వలన స్వర్గము నుండి పతనమును పొందరు. స్తుత్వా స్తోత్రైర్జగన్నాథం నారాయణమనామయమ్, సర్వాన్కామానవాప్నోతి మనసా యద్యదిచ్ఛతి. 141 దేవతాయతనే యస్తు భుక్తియుక్తః ప్రనృత్యతి, గాయతే వా స భూపాల రుద్రలోకే చ ముక్తిభాక్. 142 యేతు వాద్యం ప్రకుర్వాన్తి దేవతాయతనే నరాః, తే హంసనయానమారుఢా ప్రజన్తి బ్రహ్మణః పదమ్. 143 కరతాలం ప్రకుర్వన్తి దేవతాయతనే తు యే, తు సర్వపాపనిర్ముక్తా విమానస్థా యుగాయుతమ్. 144 దేవతాయతనే యే తు ఘంటానాదం ప్రకుర్వతే, తేషాం పుణ్యం నిగదితుం న సమర్థశ్శివస్స్వయమ్. 145 భేరీమృదంగపటహమురజైశ్చ సడిండిమైః సంప్రీణయన్తి దేవేశం తేషాం పుణ్యఫలం శృణు. 146 దేవస్త్రీగణసంయుక్తాః సర్వాకామైః సమర్పితాః, స్వర్గలోకమనుప్రాప్య మోదన్తే కల్పపంచకమ్. 147 దేవతామందిరే కుర్వన్నరః శంఖరవం నృప, సర్వపాపవినిర్మక్తో విష్ణునా సహ మోదతే. 148 తాలకాంస్యాదినినదం కుర్వన్విష్ణుగృహే నరః, సర్వపాపవినిర్ముక్తో విష్ణలోకమాప్నుయాత్. 149 యో దేవస్సర్వదృగ్విష్ణుర్జానరూపి నిరంజనః సర్వధర్మఫలంపూర్ణం సతతుష్టః ప్రదదాతి చ. 150 యస్య స్మరణమాత్రేణ దేవదేవస్య చక్తిణః, సఫలాని భవన్త్యేవ సర్వకార్మాణి భూపతే. 151 పరామాత్మా జగన్నాథస్సర్వకామఫలప్రదః, సత్కర్మకర్తృభిర్నిత్యం స్మృతః, సర్వార్తినాశనః. తముద్దిశ్య కృతం యచ్చ తదానన్త్యాయ కల్పతే. 152 ధర్మాణి విష్ణుశ్చ ఫలాని విష్ణుః కర్మాణి విష్ణుశ్చ ఫలాని భోక్తా, కార్యం చ విష్ణుః కరణాని విష్ణురస్మాన్నకించిద్వ్యతిరిక్తమస్తి.153 ఇతి శ్రీ బృహన్నారాదీయపురాణ పూర్వభాగే ప్రథమపాదే ధర్మానుకథనం నామ త్రయోదశో7 ధ్యాయః నిర్మలుడు జగన్నాధుడు అయిన నారాయణిని స్తోత్రములతో స్తుతించి మనసున కోరిన కోరికలన్నింటిని పొందగలడు. దేవాలయమున భక్తిగల వాడై నృత్యమును కాని, గానమును కాని చేసినచో రుద్రలోకమును పొందును. దేవాలయమున వాద్యములను మ్రోగించినవారు హంసవాహనమధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. దేవాలయమున కరతాళ ధ్వనిచేయువారు అన్నిపాపములనుండి విముక్తిని పొంది విమానమధిరోహించి దేవలోకమున పదివేల యుగములుందురు. దేవాలయమున ఘంటా నాదమును చేసినవారికి కలుగు పుణ్యమను స్వయముగా శివుడు కూడా చెప్పజాలడు. దేవాలయమున భేరీ మృదంగ పటహ మురజ డిండిమతలతో దేవాధీశుని సంతోషింపచేసిన వారు దేవతా స్త్రీ గణములతో కూడి అన్ని కోరికలను నెరవేర్చుకొని స్వర్గలోకమును చేరి అయిదు కల్పములు ఆనందింతురు. దేవాలయమున శంఖనాదమును చేసినవవారు అన్ని పాపముల నుండి విముక్తిని పొంది విష్ణవుతో కూడి ఆనందింతురు. విష్ణుమందిరమున కంచుతాళముల ధ్వని చేసినవారు అన్ని పాపములనుండి విముక్తి పొంది విష్ణులోకమును చేరును. శ్రీ మమావిష్ణువు సర్వదర్శి, జ్ఞానరూపుడు; నిరంజనుడు, అతడు సంతోషించినచో పరిపూరక్ణముగా సర్వధర్మఫలములను ప్రసాదించును. దేవదేవుడైన శ్రీమన్నారాయణుని స్మరించినచో సర్వకర్మలు సఫలములగును. పరమాత్మ జగన్నాధుడు అగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మల ఫలమునిచ్చవాడు. సత్కర్మలను చేయువారు నిత్యము స్మరింతురు. శ్రీహరి అందరి ఆర్తిని తొలగించును. శ్రీమహావిష్ణువును ఉద్దేశించి చేసినదేదైనను అనన్త్యమును పస్రాసాందించును. ధర్మములు, ధర్మఫలములు, కర్మలు, కర్మఫలములు, కర్మఫలభోక్త, కార్యము, కరణములు అన్నియూ శ్రీమహావిష్ణువే. శ్రీమహావిష్ణవు కంటే భిన్నమైన దేదీ మరియొకటి లేదు. ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మానుకథనమను పదమూడవ అధ్యాయము సమాప్తము.