Sri Naradapuranam-I
Chapters
Last Page
చతుర్దశో7 ధ్యాయః = పదనాలుగవ అధ్యాయము ధర్మశాన్తినిర్దేశః ధర్మరాజ ఉవాచ :- శ్రుతిస్మృత్యుదితం ధర్మం వర్ణానామానుపూర్వశః, ప్రబ్రవీమి నృపశ్రేష్ఠ తం శృణుష్వ సమాహితః. 1 యో భుంజానో శుచిం వాపి చాండాలం పతితం స్పసృశేత్, క్రోధాదజ్ఞానతో వాపి తస్య వక్ష్యామి నిష్కృతిమ్. 2 త్రిరాత్రం వాపి షడ్రాత్రం యథాసంఖ్యం సమాచరేత్, స్నానం త్రిషణం విప్ర పంచగవ్యేన శుధ్యతి. 3 భుంజానస్య తు విప్రస్య కదాచిత్స్రవతే గుదమ్, ఉచ్ఛిష్టత్వే శుచిత్వే చ తస్య శుద్ధిం వదామి తే. 4 పూర్వం కృత్వా ద్విజశ్శౌచం పశ్చాదప ఉపస్పృశేత్, అహోరాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుద్ధ్యతి. 5 నిగిరన్యది మేహేత భుక్త్వా వా మేహనే కృతే, అహోదరాత్రోషితో భూత్వా జుహుయాత్సర్పిషానలమ్. 6 యదా భోజనకాలే స్యాదశుచిః బ్రాహ్మణః క్వచిత్, భూమౌ నిధాయ తం గ్రాసం స్నాత్వా శుద్ధిమవాప్నుయాత్. 7 భక్షయిత్వా తు తద్గ్రాసముపవాసేన శుధ్యతి, అశిత్వా చైవ తత్సర్వముపవాసేన శుధ్యతి. 8 అశ్నతశ్చేద్వమిప్స్యాద్యై హ్యస్వస్థస్త్రిశతం జపేత్, స్వస్థస్త్రీణి సహస్రాణి గాయత్ర్యాః శోధనం పరమ్.9 చాండాలైశ్శ్వపచైః స్పష్టో విణ్మూత్రే చ కృతే ద్విజః, 10 త్రిరాత్రం తు ప్రకుర్వీత భుక్తోచ్ఛిష్టష్షడాచరేత్, ఉదక్యాం సూతికాం వాపి సంస్పృశే దస్త్యజో యది, 11 త్రిరాత్రేణ విశుద్ధిస్స్వా దితిశాతాతపో బ్రవీత్, రజస్వలా తు సంస్పృష్టాశ్వభిర్మాతంగవాయసైః 12 నిరాహారా శుచిస్తి ష్ఠేత్కాలే స్నానేన శుద్ధ్యతి, రిజస్వలే యదా నార్యావన్యన్యం ప్సృశతః క్వచిత్.13 శుద్ధ్యేతే బ్రహ్మకూర్చేన బ్రహ్మకూర్చేన చోపరి, ఉచ్ఛిష్టేన చ సంస్సృష్టో యే న స్నానం సమాచరేత్. 14 ఋతై తు గర్భం శంకిత్వా స్నానం మైధేనినస్స్మ్పతమ్, అనృతౌ తు స్త్రియం గత్వా శౌచం మూత్రపురీషవత్. 15 ఉభావప్యశుచీ స్వాతాం దంపతే యాభసంగతౌ, శయనాదుత్థితా నారీ శుచిస్స్యాదుశుచిః పుమాన్.16 భర్తుశ్శరీరశుశ్రూషాం దౌరాత్మ్యాదప్రకుర్వతీ, దండ్యా ద్వాదశకం నారీ వర్షం త్యాజ్యా ధనం వినా. 17 త్యజన్తో పతితాన్భంధూన్దణ్డ్యా ఉత్తమసాహసమ్, పితా హి పతితం కామం న తు మాతా కదాచన 18 ఆత్మానం ఘాతయేద్యస్తు రజ్జ్వాదిభిరుపసక్రమైః, మృతే మేధ్యేన లేప్తవ్యో జీవతో ద్విశతం దమః, 19 దండాస్తత్పుత్రమిత్రాణి ప్రత్యేకం పాణికం దమమ్, ప్రాయశ్చిత్తం తతః కుర్వుర్యథా శాస్త్రప్రచోదితమ్. 20 ధర్మరాజు పలికెను :- వర్ణాశ్రమములకు క్రమముగా శ్రుతులలో, స్మృతులలో చెప్పిన ధర్మములను వివరించెదను. సావధానముగా వినుము. భోజనము చేయుచు అపవిత్రుని కాని, చండాలుని కాని కోపముతో, అజ్ఞానముతో స్పృశించినచో వరుసగా మూడుదినములు, ఆరుదినములు, మూడువేళల్లో స్నానముచేసి పంచగవ్యముతో శుద్ధిపొందును. (పంచగవ్యమనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోఘృతము) బ్రాహ్మణుడు భోజనము చేయుచుండగా మలము స్రవించినచో ఏర్పడిన అపవిత్రత తొలగుటకు పాదప్రక్షాళనము చేసుకొని ఆచమనము చేసి ఒక దినము ఉపవాసముండి పంచగవ్యమును సేవించవలయును. భోజనము చేయుచున్నపుడు మూత్రస్రావము జరిగిచో ఒక దినము ఉపవాసము చేసి నేతితో హోమమును చేయవలయును. భోజనము చేయుచుండగా బ్రాహ్మ ణుడు అపవిత్రుడైనచో చేతిలోని ఆహారమును భూమిపైనుండి స్నానము చేసినచో శుద్ధిని పొందును. ఒక వేళ ఆ ఆహారమును భుజించినచో ఉపవాసము చేసినచో శుద్ధిని పొందును. మొత్తము ఆహారమును తీసుకొనినచో మూడు దినములుపవసించవలయును. భోజనము చేయుచుండగా వాంతిచేసుకొనిననచో అనారోగ్యముగా ఉన్నవాడు మూడువందలు, ఆరోగ్యముగటా నున్నవాడు మూడువేలు గాయత్రీ జపమును చేయవలయును. మాలమూత్రోత్సర్జనము చేయుచున్నపుడు చండాలుడు కాని, శ్వపచుడు కాని స్పృశించినచో మూడురోజులుపవసించవలయును. భోజనము చేసిన తరువాత అశుచిగా ఉన్నపఉడు స్పృశించినచో ఆరు దినములు పవసించవలయును. రజస్వల అయిన స్త్రీని కాని, స్రవించిన స్త్రీని కాని చండాలుడు స్పృశించినచో మూడు దినములు తరువాత శుద్ధి పొందును అని శాతాతపమహర్షి చెప్పెను. రజస్వల అయిన స్త్రీని కుక్కలు, కాకులు కిరాతకులు స్పృశించినచో నిరాహారముగా ఉండి యథాసమయమున స్నానము చేయవలెను. రజస్వల లైన ఇరువురు స్త్రీలు ఒకరినొకరు తాకినచో బ్రహ్మకూర్చమనువ్రతముతో శుద్ధిపొందెదరు. అపవిత్రుడు స్పృశించినపుడు స్నానము చేయనివాడు కూడా బ్రహ్మకూర్చమను వ్రతముచే శుద్ధిని పొందును. ఋతుకాలమున గర్భవతి యని శంకించి సంభోగము చేసినవానికి స్నానముతో శుధ్ధి కలుగును. ఋతుకాలము కానపుడు స్త్రీ సంగమమును జరిపినచో మూత్ర పురీషోత్సర్జనము చేసినప్పటి వలె పాదప్రక్షాలనము ఆచమనము చేయవలెను. సంభోగ సమయమున స్త్రీ పురుషులిరువూరు అపవిత్రులగుదురు. శయ్య మీదినుండి లేచినచో స్త్రీ శుద్ధురాలగును. పురుషుడు మాత్రము అశుచిగానే యుండును. దుష్టత్వముతో భర్తృ శరీరమును సేవించని స్త్రీని ధనమేమి ఇవ్వకుండగా పన్నెండు సంవత్సరాలు త్యాగము చేయవలయును. పతితులు కాని, బంధువులను త్యజించినవారిని ఉత్తమ సాహస దండముచే శిక్షించవలెను. పతితుడైతే కావచ్చును కాని తల్లి ఎన్నడూ పతితురాలు (పుత్రుని దృష్టిలో) కాదు. తాడుచే ఉరిపోసుకొనుట మొదటగు విధానములతో ఆత్మ హత్యకు పాల్పడినచో, మరణించినచో మృతదేవహమును పవిత్ర పదార్థాములతో పూయవలయును. ఒకవేళ జీవించెనేని రెండు వందల నాణములను అపరాధమును విధించవలయును. ఆత్మహత్య చేసుకొని వాని పుత్ర మిత్రాదులను కూడా ఒక్కొక్క నాణము అపరాధముగా విధించి దండించవలయును. తరువాత శాస్త్రముననుసరించి ప్రాయశ్చిత్తము నాచరించవలెను. జలాగ్న్యుద్భంధన భ్రష్టాః ప్రప్రజ్యానాశకచ్చుతాః, విషప్రపతనధ్వస్తా శస్త్రఘాతహతాశ్చ యే. 21 న చైతే ప్రత్యవసితాః సర్వలోబహిషణ్కృతాః, చాంద్రాయణన శుద్ధ్యన్తి తప్తకృచ్ఛ్రద్వయేన వా. 22 ఉభయావసితః పాపశ్యామచ్ఛబలకాచ్యుతః, చాంద్రాయణాభ్యాం శుద్ధ్యేత దత్వా ధేనుం తథా వృషమ్. 23 శ్వశృగాప్లవంగాద్యైః మానుషైశ్చ రతిం వినా, స్పృష్టస్నాత్వా శుచిస్సద్యో దివాసంధ్యాసు రాత్రిషు. 24 అజ్ఞానాద్వా తు యో భుక్త్వా చాండాలాన్నం కథంచన, గోమూత్రయావకాహారో మాసార్థేన విశుద్యతి. 25 గోబ్రాహ్మణగృహం దగ్ధ్వా మృతంచోద్బంధనాదినా, పాశం ఛిత్వా తథా తస్య కృఛ్రమేకం చరేద్విజః. 26 చాండాలపుల్యసానాం చ భుక్త్వా హత్వా చ యోషితమ్, కృచ్ఛ్రార్థమాచరేత్ జ్ఞానాదజ్ఞానాదైందవద్వయమ్. 27 గోపాలకాన్నభోక్తౄణాం తన్నారీగామినాం తథా, ఆగమ్యాగమనే విప్రో మద్యగోమాంసభక్షణ. 28 తప్తకృచ్ఛ్రపరిక్షీప్తో మౌర్వీహోమేన శుద్ధ్యతి, మహాపాతకకర్తారశ్చత్వారోలో7థ విశేషతః. 29 అగ్నిం ప్రవిశ్య శుద్దన్తి స్థిత్వా వాయహతి కృతౌ, రహస్యకరణో7 ప్యేవం మాసనమభ్యస్య పూరుషః. 30 అఘమర్షణసూక్తం వా శుద్ధ్వేదన్తర్జలే జపన్ రజకశ్చర్మకారశ్చ నటో బురుడ ఏవ చ. 31 కైవర్తమేదభిల్లాశ్చ సపై#్తతే హ్యన్త్యజాస్స్మతాః భుక్త్వా చైషాం స్త్రియో గత్వా పీత్వా యః ప్రతిగృహ్యతి. 32 కృచ్చ్రార్థమాచరే జ్ఞానాదజ్ఞానాదైందవద్వయమ్, మాతరం గురుపత్నీం చ దుహితృభగీనీస్నుషాః. 33 సంగమ్య ప్రవిశేదగ్నిం నాన్యా శద్ధిర్విధీయతే, రాజ్ఞీం ప్రవ్రజితాం ధాత్నీం తథా వర్ణోత్తమామపి. 34 గత్వా కృచ్ఛ్రద్వయం కుర్రాత్సగోత్రామభిగమ్యచ, అమూషు పితృగోత్రాసు మాతృగోత్రగతాసు చ. 35 పరదారేషు సర్వేషు కృచ్ఛ్రార్థం తపనం చరేత్ వేశ్యాభిగమనే పాపం వ్యపోహన్తి ద్విజాస్తథా. 36 పీత్వా సకృత్సుతప్తం చ పంచరాత్రం కుశోదకమ్, గురుతల్పగతో కుర్యాద్బ్రాహ్మణో విధివద్వ్రతమ్. 37 గోఘ్నస్య కేచిదిచ్ఛన్తి కేచిచ్ఛైవావరకీర్ణినః, దండాదూర్థ్వం ప్రహారేణ యస్తు గాం వినిపాతయేత్. 38 ద్విగుణం గోవ్రతం తస్య ప్రాయశ్చిత్తం విశోధయేత్, అంగుష్ఠమాత్రస్థూలస్తు బాహుమాత్రప్రమాణకః. 39 సార్ద్రకస్సపలాశశ్చ గోదండః పరికీర్తితః గవాం నిపాతనే చైవ గర్భో7 పి సంభ##వేద్యతి.40 ఏకైకకశ్చరేత్కృచ్ఛ్రమేషా గోఘ్నస్య నిష్కృతిః, బంధనే రోధనే చైవ పోషణ వా గవాం రుజామ్. 41 సంపద్యతే చేన్మరణం నిమిత్తేనైవ లిప్యతే, మూర్ఛితః పతితో వాపి దండేనాభిహతస్తతః, 42 ఉత్థాయ షట్పదం గచ్ఛేత్సప్త పంచ దశాపి వా, గ్రాసం వా యది గృహ్ణీయత్తోయం వాపి పిబేద్యది. 43 సర్వవ్యాధిప్రణష్టానాం ప్రాయశ్చిత్తం న విద్యతే, కాష్ఠలోష్టాశ్మభిర్గావశ్శసై#్త్రర్వా నిహతా యది. 44 ప్రాయశ్చిత్తం స్మృతం తత్ర శ##స్త్రే శ##స్త్రే నిగద్యతే, కాష్ఠే సంతాపనం ప్రోక్తం ప్రాజాపత్యం తు లోష్టకే. 45 తప్తకృచ్ఛంతు పాషాణ శ##స్త్రే చాప్యతికృచ్ఛ్రకమ్, ఔషదం స్నేహమాహారం దద్యాద్గోబ్రాహ్మణషు చ. 46 నీటిచే అగ్నిచే బంధనమునచే ఆత్మహత్య చేసుకొనవలయునని ప్రయత్నించి విఫలమైనవారు, సన్యాసనవ్రతమును భంగము చేసి పతితులైనవారు, విషపానము చేసినవారు, పైనుండి కిందపడినవారు, శస్త్రప్రహారముచే ఆత్మహత్యను ప్రయత్నించినవారు ప్రాయశ్చిత్తార్హులు కారు సమాజము న వ్యవహారమునకు యోగ్యులు కారు. అందరిచే బహిష్కరింపదగినవారు చాంద్రాయణవ్రతముచే కాని, తప్తకృచ్ఛ్రవ్రతమును రెండుమార్లు ఆచరించికాని శుద్ధులగుదరు. మహాపాతకములను ఉపపాతకములను రెండుమార్లు ఆచరించికాని శుద్ధులగుదురు. మాహాపాతకములను ఉపపాతకములను ఆచరించి భ్రష్టులైనవారు, నల్లని పశువును, వినియోగించి యజ్ణముచేయుటకు ఆనర్హులు. వీరు రెండు చాంద్రాయణవ్రతుములచే శుద్ధులగుదుదురు లేదా గోవును, వృషభమును దానముచే కాని శుద్ధులగుదురు. కావలెనని కాక ఆచింతితముగా శునక జంబుక వానరాదులు, పతిత పురుషులు, పగలు, సంధ్యాసమయమున, రాత్రి పూట స్పృశించనచో వెంటనే స్నానము చేసినచో శుద్ధి కలుగును. తెలియక చండాలాన్నమును భుజించిన వారు పదిహేను రోజులు గోమూత్రములో వండిన ఆహారమును భుజించినచో శుద్ధులగుదరు.బ్రాహ్మణ గృహమును, గోనివాసమును దాహము చేసినవాడు, ఉరిపోసుకొని మరణించవలయునని ప్రయత్నించినవారు, ఉరితాడును ఛేదించి ఒక కృచ్ఛ్రవ్రతము నాచరించినచో శుద్ధులగుదురు. తెలియక చండాలపుల్కసుల భోజనము చేసినవారు, స్త్రీని వధించినవారు రెండు చాంద్రాయణవత్రములనాచరించవలయును. తెలిసి చేసినచో అర్థకృచ్ఛవ్రతము నాచరించవలయును. గోపాలకుల అన్నమును భుజించినవారు, వారి స్త్రీలతో రమించివారు, పొందరాని స్త్రీలను పొందినవారు , మధ్యపానము చేసిన బ్రాహ్మణులు, గో మాంసభక్షణము చేసిన విప్రులు తస్తకృచ్ఛవ్రతముచే కాని, నూనెలో తడిపిన దాకములతో హోమమును చేసిన కాని శుద్ధులగుదురు. నాలుగు మహాపాతకములను ఆచరించినవారు అగ్నిప్రవేశముతో కాని, మహాక్రతుప్రవేశముతో కాని శుద్ధులగుదురు. రహస్యముగా పాపముల నాచరించినవారు ఒకనెల నీటిలో నిలిచి అఘమర్ణణ సూక్తమును జపించినచినచో శుద్ధులగుదురు. రజకులు, చర్మకారులు, నటులు, బురుడులు, కైవర్తులు, మేదులు భిల్లులు అను ఏడుగురు అన్త్యజులు. తెలిసి వీరి అన్నమును తినిననూ స్త్రీలతో రమించిననూ నీరు త్రాగిననూ, దానము పరిగ్రహించినను అర్ధకృచ్ఛ్రవ్రతమాచరించవలయును. తెలియక చేసినచో రెండు చాంద్రాయణ వ్రతములనాచరించవలయును. తల్లిని, గురుపత్నిని, పుత్రికను, చెల్లెలును, కోడలును, సంగమించినచో అగ్నిప్రవేశము తప్ప మరోక ప్రాయశ్చిత్తము లేదు. మహారాణిని, సన్యాసినిని, పెంపుడు తల్లిని, ఉన్నతమవర్ణసంజాతను సమంగమించినచో రెండు కృచ్ఛవ్రతమును నాచరించవలయును. సమాన గోత్రము కల స్త్రీని పొందినను రెండు కృచ్ఛవ్రతములన నాచరించవలయును. మాతృగోత్రము కల స్త్రీలను, పితృగోత్రము కల స్త్రీలను, పరదాలను సంగమించినచో అర్ధకృచ్ఛవ్రతమును నాచరించవలయును. వేశ్యాగమనము చేసిన బ్రాహ్మణులకు కూడా అర్ధకృచ్ఛ్రవ్రతముచే శుద్ధి కలుగును. గరుపత్నీసంగమము చేసిన బ్రాహ్మణుడు బాగుగా వేడిగా యున్న నీటిని ఒకసారి త్రాగి దర్భజలమును అయిదు మార్లు త్రాగి యథావిధిగా వ్రతము నాచరించవలెను. గో హత్య చేసిన వానికి, మహాపాతకములన నాచరించిన వారికి కూడా ఇదే ప్రాయశ్చత్తము నిర్ణయించబడినది. దండముతో ప్రవహరించి ఆవును క్రిందపడవేసిన వానకి రెట్టింపు గోవ్రతము (గోదండము) ప్రాయశ్చిత్తముగా విధించబడినది. అంగుష్ఠమంత లావు, బాహువంత పొడవుగానున్న పచ్చి మోదుగు దండము గోదండమనబడును. ఆదండముతో ప్రహారమే గోవ్రతము, గోవును దండముతో ప్రహరించినపుడు గర్భపాతము, సంభవించినచో ఒక్కొక్కదానికి కృచ్ఛ్రవ్రతము నాచరించవలెను. ఆవును బంధించినపుడు అడ్డగించినపుడు, పోషించినపుడు గోవుకు పీడ కలిగినచో లేదా మరణము సంభవించినచో, దండప్రహరము చేయవలయును. ఆ ప్రహారముచే మూర్ఛపోయి లేచిన తరువాత అయిదారేడు పది అడుగులు నడిచి వెళ్ళవలయును. గడ్డి తిని నీరు త్రాగి వ్యాధి నశించనచో ప్రాయశ్చిత్తము లేదు. అనగా వ్యాధిగ్రస్తమైన గోవునకు దండముతో వ్యాది నశించినచో ప్రాయశ్చిత్తముతో పని లేదు. వ్యాధి లేని గోవును దండన చేపినచో అతనినిట్లు శిక్షించవలయును. ఇదే విడిగా ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి. దండప్రహారముతో మరణించినచో సాంతపనవ్రతమును, మట్టిగడ్డతో మరణించినచో ప్రాజాపత్యవ్రతమును పాషాణ ఘాతమునకు తప్త కృచ్ఛ్రవ్రతమును , శస్త్రఘాతమునకు అతికృచ్ఛ్రవ్రతమును ఆచరించి గో బ్రాహ్మణులకు ఔషదమును ఆహారమును తైలమును దానము చేయవలెయును. ఒకవేళ దానము చేసిన ఔషధాదులు సేవించుట వలన మరణము సంభవించినచో ప్రాయశ్చిత్తముతో పనిలేదు. 21 - 46 దీయమానే విపత్తిః స్యాత్ప్రాయశ్చిత్తం తదా నహి, తైలభేజపానే చ భేషజానాం చ భక్షణ. 47 విశల్యకరణ చైవ ప్రాయశ్చిత్తం న విద్యతే, వత్సానాం కంఠబంధేన క్రియయా భేషజాన తు. 48 సాయం సంగోపనార్ధం చ త్వదోషో రోషబంధయోః, పాదే చైవాస్య రోమాణి ద్విపాదే శ్మశ్రు కేవలమ్. 49 త్రిపాదే తు శిఖావర్తం మూరే సర్వం సమాచరేత్, సర్వాన్కేశాన్సముద్ధృత్య భేదయేదంగులద్వయమ్. 50 ఏవమేవ తు నారీణాం ముండనం శిరసస్క్మృతమ్, న స్త్రియా వననం కార్యం న చ వీరాసనం స్మృతమ్. 51 న చ గోష్ఠే నివాసనో7 స్తి న గచ్ఛన్తీ మనుప్రజేతే, రాజా వా రాజపుత్రో వా బ్రాహ్మణో వా బహుశ్రుతః.52 అకృత్వా వపనం తేషాం ప్రాయశ్చత్తం వినిర్దిశేత్, కేశానాం రక్షణార్థం చ ద్విగుణం వ్రతమాచరేత్. 53 ద్విగుణ తు వ్రతే చీర్ణే ద్విగుణా వ్రతదక్షిణా, 54 పాపం న క్షీయతే హన్తుర్దాతా చ నరకం ప్రజేత్, అశ్రౌతసన్మర్తవిహితం ప్రాయశ్చత్తం వదన్తి యే. 55 తాన్దర్మవిఘ్నకర్తౄంశ్చరాజా దండేన పీడయేత్, న చైతాన్పీడయేద్రాజా కథం చిత్కామమోహితః.56 తత్పాపం శతథా భూత్వా తమేవ పరిసర్పతి, ప్రాయశ్చిత్తే తతశ్చీర్ణే కర్యాద్బ్రాహ్మణభోజనమ్. 57 వింశతిర్గా వృషశ్చైకం దద్యాత్తేషాం చ దక్షిణామ్, క్రిమిభిప్తృణసంభూతైర్మక్షికాదినిపాతితైః. 58 కృచ్ఛ్రార్థం ప్రకుర్వీత శక్త్వా దద్యాచ్చ దక్షిణామ్, ప్రాయశ్చిత్తం చ కృత్వా వై భోజయిత్వా ద్విజోత్తమాన్. 59 సువర్ణమానికం దద్యాత్తతః శుద్ధిర్విధేయతే, చాండాలశ్వపచైస్పృష్టే నిశి స్నానం విధీయతే. 60 న వసేత్తత్ర రాత్రౌ తు పద్యస్న్సానేన శుద్ధ్యతి, వసేదథ యదా రాత్రావజ్ఞానదవిచక్షణః, 61 తదా తస్య తు తత్పాపం శతథా పరివర్తతే, ఉద్గచ్చన్తి చ నక్షత్రాణ్యుపరిష్టాచ్చ యే గ్రహాః.62 సంపృష్టే రశ్మభిస్తేషాముదకస్నానమాచరేత్, యాశ్చాన్తర్జలవల్మీకమూషఫికోషరవర్త్మసు. 63 శ్మశానే శౌచశేషే చ న గ్రాహ్యాః సప్తమృత్తికాః, ఇష్టాపూర్తం తు కర్తవ్యం బ్రాహ్మణన ప్రయత్నతః. 64 ఇష్టేన లభితే స్వర్గం మోక్షం పూర్తేన చాప్నుయాత్, విత్తక్షేపో భ##వేదిష్టం తడాగం పూర్వముచ్యతే.- ఇచ్చిన ఔషదమును కాని, తైలయమును కాని పానము చేసినపుడు మరణము సంభవించినచో ఇచ్చిన వారికి ప్రాయశ్చిత్తముతో పని లేదు. దూడలకు మందు త్రాగించుటకు కంఠమున త్రాడు కట్టునపుడు సాయంకాలము రక్షణ కొఱకు బంధింనపుడు దోషము లేదు. పాదప్రాయశ్చిత్తమునకు కేశములను కర్తనము యేయవలయును. రెంచు పాదములన ప్రాయశ్చత్తమునకు మీసములు తీయవలయును. మూడు పాదముల ప్రాయశ్చిత్తమునకు శిఖను, పూర్తిప్రాయశ్చిత్తమును సంపూర్ణముగా క్షౌరము చేయవలయును. స్త్రీకి ప్రాయశ్చిత్తము చేయవలసివచ్చినపుడు మొత్తము కేశములను పట్టుకొని రెండంగులములను మాత్రము కర్తనము చేయవలయును, స్త్రీలకు ఇదియే శిరోముండనము. స్త్రీలకు పూర్తిగా పవనము కాని, వీరాసనము కాని విధించబడియుండలేదు. స్త్రీలకు గోశాలలో నివాసముకాని, నడుచుచున్న ఆవు వెంటవెళ్ళుట కాని విధించబడలేదు. రాజు కాని, రాజపుత్రుడు కాని, విద్వాంసుడైన బ్రాహ్మణుడు కాని పాపమును ఆచరించినచో శిరోముండనము కాక ఇతర ప్రాయశ్చిత్తము నాచరించవలయును. కేశరక్షణ కొఱకు రెట్టింపు వ్రతముల నాచరించవలయును. రెట్టింపు వ్రతము నాచరించి రెట్టింపు దక్షిణల నియవలయును. శ్రుతి స్మృతులలో విధించబడిని ప్రాయశ్చిత్తమును చెప్పినచో హంతకునికి పాపము నశించదు. చెప్పినవాడు నరకమునకు వెళ్ళును. అట్టు ధర్మమునకు విఘ్నములను కల్పించువారిని రాజు దండించవలయును. ఇట్లు ధర్మవిఘాతకలను రాజు కామమోహితుడై దండినచో అతని పాపము నూరురెట్లు పెరిగి రాజును పీడించును. ప్రాయశ్చిత్తము జరిపిన తరువాత బ్రాహ్మణ భోజనమును జరిపించవలయును. ఇరువది ఆవులను ఒక వృషభమును బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వవలయును. గోవును దండారులచే ప్రహారము చేసపినపుడు గాయమేర్పడి గడ్డిలో పుట్టిన పురుగులచే మక్షికాదులచే గాయము పెరుగునపుడు అర్ధకృచ్ఛవ్రతము నాచరించవలయును. శక్తి ననుసరించి దక్షిణ నీయవలయును ప్రాయశ్చిత్తము నాచరించి బ్రాహ్మణులకు భోజనమునుంచి కొంచెము బంగారమును దానము చేసి శుద్ధిని పొందును. రాత్రిపూట చండాల శ్వపచుల స్పర్శ ఏర్పడినపుడు రాత్రిలేనిచో వెంటనే స్నానముచే శుద్ధికలుగును. ఒకవేళ స్పర్శ కలిగినచో ప్రాతఃకాలమున స్నానముచే శుద్ది యేర్పడును. తెలియక రాత్రి అంతయు చండాలాదులతో కలిసి యున్నచో ఆ పాపము నూరురెట్లు పెరుగును. గ్రహములు కాని, నక్షత్రములు పైనుండి వెళ్ళుచున్నడు కిరణస్పర్శ కలిగినచో జలస్నానముచే శుద్ధియేర్పడును. నీటిలోపలనున్న మట్టిని, పుట్టలోని మట్టిని మూషిక బిలములోని మల్టిని చౌడు భూమిలోని మట్టిని, మార్గములోని మట్టిని శ్మశానములోని మట్టిని, శౌచశేషములోని మట్టిని ఈ సప్తయమృత్తికలను గ్రహించరాదు. బ్రాహ్మణుడు గట్టి ప్రయత్నముతోనైన ఇష్టాపూర్తమును ఆచరించవలెను. ఇష్టముచే స్వర్గము, పూర్తముచే మోక్షము లభించును. ద్రవ్యమును విరివిరిగా దానము చేయుట ఇష్టమనబడును. తటాకాదులను నిర్మించుటు పూర్తమనబడును. ఆరామాంశ్చ విశేషణ దేవద్రోస్తథైవచ, వాపీకూపతడాగాని దేవతాయతనానిచ. 66 పతితాన్యుద్ధరేద్యస్తు స పూర్తఫమశ్నుతే, శుక్లాయా అహరేన్మూత్రం కృష్ణాః గోశ్శకృత్తథా. 67 తామ్రాయాశ్చ పయో గ్రాహ్యం శ్వేతాయాశ్చ దధి స్మృతమః, కపిలాయా ఘృతం గ్రాహ్యం మహాపాతకనాశనమ్. 68 కుశైస్తీర్థనదీతోయైః సర్వద్రవ్యం పృథక్ పృథక్, అహృత్య ప్రణనైన ఉత్థాప్య ప్రణవేన చ. 69 ప్రణవేన సమాలోడ్య ప్రణవేనైన సంపిబేత్, పాలాశామధ్యమే పర్ణే భాండే త్రాయమయే శుభే. 70 పిబేత్పుష్కరపర్ణే వా మృణ్మయే వా కుశోదకమ్, సూతకే తు సముత్పన్నే ద్వితీయే సముపస్థతే. 71 ద్వితీయ నాస్తి దోషస్తు ప్రథమేనైన శుద్ధ్యతి, జాతేన శుధ్యతే జాతం మృతేన మృతకం తథా. 72 గర్భసంస్రవణ మాసే త్రీణ్యహాని వినిర్దిశేత్, రాత్రిభిర్మాసతుల్యాభిర్గర్భస్రావే విశుద్ధ్యతి, 73 రజస్యుపరతే సాధ్వీ స్నానేన స్త్రీ రజస్వలా. 74 స్వగోత్రాద్భ్రశ్యతే నారీ వివాహాత్సప్తమే పదే, స్వామిగోత్రేణ కర్తవ్యాస్తస్యాః పిండోదకక్రియాః. 75 ఉద్దేశ్యం పిండదానే స్యాత్పిండే పిండే ద్వినామతః, షణ్ణాం దేయాస్త్రయః పిండా ఏవం దాతా న ముహ్యతి. 76 స్వేన భర్త్రా సహస్రాబ్దం మాతా భుక్తా సుదైవతమ్, పితామహ్యపి స్వేనైన ప్రపితామహి.77 వర్షే వర్షే తు కుర్వీత మాతా పిత్రోస్తు సత్కృతిమ్, అదైవం భోజయేచ్చ్రాద్దం పిండమేకం తు నిర్వపేత్. 78 నిత్యం నైమిత్తికం కామ్యం వృద్ధిశ్రాద్ధమథాపరమ్, పార్వణం చేతి విజ్ఞేయం శ్రాద్ధం పంవిధం బుదైః. 79 గ్రహోపరాగే సంక్రాన్తౌ సర్వోత్సవ మహాలయే, నిర్వపేత్త్రీన్నరః పిండానేకమేవ మృతే హని. 80 అనూఢా న పృథక్కన్యా పిండే గోత్రే చ సూతకే, పాణిగ్రహణమంత్రాభ్యాం స్వగోత్రాద్భ్రశ్యతే తతః. 81 యేన యేన తు వర్ణేన యా కన్యా పరిణీయతే, తత్సమం సూతకం యాతి తథా పిండోదకే పి చ . 82 వివాహే చైవ సంవృత్తే చతుర్థే హని రాత్రిషు , ఏకత్వం సా వ్రజేద్ఛర్తుః పిండే గోత్రే చ సూతకే. 83 ప్రథమే7 హ్ని ద్వితీయే నా తృతీయే వా చతుర్థికే, అస్థిసంచయనం కార్యం బంధుభిర్హితబుద్దిభిః 84 చతుర్థే పంచమే చైవ సప్తమే నవమే తథా, అస్థిసంచయనం ప్రోక్తం వర్ణానామనుపూర్వశః 85 ఏకాదశాహే ప్రేతస్య యస్య చోత్సృజ్యతే వృషః, ముచ్యతే ప్రేతతోకాత్స స్వర్గలోకే మహీయతే. 86 నాభిమాత్రే జలే స్థిత్వా హృదయేన తు చింతయేత్, ఆగచ్ఛన్తు మే పితరో గృహ్ణన్త్వే తాఞ్జలాంజలీన్. 87 హస్తౌ కృత్వా తు సంయుక్తౌ పూరయిత్వా జలేన చ , గోశృంగమాత్రముద్ధృత్వ జలమధ్యే వినిక్షిపేత్. 88 ఆకాశే చక్షి పేద్వారి వారిస్థో దక్షిణాముఖః పితౄణం స్థానమాకాశం దక్షిణా దిక్ తథైవచ. 89 ఆపో దేవగణాః ప్రోక్తా ఆపః పితృగణాస్తథా, తస్మాదస్య జలం దేయం పితౄణం మితమిచ్ఛతా. 90 దివా సూర్యాంశుసంతప్తం రాత్రౌ నక్షత్రమారుతైః మధ్యయోరప్యుభాభ్యాం చ పవిత్రం పర్వదా జలమ్. 91 స్వభావయుక్తమవక్యక్తమమేధ్యేన సదా శుచిః, భాండన్థం ధరణీస్థం వా పవిత్రం సర్వదా జలమ్. 92 దేవతానాం పితౄణాం చ జలం దద్యాజ్జలాంజతీనల్, అలంస్కృప్రమీతానాం ప్థలే దద్యాద్విక్షణః. 93 శ్రాద్ధే హవనకాలే చ దద్యాదేకేన పాణినా, ఉభాభ్యాం తర్పణ దద్యాదేష ధర్మా వ్యవస్థితః. ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే ధర్మశాన్తినిర్దేశో నామ చతుర్దశో ధ్యాయః జీర్ణములైన ఆరామములను, దేవాలయములను వాపీ కూప తటాకములను ఉద్ధరించివ వారికి కూడా పూర్తిఫలము లభించును. శుక్లగోవు నుండి మూత్రమును, కృష్ణగోవునుండి పేడను, తామ్రవర్ణపు గోవు నుండి పాలను, శ్వేతగోవు నుండి పెరుగును, కపిలగోవు నుండి నేతిని తీసుకొని పంచగవ్యమును సిద్ధముచేసుకొనవలయును. ఇట్లు సిద్దము చేసిన పంచగవ్యము మహాపాతకములను నశింపచేయును. దర్భలచే తీర్ధనదీ జలముచే పంచగవ్యములోని ప్రతిద్రవ్యమును విడివిడిగా వ్రణవముతో కలుపవలయును. ప్రణవముతో పైకి తీసుకొనవలయును. వ్రణముతో చక్కగా ఆలోడనము చేసి ప్రణవముతో పానము చేయవలయును. మోదుగాకులో కాని, రాగి కలశములో కాని, తామరాకులో కాని మట్టిపాత్రలో కాని దర్భలతో నుంచి పానము చేయవలయును. సూతకము(అశౌచము) ఒకటి వచ్చిన అది పూర్తికాకమునుపే మరియొక సూతకము వచ్చినచో తరువాత వచ్చిన సూతక దోషము మొదటి దానితో పోవును. జాతాశౌవముతో జాతాశౌచము, మృతాశౌచముతో మృతాశౌచకముతో తొలగిపోవును. గర్భస్రావము జరిగినచో మూడుదినములు అశౌచముండును. ఎన్ని మాసముల గర్భస్రావమైనచో అన్ని దినములు అశౌచముండును రజస్వల అయిన స్త్రీ రజోదర్శనము ముగిసినపుడు స్నానముచే శుద్ధి పొందును. వివాహమున ఏడడుగులు నడుచటచే స్త్రీ తన గోత్రమునుండి విడిపోవును. ఆ స్త్రీకి పిండోదకకర్మలు భర్తగోత్రముచే చేయవలయును. పిండదానమునకు ప్రతి పిండమును రెండు పేర్లతో ఇచ్చుట ఉద్దేశ్యము. కావుననే ఆరుగురికి మూడు పిండములుంచవలయును. ఇట్లు చేసినచో దాత మోహమును చెందడు. మాత తన భర్తతో వేయి సంవత్సరములు పిండములను భుజించును. అట్లే పితామహికూడా తన భర్తతో వేయి సంవత్సరములు భుజించును. ఇట్లే ప్రపితామహహి కూడా అని తెలియును. తలిదండ్రులను ప్రతిసంవత్సరము శ్రాద్ధమును జరుపవలెను. విశ్వేదేవతారహితముగా శ్రాద్ధము జరుపవలయును. ఒక పిండమును అర్పించవలెను. నిత్యము నైమిత్తకము, కామ్యము వృద్ధిశ్రాద్ధము, పార్వణము అని శ్రాద్ధము అయిదు విధములు. గ్రాహణ సమయమున, సూర్యసంక్రమణమున, సూర్య సంక్రమణమున పర్వదినమునలో, ఉత్సవ దినములలో మూడు పిండముల నుంచవలయును. అబ్దికమున ఒక పిండమునుంచవలయును. వివాహము కాని కన్యకు పిండదానమున సూతకకమున విడిగా గోత్రముండదు. వివాహమైన తరువాత వేరు గోత్రముండును. యే వర్ణముతో కన్యావివాహము జరుగునో ఆ వర్ణముతోనే సూతకము పిండోదకములు జరుగును. వివాహము జరిగిన తరువాత నాలుగ దినములో రాత్రినుండి కన్య భర్త గోత్రముతో ఏకత్వమును పొందును. మరణించిన దినమున కాని, రెండు మూనడు నాలుగవ దినములతో హిత బుద్ధులైనన బంధువులు అస్థి సంచయనమును చేయవలెను. వర్ణానుక్రమముగా నాలుగు అయిదు ఏడు తొమ్మిది దినములలో అస్తి సంచయనము చేయవలయునని చెప్పబడినది. చనిపోయిన తరువాత పదకొండవదినమున వృషభమును వదిలినచో ప్రేతలోకమబనుండి విడివిడి స్వర్ముకమును చేరును. నాభిమాత్రముజనమలును నిలిచి హృదయమున ధ్యానము చేయవలయును. ఓ పితృదేవతలారా! మీరోచ్చి ఈ జలాంజలులను స్వీకరించుడు. రెండు చేతులను దగ్గరకు చేర్చి నీటితో నింపి గోశృంగ పర్యంతము పైకి హస్తములు తెచ్చి నీటి మధ్యలో విడువలయును. నీటిలో దక్షిణాముఖముగా నిలిచి జలమును ఆకాశమున చల్లవలయును. ఆకాశము పితృస్థానము. పితరుల దిక్కు దక్షిణము. జలములే దేవగణముము. జలగణములే పితృగణములు. కావున పితరుల హితమున కోరువారు పితరులకు జలతర్పణము చేయవలెను. పగలు సూర్యకిరణములచే తప్తములై, రాత్రి నక్షత్రములచే వాయుచే, మధ్యకాలమున రెంటిచే జలములు పవిత్రములగుచున్నవి. సహజముగా జలము కలశములో నున్నను, భూమిపై నున్నను సర్వదా పవిత్రమే. దేవతలకు, పితరులకు జలాంజలీయవలయును. సంస్కారరహితులై మరణించినవారికి స్థలమున జలతర్పణము చేయవలయును. శ్రాద్ధమున హోమ సమయమున ఒక చేతితో నీయవలెను. తర్పణమున రెండు చేతులతో నీయవలయును. అని ధర్మము వ్యవస్థీకరించబడినది ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున ధర్మశాంతి నిర్దేశమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.