Sri Naradapuranam-I    Chapters    Last Page

పంచదశోధ్యాయః = పదునైదవ అధ్యాయము

భగీరథస్య గంగానయనోద్యమవర్ణనమ్‌

ధర్మరాజ ఉవాచ:-

పాపభేదాన్ప్రపక్ష్యామి యథా స్థూలాశ్చ యాతనాః, శృణుష్వ ధైర్యమాస్థాయ రౌద్రా యే నరకా యతః. 1

పాపినో యే దురాత్మానో నరకాగ్నిషు సంతతమ్‌, పచ్యన్తే యేషు తాన్వక్ష్యే భయంకరఫలప్రదాన్‌.2

తపనో వాలుకాకుంభౌ మహారౌరవరౌరవౌ, కుంభీపాకో నిరుచ్ఛ్వాసః కాలసూత్రః ప్రమర్దనః.3

అసిపత్రవనం ఘోరం లాలాభక్షో హిమోత్కటః, మూషావస్థా వసాకూపస్తథా వైతరణీ నదీ. 4

భక్ష్యన్తే మూత్రపానం చ పురీషహ్రద ఏవ చ, తప్తశూలం తప్తశిలా శాల్మలీద్రుమ ఏవ చ. 5

తథా శోణితకూపశ్చ ఘోరః శోణితభోజనః, శ్వమాంసభోజనం చైవ వహ్నిజ్వాలానివేశనమ్‌. 6

శిలావృష్టిశ్శస్త్రవృష్టిర్వహ్నివృష్టిస్తథైవ చ, క్షారోదకం చోష్ణతోయం తప్తాయః పిండభక్షణమ్‌.7

అథ శిరశ్శోషణం చ మరుత్ప్రపతనం తథా, తథా పాషాణవర్షం చ కృమిభోజనమేవ చ. 8

క్షారోదపానం భ్రమణం తథా క్రకచదారణమ్‌, పురీషలేపనం చైవ పురీషస్య చ భోజనమ్‌.9

రేతః పానం మహాఘోరం సర్వసంధిషు దాహనమ్‌, ధూమపానం పాశబంధం నానాశూలానులేపనమ్‌.10

అంగారశయనం చైవ తథా ముసలమర్దనమ్‌, బహూని కాష్ఠయంత్రాణి కషణం ఛేదనం తధా.11

పతనోత్పతనం చైవ గదాదండాదిపీడనమ్‌, గజదస్తప్రహరణం నానాసర్పైశ్చ దంశనమ్‌.12

శీతామ్బుసేచనం చైవ నాసాయాం చ ముఖే తథా, ఘోరక్షారాంబుపానం చ తథా లవణభక్షణమ్‌.13

స్నాయుచ్ఛేదం స్నాయుబన్ధమస్ధిచ్ఛేదం తథైవ చ, క్షారాంబుపూర్ణరంధ్రాణాం ప్రవేశం మాంసభోజనమ్‌.14

పిత్తపానం మహాఘోరం తథైవ శ్లేష్మభోజనమ్‌, వృక్షాగ్రాత్పాతనం చైవ జలాన్తర్మజ్జనం తథా. 15

పాషాణధారణం చైవ శయనం కంటకోపరి, పిపీలికాదంశనం చ వృశ్చికైశ్చాపి పీడనమ్‌.16

వ్యాఘ్రపీడా శివాపీడా తథా మహిషపీడనమ్‌, కర్దమే శయనం చైవ దుర్గన్థపరిపూరణమ్‌. 17

బహుశశ్చార్ధశయనం మహాతిక్తనిషేవణమ్‌, అత్యుష్ణతైలపానం చ మహాకటుని షేవణమ్‌. 18

కషాయోదకపానం చ తప్తపాషాణతక్షణమ్‌, అత్యుష్ణశీతస్నానం చ తథా దశనశీర్ణనమ్‌. 19

తప్తాయశ్శయనం చైవ హ్యయోభారస్య బన్థనమ్‌, ఏవమాద్యా మహాభాగ ! యాతనాః కోటికోటిశః. 20

అపి వర్షసహస్రేణ నాహం నిగదితుం క్షమః, ఏతేషు యస్య యత్ప్రాప్తం పాపినః క్షితిరక్షక!

తత్సర్వం సంప్రవక్ష్యామి తన్మే నిగదతశ్శృణు,21

ధర్మరాజు పలికెను : పాప భేదములను స్థూల యాతనలను చెప్పెదను. నరకములు చాలా భయంకరములు కావున ధైర్యమును వహించి వినుము. దుష్టస్వభావములు కల పాపాత్ములు యే యే నరకములలో పడి యాతనలను పొందెదరో ఆ నరకములను గూర్చి చెప్పదను. ఇవి యన్నియు భయంకర ఫలముల నిచ్చును. తపన-వాలుకా-కుంభ-మహారౌరవ-రౌరవ-కుంభీపాక-నిరుచ్ఛ్వాస-కాలసూత్ర-ప్రమర్దన-అసి పత్రవనములు లాలాభక్షము, హిమోత్కటము, మూషావస్థ, వసామాపము, వైతరణీనది, మూత్రపానము, పురీషహ్రదము, తప్తశూలము, తప్తశిల, శాల్మలీద్రుమము, శోణితకూపము, ఘోరమైన శోణిత భోజనము, శ్వమాంస భోజనము, వహ్నిజ్వాలానివేశనము, శిలావృష్టి, శస్త్రవృష్టి, వహ్నివృష్టి, క్షారోదకము, ఉష్ణతోయము తప్తాయః పిండభక్షణము, శిరశ్శోషణము, మరుత్ప్రపతనము, పాషాణవర్షము, కృమిభోజనము, క్షారోదపానము, భ్రమణము, కక్రచదారణము, పురీషలేపనము , పురీషభోజనము, రేతఃపానము , సర్వసంధిదాహనము, దూమపానము, పాశబంధము, నానాశూలానులేపనము, అంగార శయనము, ముసలమర్దనము, బహుకాష్ఠయన్త్రకషణము, ఛేదనము, పతనోత్పతనము, గదాదండాదిపీడనము, గజదంతప్రహరణము, నానాసర్పదంశనము, నాసికా ముఖములలో శీతాంబు సేచనము, ఘోరక్షారామ్బుపానము, లవణ భక్షణము, స్నాయుచ్ఛేదము, స్నాయుబన్ధము, ఆస్థిచ్ఛేదము, క్షారామ్బుపూర్ణంధ్రప్రవేశము, మాంసభోజనము, పిత్తపానము, మహాఘోరమైన శ్లేష్మభోజనము, వృక్షాగ్రపతనము, జలాన్తర్మజ్జనము, పాషాణధారాశయనము, కంటక శయనము, పిపీలికాదంశము, వృశ్చికపీడనము, వ్యాఘ్రపీడ, శివాపీడ, మహిషపీడనము, కర్దము శయనము, దుర్గంధపరిపూరణము, ఆర్ధశయనము, మహాతిక్త నిషేణము, అత్యుష్ణతైలపానము, మహాకటు నిషేషణము, కషాయోదక పానము, తప్తపాషాణ తక్షణము, అత్యుష్ణశీతస్నానము, దశన శీర్ణనము, తప్తాయ శ్శయనము, అయోభారబంధనము. ఇటువంటి యాతనలు కొన్ని కోట్లు కలవు. వేల సంవత్సరములలో నేను కూడా చెప్పజాలను. ఏ పాపమునుకు ఏ యాతన వచ్చునో దానింతనూ చెప్పెదను వినుము. 1-21

బ్రహ్మహా చ సురాపీ చ స్తేయా చ గురుతల్పగః, 22

మహాపాతకినస్త్వేతే తత్సంసర్గీ చ పంచమః, పింక్తి భేదీ వృథాపాకీ నిత్యం బ్రహ్మణదూషకః. 23

ఆదేశీ వేదవిక్రేతా పంచైతే బ్రహ్మఘాతకాః, బ్రహ్మణం యస్సమాహుయ దాస్వామీతి ధనాదికమ్‌,24

పశ్చానాస్తీతి యో బ్రూయాత్తమాహుర్బ్రహ్మాఘాతినమ్‌.

స్నానార్థం పూజనార్థం వా గచ్ఛతో బ్రాహ్మణస్య యః, సమాయాత్యంతరాయాత్వం తమాహుర్బ్రహ్మఘాతినమ్‌. 25

పరనిన్దాసు నిరతశ్చాత్మోత్కర్షరతశ్చ యః, అసత్యనిరతశ్చైవ బ్రహ్మహా పరికీర్తితః. 26

అధర్మస్యానుయమంతా చ బ్రహ్మహా పరికీర్తితః, అన్యోద్వేగరతశ్చైవ అన్యేషాం దోషసూచకః. 27

దంభాచారరతశ్చైవ బ్రహ్మ హేత్యభిధీయతే , నిత్యం ప్రతిగ్రహరతస్తథా ప్రాణివదేరతః. 28

అధర్మస్యానుమన్తా చ బ్రహ్మహా పరికీర్తితః, బ్రహ్మ హత్యాసమం పాపమేవం బహువిధం నృప. 29

బ్రాహ్మహత్యను చేయువారు. సురాపానమును చేయువారు, చౌర్యమును చేయువారు, గురు పత్నీసంగమమును చేయువారు ఈ నలుగురు మహాపాతకులు అనబడుదురు. వీరితో సంబందము కలవాడు అయిదవ మహాపాతకి యగును. భోజనము చేయుచున్న పంక్తితోని అంరికీ ఒకే విధముగా వడ్డించక భేదమును చూపువారు, భగవంతునికి నివేదన చేయకనే తినువారు, ఎల్లపుడూ బ్రాహ్మణులను దూషించువారు, కఠినముగా ఆదేశమిచ్చువారు, వేదమును అమ్ముకొనువారు ఈ అయిదుగురు బ్రహ్మఘాతకులు . ధనాదికమునిచ్చెదనని బ్రాహ్మణుని పిలిచి, తరువాత లేదనువాడు కూడా బ్రహ్మఘాతకుడే. స్నానము కొఱకు కాని పూజించుటకు కాని వెళ్ళు బ్రాహ్మణునికి విఘ్నమును కల్పించువాడు కూడా బ్రహ్మఘాతుకుడే . పరులను నిందించుటలో, తనను శ్లాఘించుకొనుటలో ఆసక్తి చూపువాడు, అసత్యమును పలుకుటతో ఆనందించువాడు కూజా బ్రహ్మఘాతకుడనబడును. ఇతరులను బాధించుటలో ఆసక్తికలవాడు. ఇతరుల దోషములనే సూచించువాడు, డాంబికారాచారము కలవాడు, బ్రహ్మఘాతకుడే. ఎప్పుడూ ఎదుటివానినుండి పరిగ్రహించువాడు, ప్రాణులను స్వభావము కలవాడు అధర్మమును ఆమోదించువాడు బ్రహ్మఘాతకుడనబడును. ఇట్లు బ్రహ్మహత్యతో సమానమైన పాపము బహువిధములుగా నుండును. 22-29

సురాపానసమం పాపం ప్రవక్ష్యామి సమాసతః, గణాన్నభోజనం చైవ గణికానాం నిషేవణమ్‌. 30

పతితాన్నాదనం చైవ సురాపానసమం స్మరితమ్‌, ఉపాసనాపరిత్యాగో దేవలానాంచ భోజనమ్‌. 31

సురాపయో షిత్సంయోగస్సురాపాన సమస్స్మృతః, యశ్శూద్రేణసమాహుతో భోజనం కురతే ద్విజః. 32

సురాపీ స హి విజ్ఞేయ స్సర్వధర్మబహిష్కృతః, యశ్శూద్రేణాభ్యనుజ్ఞాతః ప్రేష్యకర్మ కరోతి చ . 33

సురాపానసమం పాపం లక్షతే స నరాధమః, ఏవం బహువిధం పాపం సుపాపానసమం స్మృతమ్‌. 34

సురాపానముతో సమానమగు పాపమును సంగ్రహముగా చెప్పెదను. వేశ్యా భోజనమును భుజించుట, వేశ్యలము సేవించుట, పతితుల అన్నమును తినుట సురాపానముతో సమానము. చేయుచున్న ఉపాసమము పరిత్యజించుట, దేవలుల (ఆలయాలలోని అర్చకుల) భోజనము, సురాపానము చేయు స్త్రీతో సంగమించుటు సురాపానముతో సమానము. శూద్రునిచే ఆహ్వానించబడి భోజనము చేయువాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి సురాపి అనబడును. శూద్రుని ఆజ్ఞచే భృత్యకర్మచేయువానికి సురాపానసమఫలము లభించును. ఇట్లు పలివిధములైన పాపములు సురాపాన సమములుగా చెప్పబడినవి. 30-34

హేమస్తేయసమం పాపం ప్రవక్ష్యామి నిశామయ, కందమూలఫలానాం చ కస్తూరీపటవాససామ్‌. 35

సదా స్తేయం చ రత్నానాం స్వర్ణస్తేయసమం స్మృతమ్‌, తామ్రయస్త్రపుకాంస్యానామాజ్యస్య మధునస్తథా. 36

స్తేయం సుగంధద్రవ్యాణాం స్వర్ణస్తేయసమం స్మృతమ్‌, క్రముకస్యాపి హరణమంభసాం చన్దనస్య చ. 37

పర్ణరసాపహరణం స్వర్ణస్తేయసమం స్మృతమ్‌, పితృయజ్ఞపరిత్యాగో ధర్మకార్యవిలోపనమ్‌. 38

యతీనాం నిన్దనం చైవ స్వర్ణస్తేయసమం స్మృతమ్‌, భక్ష్యాణాం చాపహరిణం ధాన్యానాం హరణం తథా. 39

రుద్రాక్షహరణం చైవ స్వర్ణస్తేయసమం స్మృతమ్‌, భగీనీగమనం చైవ పుత్రస్త్రీగనమం తథా. 40

రజస్వలాదిగమనం గురుతల్పసమం స్మృతమ్‌, హీనజాత్యాదిగమనం మద్యపస్త్రీనిషేవణమ్‌. 41

పరస్త్రీ గమనం గురుతల్పసమం స్మృతమ్‌, భ్రాతృస్త్రీగమనం చైవ వయస్యస్త్రీనిషేవణమ్‌. 42

విశ్వస్తాగమనం చైవ గురుతల్పసమం స్మృతమ్‌, అకాలే కర్మకరణం పుత్రీగమనమేవ చ. 43

ధర్మలోపశ్శాస్త్ర నిన్దా గురుతల్పసమం స్మృతమ్‌, ఇత్యేవమాదయో రాజన్మహాపాతకసంజ్ఞితాః. 44

ఏతేష్వేకతమేవాపి సంగకృత్తత్సమో భ##వేత్‌, యథాకథంచిత్పాపానామేతేషాం పరమర్షిభిః. 45

శాన్తైస్తు నిష్కృతిర్దృష్టా ప్రాయశ్చిత్తాదికల్పనైః, ప్రాయశ్చిత్తవిహీనాని పాపాని శృణు భూపతే. 46

ఇపుడు బంగారమును చౌర్యము చేసినందువలన కలుగు పాపముతో సమాన పాపములను చెప్పెదను వినుము. కందమూలములను, ఫలములను, కస్తూరి మొదలగు సుగంధద్రవ్యములను , రత్నములను అపహరించుట సువర్ణస్తేయముతో సమానము. రాగి, ఇనుము, సీసము, ఇత్తడి, నెయ్యి, తేనె మొదలగు వాటిని సుగంధద్రవ్యములను, పట్టువస్తములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. వక్కలను , నీటిని చందనమును, ఆకురసములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. పితృయజ్ఞమును వదలిపెట్టుట, ధర్మకార్యములను లోపింపచేయుట, యతులను నిందుంచుట స్వర్ణచౌర్యముతో సమానము. తినదగిన పదార్థములను, ధ్యానములను హరించుట రుద్రాక్షహరణము స్వర్ణచౌర్యముతో సమానము. తోబుట్టువులైన అక్కచెల్లెలు మొదలగు స్త్రీల సంగమము, కొడుకు భార్యను సంగమించుట, రజస్వలా స్త్రీ సంగమము గురు భార్యాసంగమముతో సమానము. హీనజాతిని స్త్రీని సంగమించుట, మద్యపానము చేయు స్త్రీని సంగమించుట, పరస్త్రీ గమనము, గురుదారా గమనముతో సమానము. అన్న భార్యను కలియుట, మిత్రుని భార్యను కలియుట, విధవాగమనము గురదారా గమనముతో సమానము. కాని కాలములో పనిచేయుట, పుత్రికా సంగమము, ధర్మలోపము, శాస్త్రనిన్ద, గురు భార్యా గమనముతో సమానము. కాని కాలములో పనిచేయుట, పుత్రికాసంగమము, ధర్మలోపము, శాశ్త్రనిన్ద, గురుభార్యా గమనముతో సమానము. ఇటువంటివన్నీ మహాపాపములనబడును. వీటిలో ఏ ఒక్కదానిని చేసినను మహాపాపియే యగును. శాంతులైన పరమర్షులు ఈ మహాపాపములకు నిష్కృతిని (ప్రాయశ్చిత్తమును) కనుగొనిరి. ఇక ఇపుడు ప్రాయశ్చిత్తములు లేని పాపములను చెప్పెదను వినుము. 35-46

సమస్త పాపతుల్యాని మహానరకదాని చ, బ్రహ్మహత్యాదిపాపానాం కథం నిష్కృతిర్భవేత్‌. 47

బ్రాహ్మణం ద్వేష్టి యస్తస్య నిష్కృతి ర్నాస్తి కుత్రచిత్‌, విశ్వస్తఘాతినాం చైవ కృతఘ్నానాం నరేశ్వర. 48

శూద్రస్త్రీసంగినాం చైవ నిష్కృతిర్నాస్తి కుత్రచిత్‌, శూద్రావ్నపుష్టదేహానాం వేదనింతారతాత్మనామ్‌. 49

సత్కథానిన్దకానాం చ నేహాముత్ర చ నిష్కృతిః. 50

బౌద్ధాలయం విశేద్యస్తు మహాపద్యపి వై ద్విజః, న తస్య నిష్కృతి ర్దృష్టా ప్రాయశ్చిత్తశ##తైరపి. 51

బౌద్ధాః పాషండినః ప్రోక్తా యతే వేదవినిన్దకాః, తస్మాద్ద్విజస్తాన్నేక్షేత యతో ధర్మబహిష్కృతాః. 52

జ్ఞానతో7 జ్ఞానతో వాపి ద్విజో బౌద్ధాలయం విశేత్‌, జ్ఞాత్వా చేన్నిష్కృతి ర్నాస్తి శాస్త్రాణామితి నిశ్చయః, 53

ఏతేషాం పాపబాహుల్యాన్నరకం కోటికల్పకమ్‌, ప్రాయశ్చిత్తవిహీనాని ప్రోక్తాన్యన్యాని చ ప్రభో. 54

పాపాని తేషాం నరకాన్గదతో మే నిశామయ. 55

ఇవి అన్ని పాపములతో సమానమైన పాపములు. మహానరకను నిచ్చినవి. బ్రహ్మహాత్యాది పాపములకు ఏదో యొక విధముగా నిష్కృతి లభించును. బ్రాహ్మణులను ద్వేషించువారికి ఏవిధముగానైనను నిష్కృతి లేదు. నమ్మిన వారిని చంపిన వారికి, కృతఘ్నులకు, శూద్ర స్త్రీ సంగమమును చేయువారికి నిష్కృతి లభించదు. శూద్రాన్నముతో పుష్టిని పొందిన శరీరము గలవారికి వేందనిందను చేయువారికి, సత్కథానిన్దకులకు ఇహపరములలో నిష్కృతి లేదు. గొప్ప ఆపదలోనైన బౌద్ధాలయ ప్రవేశము చేసిన బ్రాహ్మణునికి నూరు ప్రాయశ్చిత్తములు జరిపినను నిష్కృతి లభించదు. బౌద్ధులు వేదనిన్దకులు కావున పాషండులనబడుదురు. ధర్మబహిష్కృతులు కావున బ్రాహ్మణులు బౌద్ధలవైపు చూడరాదు. తెలిసియైనను తెలియకనైనను బ్రాహ్మణుడు బౌద్ధాలయమున ప్రవేశించరాదు. తెలిసి ప్రవేశించినచో నిష్కృతి లభించును. ఇది శాస్త్ర నిశ్చయము. ఇవి చాల పెద్ద పాపములు కావున కోటి కల్పములు నరకముననుభవించవలయును. ప్రాయశ్చిత్తములు లేని ఇతర పాపములు చాల కలవు. ఆ పాపములు వాటి వలన కలుగు నరకములను చెప్పెదను. వినుము. 47-55

మహాపాతకినస్తేషు ప్రత్యేకం యుగవాసినః, తదన్తే పృథివీమేత్య సప్తజన్మసు గర్దభాః. 56

తతశ్శ్వానో విద్ధదేహాః భ##వేయుర్దశజన్మసు, అశతాబ్దం విట్‌ కృమయః సర్పా ద్వాదశజన్మసు. 57

తతస్సహస్రజన్మాని మృగాద్యాః పశవో నృప, శతాబ్దం స్థావరాశ్చైవ తతో గోధాదశరీరణః. 58

తతస్తు సప్తజన్మాని చండాలాః పాపకారిణః, తతష్షోడశ జన్మాని శూద్రాద్యా హీనజాతయః. 59

తతస్తు జన్మద్వితయే దరిద్రా వ్యాదిపీడితాః, ప్రతిగ్రహపరానిత్యం తతో నిరయగాః పునః. 60

అసూయావిష్టమనసో రౌరవే నరకే స్మృతమ్‌, తత్ర కల్పద్వయం స్ధత్వా చాండాలాశ్శతజన్మసు. 61

మా దదస్వేతి యో బ్రూయాద్గవాగ్నిబ్రాహ్మణషు, చ, శునాం యోనిశతం గత్వా చాండాలేషూపజాయతే. 62

తతో విష్ఠాకృమిశ్చైవ తతో వ్యాఘ్రాస్త్రిజన్మసు, తదంతే నరకం యాంతి యుగానామేకవింశతిమ్‌. 63

పరానిన్దాపరా4 యే చ యే చ నిష్ఠురభాషిణిః, దానానాం విఘ్నకర్తారస్తేషాం పాపఫలం శృణు. 64

ముసలోలూలాఖ్యం చ చూర్ణ్యంతే తస్కరా భృశమ్‌, తదన్తే తప్తపాషాణగ్రహణమ్‌ వత్సరత్రయమ్‌. 65

తతశ్చ కాలసూత్రేణ భిద్యన్తే సప్తవత్సరాన్‌, శోచన్తస్వ్సానికర్మాణి పరద్రవ్యాపహారకాః. 66

కర్మణా తత్ర పచ్యన్తే నరకాగ్నిషు సంతతమ్‌. 67

పైన చెప్పబడిన పాపులందరిలో మహాపాపులు మాత్రమ ఒక్కొక్క మహాపాపమునకు ఒకొక్క యుగమున నరకమును నుందురు. తరువాత భూలోకమునకు వచ్చి ఏడు జన్మలు గర్దభములుగా తరువాత ఎపుడూ కొట్టబడు శరీరములు గల కుక్కలుగా పదజన్మలు పుట్టెదురు. తరువాత నూరు సంవత్సరములు మలములో పురుగులుగా, పన్నెండు జన్మలు పాములుగా, తరువాత వేయి జన్మలు మృగాది పశువులుగా, నూరు సంవత్సరములు స్థావరములుగా, తరువాత బల్లులుగా, తరువాత ఏడు జన్మలు చండాలులుగా, తరువాత పదునారు జన్మలు హీనజాతులైన శూద్రులుగా, తరువాత రెండు జన్మలు దరిద్రులుగా వ్యాధిపీడుతులూ ఎపుడూ ఎదుటివారినుండి తీసుకొను వారిగా పుట్టి మరల నరకమునకు వెళ్ళెదరు. అసూయ నిండిన మనసు కలవారు రౌరవమను నరకమునకు వెళ్ళదరు. ఆ రౌరవమున రెండు కల్పములుండి నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గోవులకు అగ్నికి బ్రాహ్మణులకు అర్పించవద్దని చెప్పినవారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి చండాలులుగా పుట్టెదరు. తరువాత మలకీటకములుగా, తరువాత మూడు జన్మలు పెద్దపులులుగా పుట్టి చివరికి మరల నరకమునకు వెళ్లి ఇరువది యొక్కయుగములు అచటనుందురు. పరులము నిందించువారు, కఠినముగా మాట్లాడువారు దానములకు విఘ్నమును కలిగించువారు చోరులతో సమానము, వారు రోట పడవేయబడి రోకళ్ళతో పొడి చేయబడుదురు. తరువాత బాగుగా కాల్చిన పాషాణమును మూడు సంవత్సరములు పట్టుకొని యుండవలయును. తరువాత ఏడు సంవత్సరములు కాల సూత్రముతో చీల్చబడుదురు. ఇట్లు పరద్రవ్య ములన నపహరించినవారు తాము చేసిన కర్మలను గూర్చి విచారించుచు నరకాగ్నిలో పాకము చేయబడుదురు(వారి పాపములు నరకములో పండునని భావము). 56-67

పరస్వసూచకానాం చ నరకం శృణు దారుణమ్‌, యావద్యుగసహస్రం తు తప్తాయఃపిండ భక్షణమ్‌. 68

సంపీడ్యతే చ రసనా సందంశైర్భృశదారుణౖః, నిరుచ్ఛ్వాసం మహాఘోరే కల్పార్ధం నివసన్తి తే. 69

పరస్త్రీ లోలుపానాం చ నరకం కథయామి తే, తప్తతామ్రస్తిస్తేనసురూపాభరణౖర్యుతాః. 70

యాదృశీస్తాదృశీస్తాశ్చ రమన్తే ప్రసభం బహు, విద్రవన్తం భ##యేనాసాం గృహ్ణన్తి ప్రసభం చ తమ్‌. 71

కథయన్తశ్చ తత్కర్మ నయన్తేనరకాన్క్రమాత్‌, అన్యం భజన్తే భూపాల పతిం త్యక్త్వా చ యా స్త్రియః. 72

తప్తాయః పురుషాస్తాస్తు తప్తాయశ్శయనే బలాత్‌, పాతయుత్వా రమన్తే చ బహుకాలం బలాన్వితాః. 73

తతసై#్తర్యోషితో ముక్తా హుతాశనసమోజ్జ్వలమ్‌, అయఃస్తంభం సమాశ్లిష్య తిష్ఠన్త్యబ్దసహస్రకమ్‌. 74

తతః క్షారోదకస్నానం క్షారోదక నిషేవణమ్‌, తదన్తే నరకాన్సర్వాన్‌ భుంఙ్త్కే7బ్ద శతం శతమ్‌. 75

యో హన్తి బ్రాహ్మణం గాం చ క్షత్త్రియం చ నృపోత్తమమ్‌, స చాపి యాతనాస్సర్వా భుంక్తే కల్పేషు పంచసు. 76

యశ్శృణోతి మహన్నిందాం సాదరం తత్ఫలం శృణు, తేషాం కర్ణేషు దాప్యన్తే తప్తాయఃకీలసంచయాః. 77

తతశ్చ తేషు ఛిద్రేషు తైలమత్యుష్ణముల్బణమ్‌, పూర్యతే చ తతశ్చాపి కుంభీపాకం ప్రపద్యతే. 78

నాస్తికానాం ప్రవక్ష్యామి విముఖానాం హరేహరే, అబ్దానాం కోటి పర్యన్తం లవణం భుంజతే హి తే. 79

తతశ్చ కల్పపర్యన్తం రౌరవే తప్తసైకతే, భజ్యన్తే పాపకర్మాణో7 న్యేష్వప్యేవం నరాధిప. 80

చోరులకు ఇతరులకు ద్రవ్యములు జాడను తేలిపి చౌర్యమును చేయుటకు సహకరించిన వారిక కలుగు నరకమును చెప్పెదను వినుము. వేయి యుగములు బాగుగా కాల్చిన ఉక్కుముద్దను తినుంచుదురు. బాగుగా కాల్చిన ఇనుప పట్కారులతో నాలుకను బయటకులాగుచుందురు. తరువాత సగము కల్పము మహాఘోరమైన నరకములో ఊపిరి పీల్చక పడియుందురు. ఇక ఇపుడు పర స్త్రీ సంగమమునందు ఆశ కలవారికి కలుగు నరక యాతనలను తెలిపెదను. బాగుగా కాల్చబడిన రాగి శరీరము కల స్త్రీలు కాల్చబడిన రాగి ఆభరణములను ధరించి ఇదివరకు వీరు కోరిన స్త్రీల వంటి రూపములతో వచ్చి బలవంతముగా రమించెదరు. ఆ స్త్రీలను చూచి భయముతో పారిపోలుచున్న పురుషుని బలాత్కారమచే పట్టుకొని పురుషుడు చేసిన పాపకార్యములను స్త్రీ సంగమములను చెప్పుచు నరకనుల లెనికి తీసికొని వెళ్లి బలవంతముగా రమించెదరు. అట్లే భర్తను వదిలి పరపురుషునితో రమించిన స్త్రీలను నరకములో బాగుగా కాల్చిన ఉక్కు శరీరమును కల పురుషులు బాగుగా కాల్చిన ఉక్కు శయ్యమీద బలవంతముగా పడవేసి బలవంతులు కావున చాలా కలము రమింతురు. అట్లు చాలా కాలము రమించి విడిచిన తరువాత ఆ స్త్రీలు అగ్నివలె మండుచున్న ఉక్కస్తంభమును ఆలింగనము చేసుకొని వేయి సంవత్సరములుందురు. తరువాత కారము నీటితో స్నానము చేయుచు కారము నీరు త్రాగుచుందురు. తరువాత నూరు సంవత్సరములు అన్ని నరకయాతనలననుభవించెదరు. బ్రాహ్మణుని, ఆవును, ఉత్తమరాజగు క్షత్రియుని చంపువారు అయిదు కల్పములు అన్ని నరక యాతనలననుభవించెందరు. మహాత్మునిందను ఆదరముతో వినువారి చెవులలో బాగుగా కాల్చిన ఇనుప మేకులను నాటెదరు. తరువాత ఆ కర్ణరంధ్రములో బాగుగా కాగి మసలుచున్న నూనెను నింపెదరు. తరువాత కుంభీపాక నరకనునకు గొనిపోయెదరు. శ్రీహరి యందు గాని శంకరుని యందు కాని విముఖులైన నాస్తికలు కోటి సంవత్సరములు ఉప్పునే తినుచుందురు. తరువాత బాగుగా కాలియున్న ఇసుక కల రౌరవమునందు ఒక కల్పకాలము యాతనలను అనుభవించి ఇతర యాతనలను కూడ ఇట్లే అనుభవించెదరు. 68-80

బ్రాహ్మణాన్యే నిరీక్షన్తే కోపదృష్ట్యా నరాధమాః, తప్తసూచీ సహస్రేణ చక్షుస్తేషాం ప్రసూచ్యతే. 81

తతః క్షారాంబు ధారాభిస్సేచ్యన్తే నృపసత్తమ, తతశ్చ క్రకచైర్ఘోరైర్భిద్యన్చే పాపకర్మణః. 82

విశ్వాసఘాతినాం చైవ మర్యాదాభేదినాం తథా, పరాన్నలోలుపానాం చ నరకం శృణు దారుణమ్‌. 83

స్వమాంసభోజినో నిత్యం భక్ష్యమాణాశ్శభిస్తు తే, నరకేషు నమస్తేషు ప్రత్యేతం హ్యబ్దవాసినః. 84

ప్రతిగ్రహరతా యే చ వై నక్షత్రాపాఠకాః, యేచ దేవలకాన్నానాం భోజినస్తాన్‌ శృణష్వ మే. 85

రాజన్నాకల్పపర్యన్తం యాతనాస్వాసు దుఃఖితాః, పచ్యన్తే సతతం పాపావిష్టా భోగరతాస్తదా. 86

తతసై#్తలేన పూర్యేన్తే కాలసూత్రప్రపీడితాః, తతః క్షారోదక స్నానం మూత్రవిష్ఠానిషేవణమ్‌. 87

తదన్తే భువమాసాద్య భవన్తి వ్లుెచ్ఛజాతయః అన్యోద్వేగరతా యే తు యాన్తి వైతరణీం నదీమ్‌. 88

త్యక్త పంచమహాయజ్ఞా లాలాభక్షం వ్రజన్తి హి, ఉపాసనాపరిత్యాగే రౌరవం నరకం వ్రజేత్‌. 89

విప్రగ్రామకరా దానం కుర్వతాం శృణు భూపతే, యాతనాస్వాసు పచ్యన్తే యావదాచన్ద్రతారకమ్‌. 90

గ్రామేషు భూపాలవరో యః కుర్యాదధికం కరమ్‌, స సహస్రకులో భుంక్తే నరకం కల్పపంచసు. 91

విప్రగ్రామకరా దానే యో నుమంతా తు పాపకృత్‌, స ఏవ కృతవాన్రాజన్‌! బ్రహ్మహత్యా సహస్రకమ్‌. 92

కాలసూత్రే మహాఘోరే స వసేద్ధి చతుర్యుగమ్‌, అయోనౌ చ వియోనౌ చ పశుయోనౌ చ యో నరః. 93

త్యజేద్రేతో మహాపాపీ స రేతోభోజనం లభేత్‌, వసాకూపం తతః ప్రాప్య స్థిత్వా దివ్యాబ్ది సప్తకమ్‌. 94

రేతోభోజీ భ##వేన్మర్త్య స్సర్వలోకేషు నిన్దితః, ఉపవాసదినే రాజన్దన్తధావనకృన్నరః. 95

స ఘోరం నరకం యాతి వ్యాఘ్రపక్షం చతుర్యుగమ్‌, య స్స్వకర్మ పరిత్యాగీ పాషండీత్యుచ్యతే బుధైః. 96

తత్సఙ్గకృతమోఘసాయత్తావుభావతి పాపినౌ, కల్పకోటి సహస్త్రేషు ప్రాప్నుతో నరకాన్క్రమాత్‌. 97

దేవద్రవ్యాపహర్తారో గురుద్రవ్యాపహారకాః, బ్రహ్మహత్యావ్రతసమం దుష్కృతం భుంజతే నృప!. 98

అనాథధనహర్తారో హ్యనాథం యే ద్విషన్తి చ, కల్పకోటి సహస్రాణి నరకే తే వసన్తి చ. 99

స్త్రీ శూద్రాణాం సమీ పేతు యే వేదాధ్యయనే రతాః, తేషాం పాపఫలం వక్ష్యే శృణుష్వ సుసమాహితః. 100

అథఃశీర్షోర్ధ్వోపాదశ్చ కేలితా స్త్సంభకద్వయే, ధూమ్రపానరతా నిత్యం తిష్ఠన్త్యాబ్రహ్మవత్సరమ్‌. 101

బ్రాహ్మణులను కోపదృష్టిచే చూచిన నరాధములు వేలకొలది కాల్చిన సూదులచే కన్నులలో పొడువబడుదురు. తరువాత కారపు నీటి ధారలచే చల్లబడుదురు. తరువాత వారి దేహములను గడ్డపారలచే త్రవ్వెదరు. విశ్వాసఘాతకులు మర్యాదను భంగపరచువారు ఇతరుల అన్నమును ఆశించువారు తమ మాంసమును తామే భుజిస్తూ , కుక్కలచే భుజింపబడుదురు. ప్రతినరకమున ఒక్క సంవత్సరము చొప్పున నివసించెదరు. ఇతరులనుండి దానము గ్రహించుటయందు ఆసక్తికలవారు, నక్షత్రములను పఠించువారు దేవతల అన్నమును భుజించువారు కల్పము వరకు ఈ యాతనలలో దుఃఖముతో పాపావిష్టులు భోగరతులూ అగుచు నరకము ననుభవించెదరు. కాల సూత్రమును యాతనచే పీడించబడుచు కాగిన తైలములో ముంపబడుదురు. తరువాత కారపు నీటితో స్నానము మలమూత్ర సేవనము చేతురు. తరువాత భూలోకమున వ్లుెచ్ఛజాతులలో పుట్టెదరు. ఇతరులను బాధించువారు వైతరణీ నదిని చేరెదరు. దేవపితృ బ్రహ్మయజ్ఞాది పంచమహా యజ్ఞములను విడిచినవారు లాలా భక్షమను నరకమును పొందెదరు. ఉపాకనను పరిత్యజించినవారు రౌరవ నరకముపే సొందెదరు. బ్రాహ్మణసమూహముల నుంచి పన్నును తీసుకొను వారు సూర్య చంద్రులుండు వరకు ఈ నరకములలో యాతలను పొందెదరు. గ్రామములలో ఎక్కువ పన్నును గ్రహించు రాజు వేయి తరములు అయిదు కల్పములు నరకములననుభవించును. బ్రాహ్మణులనుండి పన్నును తీసుకొనుటను ఆమోదించినవాడు వేయి బ్రహ్మహత్యలను చేసిన వానితో సమానము. నాలుగు యుగములు మహాఘోరమైన కాల సూత్రమను నరకమున నివసించును. భగినీపుత్రవధు మొదలగు స్త్రీల యందు, శూద్రాది స్త్రీల యందు, పశువులందు వీర్యమునుంచివాడు మాహాపాపియగును. అతను నరకమున రేతో భోజనమును చేయును. ఏడు దివ్య వర్షములు వసామాపమను నరకమును పొంది అన్ని లోకములలో నిందించబడును. రేతో భోజనమును చేయుచుండును. ఉపవాసదినమున దంతధావనమును చేయువాడు నాలు యుగములు వ్యాఘ్రపక్షమను నరకమును పొందును. స్వకర్మలను పరిత్యజించువారు పాషండులనబడుదురు. పాషండులతో కలిసియుండువారు కూడా వారితో పాటు వేల కోట్ల కల్పములలో క్రమముగా నరకములను పొందెదరు. దేవ ద్రవ్యములను గురుద్రవ్యముల నపహరించువాడురు బ్రహ్మహత్య చేసిన వారితో సమానముగా నరకము ననుభవించెదరు. అనాధల ధనమునపహరించువారు, అనాధలను ద్వేషించువారు కోటి కల్పములు నరకమున నివసింతురు. స్త్రీల సమీపమున, శూద్రులసమీపమున వేదాధ్యయనమును చేయువారు క్రింద తల, పైన పాదములతో తలక్రిందులుగా రెండు స్తంభముల మధ్యన వేలాడుచుందురు. బ్రహ్మ ఉండునంత వరకు ధూమపానము చేయుచు గడుపుచుందురు. 81-101

జలే దేవాలయే వాపి యస్త్యజేద్దేహజం మలమ్‌, భ్రూణహత్యాసమం పాపం సంప్రాప్నోత్యతిదారుణమ్‌. 102

దంతాస్థికేశనఖరాన్యే త్యజన్త్యమరాలయే, జలే వా భుక్తశేషం చ తేషాం పాపఫలం శృణు. 103

ప్రాసప్రోతా హలైర్భిన్నా ఆర్తరావవిరావిణః, అత్యుష్ణతైలపాకే7 తితప్యన్తే భృశదారుణ.104

కుర్వన్తి దుఃఖసంతప్తా స్తతో7 న్యేషు వ్రజన్తిచ, బ్రహ్మ సంహరతే యస్తు దంతకాష్ఠం తథైవ చ. 105

స యాతి నరకం ఘోరం యావదాచన్ద్ర తారకమ్‌, బ్రహ్మస్వహరణం రాజన్నిహాముత్ర చ దుఃఖదమ్‌. 106

ఇహ సంపద్వినాశాయ పరత్ర నరకాయ చ, కూటసాక్ష్యం వదేద్యస్తు తస్య పాపఫలం శృణు. 107

స యాతి యాతనాస్సర్వా యావదిన్ద్రాశ్చతుర్దశ. ఇహ పుత్రాశ్చ పౌత్రాశ్చ వినశ్యన్తి పరత్ర చ. 108

రౌరవం నరకం భుఙ్త్కే తతో7 న్యానపి క్రమాత్‌, యే చాతికామినో మర్త్యా యే చ మిథ్యాప్రవాదినః, 109

తేషాం ముఖే జతాకాస్తు పూర్యన్తే పన్నగోపమాః, ఏవం షష్టిసహస్రాబ్దే తతః క్షారాంబుసేతనమ్‌. 110

యే వృథా మాంసనిరాతస్తే యాన్తి క్షారకర్దమమ్‌, తతో గజైర్నిపాత్యన్తే మర్తృ పతనం యథా. 111

తదన్తే భువమాసాద్య హీనాంగాః ప్రభవన్తి చ, యస్త్వృతౌ నాభిగచ్ఛేత స్వస్త్రియం మనుజేశ్వర. 112

స యాతి రౌరవం ఘోరం బ్రహ్మహత్యాం చ విన్దతి, అత్యాతారరతం దృష్ట్వా యః శక్తో న నివారయేత్‌. 113

తత్పాపం సమవాప్నోతి నరకం తావుభావపి. పాపినాం పాపగణనాం కృత్వాన్యేభ్యో దిశన్తి చ. 114

అస్తిత్వే తుల్యపాపాస్తే మిథ్యాత్వే ద్విగుణా నృప, అపాపే పాతకం యస్తు సమారోప్య వినిన్దతి. 115

స యాతి నరకం ఘోరం యావచ్చన్ద్రార్క తారకమ్‌. పాపినాం నిన్ద్యమానానాం పాపార్ధం క్షయమేతి చ. 116

యస్తు వ్రతాని సంగృహ్య అపమాప్య పరిత్యజేత్‌, సో7 పి పత్రే అనుభూయార్తిం హీనాంగో జాయతే భువి. 117

అన్యైస్సం గృహ్యమాణానాం వ్రతానాం విఘ్నకృన్నరః, అతీవ దుఃఖదం రౌద్రం స యాతి శ్లేష్మభోజనమ్‌. 118

న్యాయే చ ధర్మశిక్షాయా పక్షపాతం కరోతి యః, న తస్య నిష్కృతిర్బూయః ప్రాయశ్చాత్తాయుతైరపి. 119

అభోజ్యభోజీ సంప్రాప్య విడ్భోజ్యం తు సమాయుతమ్‌, తతశ్చండాలయోనౌ తు గోమాంసాశీ సదా భ##వేత్‌. 120

నీటిలో కాని దేవాలయమున కాని దేహమలమును విడిచినవారు అతి భయంకరమైన భ్రూణహత్య సమమైన పాపమును పొందెదరు. దేవాలయమున దంతములను ఎముకలను కేశములను, గోళ్ళను వదలినవారు, తినగా మిగిలిన దానిని జలమున వదిలిన వారు ప్రాసములవతో పొడువబడుచు, నాగళ్ళచే చీల్చబడుచు ఆర్తనాదములు చేయుచు, చాలా వేడితో మసులుచున్న నూనెలో బాగుగా గోలించబడుదురు. అట్లు దుఃఖముచే బాగుగా తపించినవారు ఇతర నరకములలోనికి పంపబడదురు. బ్రాహ్మణుని చంపినవారు , గంధపు కట్టెను నరికిన వారు సూర్యచంద్రులుండు వరకు ఘోర నరకమున నివసింతురు. బ్రాహ్మణ ధనమును అపహరించుట ఇహ పరములలో దుఃఖమునే కలిగించును. ఇహలోకమున సంపదలను నశింపచేయును. పరమున నరకమున కలిగించును. అసత్యపు సాక్ష్యమును చెప్పువారు ఒక కల్పకాలము అన్ని నకరకయాతనలను పొందెదరు. ఇహ లోకమున పుత్రులు పౌత్రులు నశింతురు. పరలోకమున రౌరవనరకమును ఇతర నరకములను కూడా అనుభవింతురు. అతి కాముకులు, అబద్ధమును మాటలాడువారు చాలా ఘోరమైన నరకమును పొందెదరు. వారి నోట్లో పాముల వంటి జలగలను నింపెదరు. అట్లు ఆరువదివేల సంవత్సరముల అనుభవించిన తరువాత కారపునీటిని చల్లెదరు. వ్యర్ధముగా మాంసమును భుజించువారు కారపు బురదలో పడెదరు. తరువాత కాలితో కొట్టబడినట్లుగా యేనుగులచే పడవేయబడుదురు. దాని తరులాత భూలోకమున అంగవికలులుగా జన్మించెదరు. ఋతుకాలమున తన భార్యను సంగమించినవారు గోరమైన రౌరవ నరకమును పొందును, బ్రహ్మహత్యాపాపమును కూడా పొందును. సమర్ధుడైయుండి కూడా అత్యాచారములను చేయువారిని వారించనివారు కూడా ఆ ఆపాపమునను పొందెదరు. వారిద్దరు నరకమును పొందెదరు. వారిద్దరు నరకమును పొందెదరు. పాపాత్ముల పాపములను లెక్కించుచు ఇతరులకు చెప్పువారు , వారు చెప్పిన పాపములున్నచో వారితో సమానముగా పాపము గలవారిగాను, అసత్యమైనచో రెట్టింపు పాపము గలవారిగా నగుదురు. పాపములేని వానియందు పాపము నారోపించి చెప్పినచో సూర్యచంద్రులు, నక్షత్రములుండు వరకు మహాఘోర నరకమును పొందెదరు. పాపులను నిందించినచో వారి పాపము సగము తొలగును. వ్రతములను ప్రారంభించి పూర్తిచేయక వదిలినచో ఆసి పత్రమను నరకమున యాతనలననుభవించి, భూలోకమున వికలాంగులుగా జన్మించెదరు. ఇతరులు చేయువ్రతములకు విఘ్నములను కల్పించువారు మిక్కిలి దుఃఖమును కలిగించు, భయంకరమైన శ్లేష్మ భోజనమను నరకమును పొందెదరు. న్యాయమునందు, ధర్మశిక్షలో పక్షపాతమును చూపివారికి పదివేల ప్రాయశ్చిత్తముల నాచరించినను నిష్కృతి లభించదు. తినకూడని దానిని తిననవారు మల భోజ్యమను నరకమును పొంది పిదప చండాలులుగా పుట్టి గోమాంసమును భుజించువారగుదురు.

అవమాన్య ద్విజన్వాగ్భిర్బ్రహ్మహత్యాం చ విందతి , సర్వాశ్చ యాతనా భుక్త్వా చాండాలో దశజన్మసు. 121

విప్రాయ దీయమానే తు యస్తు విఘ్నం సమాచరేత్‌, బ్రహ్మహత్యాసమం తేన కర్తవ్యం వ్రతమేవ చ. 122

అపహృత్య పరస్యార్ధం యః పరేభ్యః ప్రయచ్ఛతి, అపబహర్తా తు నిరయీ యస్యార్ధస్తస్య తత్ఫలమ్‌. 123

ప్రతిశ్రుత్వా ప్రదానేన లాలాభక్షం వ్రజేన్నరః, యతినిన్దాపరో రాజన్‌ శిలామాత్రే ప్రయాతి హి. 124

ఆరామచ్ఛేదినో యాన్తి యుగానామేకవింశతిమ్‌, శ్వభోజనం తత స్సర్వా భుంజతే యాతనాః క్రమాత్‌. 125

దేవతాగృహభేత్తారస్తడాగానాం చ భూపతే! పుష్పారామభిమశ్చైవయాం గతి యాంతి తచ్ఛృణు. 126

యాతనాస్వాసు సర్వాసు పచ్యన్తే వై పృథక్‌ పృథక్‌, తతశ్చ విష్ఠాకృమయః కల్పానామేకవింశతిమ్‌. 127

తతశ్చండాలయోనౌ తు శతజన్మాని భూపతే, గ్రామవిధ్వంసకానాం తు దాహకానాం చ లుంపతామ్‌. 128

మహత్పాపం దతాదేష్టుం న క్షమో7 హం నిజాయుషా, ఉచ్ఛిష్ట భోజినో యే చ మిత్రద్రోహపరాశ్చ యే. 129

ఏతేషాం యాతనాస్తీవ్రా భవన్త్యాచన్ద్ర తారకమ్‌, ఉచ్ఛిన్నపితృదేవేజ్యా వేదమార్గబహిస్థ్సితాః. 130

పాషణ్డా ఇతి విఖ్యాతాస్తేషాం వై సర్వ యాతనాః ఏవం బహువిదా భూప యాతనాః పాపకారిణామ్‌. 131

తేషాం లూసాం చ సంఖ్యానం కర్తుం నాలమహం ప్రభో, పాపానాం యాతనానాం చ ధర్మాణాం చాపి భూపతే. 132

సంఖ్యాం నిగదితుం లోకే కః క్షమో విష్ణునా వినా, ఏతేషాం ,సర్వపాపానాం ధర్మశాస్త్రవిధానతః. 133

ప్రాయశ్చిత్తేషు చర్తేషు పాపరాశిః ప్రణశ్యతి, ప్రాయశ్చిత్తాని కార్యాణి సమీపే కమలాపతేః. 134

మాటలతో బ్రాహ్మణులను అవమానించినవారు బ్రహ్మహత్యాపాపమును పొంది అన్ని నరకయాతనల ననుభవించి పది జన్మలు చండాలులుగా పుట్టుదురు. బ్రాహ్మణునకిచ్చు దానమునకు విఘ్నమును కల్పించువారు బ్రహ్మహత్య చేసినవారు చేయవలసిన ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఇతరుల ధనమును అపహరించి మరొకరికి దానము చేసినచో, అపహరించినవారు నరకమును పొందుదురు. ఆ ధనము ఎవరిదో వారికి దాన ఫలము లభించును. ఇచ్చెదనని మాట ఇచ్చి ఈయన వారు లాలాభక్షమను నరకమును పొందును. యతులను నిందించువారు శిలా మాత్రమను నరకమును పొందును. ఉద్యానవలనములను నరుకువారు ఇరువది యొక్క యుగములు శ్వభోజనమను నరకమును అనుభవించి వరుసగా అన్ని యాతనల ననుభవించెదరు. దేవాలయములను తటాకములను పూలతోటలను ధ్వంసము చేయువారు అన్ని యాతనలను వేరువేరుగా అనుభవించి ఇరువది యొక్క కల్పములు మలములో క్రిములుగా ఉండి, నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గ్రమములను ధ్వంసమును చేయువారు, దగ్ధముగావించువారు పొందెడు పాపమును, నరకములను నా జీవితకాలమునంతటిలోనూ చెప్పజాలను. ఉచ్ఛిష్టమును భుజించువారు మిత్రద్రోహులు సూర్యచంద్రులుండు వరకు తీవ్రయాతనలము పొందెదరు. పితృదేవయజ్ఞములను విచ్ఛిన్నమును చేసినవారు, వేద మార్గములనుండి బహిష్కృతులైన వారు పాషండులనబడెదరు. వారికి అన్ని యాతనలు సంప్రాప్తించును. ఓ రాజా! ఇట్లు పాపకర్మలు నాచరించువారికి చాలా విధములైన యాతములు కలుగును. ఆ పాపములను యాతనలను లెక్కించు శక్తి నాకు లేదు. పాపములను యాతనలను ధర్మములను లెక్కించుటకు శ్రీమహావిష్ణువు తప్ప ఇతరులు సమర్ధులు కారు. ఈ పాపములనన్నింటికి ధర్మశాస్త్ర విదానముననుసరించి ప్రాయశ్చిత్తముల నాచరించినచో పాప రాశి నశించును. ఈ ప్రాయశ్చిత్తములనన్నింటిని శ్రీమహావిష్ణువు సన్నిధిలో నాచరించవలయును. 121-134

న్యూనాతిరిక్తకృత్యానాం సంపూర్తికరణాయ చ, గంగా చ తులసీ చైవ సత్సంగో హరికీర్తనమ్‌. 135

అనసూయా హ్యహింసా చ సర్వేప్యేతే హి పాపహాః, విష్ణ్వర్పితాని కర్మాణి సఫలాని భవన్తి హి. 136

అనర్పితాని కర్మాణి భస్మవిన్యస్తబవ్యవత్‌, నిత్యం నైమిత్తికం కామ్యం యచ్ఛాన్యన్మోక్షసాధనమ్‌. 137

విష్ణౌ సమర్పితం సర్వం సాత్త్వికం సఫలం భ##వేత్‌, హరిభక్తిః పరా నౄణాం సర్వపాపప్రణాశీనీ. 138

సా భక్తిర్దశధా జ్ఞేయా పాపారణ్యదవోపమా, తామసై రాజసైశ్చైవ సాత్ర్వికైశ్చ నృపోత్తమ. 139

యచ్చాన్యస్య వినాశార్థం భజనం శ్రీపతేర్నృప, సా తామస్యధమా భక్తిః జలభావధరా యతః. 140

యో7ర్చయేత్కైతవధియా సై#్వరిణీ స్వపతిం యతా, నారాయణం జగన్నాధం తామసీ మధ్యామా తు సా. 141

దేవపూజాపరాన్దృష్ట్వా మాత్సర్యాదో7ర్చయేద్ధరిమ్‌, సా భక్తిః పృథివీపాల తామసే చోత్తమా స్మృతా. 142

ధనధాన్యాదికం యస్తు ప్రార్ధయన్నర్చయేద్ధరిమ్‌. శ్రద్ధయా పరయా యుక్తస్సా రాజస్యధమా స్మృతా. 143

యస్సర్వలోకవిఖ్యాతికీర్తిముద్దిశ్య మాధవమ్‌,స అర్చయేత్పరయా భక్త్యా సా మధ్యా రాజసీ మతా. 144

సాలోక్యాది పదం యస్తు సముద్దిశ్యార్చయేద్ధరిమ్‌, సారాజస్యుత్తమా భక్తిః కీర్తితా పృథిపతే. 145

యస్తు స్వకృతపాపానాం క్షయార్ధం ప్రార్చయేద్ధరిమ్‌, శ్రద్ధయా పరయోపేతః సా సాత్త్విక్యధమా స్మృతా. 146

హరేరిదం ప్రియమితి శుశ్రూషాం కురుతే తు యః, శ్రద్ధయా సంయుతో భూయస్సాత్త్వికీ మధ్యామా తు సా. 147

విదిబుద్ధ్యార్చయేద్యస్తు దాసవచ్ఛ్రీపతిం నృప, భక్తీనాం ప్రవరా సా తు ఉత్తమా సాత్త్వికీ స్మృతా. 148

మహిమానం హరేర్యస్తు కించిత్కృత్వా ప్రియో నరః, తన్మయత్వేన సంతుష్ట స్సా భక్తిరుత్తమోత్తమా. 149

అహమేవపరో విష్ణుర్మయి సర్వమిదం జగత్‌, ఇతి యస్సతతం పశ్యేత్తం విద్యాదుత్తమోత్తమమ్‌. 150

ఏవం దశవిధా భక్తిస్సంసారచ్ఛేదకారిణీ, తత్రాపి సాత్త్వికీభక్తిస్సర్వకామఫలప్రదా. 151

తస్మాచ్ఛృణుష్వ భూపాల సంసారవిజిగీషుణా, స్వకర్మ7ణోవిరోధేన భక్తిః కార్యా జనార్దనే. 152

యస్స్వధర్మం పరిత్యజ్య భక్తిమాత్రేణ జివతి, న తస్య తుష్యతే విష్ణురాచారేణౖవ తుష్యతే. 153

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్ప్యతే, ఆచారప్రభవలో ధర్మో ధర్మస్య ప్రచురచ్యుతః, 154

తస్మాత్కార్యా హరేర్భక్తి స్స్వధర్మస్యావిరోధినీ, సదాచారవిహీనానాం ధర్మా అప్యసుఖప్రదాః. 155

స్వధర్మ హీనా భక్తిశ్చాప్యకృతైవ ప్రకీర్తితా, యత్తు పృష్టం త్వయా భూయస్తత్సర్వం గదితం మయా. 156

తస్మాద్ధర్మపరో భూత్వా పూజయస్వ జనార్దనమ్‌, నారాయణమణీయాంసం సుఖమేష్యసి శాశ్వతమ్‌. 157

శివ ఏవ హరిస్సాక్షాద్ధరిరేవ శివస్స్వయమ్‌, ద్వయోరన్తరదృగ్యాతి నరకాన్కోటిశః ఖలః. 158

తస్మాద్విష్ణుం శివం వాపి సమం బుద్ధ్వా సమర్చయ, భేదకృద్దుఃఖమాప్నోతి ఇహలోకే పరత్ర చ. 159

ఎక్కువ తక్కువలుగా చేసిన కర్మలను పరిపూర్ణములుగా చేయునని గంగా తులసి, సత్సంగము, హరికీర్తనము, అసూయ లేకయుండుట, అహింస అనునవి. ఇవి అన్ని పాపములను హరింప చేయును. శ్రీమహావిష్ణువునకు సమర్పించిన కర్మలు సఫలములగును

శ్రీమహావిష్ణువునకు అర్పించక చేసిన కర్మలు బూడిదలో అర్పించిన హోమద్రవ్యములవంటివి. మోక్షసాధనములైన నిత్యనైమిత్తిక కామ్య కర్మలు , ఇతర కర్మలు విష్ణువును కర్పించినచో సాత్త్వికములు సఫలములగును. మానవులకు అన్ని పాపములను నశింప చేయునది ఉత్తమముమైనది హరిభక్తి యొక్కటే. పాపారణ్యములకు దవాగ్నియైన ఆ హరి బక్తి పది విధములని తెలియుము. సాత్త్వికములు రాజసములు తామసములుగా భక్తి ప్రభేదములుండును. ఇతరుల వినాశము కొఱకు శ్రీహరిని భజించినచో దుష్ట స్వభావము కలది కావున ఈ భక్తి అధమతామసభక్తు అనబడును. తనకు నచ్చిన పురుషునితో రమించు స్త్రీ తన భర్తను పూజించునట్లు జగన్నాథుడైన నారాయణుని కపటముతో పూజించినచో ఆ భక్తి మధ్యమ తామసభక్తి అనబడును. దేవతలను పూజించువారిని జూచి మాత్రర్యముతో శ్రీహరిని ఆర్పించినచో ఆ భక్తి ఉత్తమ తామసభక్తి అనబడును. ధాన్యాదికములను కోరుచు శ్రీహరిని ఉత్తమమైన శ్రద్ధచే పూజించినచో ఆ భక్తి అధమరాజసభక్తి అగును. అన్ని లోకములలో ప్రసిద్దిపొందు కీర్తికావలయుని ఉత్తమమైన భక్తిచే శ్రీహరిని పూజించిన చో మధ్యమ రాజభక్తి యగును. సాలోక్యసాయుజ్యములను కోరుచు శ్రీహరిని పూజించినచో ఉత్తమరాజస భక్తి యనబడును. తాను చేసిన పాపములు నశించవలయునని ఉత్తన శ్రద్ధతో శ్రీహరిని పూజించినచో అధమ సాత్త్విక భక్తియగును. ఇది శ్రీహరికి ప్రీతిని కలిగించునని శ్రీహరిని సేవించినచో మద్యమసాత్త్విక భక్తియగును. హరిని పూజించుట నా కర్తవ్యమను బుద్ధితో దాసుని వలె శ్రీహరిని పూజించినతో అన్ని భక్తులలో ఉత్తమమైనగు ఉత్తమ సాత్త్విక భక్తి యగును. శ్రీహరి మహిమను ఏ కొంచెమానను గొప్ప సంతోషముతో ప్రీతికలవాడై తన్మయత్వముతో స్తుతించినచో ఉత్తమోత్తమమైన భక్తి యగును. నేనే విష్ణువును. ఈ జగత్తంతయు నాలోనే నిలిచియున్నది. అని జగత్తునంతటిని విష్ణుమయముగా చూడగలవాడు ఉత్తమోత్తముడగును. ఇట్లు పది విధములుగా నుండు భక్తి సంసారమును నశింపచేయును. ఈ పదివిధములలోని సాత్త్విక భక్తి అన్ని కోరికలను ప్రసాదించును. కావున ఓ మహారాజా: సంసారమును గెలువవలయునని కోరువారు తమ కర్మలకు విరోధము కాకుండా శ్రీహరియందు భక్తిని చేయవలయును. స్వధర్మమును వదలి భక్తిని నాత్రమే చేయువాని విషయమున శ్రీహరి సంతోషించడు. ఆచారముతో మాత్రమే శ్రీహరి సంతోషించెను. అన్ని ఆగమములలోను మొదటిది ఆచారమని నిర్ణయించబడినది. ఆచారమునుండే ధర్మము పుట్టును. ధర్మమునకు శ్రీహరి ప్రభువు. కావున స్వధర్మముకు భంగకరము కాని విధముగా శ్రీహరి భక్తిని ఆచరించవలయును. సదాచారము లేని వారికి ధర్మములు సుఖము నీయజాలవు. స్మధర్మాచరణములేని భక్తిలేని దానితో సమానమే. నీవు అడిగిన దానినంతటిని చెప్పితిని. కావున ధర్మపరుడైన జనార్దనుని పూజింపుము. సూక్ష్మరూపుడైన శ్రీమన్నారాయణుని పూజించి ఆనందమును శివుడే శ్రీహరి. శ్రీహరియే శివుడు. ఇద్దరిలో భేదమును చూచు ఖలుడు కోటి నరకములను పొందును. కావున శ్రీహరిని కాని శివుని కాని సమానముగా భావించి పూజించుము.భేదమును చూచువాడు ఇహపరములలో దుఃఖమునే పొందును. 135-159

యదర్ధమహమాయాతస్త్వత్సమీపం జనాధిప! తత్తే వక్ష్యామి సుమతే! సావధానం నిశామయ. 160

ఆత్మఘాతకపాప్మానో దగ్ధాః కపిలకోపతః, వసన్తి నరకే తే తు రాజంస్తవ పితామహాః. 161

తానుద్ధర మహాభాగ గంగానయకర్మణా, గంగా సర్వాణి పాపాని నాశయత్యేవ భూపతే!162

కేశాస్థినఖదంతాశ్చ భస్మాపి నృపసత్తమ, నయతి విష్ణుసదనం స్పృష్టా గాంగేన వారిణా. 163

యస్యాస్థి భస్మ వా రాజన్‌ గంగాయాం క్షిప్యతే నరైః, స సర్వపాపనిర్ముక్తః ప్రయాతి భవనం హరేః. 164

యాని కాని చ పాపాని ప్రోక్తాని తవ భూపతే, తాని సర్వాణి నశ్యన్తి గంగాబిన్ద్వభిషేచనాత్‌. 165

ఓ రాజా! సుబుద్ధీ ! నేను నీ వద్దకు వచ్చిన కారణమును చెప్పెదను. సావధాముగా వినుము. నీ పితామహులు అత్మహత్యా పాపమును చేసి కపిల మహర్షి కోపముచే దహించబడి నరకముననున్నారు. ఓ మహానుభావా! గంగను తీసుకొని వచ్చి నీ పితామహులనుద్ధరించుము. గంగ అన్ని పాపములను నశింపచేయును. కేశములు, ఆస్థులు, నఖములు, దంతములు, చివరికి బూడిద అయిననూ గంగాజలములచే స్పృశించబడినచో శ్రీ విష్ణులోకమును చేర్చును. అస్థులను కాని భస్మమును కాని గంగలో పడవేసినచో అతను అన్నిపాపముల నుండి విముక్తుడై శ్రీహరి భవనమును చేరును. గంగా బిన్ద్వభిషేకము వలన నేను నీకు తెలిపిన పాపములన్నియూ నశించును. 160-165

సనక ఉవాచ-

ఇత్యుక్త్వా మునిసార్దూల మహారాజం భగీరథమ్‌, ధర్మాత్మానం ధర్మరాజః సద్యశ్చాన్చర్దధే తదా. 166

స తు రాజా మహాప్రాజ్ఞః సర్వశాస్త్రార్ధపారగః, నిక్షిప్య పృథివీం సర్వాం సచివేషు య¸° వనమ్‌. 167

తుహినాద్రే తతో గత్వా నర నారాయణాశ్రమాత్‌, పశ్చిమే తుహినాక్రాన్తే శృంగే షోడశయోజనే. 168

తపస్తప్వా7 నయామాస గంగాం త్రైలోక్యపావనీమ్‌. 169

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే

ప్రథమపాదే ధర్మాఖ్యానే ధర్మరాజోపదేశేన

భగీరథస్య గంగానయనోద్యమవర్ణనం నామ

పంచదశో7ధ్యాయః

సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా! మహారాజగు భగీరథునితో యమధర్మరాజు ఇట్లు చెప్పి వెంటనే అంతర్దానము చెందెను. సర్వశాస్త్రార్థకోవిదుడు మహాప్రాజ్ఞుడగు భగీరథమహారాజు మంత్రులయందు రాజ్యభారమునుంచి అరణ్యమునకు వెళ్ళెను. హిమవత్పర్వతమునకు వెళ్ళి అచట నరనారాయణాశ్రమమునకు పశ్చిమమున పదునారు యోజనముల దూరమున మంచుతో కప్పబడియున్న శృంగమున తపస్సు చేసి మూడు లోకములలో పావనమైన గంగను తెప్పించెను. 166-169

ఇది శ్రీ బృన్నారదీయ పురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున

ధర్మాఖ్యానము న ధర్మరాజోపదేశముచే

భగీరథుడు చేసిన గంగానయనోద్యమ

వర్ణనమను పదునైదవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page