Sri Naradapuranam-I
Chapters
Last Page
షోడశో7ధ్యాయః పదునారవ అధ్యాయము భగీరథగంగానయనమ్ నారద ఉవాచ :- హిమవద్గిరిమాసాద్య కిం చకార మహీపతిః, కథమానీతవాన్గంగామేత్మనే వక్తుమర్హసి. 1 నారద మహర్షి పలికెను:- భగీరథమహారాజు హిమవత్పర్వతమును చేరి ఏమి చేసెను? గంగనెట్లు తీసుకొని వచ్చెను? ఈ విషయమును నాకు తెలుపుము. సనక ఉవాచ :- భగీరథో మహారాజో జటాచీరధరో మునే, గచ్ఛన్హిమాద్రిం తపసే ప్రాప్తో గోదావరీతటమ్. 2 తత్రాపశ్యన్మహారణ్య భృగోరాశ్రమముత్తమమ్, కృష్ణసారసమాకీర్ణం మాతంగగణసే వితమ్. 3 భ్రమద్భమరసంఘష్టం కూజద్విహగసంకులమ్, వ్రజద్వరాహనికరం చమరీపృచ్ఛవీజితమ్. 4 నృత్యన్మయూరనికరం సారంగాదినిషేవితమ్, ప్రవర్ధితమహావృక్షం మునికన్యాభిరాదరాత్. 5 శాలతాలతమాలాఢ్యం నూనహిన్తాలమండితమ్, మాలతీయూధికాకుంధచంపకాశ్వత్థభూషితమ్. 6 ఉత్ఫుల్లకుసుమోపేతమృషిసంఘనిషేవితమ్, వేదశాస్త్రమహాఘోషమాశ్రమం ప్రావిశద్భృగోః. 7 సనక మహర్షి పలికెను : - భగీరధమాహారాజు జడలను, నారవస్త్రములను ధరించి తపస్సు చేయుటకు హిమవత్పర్వతమునకు వెళ్ళుచు గోదావరీతీరమును చేరెను. అచట ఆ మహారణ్యమున ఉత్తమము పవిత్రమైన భృగుమహర్షి ఆశ్రమమును చూచెను. ఆయాశ్రమమున జింకలు, యేనుగులు, తిరుగాడు తుమ్మెదల ఝుంకారములు, కూయుచున్న పక్షుల కోలాహలములు, వెళ్ళుచున వరాహ బృందములు, పుచ్ఛములతో వీచుచున్న చమరీ మృగములు, నాట్యముచేయుచున్న నెమళ్ళు గుంపులు, లేళ్ళు మొదలగు సాధుజంతువులు మునికన్యలచే ఆదరముతో పెంచబడిన వృక్షములు , శాలతమాలతాళమీంతాలములు మాలతి, సంపెంగ, మల్లె, సన్నజాజి, రాగి, మొదలగు లతావృక్షములు, వికసించిన పూవులు కలిగి, ఋషిసమూహములచే వేదఘోష చేయబడుచుండగా భగీరధ మహారాజు ఆయాశ్రమమున ప్రవేశించెను. 2-7 గృణన్తం పరమం బ్రహ్మ వృతం శిష్యగణౖర్మునిమ్, తేజసా సూర్యసదృశం భృగుం తత్ర దదర్శ సః. 8 ప్రణనామాథ విప్రేన్ద్రం పాదసంగ్రహాణాదినా, ఆతిథ్యం భృగురప్యస్య చక్రే సన్మానపూర్వకమ్. 9 కృతాతిథ్యక్రియో రాజా భృగుణా పరమర్షిణా, ఉవాచ ప్రాంజలిర్భూత్వా వినయాన్మునిపుంగవమ్. 10 పరబ్రహ్మను ధ్యానము చేయుచు, శిష్య బృందములతో కూడి ఉన్న సూర్యుని వంటి తేజస్సు గల భృగుమహర్షిని చూచెను. పాదముల పట్టుకొని భృగుమహర్షికి నమస్కరించెను. భృగుమహర్షి కూడా సన్మాన పూర్వకముగా భగీరథ మహారాజునకు అతిథి మర్యాదను చేసెను. ఇట్లు భృగుమహర్షిచే అతిథి మర్యాదను పొందిన భగీరథమహారాజు చేతులు జోడించి వినయముతో భృగుమహర్షిని గూర్చి ఇట్లు పలికెను. 8-10 భగీరథ ఉవాచ:- భగవన్సర్వధర్మజ్ఞ ! సర్వశాస్త్రవిశారద ! పృచ్ఛామి భవభీతో7హం నృణాముద్ధారకారణమ్. 11 భగవాంస్తుష్యతే యేన కర్మణా మునిసత్తమ ! తన్మమాఖ్యాహి సర్వజ్ఞ అనుగ్రాహ్యో7 స్మితే యది. 12 సర్వధర్మములను తెలుసుకొని సర్వశాస్త్రములందు విశారదుడైన ఓ మహర్షి ! సంసారమునకు భయపడిన నాకు మానవులు సంసారమును దాటు కారణమును తెలుపుము. ఓ మునిసత్తమా ! శ్రీమన్నారాయణుడు సంతోషించు కర్మను నామీది దయతో తెలుపుము. 11-12 భృగురువాచ :- రాజంస్తవేప్సితం జ్ఞాతం త్వం హి పుణ్యవతాం వరః, అన్యథా స్వకులం సర్వం కథముద్ధర్తుతమర్హసి. 13 యో వా కో వాపి భూపాల స్వకులం శుభకర్మణా, ఉద్ధర్తుకామస్తం విద్యాన్నరరూపధరం హరిమ్. 14 కర్మణా యేన దేవేశో నృణామిష్టఫలప్రదః, తత్ప్రవక్ష్యామి రాజేన్ద్ర శృణుష్వ సుసమాహితః. 15 భవ సత్యపరో రాజన్న హింసా నిరతస్తథా, సర్వభూతహితో నిత్యం మానృతం వద వై క్వచిత్. 16 త్యజ దుర్జనసంవర్గం భజ సాధులసమాగమమ్, కురు పుణ్యమాహారాత్రం స్మర విష్ణుం సనాతనమ్. 17 కురు పూజాం మహావిష్ణోర్వా హి శాన్తిమనుత్తమామ్, ద్వాదశాష్టాక్షరం మన్త్రం జప శ్రేయో భవిష్యతి. 18 భృగుమహర్షి పలికెను:- ఓ రాజా! నీ కోరిక తెలిసినది. నీవు పుణ్యాత్ములలో శ్రేష్ఠుడవు. కావుననే నీ కులము నుద్ధరించదవచితివి. మంచిపనులచే తన కులమునుద్ధరించదలచు నరుని సాక్షాత్తు శ్రీహరిగా తెలియవలయును. ఓ రాజేన్ద్రా! శ్రీహరిని సంతోషించు కర్మను తెలిపెదను. సావధానముగా వినుము సత్యపరుడుగా అహింసా నిరతుడుగా ఉండుము. అన్నిప్రాణులహితమును కోరుము. అసత్యముము పలుకకుము. దుర్జనులతో సాంగత్యమయును విడువుము. సాధు జనసమాగమును కోరిము. రాత్రింబవళ్ళు పుణ్యము నాచరించుము,. సానాతనుడైన శ్రీమవిష్ణువును స్మరించుము. మహావిష్ణఉవును పూజించి సాటిలేని శాంతిని పొందుము. ద్వాదశాక్షర మంత్రమును కాని, అష్టాక్షక మంత్రమును కాని జపించుము. నీకు మేలు కలుగును. 13-18 భగీరథ ఉవాచ :- సత్యం తు కీదృశం ప్రోక్తం సర్వభూతహితం మునే ! అనృతం కీదృసం ప్రోక్తం దుర్జనాశ్చాపి కీదృశాః. 19 సాధవః కీదృశాః ప్రోక్తాస్తస్య పూజా త కీదృశీ, స్మర్తవ్యశ్చ కథం విష్ణుస్తస్య పూజా చ కీదృశీ. 20 శాన్తిశ్చ కీదృశీ ప్రోక్తా మునే తత్త్వార్థకోవిద ! కృపాం మయి పరాం సర్వం వ్యాఖ్యాతుమర్హసి. 21 భగీరథమహారాజు పలికెను:- సత్యమనగా నెట్టిది ? సర్వభూతహితమననేమి? అసత్యమనగానేమి? దుర్జనులెట్టివారు? సాధువులనగా నెవరు? పుణ్యమనుగా నెట్టిది? విష్ణువునెట్లు స్మరించవలయును? ఎట్లు పూజించవలయును ? శాంతి యనగా నెమి? అష్టాక్షర మంత్రమనగానేమి? ద్వాదశాక్షరమంత్రమేది ? వాస్తవార్థమును తెలిసిన ఓ మహర్షీ ! నా మీద దయయుంచి అంతయు తెలుపుము. 19-21 భృగురువాచ:- సాధు ! సాధు ! మహాప్రాజ్ఞ తవ బుద్దిరనుత్తమా! యత్పృష్టో హం త్వయా భూప! తత్సర్వం ప్రవదామి తే 22 యథార్థకథనం యత్తత్సత్యమాహుర్విపశ్చితః ధర్మావిరోధతో వాచ్యం తద్ధి ధర్మపరాయణౖః. 23 దేశకాలాది విజ్ఞాయ స్వయమస్యావిరోధతః యద్వచః ప్రోచ్యతే సద్భిస్తత్సత్యమభిదీయతే. 24 సర్వేషామేవ జన్తూనామక్లేశజననం హి తత్ అహింసా సా నృప ప్రోక్తా సర్వకామప్రదాయినీ 25 కర్మకార్యసహాయత్వమకార్యపరిపంథితా సర్వలోకహితత్వం వై ప్రోచ్యతే ధర్మకోవిదైః. 26 ఇచ్ఛానువృత్తకథనం ధర్మాధర్మవివేకినః అనృతం తద్ధి విజ్ఞేయం సర్వశ్రేయోవిరోధి తత్. 27 యే లోకే ద్వేషిణో మూర్ఖా కుమార్గరతబుద్ధయః తే రాజన్దుర్జనా జ్ఞేయాస్సర్వధర్మబహిష్కృతాః. 28 ధర్మాధర్మవివేకేన వేదమార్గాముసారిణః సర్వలోకహితాసక్తాః సాధవః పరికీర్తితాః. 29 హరిభక్తికరం యత్తత్సద్భిశ్చ పరిరంజితమ్ ఆత్మనః ప్రీతిజనకం తత్పణ్యం పరికీర్తితమ్. 30 సర్వం జగదిదం విష్ణుర్విష్ణుస్సర్వస్య కారణమ్ ఆహం చ విష్ణుర్యజ్ఞానం తద్విష్ణుస్మరణం విదుః. 31 సర్వదేవమయా విష్ణుర్విధినా పూజయామి తమ్ ఇతి యా భవతి శ్రద్ధా సా తద్భక్తిః ప్రకీర్తితా. 32 సర్వభూతమయో విష్ణుః పరిపూర్ణః సనాతనః ఇత్యభేదేన యా బుద్ధిః సమతా సా ప్రకీర్తితా. 33 సమతా శత్రుమిత్రేషు వశిత్వం చ తథా నృప యదృచ్ఛాలాభ సంతుష్టిః సా సాన్తిః పరికీర్తితా. 34 ఏతే సర్వే సమాఖ్యాతాస్తపస్సిద్ధిప్రదా నృణామ్ సమస్తపాపరాశీనాం తరసా నాశ##హేతవః. 35 అష్టాక్షరం మహామన్త్రం సర్వపాపప్రణాశనమ్ వక్ష్యామి తవ రాజేన్ద్ర పురుషార్థైకసాధనమ్. 36 విష్ణోః ప్రియకరం చైవ సర్వసిద్ధిప్రదాయకమ్ నమో నారాయణాయేతి జపేత్ప్రణవపూర్వకమ్. 37 నమో భగవతే ప్రోచ్య వాసుదేవాయ తత్పరమ్ ప్రణవాద్యం మహారాజ ! ద్వాదశార్ణముదాహృతమ్. 38 ద్వయోస్సమం ఫలం రాజన్నష్టద్వాదశవర్ణయోః ప్రవృత్తౌ చ నివృత్తౌ సామ్యముద్దిష్టమేతయోః. 39 శంఖచక్రధరం శాంతం నారాయణనామయమ్ లక్ష్మీ సంశ్రితవామాంకం తథా భయకరం ప్రభుమ్. 40 కిరిటమండలధరం నానామండనశోభితమ్ భ్రాజత్కౌస్తుభమాలాఢ్యం శ్రీవత్సాంకితవక్షసమ్. 41 పీతాంబరధరం దేవం సురాసురనమస్కృతమ్ ధ్యాయేదనాదినిధనం సర్వకామఫలప్రదమ్. 42 అన్తర్యామీ జ్ఞానరూపీ పరిపూర్ణస్సనాతనః ఏతత్సర్వం సమాఖ్యాతం యత్తు పృష్టం త్వయా నృప 43 స్వస్తి తే7స్తు తపస్సిద్ధిం గచ్ఛ లబ్ధుం యథా సుఖమ్. 44 భృగుమహర్షి పలికెను:- ఓ మహాప్రాజ్ఞుడా ! బాగు ! బాగు ! నీ బుద్ధికి సాటిలేదు. నీవడిగిన వాటినన్నింటినీ నీకు తెలిపెదను. ఉన్నది యున్నట్లుగా యధార్థమును చెప్పుట సత్యమని పండితులందురు. ధర్మపరాయణులు ధర్మమునకు విరుద్ధము కాని విధముగా చెప్పవలయును. దేశకాలాదులము చక్కగా తెలిసి తనకు తన ధర్మమునకు విరుద్ధముగా కాని విధముగా చెప్పబడు మాటయే సత్యమని సత్పురషురు చెప్పెదరు. అన్ని ప్రాణులకు కష్టమును కలిగించకయుండటయే అహింసనయబడును. ఈ అహింస అన్ని కోరికలను తీర్చును. చేయదగిన కార్యమునకు సాయపడుట చేయరాని పనిని అడ్డదించుటయే సర్వలోకహితమని ధర్మకోవిదులు చెప్పెదరు. ధర్మాధర్మములు తెలియక ఇష్టమొచ్చినట్లు చెప్పుటయే అసత్యమనబడును. ఈ సత్యమయు అన్ని శ్రేయస్సులకు విరోధియేయగును. లోకమున అందరిని , అన్నిటిని ద్వేషించువారు, మూర్ఖుకులు, చెడుదారిన నడుచుటలో ఆసక్తు కలవారు దుర్జనులని తెలియును. ఈ దుర్జనులు అన్ని ధర్మకార్యములలో, ధర్మములలో బహిష్కృతులే, ధర్మధర్మ వివేకముతో వేదమార్గము ననుసరించుచు అన్ని ప్రాణులకు హితమును సమకూర్తువలయుని కోరువారు సజ్జనులనబడుదురు. శ్రీహరియందు భక్తిని కలుగజేయునది, సత్పురులకానందమును కలిగించినది. తమకు ప్రీతిని కలిగించునది, సత్పురులకానందమును కలిగించునది, తమకు ప్రీతిన కలిగించునది. పుణ్యమనబడును. ఈ జగత్తంతయూ విష్ణువే. అన్నిటికీ కారణము విష్ణువే. నేను కూడా విష్ణువునే. అను జ్ఞానమే విష్ణుస్మరణ మనబడును. విష్ణువు సర్వదేవ స్వరూపుడు. శ్రీమహావిష్ణువును విధిగా పూజించెదను అను శ్రద్ధయే భక్తియనబడును. విష్ణువు సర్వప్రాణి స్వరూపుడు, పరిపూర్ణుడు, సనాతనుడు అని అభేదబుద్ధియే సమతయనబడును. శత్రుమిత్రవిషయమున సమబుద్ధితో నుండుట, ఇంద్రియ జయము, దైవసంకల్పముచే లభించిన దానితో తృప్తి చెందుట శాంతియనబడును. ఈ పైన చెప్పబడినవన్నియూ మానవులకు తపస్సిధ్ధిని కలిగించునవి. అన్ని పాపరాశులను వెంటనే నశింపచేయగలవి. అన్ని పాపములను నశింపచేసి అన్ని పురుషార్ధఘములను సాధించగల ఒకే సాధనము అయిన అష్టాక్షరీ మహామంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము విష్ణువునకు ప్రియము, అన్ని సిద్ధులను అందించునది. మొదట ప్రణవమునుచ్చరించి పిదప నమో నారాయణాయ అని జపించినచో అష్టాక్షరీ మహామంత్రమగును. మొదట ప్రణవమునుచ్చరించి , పిదప నమో భగవతే అని పలికి పిమ్మట వాసుదేవాయ అని ఉచ్చరించినచో ద్వాదశాక్షరీ మంత్రమగును. అనగా ''మ్ నమో నారాయణాయ'' అనునది అష్టాక్షరీ మంత్రము. ''ఓమ్ నమో భగవతే వాసుదేవాయ'' అనునది ద్వాదశాక్షరీ మంత్రము అని భావము. ఈ రెండు మంత్రములకు సమాన మైన ఫలమే లభించును. ప్రవృత్తిలోను నివృత్తిలోను అనగా ఇహపరములలో ఈ రెండు మంత్రములు సమములే. శంఖచక్రధరుడు, వికారరహితుడు, శాంతుడు, లక్ష్మీవామాంకమున కలవాడు, అభయప్రదుడు, కిరీటమండలాదినానాభరణశోభితిడు, కౌస్తుభమణిచే ప్రకాశించు హారము కలవాడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షస్థలమున కలవాడు, పీతాంబరధారి, సురాసురులతో నమస్కరించబడువాడు. ఆద్యంతములు లేనివాడు అందరి కోరికల నీడేర్చువాడు, అంతర్యామీ, జ్ఞానస్వరూపుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, అగు శ్రీమన్నారాయణుని ధ్యానించవలయును. ఇట్లు నీవడిగినదంతయూ చెప్పితిని. నీకు శుభమగుగాక ! తపస్సిద్ధిని పొందుటకు యథావకాశముగా వెళ్ళుము. 22-44 ఏవముక్తో మహాపాలో భృగుణా పరమర్షిణా, పరమాం ప్రీతిమాపన్నః ప్రపేదే తపసే వనమ్. 45 హివద్గిరిమాసాద్య పుణ్యదేశే మనోహరే , నాదేశ్వరే మహాక్షేత్రే తపస్తేపే7 తిదుశ్చరమ్. 46 రాజా త్రిషవణస్నాయీ కందమూలఫలాశనః, సర్వభూతహితశ్శాన్తో నారాయణపరాయణః. 47 సర్వబూతహితశ్శాన్తో నారాయణపరాయణః, పత్రైః పుషై#్పః ఫలైస్తోయైస్త్రికాలం హరిపూజవః. 48 ఏవం బహుతిథిం కాలం నీత్వా చాత్యన్తధైర్యవాన్, ధ్యాయన్నారాయణం దేవం శీర్ణపర్ణాశనో7భవత్. 49 ప్రాణాయామపరో భూత్వా రాజా పరమధార్మికః, నిరుచ్ఛ్వాసప్తపస్తప్తుం తతస్సముపచక్రమే. 50 ధ్యాయన్నారాయణం దేవమనంతపరాజితమ్, షష్టివర్షసహస్రాణి నిరుచ్ఛ్వాసపరో7భవత్. 51 తస్య నాసాపుచాద్రాజ్ఞో వహ్నిర్జజ్ఞే భయంకరః, తం దృష్ట్వా దేవతాస్సర్వే విత్రస్తా వహ్నితాపితాః. 52 అభిజగ్ముర్మహావిష్ణుః యత్రాస్తే జగతాంపతిః, క్షీరోదస్యోత్తరం తీరం సంప్రాప్య త్రిదశేశ్వరాః. అస్తువన్దేవదేవేశం శరణాగతపాలకమ్. 53 పరమర్షి అయిన భృగువిట్లు పలుకగా పరమానందమును పొందిన భగీరథ మహారాజు తపస్సు చేయుటకు అరణ్యమును చేరెను. హిమవత్పర్వతమును చేరి పవిత్రము సందరము అయిన నాదేశ్వరమను క్షేత్రమున కఠోరమైన తపస్సునాచరించెను. మూడు వేళలలో స్నానము ను చేయుచు కందమూల ఫలములను భుజించుచు, అతిథులను హితమును కలిగించుచు నారాయణుని యందు మనసు నిలిపి పత్రపుష్పఫలతోయములతో మూడువేళలా శ్రీహరిని పూజించుచు, మిక్కిలి ధైర్యముతో చాలాకాలమును గడిపి శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు రాలిపడిన ఆకులను తినుచు తపమునాచరించెను. పరమధార్మికుడైన భగీరథమహారాజు ప్రాణాయమముచే ఊపిరి పీల్చకనే తపస్సున చేయ సంకల్పించెను. అనంతుడు అపరాజితుడు అగు శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు ఆరువది వేల సంవత్సరములు గాలి పీల్చకనే యుండగా, అతని నాసికాపుటము నుండి గొప్ప అగ్ని పుట్టెను. ఆ యగ్నిచే తపించిన దేవతలు భగీరథుని చూచి భయమును చెంది జగత్పతి యగు శ్రీమన్నారాయణుడు నివసించు శ్రీరసారోత్తర తీరమును చేరి శరణాగత పాలకుడు దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తుతించిరి. 45-53 దేవా ఊచుః :- నతాః స్మ విష్ణుం జగదేకనాథం స్మరత్సమస్తార్తిహరం పరేశమ్ స్వభావశుద్ధం పరిపూర్ణభావం వదన్తి యం జ్ఞానతనుం చ తదేజ్ఞాః. 54 ధ్యేయస్సదా యోగివరైర్మహాత్మా స్వేచ్ఛాశరీరైః కృతదేవకార్యః జగత్స్వరూపోజగదాదినాథస్త సై#్మనతాస్స్మః పురుషోచ్చమాయ. 55 యన్నామసంకీర్తనతో ఖలానాం సమస్తపాపాని లయం ప్రయాన్తి తమీశమీడ్యం పురుషం పురాణం నతాస్మ్స విష్ణుం పురుషార్థసిద్ధ్యై 56 యత్తేజసా భాన్తి దివాకరాద్యా నాతిక్రమన్తస్య కదాపి శిక్షాః కాలాత్మకం తం త్రిదశాధినాథం మనామహే వై పురుషోర్థరూపమ్. 57 జగత్కరోత్యబ్జభవో7 త్తి రుద్రః పునాతి లోకాన్ శ్రుతిభిశ్చ విప్రాః తమాదిదేవం గుణసన్నిదానం సర్వోపదేష్టారమితాః శరణ్యమ్. 58 వరం వరేణ్యం మధుకైటభారిం సురాసురాభ్యర్చితపాదపీఠమ్. సద్భక్తిసంకల్పితసిద్ధిహేతుం జ్ఞానైకవేద్యం ప్రణతాస్స్మ దేవమ్. 59 అనాదిమధ్యాన్తమజం పరేశమనాద్యవిద్యాఖ్యతమోవినాశనమ్ సచ్చిత్పరానన్దఘనస్వరూపం రూపాదిహీనం ప్రణతాస్స్మ దేవమ్. 60 నారాయణం విష్ణుమనన్తమీసం పీతామ్బరం పద్మభవాని సేవ్యం యజ్ఞప్రియం యజ్ఞకరం విశుద్ధం నతాస్స్మ సర్వోత్తమమవ్యయం తమ్. 61 దేవతలు పలికిరి. జగదేకనాథుడు , పరేశుడు, స్మరించువారి ఆర్తిని నశింపచేయువాడు, సహజశుద్ధుడు పరిపూర్ణకాముడు, తెలిసిన వారిచే జ్ఞానరూపునిగా చెప్పబడుచున్న శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఉత్తమయోగులచే సర్వకాలములందు ధ్యానము చేయబడు మహానుభావుడు, తన సంకల్పముచే స్వీకరించిన శరీరములచే దేవకార్యములను నిర్వహించినవాడు, జగత్స్వరూపుడు, జగత్తునకు మొదటి ప్రభువు. పురుషోత్తముడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాము. నామ సంకీర్తనచే ఖలులు పాపములను కూడా నశింపచేయు పురాణపురుషుడు, స్తుతించదగినవాడు, ప్రభువు అయిన శ్రీహరిని పురుషార్థసిద్ధికి నమస్కరించుచున్నాము. శ్రీహరి తేజస్సుచే సూర్యచంద్రాదులు ప్రకాశించుచున్నారు. శ్రీహరి ఆజ్ఞను ఎవ్వరూ అతిక్రమించలేరు. అట్టి కాలాత్మకుడు దేవాధినాథుడు పురుషార్థరూపుడు అయిన మహావిష్ణువునకు నమస్కరించుచున్నాము. బ్రహ్మరూపముతో జగత్తును సృష్టించి , రుద్రరూపముతో లయము చేసి బ్రహ్మణ రూపముతో పావనము చేయుచున్న ఆదిదేవుడు, సకలసద్గుణరూపుడు, అందరికి అన్నిటికీ ఉపదేశించువాడు అయిన శ్రీహరిని శరణువేడుచున్నాము. ఉత్తముడు, సర్వోత్తముడు, మధుకైటభలను సంహరించినవాడు, దేవదానవులచే పూజించబడు పాదపద్మములు కలవాడు, సద్భక్తుల సంకల్పము సిద్ధించుటకు హేతుభూతుడు, జ్ఞానముచే మాత్రమే తెలియదగువాడు అగు శ్రీహరికి నమస్కరించుచున్నాము. ఆది మధ్యాంతములు లేనివాడు, పుట్టుక లేనివాడు, పరేశుడు, అనాదియైన అవిద్యయను ఆజ్ఞానమును నశింపచేయువాడు, సచ్చిదానన్దఘనస్వరూపుడు, రూపాదిరహితుడగు దేవునికి నమస్కరించుచున్నాము. అనన్తుడు, ఈశుడు, పీతాంబరుడు బ్రహ్మాదులచే సేవించబడువాడు, యజ్ఞప్రియుడు, యజ్ఞములను చేయువాడు, విశుద్ధుడు, సర్వోత్తముడు, అవ్యయుడు, సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము. 54-61 ఇతి స్తుతో మహావిష్ణుర్దేవైరిన్ద్రాదిభిస్తథా, చరితం తస్య రాజర్షేర్దేవానాం సంన్యవేదయతే. 62 తతో దేవాన్సమాశ్వాస్య దత్త్వా భయమనంజనః, జగామ యత్ర రాజర్షిస్తపస్తపతి నాదర. 63 శంఖచక్రధరో దేవస్సచ్ఛిదానన్ధవిగ్రహః ప్రత్యక్షతామగాత్తస్య రాజ్ఞస్సర్వజగద్గురుః 64 తం దృష్ట్వా పుండరీకాక్షం భాభాసితదిగన్తరమ్, అతసీపుష్పసంకాశం స్ఫురత్కుండలమండితమ్. 65 స్నిగ్ధకుంతలవక్త్రాబ్జం విభ్రాజన్మకుటోజ్జ్వలమ్, శ్రీవత్సకౌస్తుభధరం వనమాలావిభూషితమ్. 66 దీర్ఘబాహుముదారాంగం లోకేశార్చితపత్కడమ్, ననామ దండవద్భూమో భూపతిర్నమ్రకందరః. 67 అత్యంత హర్షసంపూర్ణస్సరోమాంచస్సగదదః, కృష్ణ కృష్ణేతి శ్రీకృష్ణేతి సముచ్చరన్. 68 తస్య విష్ణుః ప్రసన్నాత్మా హ్యన్తర్యామీ జగద్గురుః ఉవాచ కృపయావిష్టో భగవా న భూతభావనః. 69 ఇట్లు ఇంద్రాది దేవతలచే స్తుతింబడిన శ్రీమహావిష్ణువు భగీరథమహారాజు చరిత్రను దేవతలకు తెలియ చేసెను. తరువాత దేవతలనోదార్చి అభయమునిచ్చి భగీరధుడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వెళ్ళెను. సర్వజగద్గురువు, సచ్చిదానన్ద స్వరూపుడు అయిన శ్రీహరి శంఖ చక్రములను ధరించి భగీరధమహారాజునకు ప్రత్యక్షమాయెను. తన కాంతిచే దిగంతములను ప్రకాశింపచయుచున్నావాడు, పుండరీకాక్షుడు, అవిశపూవు వన్నె కలవాడు, ప్రకాశించు మండలములచే అలంకరించబడువాడు, దట్టమైన ముంగురులచే ప్రకాశించు ముఖ పద్మము కలవాడు, కిరీటముచే ప్రకాశించువాడు, శ్రీవత్సమును కౌస్తుభమును ధరించినవాడు . వనమాలచే అలంకరించబడినవాడు, ఆజానుబాహువు, ఉదారావయవములు కలవాడు లోకపాలకులచే పూజించబడు పాద పద్మములు కలవాడు, అయిన శ్రీమన్నారాయణుని చూచి దండవత్ప్రణామము లాచరించెను. మిక్కిలి సంతోషముతో నిండినవాడై పులకింతలు తడబాటు రాగా కృష్ణ, కృష్ణ, కృష్ణ శ్రీకృష్ణ అని కీర్తించెను. జగద్గురువు, అంతర్యామి అయిన శ్రీహరి భూతసృష్టి చేసిన భగవానుడు కావున భగీరథ మహారాజునకు ప్రసన్నుడై దయతో నిట్లు పలికెను. 62-69 శ్రీభగవానువాచ:- భగీరథ ! మహాభాగ ! తవాభీష్టం భవిష్యతి, ఆగమిష్యన్తి మల్లోకం తవ పూర్వపితామహాః. 70 మమ మూర్త్యన్తరం శంభుం రాజన్త్సోత్రైస్సశక్తితః, స్తుహి తే సకలం కామం స వై సద్యః కరిష్యతి. 71 యస్తు జగ్రహా శశినం శరణం సముపాగతమ్, తస్మాదారాధయేశానం స్తోత్రైస్సుత్యం సుఖప్రదమ్. 72 అనాదినిధనో దేవస్సర్వకామఫలప్రదః, త్వయా సంపూజితో రాజన్సద్యశ్శ్రేయో విధాస్యతి. 73 ఇత్యుక్త్వా దేవదేవేశో జగతాం పతిరచ్యుతః, అంతర్దధే మునిశ్రేష్ఠ ఉత్తస్థౌ సో7 పి భూపతిః. కిమిదం స్వప్న ఆహోస్విత్ సత్యం సాక్షాద్దిజోత్తమ, భూపతిర్విస్మయం ప్రాప్తః కింకరోమీతి విస్మితః. 74 అథాంతరిక్షే వాగుచ్ఛైః ప్రాహ తం భ్రాంతచేతసమ్, సత్యమేతదితి వ్యక్తం న చింతాం కర్తుమర్హసి. 75 తన్నిశమ్యావనీపాల ఈశానం సర్వకారణమ్, సమస్తదేవతారాజం సమస్తౌషీద్భక్తితత్పరః. 76 శ్రీమన్నారాయణుడు పలికెను :- ఓ మహానుభావుడగు భగీరథుడా ! నీకోరిక నెరవేరును. నీ పితామహులు నా లోకమునకు రాగలరు. నాకు మరో రూపమైన శంకరుని నీ సక్తి కొలది స్తోత్రములును చేయుము. ఆ శంకరుడు నీ కోరికనంతటినీ వెంటనే తీర్చగలడు. శరణు వేడిన చంద్రుని స్వీకరించినవాడు శంకరుడు. కావున స్తుతించదగినవాడు సుముఖమునిచ్చువాడు అయిన శంకరుని స్తుతించుము. ఆద్యంతములు లేని ఆ శంకరుడు అన్ని కోరకల నిచ్చువాడు. నీచే పూజింపబడి వెంటనే మేలును చేకూర్చును. జగత్పతియగు ఆచ్యుతుడు ఇట్లు పలికి అంతర్ధానము చెందెను. ఆ భగీరథమహారాజు కూడా లేచి నిలబడెను. ఇది నిజమా ? నేనేమిల చేయవలయును అని ఆశ్చర్యముగా చెందెను. ఇట్లు భ్రాంతి చెందిన భగీరథమహారాజును గూర్చి ఆకాశవాణి ఇది సత్యమే. విచారించవలదని పలికెను. ఆ మాటను వినిన భగీరథమహారాజు , సమస్తదేవరాజు, జగత్కారణుడు అయిన శంకరుని స్తోత్రము చేసెను. 70-76 77 ప్రణమామి జగన్నాథం ప్రణతార్తిప్రణాశనమ్, ప్రమాణాగోచరం దేవమీశానం ప్రణవాత్మకమ్. 78 జగద్రూపమజం నిత్యం సర్గస్థిత్యంతకారణమ్, విశ్వరూపం విరూపాక్షం ప్రణతో7స్మ్యుగ్రరేతసమ్. 79 ఆదిమధ్యాంతరహితమనన్తమజమవ్యయమ్, సమామనన్తి యోగీన్ద్రాస్తం వన్దే పుష్టివర్ధనమ్. 80 నమో లోకాధినాథాయ వంచతే పరివంచతే నమో7స్తు నీలగ్రీవాయ పశూనాం పతయే నమః. 81 నమశ్చైతన్యరూపాయ పుష్టానాం పతయే నమః నమః కల్పప్రకల్పాయ భూతానాం పతయే నమః.82 నమః పినాకహస్తాయ శూలహస్తాయ తే నమః నమః కపాలహస్తాయ పాశముద్గరధారిణ.83 నమస్తే సర్వభూతాయ ఘంటాహస్తాయ తే నమః నమః పంచాస్యదేవాయ క్షేత్రాణాం పతయే నమః 84 నమస్సమస్త భూతానాధిభూతాయ భూభృతే అనేకరూపాయ సద్గుణాయ పరాత్మనే. 85 నమో గణాధిదేవా గణానాం పతయే నమః నమో హిరణ్యగర్భాయ హిరణ్యపతయే నమః 86 హిరణ్య రేతసే తుభ్యం నమో హిరణ్యపతయే నమః నమో ధ్యానస్వరూపాయ నమస్తే ధ్యానసాక్షిణ. 87 నమస్తే ధ్యానసంస్థాయ ధ్యానగమ్యాయ తే నమః యేనేదం విశ్వమఖిలం చరాచరవిరాజితమ్.88 వర్షే వాభ్రేణ జనితం ప్రధానపురుషాత్మనా స్వప్రకాశం మహాత్మానం పరంజ్యోతిస్సనాతనమ్.89 యమానన్తి తత్త్వజ్ఞా స్సవితారం నృచక్షుషామ్ ఉమాకాస్తం నందికేశం నీలకంఠం సదాశివమ్.90 మృత్యుంజయం మహాదేవం పరాత్పారతరం విభుమ్ పరం శబ్దబ్రహ్మరూపం తం వన్తే7 ఖిలకారణమ్ 91 కపర్దినే నమస్తుభ్యం సద్యోజాతాయ వైనమః భవోద్భవాయ శుద్ధాయ జ్యేష్ఠాయ చ కనీయసే 92 మన్యవే త ఇషే త్రయ్యాః పతయే యజ్ఞతన్తవే ఊర్జే దిశాం చ పతయే కాలయ ఘోరరూపిణ 93 కృశానురేతసే తుభ్యం నమో7స్తు సుమహాత్మనే 94 యతసన్సముద్రాస్సరితో7ద్రయశ్చ గంధర్వక్షారసుర సిద్ధసంఘాః స్థాణు శ్చరిష్ణుర్మ హదకల్పం చ అసచ్చ సజ్జీవయజీవయాస 95 నతో7 స్మి తం యోగినతాంఘ్రిపద్మం సర్వాన్తరాత్మనమరూపమీశమ్ స్వతంత్రమేకం గుణినాం గుణం చ నమామి భూయః ప్రణామామి భూయః 96 భగీరథమహారాజు పలకెను :- జగన్నాథుడు, ప్రణామము చేయువారి ఆర్తిని నశింప చేయువాడు, ప్రమాణములకు గోచరము కానివాడవు, ప్రణన్వరూపుడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. జగద్రూపుడు, పుట్టుకలేనివాడు, నిత్యుడు, సృష్టి స్థితి లయకారుడు, విశ్వరూపుడు, ఉగ్రరేతసుడు అయిన విరూపాక్షుని నమస్కరించుచున్నను. అది మధ్యాంతరములు లేనివాడు అవ్యయుడు, పృష్టికారడు, యోగీన్ద్రులచే మనము చేయబడువాడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నను. లోకాధినాధుడు, నీలకంఠుడు అయిన పశుపతికి నమస్కారము. చైతన్యరూపునకి, పుష్టులపతికి అకల్పప్రకల్పునికి భూతపతికి నమస్కారము. పినాకహస్తునకి శూలహస్తునకి, కపాలహస్తునకి, పాశముద్గరధారికి నమస్కరము. సర్వభూతస్వరూపునికి ఘంటాహస్తునికి పంచముఖునకు, క్షేత్రపతికి నమస్కారము. సమస్త భూతములకు అదిభూతుడైనవానికి, భూభరణునకు, అనేకరూపునకు నిర్గుణునకు పరమాత్మనకు నమస్కారము. గణాధిదేవునకు గణపతికి హిరణ్యగర్భునకు, హిరణ్యపతికి నమస్కారము. హిరణ్యరేతస్కునకు, హిరణ్యబాహువునకు , ధ్యానస్వరూపునకు, ధ్యానసాక్షికి., ధ్యానసంస్థునకు ధ్యానగమ్యునకు నమస్కారము. చరాచాత్మకమగు ఈ ప్రపంచమునంతటిని ప్రకాశించచేయువానికి నమస్కారము. ప్రకృతి పురుషరూపముతో నున్నవానికి స్వయం ప్రకాశునకు, మహాత్మునకు, పరంజ్యోతికి, సనాతనునకు, తత్వజ్ఞులు మననము చేయువానికి మానవనేత్రములకు సూర్యునికి వంటి వానికి నమస్కారము. ఉమాకాంతుడు, నందికేశుడు, నీలకంఠుడు, సదాశివుడు, మృత్యంజయుడు, మహాదేవుడు, పరాత్పరుడు, విభువుపరుడు,. శబ్ధ బ్రహ్మరూపుడు, అఖిలకారణుడగు అగు శివునకి నమస్కరించుచున్నాను. కపర్దికి సద్యోజాతునకు నమస్కారము, భవోద్భవుడు, శుద్ధుడు, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, మన్యువు, త్రయీపతి అయిన ఈశునకు నమస్కారము. దిక్పతికి, కాలునకు అఘోరరూపునకు కృశానుదేతస్కునకు మహాత్మునకు నమస్కారము. సముద్రములు, నదులు, పర్వతములు గంధర్వ, యక్ష అసురసిద్ధ సంఘములు ఎవనినుండి పుట్టినవో, ఆ స్థాణువును నమహద్రూపుకు అల్పునకు, చరిష్ణువునకు సదద్రూపునకు నమస్కరించుచున్నాను. యోగులచే నమస్కరించుబడు పాదపద్మములు గలవానికి, సర్వాంతర్యామికి, రూపరహితునకి స్వతంత్రునికి, గుణవంతుల గుణస్వరూపునికి ఈశ్వరునికి మాటిమాటికి నమస్కరించుచున్నను. ఇత్ధం స్తుతో మమాదేవశ్శంకరో లోకశంకనరః, అవిర్భభూవ భూపస్య సంతప్తతపసోగ్రతః.97 పంచవక్త్రం దశభుజం చంద్రార్ధకృతశేఖరమ్, త్రిలోచనదారాంగం నాగయజ్ఞోపవీతిమ్.98 విశాలవక్షసం దేవం తుహినాద్రిసమప్రభమ్, గజచర్మాంబరధరం సురార్చితపదాంబుజమ్.99 దృష్ట్వా పపాత పాదాగ్రే దండవద్భువి నారద ! తత ఉత్థాయ సహసా శివాగ్రే విహితాంజలిః. 100 ప్రణనామ మమాదేవం కీర్తయన్శంకరాహ్వయమ్, విజ్ఞాయ భుక్తిం భూపస్య శంకరశ్శశిశేఖరః101 ఉవాచ రాజ్ఞేతుష్టో7స్మి వరం పరయ వాంఛితమ్, తోసితో స్మి త్వయా సమ్యక్ స్తోత్రేణ తపసా తథా.102 ఏవముక్తస్స దేవేన రాజా సంతుష్టమానసః, ఉవాచ ప్రాంజలిర్భూత్వా జగతామీశ్వరమ్.103 ఇట్లు స్తోత్రము చేయబడిన శంకరుడు లోకములకు శుభములకు కలిగించువాడు కావున ఉగ్రమైన తపస్సుచే తపించిన భగీరథ మహారాజునకు ప్రత్యక్షమాయెను. పంచవక్త్రుడు, దశభుజుడు, అర్థచంద్రశేఖరుడు, త్రిలోచనుడు, ఉదారాంగుడు, నాగయజ్ఞోపవీతుడు, విశాలవక్షుడు, హిమాద్రిసమకాంతిదేహుడు, గజచర్మాంబధారి, సరార్చితపదాంబుజుడు అయిన శంకరుని చూచి భగీరథుడు దండమువలెన శివుని పాదములపై బడెను. తరువాత లేచి నిలబడి శివుని ముందు చేతులు జోడించి మహాదేవుని కీర్తించుచు నమస్కరించెను. చంద్రశేఖరుడుగు శంకరుడు రాజు భక్తిన తెలుసుకొని చేసిన స్తోత్రమునకు తపస్సునకు సంతోషించితిని. ఇట్లు శంకరుడు పలుకగా భగీరథమహారాజు సంతోషించి జగదీశ్వరునితో చేతులు జోడించి ఇట్లు పలికెను. 97 - 103 భగీరథ ఉవాచ:- అనుగ్రాహ్యోస్మి యది తే వరదానాన్మహేశ్వర, తదా గంగాం ప్రయచ్ఛాస్మత్పితృణాం ముక్తిహేతవే. 104 భగీరథుడు పలికెను :- ఓ మహేశ్వరా! వరములనిచ్చి అనుగ్రహించినచో మా పితామహులు మోక్షమును చేరుటకు కారణమైన గంగను ప్రసాదించుము. 104 శ్రీ శివ ఉవాచ :- దత్తా గంగా మయా తుభ్యం పితౄణాం తే గతిః పరా తుభక్యం మోక్షః పరశ్చేతి తముక్త్వా న్తర్ధధే శివః105 కపర్దినో జటాస్రస్తా గంగా లోకైకపావనీ పావయన్తీ జగత్సర్వమన్వగచ్ఛద్భగీరథమ్ 106 తతః ప్రభృతి సా దేవీ నిర్మలా మలహారిణా భాగీరథీతి విఖ్యాతా త్రిషు లోకేష్వభూన్మునే. 107 సగర్యాత్మజాః పూర్వం యత్ర దగ్ధాస్స్వపాప్మనా, తం దేశం ప్లావయామాస గంగా సర్వసరిద్వరా. 108 యదా సంప్లావితం భస్మ సాగరాణాం తు గంగయా, తదైవ నరకే మగ్నా ఉద్ధృతాశ్చ గతైనపః.109 పురా సంక్రుశ్యమానేన యే యమేనాతిపీడితాః, త ఏవ పూజితాస్తేన గంగాజలపరిప్లుతాః.110 గతపాపాన్స విజ్ఞాయ యమస్సగరసంభవాన్, ప్రణమ్యాభ్యర్చ్య విధివత్ప్రాహ తాన్ప్రీతమానపః111 భో ! భో ! రాజసుత యూయం నకరాద్భృశదారుణాత్, ముక్తా విమానమారుహ్య గచ్ఛధ్వం విష్ణుమందిరమ్.112 ఇత్యుక్తాస్తే మహాత్మానో యమేన గతకల్మషాః, దివ్యదేహధరా భూత్వా విష్ణులోకం ప్రపేదిరే.113 ఏవంప్రభవా సా గంగా విష్ణుపాదాగ్రసంభవా,. సర్వలోకేషు విఖ్యాతా మహాపాతకనాశినీ.114 య ఇదం పుణ్యమాఖ్యానం మహాపాతకనాశనమ్, పఠేచ్చ శృణుయాద్యాపి గంగాస్నానఫలం లభేత్.115 యస్త్వే తత్పణ్యమాఖ్యానం కథయేద్భ్రాహ్మణాగ్రతః, స యాతి విష్ణుభవనం పునరావృత్తివర్జితమ్.116 ఇతి శ్రీ బృహాన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే గంగామాహాత్య్మే భగీరథగంగానయనం నామ షోడశో7ధ్యాయః శ్రీ శివుడు పలికెను :- నీ పితామహుల కొరకు నేను గంగనిచ్చుచున్నను. నీకు ఉత్తమమైన మోక్షమును కూడా ఇచ్చితిని అని పలకి అంతర్ధానము చెందెను. తరువాత శంకరుని జటలనుండి జారిపడిన లోకపావని యగు గంగ జగత్తును పావనము చేయుచు భగీరధుని అనుసరించెను. అప్పటినుండి మలమును తొలగించు నిర్మల యగు గంగ మూడు లోకములలో భాగీరథి యని ప్రసిద్ధి చెందెను. సగరపుత్రులు తన పాపములచే దగ్ధమైన ప్రదేశమును నదీ శ్రేష్ఠమైన గంగముంచివేసెను. సగరపుత్రుల భస్మమును గంగ తడిపిన వెంటనే సగరపుత్రులు పాపము తొలగినవారై నరకములనుండి ఉద్ధరించబడిరి. పూర్వము యమునిచే పీడించబడిన సగరపుత్రులు గంగాజల సేవచనముచే పూజించబడిరి. యముడు వారిని పాపరహితులుగా తెలుసుకొని నమస్కరించి యథావిదిగా పూజించి సంతోషమునిండిన మనసుతో నిట్లు పలికెను. '' ఓ రాజా పుత్రులారా ! మీరు మిగుల భయంకరమైన నరకమునుండి విముక్తులైతిరి విమానము నధిరోహించి విష్ణుమందిరమునకు వెళ్ళుడు'' ఇట్లు యమధర్మరాజు చెప్పగా పాపము తొలగిన సగరపుత్రులు దివ్యదేహమును ధరించి విష్ణులోకమును పొందిరి. విష్ణుపాదాగ్రమున పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. అన్ని లోకములతో మహాపాతకనాశిని అని ప్రసిధ్ధి చెందినది. మహాపాతకములను నశింపచేయు పవిత్రమైన ఈ కథను చదివినను వినిననూ గంగా స్నాఫలము లభించును. భ్రాహ్మణుల ముందు పవిత్రమైన ఈ కథను చెప్పినవారు పునరావృత్తిరహితమైన విష్ణుభవనమును చేరుదురు. 105 - 106 ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామహాత్మ్యమున భగీరథగంగానయనమను పదునారవ అధ్యాయము సమాప్తము