Sri Naradapuranam-I
Chapters
Last Page
సప్తదశో ೭ ధ్యాయః
మార్గశీర్ష శుక్లద్వాదశీవ్రత కథనమ్
ఋషుయ ఊచుః :
సాధు సూత మమాభాగ! త్వయాతికరుణాత్మనా శ్రావితం సర్వపాపఘ్నం గంగామాహాత్మ్యముత్తమమ్. 1
శ్రత్వా తు గంగామాహాత్మ్యం నారదో దేవదర్శనమః కీం పప్రచ్ఛ పునస్సూత సనకం మునిసత్తమమ్. 2
ఋషులు పలికిరి : మహానుభావుడవగు సూతుడా! నీవు ఎంతో దయతో ఉత్తమము, పర్వపాప వినాశకము అగు గంగా మాహాత్మ్యమును వినిపించితివి. దివ్యజ్ఞాననము గల నారదమహర్షి గంగామాహాత్య్యమును విని సనకమహర్షిని ఏమడిగెను 1-2
సూత ఉవాచ:
శృణుధ్వమృషయస్సర్వే నాదేన సురర్షిణా, పృష్టం పునర్యథా ప్రాహ ప్రవక్ష్యామి తైవ తత్.3
నానాఖ్చాతనేతి హాసాఢ్యం గంగామాహాత్య్మ ముత్తమమ్, శ్రుత్వా బ్రహ్మసుతో భూయః పృష్టవానిదమాదరాత్.4
సూతమహర్షి చెప్పెను: ఓ ఋషులారా! మీరందరూ వినుడు ! నారదమహర్షి దేనినడిగెనో, ఎట్లు పలికెనో ధానంతయు అట్లే చెప్పెదను. అనేక కథలతో ఇతిహాసముతలో కూడిన ఉత్తమమైన గంగామాహాత్య్మమును వినిన నారదమహర్షి ఆదరముతో మరల నిట్లడిగెను.
నారద ఉవాచ :
అహోతిధన్యం సుకృతైకసారం సుకృతైకసారం శ్రుతం మయా పుణ్యమసంవృతార్ధమ్,
గాంగేయమాహాత్య్మమఘప్రణాశి త్వత్తో మునే కారుణికాదభీష్టమ్, 5
యే సాధవస్సాధు భజన్తి విష్ణుం స్వార్థం పరార్థం చ యతన్త
నానోపదేశైస్సువిముగ్ధచిత్తం ప్రబోధయన్తి ప్రసభం ప్రసన్నమ్.
తతస్సమాఖ్యాహి హరేర్వ్రతాని కృతైశ్చ యైః ప్రీతిము పైతి విష్ణుః,
దదాతి భక్తిం భజతాం దయాలుర్మక్తిస్తు తస్యావిదితా హి దాసీ7
దదాతి ముక్తిం భజాతావం ముకుందదో వ్రతార్చనధ్యానపరాయణానామ్,8
భక్తాను సేవాసు మహాప్రయాసం విమృశ్యకస్యాపి న భక్తియోగమ్
ప్రవృత్తం చ నివృత్తం చ యత్కర్మ హిరతోషణమ్, తదాఖ్యాహి మునిశ్రేష్ఠ! విష్ణుభక్తోపి మానద!9
నారద మహర్షి పలికెను: ఓ సనక మహర్షీ ! పరమదయాలువులైన మీ నుండి పవిత్రము పాపనాశకము, పుణ్యసారము, స్పష్టార్ధము అయిన గంగా మాహాత్మ్యమును వింటిని. తమకొరకు ఇతరుల కొఱకు ప్రయత్నము యేయుచునే సాధువులు శ్రీ మహావిష్ణువును బాగుగా సేవించెదరు. మోహము చెందిన మనసు కలవారిని పలు విధములైన ఉపదేశములతో ప్రభోదించి ప్రసన్కనచిత్తులను చేతురు. శ్రీహరి ని ప్రసన్నుని చేయు హరివ్రతములను చక్కగా తెలుపుము. తనను సేవించువారికి దయాలువైన శ్రీహరి భక్తి నొసంగును. ఆ భక్తికి ముక్తి ప్రసిద్ధమైన దాసి. వ్రతములచే అర్చనలచే ధ్యానములచే తనను సేవించువారికి శ్రీహరి ముక్తి నొసంగును. భక్తులను వెంట ఉండి సేవించుటలో గల ప్రయాసను చూచి శ్రీహరి భక్తినెవ్వరికి నోసగడు. హరిని సంతోషపరచు ప్రవృత్తి రూపకర్మను నివృత్తి రూపకర్మను విష్ణుభక్తుడవైన నీవు నాకు తెలియజేయుము.
సనక ఉవాచ:-
సాధు సాధు మునిశ్రేష్ఠ! భక్తస్త్యం పురషోత్తమే, భయో భూయో యతః పృచ్ఛేశ్చరిత్రం శార్దధరన్వనః 10
వ్రతాని తే ప్రకక్ష్యామి లోకోపకృతిమన్తి చ, ప్రసీదతి హరిర్యైస్తు ప్రయచ్ఛత్యభయం తథా.11
యస్య ప్రసన్నో భగవాన్యజ్ఞలింగో జనార్ధనః, ఇహాముత్ర సుఖం తస్య తపోవృద్ధిశ్చ జాయతే. 12
యేన కేనాప్యుపాయేన హరిపూజాపరాయణాః, హరిపూజాపరాయణాః, ప్యయాన్తి పరమం స్థానమితి ప్రాహుర్మహర్షయః.13
మార్గశీర్షే సితే పక్షే ద్వాదశ్యాం జలశాయినమ్, ఉపోషితో7ర్చయేమ్యమ్యఞ్నరః శ్రద్ధాసమన్వితః.14
స్నాత్వా శుక్లామ్బరధరో దస్తధానమపూర్వకమ్, గంధపుష్పాక్షతైర్ధూపైర్దీపైర్నైవేద్యపూర్వకైః.15
వాగ్యతో భక్తిభావేన మునిశ్రేష్ఠార్చయేద్ధరిమ్, కేశవాయ నమస్తుభ్యమితి విష్ణుం చ పూజయేత్.16
అష్టోత్తరశతం హుత్వా వహ్నౌ ఘ్నతితలాహుతీః, రాత్రౌ జాగారణం కుర్యాచ్ఛాలగ్రామసమీపతః.
స్నాపయేత్ప్రస్థపయసా నారాయణమనామయమ్, గీతైర్వాద్యైశ్చ నైవేద్యర్భక్ష్యైర్భోజ్యైశ్చ కేశవమ్.18
త్రికాలంపూజయేద్భక్త్యా మహాలక్ష్మ్యా సమన్వితమ్, పునః కల్యే సముత్థాయ కృత్వా కర్మ యథోచితమ్.19
పూర్వవతస్పూజయేద్దేవం వాగ్యతెఓ నియత శ్శుచిః, పాయసం ఘృతసమ్మిశ్రం నాలికేరఫలాన్వితమ్.20
మన్త్రేణానేన విప్రాయ దద్యాద్భక్త్యాస దక్షిణమ్, కేశవః కేశిహా దేవః సర్వ సంవత్ప్రదాయః.21
పరమాన్నప్రదానేన మమ స్యాదిష్టదాయః, బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాచ్ఛక్తితో బంధుభిస్సహ.22
నారయణపరో భూత్వా స్యయంభుంజీత వాగ్యతః, ఇతి యః కురతే భక్త్యా కేశవార్చనముత్తమ్.23
స పౌండరీకయజ్ఞస్య ఫలమష్టగుణం లభేత్, పౌషమాసే పితే పక్షే ద్వాదశ్యాం పముపోషితః.24
నమో నారాయణాయేతి పూజమేత్ప్రయతో హరిమ్, పయసా స్నాప్య నైవేద్యం పాయసం చ సమర్పయేత్.25
రాత్రౌ జాగరణం కుర్యాత్త్రికార్చనతత్పరః, ధూపైర్థీపైశ్చ నైవేద్యై ర్గంధైః పుషై#్పర్మనోరమైః.26
తృణౖశ్చ గీతవాద్యాద్యైః స్తోత్రైశ్చాప్యర్చయేద్ధరిమ్, కృశరాన్నం చ విప్రాయ దద్యాత్సఘృదక్షిణమ్.27
సర్వాత్మా సర్వలోకేశస్సర్వవ్యాపీ సనాతనః, నారాయణః ప్రసన్నః స్యాత్కృశరాన్నప్రదానతః. 28
మంత్రేణానేన విప్రాయ దత్వా వై దానముత్తమమ్. ద్విజాంశ్చ భోజయేచ్ఛక్త్యా స్వ యమద్యాత్సభాంధవః. 29
ఏవం సంపూజయేద్భక్త్యా దేవం నారాయణం ప్రభుమ్, అగ్నిష్టోమాష్టకఫలం స సంపూర్ణమవాప్నుయాత్.30
సనక మహర్షి పలికెను : ఓ మునిశ్రేష్ఠా ! బాగు బాగు. నీవు మాటిమాటికి శ్రీహరి చరిత్రమును అడుగుచున్నావు కావున పురోషోత్తముని భక్తుడవు. లోకములకు ఉపకారమును చేయునని, శ్రీహరి సంతోషించి అభయమునిచ్చు వ్రతములను చెప్పెద ను. ఈ వ్రతముల వలను యజ్ఞలింగుడు భగవంతుడగు జనార్దనుడు ప్రసన్నుడై ఇహపరములలో సుఖమును తపోవృద్ధిని కలిగించును. ఏదోయొక విధముగా శ్రీహరిని పూజించువారు పరమపదమును పొందెదరని మహర్షులు చెప్పుచున్నారు. మార్గశీర్ష శుద్ధ ద్వాదశి దినమున ఉపవసించి శ్రద్ధకలవాడై జలశాయియైన శ్రీహరిని చక్కగా పూజించవలయును. ప్రాతఃకాలమున దంతధావనము గావించుకొని స్నానముచేసి తెల్లని వస్త్రములను ధరించి వాక్కును నియమించి భక్తిభావముచే గంధపుష్పాక్షత ధూపదీపనైవేద్యములతో శ్రీహరిని పూజించవలయును. ఓ కేశవా ! నీకు నమస్కారము అనుచు విష్ణువును పూజించవలయును. అగ్ని హోత్రమున నేతిచే నువ్వులచే నూట ఎనిమిది ఆహుతులనిచ్చి రాత్రిపూట సాలగ్రామ సమీపమున జాగరణము చేయవలయును. ఒక శేరుపాలతో నిర్మలుడగు శ్రీమన్నారాయణుని స్నానమును చేయించవలయును. మూడు పూటల ధూపదీపనైవేద్య భక్ష్యభోజ్యములతో, గీత వాద్యములచే లక్ష్మీయుక్తుడగు శ్రీమన్నారాయణుని పూజించవలయును. మరల యథా సమయమున లేచి యథోచిత కర్మల నాచరించి వాఙ్నయమముతో శుచి అయి పూర్వము వలెనే పూజించవలయును. నేతితో వండిన పాయసమును కొబ్బరికాయతో దక్షిణతోపాటు ''కేశవః కేశిహా'' దేవస్సర్వసంపత్ర్పదాయకః పరమాన్న ప్రదానేన మమ స్యాదిష్టదాయకః '' అను మన్త్రముచే బ్రాహ్మణునకు భక్తితో సమర్పించవలయును. (''సర్వసంపదలనిచ్చు దేవుడగు వాడు కేశియను రాక్షసుని సంహరించిన కేశవుడు పరమాన్నదానముచే నా ఇష్టమును పూరించుగాక'' అని పై మన్త్రమునకు అర్థము) తరువాత భక్తితో బ్రాహ్మణులను బంధువులను భోజనము చేయించవలయును. నారాయణుని ధ్యానించుచు వాఙ్నియమముతో తాను భోజనము చేయవలయును. ఇట్లు భక్తితో ఉత్తమైన కేశవార్చనను చేయువాడు పౌండరీక యజ్ఞము చేసిన దానికి ఎనిమిదిరెట్లు అధిక ఫలమును పొందును.
పుష్యశుద్ధ ద్వాదశీ తిథిన చక్కగా ఉపవసించి మనోనిగ్రహముతో నారాయణునకు నమస్కారము (నమోనారాయణాయ) అను మంత్రమును పఠించుచు శ్రీహరిని పూజించవలయును. పాలతో స్నానము చేయించి పాయసము నర్పించవలయును. మూడు కాలములలో అర్చన చేసి రాత్రిపూట జాగరణమును చేయవలయును. సుందరమైన గంధదూపదీపనైవేద్య పుష్పములచే గీత వాద్యమలుచే స్తోత్రములచే అర్చించవలయును. నేతితో చేసిన నువ్వుల పొంగలిని దక్షిణతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. ''సర్వాత్మా సర్వలోకేశః సర్వవ్యాపీ సనాతనః
నారాయణః ప్రసన్నస్స్యాత్కృశరాన్న ప్రదానతః'' అను మంత్రము పఠించుచు దానము చేయుచు తరవాత బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను బాంధవులతో కలసి భుజించవలయును. ఇట్లు భక్తిచే ప్రభువు దేవుడు అగు నారాయణుని పూజించినచో ఎనిమిది అగ్నిష్టోమముల ఫలమును పొందును.
మాఘస్య శుక్లద్వాదశ్యాం పూర్వత్సముపోషితః, నమస్తే మాధవాయేతి హుత్వాష్టౌ చ ఘృతాహుతీః. 31
పూర్వమానేన పయసా స్నాపయేన్మాధవం తదా, పుష్పగంధాక్షతైరర్చేత్సావధానేన చేతసా. 32
రాత్రౌ జాగరణం కుర్యాత్పూర్వవద్భక్తి సంయుతః, కల్యకర్మ చ నిర్వర్త్య మాధవం పునరర్చయేత్. 33
ప్రస్ధం తిలానాం విప్రాయ దద్యాద్వై మంత్రపూర్వకమ్, సదక్షిణం సవస్త్రం చ సర్వపాపవిముక్తయే. 34
మాధవస్సర్వభూతాత్మా సర్వకర్మఫలప్రదః, తిలదానేన మహాతా సర్వాన్కామాన్ప్ర యచ్ఛతు. 35
మంత్రేణానేన విప్రాయ దత్వా భక్తి సమన్వితః, బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యా సంస్మరన్మాధవం ప్రభుమ్. 36
ఏవం యః కురుతే భక్త్యా తిలదానే వ్రతం మునే, వాజపేయశతస్యాసౌ సంపూర్ణం ఫలమాప్నుయాత్. 37
ఫాల్గునస్య సితే పక్షే ద్వాదశ్యాం సముపోషితః గోవిందాయ నమస్తుభ్యమితి సంపూజయేద్వ్రతీ. 38
అష్టోత్తరశతం హుత్వా ఘృతమిశ్ర తిలాహుతీః పూర్వమానేన పయసా గోవిన్దం స్నాప యేచ్ఛుచిః. 39
రాత్రౌ జాగరణం కుర్యాత్త్రికాలం పూజయేత్తథా ప్రాతః కృత్యం సమాప్యాథ గోవిన్దం పూజయేత్పునః. 40
వ్రీహ్యాఢకం చ విప్రాయ దద్యాద్వస్త్రం సదక్షిణమ్ నమో గోవిన్ద సర్వేశ గోపికా జనవల్లభ ! 41
అనేన ధాన్యదానేన ప్రీతో భవ జగద్గురో ఏవం కృత్వా వ్రతం సమ్యక్ సర్వపాపవివర్జి తః.42
గోమేధమఖజం పుణ్యం సంపూర్ణం లభ##తే నరః చైత్రమాసే సితే పక్షే ద్వాదశ్యాం సముపోషితః. 43
నమో7స్తు విష్ణవే తుభ్యమితి పూర్వవదర్చయేత్ క్షీరేణ స్నాపయేద్విష్ణుం పూర్వమానేన శక్తితః. 44
తథైవ స్నాపయేద్విప్ర ఘృతప్రస్ధేన సాదరమ్ కృత్వా జాగరణం రాత్రౌ పూజయేత్పూర్వవద్ర్వతీ. 45
తతః కల్యే సముత్థాయ ప్రాతః కృత్యం సమాప్య చ అష్టోత్తర శతం హుత్వా మధ్వాజ్యతిలమిశ్రితమ్. 46
స దక్షిణం చ విప్రాయ దద్యాద్వై తుండులాఢకమ్ ప్రాణరూపీ మహావిష్ణుః ప్రాణదస్సర్వవల్లభః. 47
తండులాఢకదానేన ప్రీయతాం మే జనార్దనః ఏవం కృత్వా నరో భక్త్యా సర్వపాపవివర్జితః
అత్యగ్నిష్టోమ యజ్ఞస్య ఫలమష్టగుణం లభేత్. 48
మాఘ శుద్ధ ద్వాదశీతిథిన మొదటి వలెనే ఉపవసించి 'నమస్తే మాధవాయ' అని అగ్నితో ఎనిమిదినేతి ఆహుతులనిచ్చి, ఒక శేరుపాలతో శ్రీహరిని స్నానము చేయించవలయును. సావధానమైన మనస్సుతో పుష్పగంధాక్షతలతో అర్చించవలయును. భక్తితో రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాలమున కాలకృత్యములను తీర్చుకొని మరల మాధవుని పూజించవలయును. మన్త్రపూర్వకముగా ఒక కిలో నువ్వులను బ్రాహ్మణునకుదానమీయవలయును. వస్త్రములను దక్షిణనీయవలయును. అట్లు చేసినచో అన్ని పాపములు నశించును. ''మాధవ స్సర్వభూతాత్మా సర్వకర్మఫలప్రదః తిలదానేన మహాతా సర్వాన్కామా న్ప్ర యచ్ఛతు'' అను మంత్రముచే భక్తితో బ్రాహ్మణునకు దానమీయవలయును. (సర్వప్రాణిస్వరూపుడుగు సర్వకర్మల ఫలములనిచ్చు మాధవుడు మహాతిల దానముతో నా కోరికలను తీర్చుగాక''అని మన్త్రమున కర్థము) తరువాత ప్రభువైన మాధవుని స్మరించుచు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. ఇట్లు తిలదానవ్రతము చేయువారు నూరు వాజపేయ యాగముల ఫలమును పొందెదరు.
ఫాల్గుణ శుధ్ధ ద్వాదశీన ఉపవాసము చేసి 'గోవిందాయ నమస్తుభ్యం అని శ్రీహరిని పూజించవలయును. నేతితో కలిసిన నువ్వులతో అగ్నిలో నూట ఎనిమిది ఆహుతుతలనిచ్చి ఒక శేరు పాలతో గోవిందుని స్నానము చేయించవలయును మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాల కృత్యములను ముగించి మరల గోవిందుని పూజించవలయును. వస్త్రములను దక్షిణను నాలుగు శేర్ల ధాన్యమును బ్రాహ్మణునకు దానమీయవలయును ''నమో గోవిన్ద సర్వేశ గోపికా జనవల్లభ అనేన ధాన్యదానేన ప్రీతో భవ జగద్గురో'' అను మంత్రముచే దానమీయవలయును. ( ''ఓ గోవిందా ! గోపికా జనవల్లభా ! నీకు నమస్కారము. ఓ జగద్గురూ ! ఈ ధాన్యదానముచే సంప్రీతుడవు కమ్ము'' అని మంత్రమున కర్ధము). ఇట్లు చక్కగా వ్రతము నాచరించి సంపూర్ణ గోమేధయాగఫలమును పొందును.
చైత్రశుద్ధ ద్వాదశీ తిథిన ఉపవసించి 'నమోస్తు విష్ణవే తుభ్యం' అని మొదటి వలెనే అర్చించవలయును. ఒక శేరు పాలతో తన శక్తికి తగినట్లుగా పాలచే అభిషేకము చేయించవలెను. అట్లే ఆదరముతో శేరు నేయితో అభిషేకము చేయవలయను. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణము చేయవలయును. తరువాత ప్రాతఃకాలుమున లేచి కాలకృత్యములను ముగించుకొని తేనె నేయి నువ్వులతో నూట ఎనిమిది ఆహుతులనిచ్చి హూమము చేసి నాలుగు శేర్ల బియ్యమును దక్షిణతో బ్రాహ్మణునకు దానమీయవలయును. ''ప్రాణరూపీ మహావిష్ణుః ప్రాణదస్సర్వవల్లభః తండులాఢక దానేన ప్రీయతాం మే జనార్దనః'' అను మంత్రముచే దానమీయవలయును. (''ప్రాణరూపుడు ప్రాణము నిచ్చువాడు అందరికి ప్రియుడగు జనార్దనుడు నాలుగు శేర్ల తండుల దానముచే ప్రీతి చెందుగాక'' అని ఈ మంత్రమున కర్థము). ఇట్లు భక్తిచే ఆచరించిన నరుడు అన్ని పాపములనుండి విడివడి అత్యగ్నిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలమును పొందును.
వైశాఖ శుక్లద్వాదశ్యాముపోష్య మధుసూదనమ్, ద్రోణక్షీరేణ దేవేశం స్నాపయోద్భక్తిసం యుతః. 49
జాగరం తత్ర కర్తవ్యం త్రికాలార్చన సంయుతమ్, నమస్తే మధుహన్త్రే చ జుహుయాచ్చక్తితో ఘృతమ్. 50
అష్టోత్తరశతం ప్రార్చ్య విధివన్మధుసూదనమ్ 51
విపాపో హ్యశ్వమేధానామష్టానాం ఫలమశ్నుయాత్, జ్యేష్ఠమాసే సితే పక్షే ద్వాదశ్యాముపవాసకృత్. 52
క్షీరేణాఢకమానేన స్నాపయేద్యస్త్రివిక్రమమ్, నమస్త్రివిక్రమాయేతి పూజయేద్భక్తిసంయుతః. 53
జుహుయాత్పాయ సేనైవ హ్యష్టోత్తరశతాహుతీః, కృత్వా జాగరణం రాత్రౌ పునః పూజాం ప్రకల్పయేత్. 54
అపూపవింశతిం దత్వా బ్రాహ్మణాయ సుదక్షిణమ్, దేవదేవ జగన్నాథ ప్రసీద పరమేశ్వర. 55
ఉపాయనం చ సంగృహ్య మమాభీష్టప్రదో భవ, బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యా స్వయం భుంజీత వాగ్యతః. 56
ఏవం యః కురుతే విప్ర వ్రతం త్రైవిక్రమం పరమ్, సో7ష్టానాం నరమేధానాం విపాపః ఫలమాప్నుయాత్. 57
వైశాఖ శుద్ధ ద్వాదశీ తిథిన ఉపవాసము చేసి మధుసూదనుని ముప్పదిరెండు సేర్ల పాలతో అభిషేకము చేసి, భక్తితో జాగరణముచేసి మూడు వేళలా పూజించవలయును. 'నమస్తే మధుహన్త్రే' అనుచు నూట ఎనిమిది మార్లు నేతితో హోమము చేయవలయును. ఇట్లు భక్తిచే చేసినచో అన్ని పాపములు తొలగి ఎనిమిది అశ్వమేధ యాగముల ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధద్వాదశిన ఉపవాసమును చేసి నాలుగు శేర్లపాలతో త్రివిక్రమునికి అభిషేకము చేసి భక్తితో పూజించిన 'నమస్త్రివిక్రమాయ' అనుచు పాయసముతో నూట ఎనిమిది మార్లు హోమముచేసి రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు దక్షిణతో ఇరువది అపూపములను దానము చేయవలయును. 'దేవ దేవ జగన్నాధ ! ప్రసీద పరమేశ్వర ! ఉపాయనం చ సంగృహ్య మమాభీష్ఠప్రదో భవ' అను మంత్రముచే దానమీయ వలయును. తరువాత శక్తికొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టి వాఙ్నియమముతో తాను భోజనమును చేయవలయును. ఇట్లు ఉత్తమమైన త్రివిక్రవ్రతము నాచరించువాడు అన్ని పాపములను బోనాడి ఎనిమిది నరమేధముల ఫలమును పొందును. 49-57
ఆషాడశుక్లద్వాదశ్యాముపవాసీ జితేన్ద్రియః, వామనం పూర్వమానేన స్నాపయేత్పయసా వ్రతీ. 58
నమస్తే వామనాయేతి దూర్వాజ్యోష్టోత్తరం శతమ్, హుత్వా చ జాగరం కుర్యాద్వామనం చార్చయేత్పునః, 59
సదక్షిణం చ దధ్యన్నం నాలికేరఫలాన్వితమ్ భక్త్యా ప్రదద్యాద్విప్రాయ వామనార్చనశీలినే. 60
వామనో వృద్ధిదో హోతా ద్రవ్యస్థో వామనస్సదా, వామనస్తారకో7స్మాచ్చ వామనాయ నమో నమః. 61
అనేన దత్వా దధ్యన్నం శక్తితో భోజయేద్ద్విజాన్, కృత్వైవమగ్నిష్టోమానాం శతస్య ఫలమాప్నుయాత్.62
శ్రావణస్య సితే పక్షే ద్వాదశ్యాముపవాసకృత్, క్షీరేణ మధుమిశ్రేణ స్నాపయే చ్ఛ్రీధరం వ్రతీ. 63
నమో7స్తు శ్రీధరాయేతి గన్ధాద్యైః పూజయేత్కృమాత్, జుహుయాత్పృషదాజ్యేన శతమష్టోత్తరం మునే. 64
కృత్వా చ జాగరం రాత్రౌ పునః పూజాం ప్రకల్పయేత్, దాతవ్యం చైవ విప్రాయ క్షీరాఢకమనుత్తమమ్. 65
దక్షిణాం చ సవస్త్రాం వై ప్రదద్యాద్ధేమకుండలే, మన్త్రేణానేన విప్రేన్ద్ర సర్వ కామార్థసిద్ధయే. 66
క్షీరాబ్ధిశాయిన్దేవేశ రమాకాన్త జగత్పతే ! క్షీరదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః. 67
సుఖప్రదత్వాద్విప్రాంశ్చ భోజయేచ్ఛక్తితో వ్రతీ, ఏవం కృత్వాశ్వమేధానాం సహస్రస్య ఫలం లభేత్. 68
మాసి భాద్రపదే శుక్లే ద్వాదశ్యాం సముపోషితః, స్నాపయే ద్ద్రోణ పయసా హృషీకేశం జగద్గురమ్. 69
హృషికేశ నమస్తుభ్యం మితి సంపూజయేన్నరః, చరుణా మధుయుక్తేన శతమష్టోత్తరం హువేత్.70
జాగరాదీని నిర్వర్త్య దద్యాదాత్మవిదే తతః సార్ధాఢకం చ గోధూమాం దక్షిణాం హేమశక్తితః. 71
హృషీకేశ నమస్తుభ్యం సర్వలోకైకహేతవే, మహ్యం సర్వసుఖం దేహి గోధూమస్య ప్రదానతః. 72
భోజయేద్బ్రాహ్మణాన్భక్త్యా స్వయం చాశ్నీత వాగ్యతః, సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మమేదఫలం లభేత్. 73
ఆషాడ శుక్ల ద్వాదశినాడు ఇంద్రియ జయముతో ఉవవాసముచేసి నాలుగు శేర్ల పాలతో వామనమూర్తికి అభిషేకము చేయవలయును. 'నమస్తే నామనాయ' అని నూట ఎనిమిది మార్లు నేతితో గరకతో హోమము చేయవలయును. ఇట్లు హోమము చేసిన పిదప జాగరణ చేసి వామనుని పూజించవలయును. వామన మూర్తిని పూజించు బ్రాహ్మణునకు భక్తితో నారికేళము దక్షిణలతో పెరుగన్నమును ప్రదానము చేయవలయును. 'వామనో వృద్ధిదో హోతా ద్రవ్యస్థో వామన స్సదా. వామనస్తారకో 7స్మాచ్చ వామనాయ నమో నమః' అను మంత్రముతో దధ్యన్నప్రదానాము గావించవలయును. (''వామనుడు వృద్ధినిచ్చువాడు వామనుడేహోత, వామనుడెపుడూ ద్రవ్యములో నుండును. వామనుడు మనలను తరింపచేయును. వామనునకు నమస్కారము'' అని ఈ మంత్రమునకర్థము.) తరువాత శక్తికొలది బ్రాహ్మణములకు భోజనమొసంగవలయును. ఇట్లు వ్రతమాచరించిన వారు నూరు అగ్నిష్టోమయాగములు చేసిన ఫలమును పొందును.
శ్రావణశుద్ధ ద్వాదశిన ఉపవసించి వ్రతమును స్వీకరించి తేనె కలిపిన పాలతో శ్రీధరునికి అభిషేకము చేయవలయును. ధూపదీపగంధాదులతో 'నమో7స్తు శ్రీధరాయ' అనుచు పూజించవలయును. నేయి కలిపిన పెరుగుతో నూట ఎనిమిదిమార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణ చేపి మరల శ్రీధరుని పూజించవలయును. నాలుగు శేర్ల పాలను బ్రహ్మణునకు దానమీయవలయును. బంగారుకుండలమునలను, వస్త్రములను, దక్షిణను ఈయవలయును. ''క్షీరాబ్ధిశాయిన్ ! దేవేశ ! రమాకాన్త ! జగత్పతే ! క్షీరదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః'' అను మన్త్రముచే దానము చేయవలయును. (''పాలసముద్రములో శయనించువాడా! దేవేశా ! రమాకాన్త ! జగత్పతీ ! అన్ని ఆనందములనిచ్చు నీవు క్షీరదానముచే సుప్రీతుడవుకమ్ము'' అని అర్థము.) ఈ వ్రతమునాచరించువాడు ఆనందమునిచ్చు బ్రాహ్మణులకు శక్తికొకలది భోజనము నొసంగవలయును. ఇట్లు చేసిన వారు వేయి అశ్వమేధ యాగముల ఫలమును పొందును.
భాద్రపద శుద్ధ ద్వాదశిన చక్కగా ఉపవసించి జగద్గురువైన హృషీకేశుని ముప్పది రెండు శేర్లపాలతో అభిషేకించవలయును. 'హృషేకేశ నమస్తుభ్యం' అని చక్కగా పూజించవలయును. తెనె కలిపిన పొంగలితో నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించి ఆత్మజ్ఞానముగల బ్రాహ్మణునకు ఆరు శేర్ల గోధుమలను దక్షిణను, శక్తికొలది బంగారమును దానము చేయవలయును. ''హృషీకేశ నమస్తుభ్యం సర్వలోకైకహేతవే మహ్యం సర్వసుఖం దేహి గోధూమస్య ప్రదానతః'' అను మంత్రమును దానము చేయవలయును. (''అన్ని లోకములకు ముఖ్యకారణ భూతుడవైన ఓ హృషీకేశా ! నీకు నమస్కారము. గోధూమ దానముతో నాకు అన్ని సుఖములనిమ్ము'' అని ఈ మన్త్రమునకర్థము.) భక్తితో బ్రాహ్మణులకు భోజనమొసంగి వాఙ్నియమముతో తాను కూడా భూజించవలయును. ఇట్లు చేసినచో అన్ని పాపములు తొలగి బ్రహ్మమేధఫలమును పొందును.
ఆశ్వినే మాసి శుక్లాయాం ద్వాదశ్యాం సముపోషితః, పద్మనాభం చ పయసా స్నాపయోద్భక్తిశ్శుచిః.74
నమస్తే పద్మనాభాయ హోమం కుర్యాత్స్వశక్తితః, తిలవ్రీహియవాజ్యైశ్చపూజయేచ్చ విధానతః. 75
జాగరం నిశి నిర్వర్త్య పునః పూజాం సమాచరేత్, దద్యాద్విప్రాయ కుడవం మధునస్తు సదక్షిణమ్. 76
పద్మనాభ నమస్తుభ్యం సర్వలోకపితామహ, మధుదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః. 77
ఏవం యః కురుతే భక్త్యా పద్మనాభవ్రతం సుధీః, బ్రహ్మమేధసహస్రస్య ఫలమాప్నోతి నిశ్చితమ్. 78
ద్వాదశ్యాం కార్తికే శుక్లే ఉపవాసీ జితేంద్రియః, క్షీరేణాఢకమానేన దధ్నా వాజ్యేన తావతా. 79
నమో దామోదారాయేతి స్నాపయోద్భక్తిభావతః, అష్టోత్తరశతం మధ్వాజ్యాక్తతిలాహుతీః. 80
జాగరం నియతః కర్యాత్త్రికాలార్చనతత్పరః, ప్రాతస్సంపూజయేద్దేవం పద్మపుషై#్పర్మనోరమైః. 81
పునరష్టోత్తరశతం జుహుయాత్సఘ్నత్రై స్తిలైః, పంచభక్ష్యయుతం చాన్నం దద్యాద్విప్రాయ భక్తితః. 82
దామోదర ! జగన్నాథ ! సర్వకారణకారణ ! త్రాహి మాం కృపయా దేవ శరణాగత పాలక ! 83
అనేన దత్త్వా దానం చ శ్రోత్రియాయ కుటుంబినే, దక్షిణాం చ యథా శక్త్యా బ్రాహ్మంనాంశ్చాపి భోజయేత్. 84
ఏవం కృత్వా వ్రతం సమ్యగశ్నీయాద్భందుభిస్సహ, అశ్వమేధసహస్రాణాం ద్విగుణం ఫలమశ్నుతే. 85
ఏవం కుర్యాద్వ్రతీ యస్తు ద్వాదశీవ్రతముత్తమమ్, సంవత్సరం మునిశ్రేష్ఠం స యాతి పరమం పదమ్. 86
ఏకమాసే ద్విమాసే వా యః కుర్యాద్భక్తితత్పరః తత్తత్ఫలమావాప్నోతి ప్రాప్నోతి చ హరేః పదమ్.87
ఆశ్వయుజ శుక్ల ద్వాదశిన ఉపవసించి పాలతోపద్మనాభునికి అభిషేకమును చేయవలయును. 'నమస్తే పద్మనాభాయ' అనుచు శక్తికొలది తిలలుధాన్యము, యవలు నేయితో హోమము చేసి యథావధిగా పూజించవలయును. రాత్రి జాగరణ చేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు తేనె పావుశేరును దక్షిణతో నీయవలయును. 'పద్మనాభ నమస్తుభ్యం సర్వలోకపితామహ మధుదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః' అని దానము చేయవలయును (''అందరికి పితామహుడువైన ఓ పద్మనాభా ! నీకు నమస్కారము. అన్ని ఆనందములను ప్రసాదించుస్వామీ ఈ మధుదానముతో సుప్రీతుడవు కమ్ము'' అని మంత్రమునకర్థము.) ఇట్లు పద్మనాభవ్రతమును చేయుబుద్ధిమంతుడు వేయి బ్రహ్మమేధముల ఫలమును పొందును.
కార్తీక శుక్ల ద్వాదశీతిథిన జితేంద్రియుడై ఉపవాసము చేసి నాలుగు శేర్ల పాలచే కాని పెరుగుచే కాని, నేయిచే కాని ''నమో దామోదరాయ'' అనుచు దామోదరునికి అభిషేకము చేయవలయును. భక్తిచే తేనె నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాలమున సుందరమైన పద్మములచే పూజించవలయును. మరల నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిది మార్లుహోమము చేయవలయును. భక్తితో బ్రాహ్మణునకు పంచభక్ష్యములతో కూడిన అన్నము నీయవలయును. దామోదర! జగన్నాథ! సర్వకారణ కారణ! త్రాహి మాం కృపయాదేవ శరణాగత పాలక'' అనుమంత్రముచే కుటుంబి, శ్రోత్రియుడు అగు బ్రాహ్మణునకు దక్షిణతో దానమును చేయవలయును. సర్వకారణములకు కారణ భూతుడవైన ఓ జగన్నాథా! దామోదరా! శరణాతగత రక్షక ! నన్ను దయచే కాపాడుము అని పై మంత్రమునకర్థము. పిదప బ్రాహ్మణులను భుజింపచేయవలయును. ఇట్లు వ్రతమును ముగించి బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు చేసినచో వేయి అశ్వమేధ యాగములకు రెట్టింపు ఫలము లబించును. ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతము నాచరించినవారు పరమ పదమును పొందెదరు. భక్తిచే ఒకటి రెండు నెలలు చేసిన వారు కూడా ఆయా ఫలములను పొంది అంతమున శ్రీహరి లోకమును చెరెదరు.
పూర్ణం సంవత్సరం కృత్వా కుర్యాదుద్యాపనం వ్రతీ, మార్గశీర్షే సితే పక్షే ద్వాదశ్యాం చ మునీశ్వర! 88
స్నాత్వా ప్రాతర్యథాచారం దస్తధావన పూర్వకమ్, శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః. 89
మండపం కారమేద్దివ్యం చతురస్రం సుశోభనమ్, ఘంటావచామరసంయుక్తం కింకిణీరవశోభితమ్.90
అలంకృతం పుష్పమాల్యైర్వితానధ్వజనరాజితమ్, ఛాదితం శుక్లవస్త్రేణ దీపమాలావిభూషితమ్. 91
తన్మధ్యే సర్వతోభద్రం కర్యాత్సమ్యగలంకృతమ్, తస్యోపరి న్యసేత్కుంభాన్ద్వాదశాంబుప్రపూరితాన్. 92
ఏకేన శుక్లవస్త్రేణ సమ్యక్సంశోధితేన చ , సర్వానాచ్ఛాదయేత్కంభాన్ పంచరత్నసమన్వితాన్. 93
లక్ష్మీనారాయణం దేవం కాయనద్భక్తిమాన్వ్రతీ, హేమ్నా వా రజతేనాపి తథా తామ్రేణ వా ద్విజ.94
స్థాపయేత్ప్రతిమాం తాం చ కుంభోపరి సుసంయమీ, తన్మూల్యం వా ద్విజశ్రేష్ఠ కాంచనం చాస్య శక్తితః.95
సర్వవ్రతేషు మతిమాన్విత్తశాఠ్యం వివర్జయేత్, యది కుర్యాతయం యాన్తి తస్యాయుర్ధనమసంపదః. 96
అనన్తశాయినం దేవం నారాయణమనామయమ్, పంచామృతేన ప్రధమం స్నాపయేద్భక్తిసంయుతః. 97
నామభిః కేశవాద్యైశ్చ హ్యుపచారాన్ప్రకల్పయేత్, రాత్రౌ జాగరణం కుర్యాత్పురాణశ్రవణాదిభి. 98
జితనిద్రో భ##వేత్సమ్యక్సోపవాసో జితేన్ద్రియః, త్రికాలమర్చయేద్దేవం యథా విభవవిస్తరమ్.99
తతః ప్రాతస్సముత్థాయ ప్రాతః కృత్యం సమాస్య చ , తిలహోమాన్వ్యాహృతిభిస్సహస్రం కారయేద్ద్విజైః.100
తతస్సంపూజయేద్దేవం గన్ధపుష్పాదిభిః క్రమాత్, దేవస్య పురతః కుర్యాత్పురాణశ్రవణం తతః.101
దద్యాద్ద్వాదశవిప్రేభ్యో దధ్యన్నం పాయసం తదా, అపూపైర్ణశభిర్యక్తం సఘృతం చ సదక్షిణమ్. 102
దేవదేవ జగన్నాథ భక్తానుగ్రహవిగ్రహ! గృహోణోపాయనం కృష్ణ సర్వాభీష్టప్రదో భవ.103
అనేనోపాయంన దత్త్వా ప్రార్థయేత్ప్రాఞ్జలిః స్థితః, ఆదాయ జానునీ భూమౌ వినియావనతో ప్రతీ.104
నమో నమస్తే సురరాజరాజ! నమో೭ స్తుతే దేవే జగన్నివాస!
కురుష్వ సంపూర్ణఫలం మమాద్య నమో ೭ స్తుభ్యం పురుషోత్తమాయ.105
ఇతి సంప్రార్థయేద్విప్రాన్దేవం చ పురుషోత్తమమ్, దద్యాదర్ఘ్యం చ దేవాయ మహాలక్ష్మీయుతాయ వై.106
లక్ష్మీపతే నమస్తుభ్యం క్షీరార్ణవనివాసినే, అర్ఘ్యం గృహాణ దేవేశ లక్ష్మ్యా చ సహితః ప్రభో!
యస్మ స్మృత్యా చ నామోక్త్యా తపోయజ్ఞక్రియాదిషు,
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్.
ఇతి విజ్ఞాప్య దేవేశం తత్సర్వ సంయమీవ్రతే ప్రతిమాం దక్షిణాయుక్తామాచార్య నివేదయేత్. 109
బ్రాహ్మణోన్భోజయేత్పశ్చాచ్ఛక్త్యా దద్యాచ్చదక్షిణామ్, భుంజీత వాగ్యతః, పశ్చాత్స్వయం బంధుజనైర్వృతః 110
అసాయం శృణుయాద్విష్ణోః కథాం విద్వజ్జనైస్సహ, ఇత్యేవం కురుతే యస్తు మనుజో ద్వాదశీవ్రతమ్.111
సర్వాన్కామాన్స ఆప్నోతి పరత్రేహ చ నారద, త్రిసప్తకులసంయుక్తః సర్వపాపవివర్జితః, 112
ప్రయాతి విష్ణుభవవనం యత్ర యాత్వా న శోచతి.
య ఇదం శృణు యాద్విప్ర ద్వాదశీవ్రతముత్తమమ్, వాచయేద్వాపి న నరో వాజపేయఫలం లభేత్.
ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే ప్రథమపాదే
వ్రతాఖ్యానే మార్గశీర్ష శుక్ల ద్వాదశీవ్రత కథనం నామ
సప్తదశో ధ్యాయః.
ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతమునాచరంచి ఉద్యాపనము చేయవలయును. మార్గశీర్షశుక్ల ద్వాదశిన ప్రాతఃకాలమున దంతధావనమును చేసుకొని ఆచారానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రమును పుష్పమాలలను ధరించి తెల్లని గంధమును పూసుకొని సుందరముగా నాలుగు మాలలతో మండపమును చేయించవలయును. ఘంటా చామరములతో కింకిణీ ధ్వనులతో ఛత్రచామర పతాకములతో పుష్పమాలతో నలంకరించి తెల్లని వస్త్రమును పైన కప్పవలయును. చుట్టూ దీపమాలతో అలంకరింపచేయవలయును. ఆ మండప మధ్య బాగమున సర్వతో భద్రముద్రను చక్కగా అలంకారముతో చిత్రించవలయును. సర్వతోభద్రముద్రమీద జలపూరితములైన పన్నెండు కలశములనుంచవలయును. చక్కగా శోధించిన తెల్లని వస్త్రముచే అన్ని కలశములను కప్పవలయను. ఆ కలశములలో పంచరత్నముల నుంచవలయును. బంగారముచే కాని, వెండిచే కాని, రాగిచే కాని లక్ష్మీనారాయణ ప్రతిమను భక్తితో చేయించవలయును. ఆ ప్రతిమను కలశము మీద నుంచవలయును. ప్రతిమను చేయగల అవకాశములేనిచో ప్రతిమా మూల్యమును కలశముపై నుంచవలయును. శక్తిననుసరించి బంగారమును కూడా ఉంచవచ్చును. బుద్ధిమంతుడైనవాడు ఏ వ్రతమునందైన విత్తలోభమును వదలిపెట్టవలయును. పురాణ శ్రవణాదులను చేయుచు రాత్రి జాగరణమును చేయవలయును. కేశవాది నామములచే ఉపచారమును చేయవలయును. ఉపవాసముచే జితేంద్రియుడు జితనిద్రుడు కావలయును. సంపదకనుగుణముగా మూడుపూటలా శ్రీహరిని పూజించవలయును. ప్రాతఃకాలమున లేచి ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని వ్యాహృతులచే వేయి తిలాహుతుల నీయవలయును. తరువాత క్రమముగా గంధపుష్పాదులచే శ్రీమన్నారాయుణుని పూజించవలయును. శ్రీమన్నారాయణుని ముందు కూర్చొని పురాణ శ్రవణమును చేయవలయును. పన్నెండుమంది బ్రాహ్మణులకు నేయితో కలిపిన పది అపూపములను, పాయసమును, పెరుగన్నమును, దక్షిణచే నీయవలయును. (''దేవదేవా!జగన్నాథా! భక్తులననుగ్రహించుటకు శరీరమును ధరించువాడా ! ఈ ఉపాయనమును స్వీకరించి నా అభీష్టములన్నింటిని తీర్చుము'' అని మంత్రమునకర్థము) భూమిపై మోకాళ్ళనుంచి వినయముతో వంగి, చేతులో జోడించి ప్రార్థించవలయును.సురరాజా! జగన్నివాసా! నీకు నమస్కారము, నా వ్రతమును సంపూర్ణముగా ఫలవంతమును చేయుము. ఓ పురోషత్తమా! నీకు నమస్కారము ఇట్లు పురుషోత్తమదేవుని చక్కగా ప్రార్థించవలయును. మహాలక్ష్మీ సమేతునకు ఆర్ఘ్యము నీయవలయును. క్షీరసాగరనివాస! లక్ష్మీ పతీ! నీకు నమస్కారము . లక్ష్మీసహితుడవై అర్ఘ్యమును స్వీకరించుము. అచ్యుతుని స్మరణమాత్రమున తపోయజ్ఞక్రియాదులలోన్యూనము పూర్ణమగును. కావున అచ్యుతనకు నమస్కారము. ఇట్లు విజ్ఞాపన చేసి దక్షిణ సహితముగా లక్ష్మీనారాయణ ప్రతిమను ఆచార్యునకి దానమునీయవలెను. తరువాత బ్రాహ్మణులకు భోజనము నుంచి శక్తిననుసరించి దక్షిణనీయవలయును. బంధుజనులతో కూడి మౌనముగా తాను భుజించవలయును.విద్వజ్జనులతో కలిసిన సాయంకాలమువరకు విష్ణుకథలను వినవలయును. ఇట్లు ద్వాదశీవ్రతమునుచేయు మనుజుడు ఇహపరలోకములో అన్ని కోరికలను సంపూర్ణముగా పొందును. ఇరువదిఒకతరములతో అన్ని పాపములనుండి విముక్తుడై వెళ్ళి, తరువాత శోచించని విష్ణుభవనమునకు వెళ్ళును. ఇట్లు ఈ ద్వాదశీవ్రతమును వినిన వారు చెప్పిన వారు కూడా వాజపేయ యాగఫలమును పొందును. 88-113
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున వ్రతాఖ్యానమున మార్గశీర్ష శుక్ల ద్వాదశీ వ్రతకథనమను పదునేడవ అద్యాయము ముగిసినది.