Sri Naradapuranam-I
Chapters
Last Page
అష్టాదశో೭ ధ్యాయః = పదునెనిమిదవ అధ్యాయము మార్గశీర్షపౌర్ణిమాయాం లక్ష్మీనారాయణవ్రతమ్ సనక ఉవాచ : అన్వద్వ్రతవరం వక్ష్యేశృణుష్వ మునిసత్తమ ! సర్వపాపహారం పుణ్యం సర్వదుఃఖనిబర్హణమ్.1 బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం యోషితతాం తథా, సమస్త కామఫలదం సర్వవ్రత ఫలప్రదమ్.2 దుస్సప్న నాశనం ధర్మ్యం దుష్టగ్రహ నివారణమ్, సర్వలోకేషు విఖ్యాతం పూర్ణిమావ్రతముత్తమ్, యేన చీర్ణేన పాపానాం రాశికోటిః ప్రశామ్యతి. 3 మార్గశీర్షే సితే పక్షే పూర్ణాయాం నియతః శుచిః, స్నానం కుర్యాద్యథాచారం దన్తధావనపూర్వకమ్. 4 శుక్లాంబరధరశ్శుధ్ధో గృహమాగత్య వాగ్యతః ప్రక్ష్యాళ్య పాదావాచమ్య స్మరన్నారాయణం ప్రభుమ్.5 నిత్యం దేవాచ్చనం కృత్వా పశ్చాత్సంకల్పం పూర్వకమ్, లక్ష్మీనారాయణం దేవమర్చయేద్భక్తిభావతః.6 అవాహనాపనాద్యైశ్చ గంధపుష్పాదిభిర్వ్రతీ, నమో నాచాయణాయేతి పూజయేనద్భక్తితత్పరః.7 గీతైర్వాద్యైశ్చ నృత్యైశ్చ పురాణపఠనాదిభిః, స్తోత్రైర్వారాధయేద్దేవం వ్రతకీత్సుసమాహితః. 8 దేవస్య పురతః కృత్వా స్ధండిలం చతురస్రకమ్, అరత్నిమాత్రం తత్రాగ్నిం స్ధాపయేద్గృహ్యమార్గతః.
9 ఆజ్యభాగాన్తపర్యన్తం కృత్వా పురుషసూక్తత, చరుణా చ తిలైశ్చాపి ఘృతేన జుహుయాత్తథా.10 ఏకవారం ద్వివారం వా త్రివారం వాపి శక్తితః, హోమం కుర్యాత్పత్రయత్నేన సర్వపాపనివృత్తయే. 11 ప్రాయశ్చిత్తాధికం సర్వం స్వగృహోక్తవిధానతః, సమాప్య హోమం విదివచ్ఛాన్తిసూక్తం జపేద్భుదః.12 ననకమహర్షి పలికెను : ఓ మునిసత్తమా! ఇంకొక ఉత్తమవ్రతమును చెప్పదను. ఈ వ్రతము అన్ని పాపములను నశింపచేయును. పరమ పవిత్రమైనది. అన్ని దుఃఖములను తొలగింపచేయును. బ్రాహ్మణక్షత్రియ వైశ్య శూద్రులను స్త్రీలకు అన్ని కోరికలను తీర్చును. ఈ వ్రతము నాచరించినచో అన్ని వ్రతముల నాచరింన ఫలము లభించును. దుస్స్వప్నములను నశింపచేయును. ధర్మమును ప్రసాదించును. దుష్టగ్రహములను నివారింపచేయును. ఈ పూర్ణిమా వ్రతము అన్ని లోకములలో ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమునిర్వర్తించినచో పాపరాశి నశించును. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమనాడు పవిత్రుడై నియమముగా ప్రాతఃకాలమున దంతాధవనముచేసుకొని ఆచారానుగుణముగా స్నాము చేసి తెల్లని వస్త్రములను ధరించి శుద్ధుడై ఇంటికి వచ్చి మౌనము వహించి, పాదప్రక్షాళనమును చేసుకొని ప్రభువైన నారాణుని స్మరించుచు నిత్య విధియైన దేవార్చనను చేసి తరువాత సంకలపూర్వకముగా భకక్తి భావముతో లక్ష్మీనారాయణ దేవుని అర్చించవలయును. వ్రతమును స్వీకరించినవాడు ఆవాహనానగంధపుష్పాదులచే నమో నారాయణాయ అని భక్తి తత్పరుడై పూజించవలయును. గీత నృత్యవాద్యములచే పూరాణ పఠనాదులచే కాని స్తోత్రములచే కాని ఆరాధించవలయును. లక్ష్మీనారాయుణుని పురోబాగమున చతురస్ర స్థండిలమునేర్చరచి గృహ్యసూత్రానుసారముగా ఆ స్థండిలమున ఆరంగుళముల ప్రదేశమున అగ్నిని స్థాపించవలయును. ఆజ్యభాగాంతము వరకు పురుషసూక్తముచే పొంగలిచే (చరువు) నువ్వులచే నెయ్యిచేఉ హోమము చేయవలయును. సర్వపాపనివృత్తికొఱకు ప్రయత్నము చే ఒకమారు, రెండుమార్ల మూడు మార్లు కాని హోమమును చేయవలయును. తమతమ గృహ్యసేత్రానుసారముగా ప్రాయశ్చిత్తాదికమంతటిని ముగింపచేసి, హోమమును సమాప్తిని గావించి శాంతి సూక్తమును పఠించవలయును. పశ్చాద్దేవం సమాగత్య పునః పూజాం ప్రకల్పయేత్, తథోపవాసం దేవాయ హ్యరపయేద్భక్తిసంయుతః.13 పౌర్ణమాస్యాం నిరాహారః స్థిత్వా దేవా తవాజ్ఞయా బోక్ష్యామి పుండరీకాక్ష పరేహ్ణి శరణం భవ.14 ఇతి విజ్ఞాప్య దేవాయ హ్యర్ఘ్యం దత్వా తథేన్దనే, జానుభ్యామవనీం గత్వా శుక్ల పుష్పాక్షతాన్వితః 15 గృహోణార్ఘ్యం మయూ దత్తం రోహిణీనాయక ప్రభో ఏవమర్ఘ్యం ప్రదాయేన్ధోః ప్రార్ధయేత్ప్రాంజలిః స్థితః.16 తిష్ఠన్పూర్వముఖో భూత్వా పశ్యన్నిన్దుం చ నారద నమః శుక్లాంశ##వే తుభ్యం ద్విజరాజాయ తే నమః.17 రోహిణీపతేయే తుభ్యం లక్ష్మీ భ్రాత్రే నమోస్తుతే, తతశ్చ జాగరం కర్యాత్పురాణ శ్రవణాదిభిః.18 జితేన్ద్రియశ్చ శుద్ధః పాషండాలోకవర్జితః తతః ప్రాతః ప్రకుర్వీత స్వాచారం చ యథావిధి, 19 పునస్సంపూజయేద్దేవం యధావిభవిస్తరమ్, 20 బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యా తతశ్చప్రయతో నరః, బంధుభృత్యాదిభిః సార్ధం స్వయం భుంజీత వాగ్యతః.21 మరల దేవుని సమీపించి మరల పూజను సలుపవలయును. భక్తిగల వాడై లక్ష్మీనారాయణునికి ఉపవాసమును అర్పించవలయును. ఓ దేవా! నీ యాజ్ఞచే పౌర్ణమీ తిథిన నిరాహారముగా నుండి మరుసటి దినమున భుజింతును. నాకు రక్షకుడువు కమ్ము. ఇట్లు విజ్ఞాపన చేసి స్వామికి అర్ఘ్యము నీయవలయును. అట్లే భూమిపై మోకాళ్ళనుండి తెల్లనిపూవులను అక్షతలను చేతిలోతీసుకొని '' క్షీరోదార్ణవ సంభూత! అత్రిగోత్రముద్భవ! గృహణార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయకప్రభో!'' అను మంత్రముచే అర్ఘ్యమును చంద్రునకిచ్చి చేతులు జోడించి ప్రార్థించవలయును. (''పాలసముద్రమున పుట్టినవాడా! అత్రిగోత్రమున అవతరించినవాడా1 రోహిణీ పతీ! నేనిచ్చిన అర్ఘ్యమును స్వీకరింపుము'' అని పై మంత్రమున కర్థము) తూర్పు ముఖముగా నిలచి చంద్రుని చూచుచు తెల్లని కిరణములు కలిగిన ద్విజరాజువైన, రోహిణీ పతివి, లక్ష్మీదేవి సోదరుడవు అయిన నీకు నమస్కారము. అని ప్రార్థించి పురాణ శ్రవణాదులచే జాగరమును చేయవలయును, పవిత్రుడై ఇంద్రియ జయము కలిగి పాషండుల దృష్టి సోకక యుండవలయును. తరువాత ప్రోద్దున స్వాచారాను గుణముగా యథావిదిగా నిత్యకృత్యములను నిర్వర్తించి విభవాను గుణముగా విస్తరముగా మరల స్వామి ని పూజించవలయును. బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వినయముతో బంధుమిత్ర భృత్యపరివారముతో మౌనముగా తాను భుజించవలయును. 13 - 21 ఏవం పౌషాదిమాసేషు పూర్ణిమాయాముపోషితః, అర్చయేద్భక్తిసంయుక్తో నారాయణననునామయమ్.22 ఏవం సంవత్సరం కృత్వా కార్తిక్యాం పూర్ణిమా దినే, ఉద్వాపనం ప్రకుర్వీత తద్విదానం వదామి తే.23 మండపం కారయేద్దివ్యం చతురస్రం సుమంగలమ్, శోభితం పుష్పమాలాభిరవ్వితానధ్వజరాజితమ్.24 బహుదీపసమాకీర్ణం కింకిణీజాలశోభితమ్, దర్పణౖశ్చామరైశ్చైవ కలశ్చైశ్చ సమావృతమ్.25 తన్మధ్యే సర్వతోభద్రం పంచవర్ణవివరాజితమ్, జలపూర్ణం తతః కుంభం న్యసేత్తస్యోపరి ద్విజ.26 పిధాయ కుంభం వస్త్రేణ సుసూక్ష్మేణా తిశోభితమ్, హేమ్నా వా రజతేనాపి తథా తామ్రేణ వా ద్విజ. 27 లక్ష్మీనారాయణం దేవం కృత్వా తస్యోపరి న్యపేత్, పంచామృతేన సంస్నాప్యాభ్యర్య్చ గంగా దిభిః క్రమాత్.28 భ##క్ష్యైర్భోజ్యాదినైవేద్యర్భక్తితస్సంయతేంద్రియః, జాగరం చ తథా కుర్యాత్సమ్యక్శ్రద్ధాసమన్వితః. 30 బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యా విభ##వే సత్యవారితమ్, తిలదానం ప్రకుర్వీత యథా శక్త్యా సమాహితః.31 కుర్యాదగ్నౌచ విధిపత్తిలహోమం విచక్షణ, ఏవం కృత్వా నరస్సమ్యగ్లక్ష్మీనారాయణప్రతమ్. 32 ఇహ భుక్త్వా మహాభోగాన్పుత్రపౌత్రసమన్వితః, సర్వపాపవినిర్ముక్తః కులాయుతసమన్వితః ప్రయాతి విష్ణుభవనం యోగినామపి దుర్లభమ్.33 ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే ప్రతాఖ్యానే మార్గశీర్షపౌర్ణమాయాం లక్ష్మీనారాయణవ్రతం నామ అష్టాదశో ೭ధ్యాయః. ఇట్లే పుష్యాది మాసములలో పూర్ణియా తిధిన ఉపవసించి వికారరహితుడగు శ్రీమన్నారాయణుని భక్తితో పూజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించి కార్తీక పూర్ణిమ నాడు ఉద్యాపనమును చేయవలయును. ఆ విధానమును చెప్పెదను వినుము. కళ్యాణకరమగు చతురస్రమండపమును చేయవలయును. ఆ మండపమును పుష్పమాలాదులచే ఛత్రచామర ధ్వజములచే అలంకరించవలయును. చాలా దీపములనుంచవలయును. గంటలు అమర్చవలయును. అద్దములతో కలశములతో కూర్చవలయును. ఆ మధ్యన పంచవర్ణములతో సర్వతో భద్రమును లిఖించవలయును. అద్దములతో కుంభమునుంచవలయును. ఆ మద్యన పంచవర్ణములతో సర్వతో భద్రమును లిఖించవలయును. దానిపై జలపూరిత కుంభమునుంచవలయును. కలశము ను వస్త్రముతో కప్పి, బంగారముతో కాని, వెండితో కాని రాగితోకాని, చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమ ను వస్త్రమును నుంచవలయును. ఆ ప్రతిమ పంచామృతముతో అభిషేకించి క్రమముననుసరించి గంధాదులతో అర్చించవలయును. ఇంద్రియ నిగ్రహము కలవాడై భక్ష్య భోజప్యములను నివేదములు చేయవలయును. శ్రద్ధతో చక్కగా జాగరణ చేయవలయును. మరుసటి దినమున ప్రాతఃకాలమున యథావిదిగా పూర్వము వలె విష్ణువు నర్యచించవలయును. ఆ ప్రతిమను దక్షిణగా ఆచార్యునకు దానము చేయవలయును. సంపదలున్నచో కాదనక బ్రాహ్మణులను భుజింపచేయవలనయును. శక్తిననుసరించి సావధానముగా తిలదానమును చేయవలయును. వివేకము కలవాడై విధిపూర్వకమగా తిలహోమమును చేయవలయును. ఇట్లు చక్కగా లక్ష్మీనారాయణ వ్రతమును నాచరించినవారు ఇహలోకమును పుత్రపౌత్రాదులతో మహాభోగముల ననుభవవించి అన్నిపాపములనుండి విముక్తిని పొంది పదివేల తరములతో యోగులకు కూడా దుర్లభమగు విష్ణుభవనము చేరుదురు. ఇది శ్రీ భృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యాతనమున మార్గశీర్ష పూర్ణిమనాడు లక్ష్మీ నారాయణ వ్రతమను పదునెనిమిదవ అధ్యాయమము సమాప్తము