Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకోనవింశో ధ్యాయః పందొమ్మిదవ అధ్యాయము

ధ్వజారోపణమ్‌

సనక ఉవాచ :

అనయద్వ్రతం ప్రవక్ష్యామి ధ్వరోపణ సంజ్ఞితమ్‌, సర్వపాపహరం పుణ్యం విష్ణుప్రీణనకారణమ్‌.1

యః కుర్యాద్విష్ణుభవనే ధ్వజారోపణముత్తమ్‌, సంపూజ్యతే విరించాద్యైః కిమన్యైర్బహుభాషితైః. 2

హేమభార సహస్రం తు యో దదాతి కుటుంబినే, తత్ఫలం తుల్య మాత్రం స్యాధ్వజారోపణకర్మణః.

ధ్వజనారోపణతుల్యం స్యాద్గంగాస్నానమనుత్తమమ్‌, అథవా తులసీసేవా శివలింగప్రపూపజనమ్‌. 4

అహోపూర్వమహోపూర్వమహోపూర్వమిదం ద్విజ, సర్వపాపహరం కర్మ ధ్వజారోపణసంజ్ఞితమ్‌.5

కార్తకప్య సితే పక్షే దశమ్యాం ప్రయతో నరః, స్నానం కుర్యాత్ప్రయత్నేన దస్తధావనపూర్వకమ్‌.7

ఏకాశీ బ్రహ్మచారీ చ సపేన్నారాయణం స్మరన్‌, ధౌతాంబరధరశ్శద్ధో విప్రో నారాయణాగ్రతః.8

తతః ప్రాతస్సముత్థాయ స్నాత్వాచమ్య యథావిధి, నిత్యకర్మాణి నర్వర్త్య పశ్చాద్విష్ణుం సమర్చయేత్‌.9

చతుర్భిద్భ్రాహ్మణౖస్సార్థం కృత్వా చ స్వప్తివాచనమ్‌, నాందీశ్రాద్ధం ప్రకుర్వీత ధ్వజారోపణకర్మణి.

ధ్వజస్తంభే చ గాయత్ర్యా ప్రోక్షయేద్వస్త్రసంయుతౌ,

సూర్యం చ వైనతేయం చ హిమాంశుం తత్పరో ర్భయేత

ధాతారం చ విధాతారం పూజయేద్ధ్వాజదండకే, హరిద్రాక్షతగంధాద్యైః శుక్లపు షై#్పర్విశేషతః.12

తతో గోచర్మమాత్రం తు స్థండిలం చోపలిప్య వై, ఆధాయాత్నిం స్వగృహోక్త్యా హ్యాజ్యభాతాదికం క్రమాత్‌.13

జహుయాత్పాయసం చైవ సాజ్యమష్టోత్తరం శతమ్‌, ప్రథమం పౌరషం సూక్తం విష్ణోర్నుక మిరావతీమ్‌.14

తతశ్చ వైనతేయాయ స్వాహేత్యష్టాహుతీస్తథా, సోమో ధేనుముదుత్యం చ జుహుయాచ్చతతో ద్విజ.15

సౌరమంత్రాజ్ఞపేత్తత్ర శాంతిసూక్తాని శక్తితః, రాత్రౌ జాగరణం కుర్యాదుపకంఠం హరేఃశుచిః.16

తతః ప్రాతస్సముత్థాయ నిత్యకర్మసమాస్య చ, గన్దపుష్పాదిభిర్దేవమర్చయేత్పర్వవత్కృమాత్‌.17

తతో మంగలవాద్యశ్చసూక్తపాఠైశ్చ శోభనమ్‌, నృత్యైశ్చ స్తోత్రపఠనైర్నయేద్విష్ణ్వాలయే ధ్వజమ్‌.18

దేవసయ ద్వారదేశే వా శిఖరే వా ముదాన్వితః, సుస్థిరం స్థాపయేద్విప్ర ధ్వజం సుప్తమ్భసంయుతమ్‌.19

గంధపుష్పాక్షతైర్దవం దూపదీపైర్మనోహరైః భక్ష్యభోజ్యాదిసంకుక్తైర్నైవేద్యైశ్చ హరిం యజేత్‌.20

ఏవం దేవాలయే స్థాప్య శోభనం ద్వజముత్తతమ్‌, ప్రదక్షిణమనుప్రజ్య స్తోత్రమేతదురీరయేత్‌.21

సనక మహర్షి పలికెను : ధ్వజారోపణమును మరియొక వ్రతమును చెప్పెదను. ఈ వ్రతము అన్ని పాపములను తొలగించును. శ్రీహరికి ప్రీతిని కలింగించును. శ్రీవిష్ణుదేవాలయమున ధ్వజారోపణమును చేసినవారిని బ్రహ్మాదులు కూడా పూజింతురనిన ఇకనేమి చెప్పవలయును. పెద్దకుటుంబము కల బ్రాహ్మణుకు పదివేల కిలోల బంగారమును (భారసహస్రము) దానము చేసినచో ధ్వజారోపణముతో సమానమగును. ధ్వజారోపణముతో సమానమగునది గంగాస్నానము లేదా తులసీ సేవనము, లేదా శివలింగపూజనము, ఈ ధ్వజారోపణము అపూర్వము. ఆశ్చర్యావహము. సర్వపాపహరము. ధ్వజారోపణ వ్రతమున చేయవలసిన కార్యములను నేను చెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశిన వ్రతమును స్వీకరించదలచిన మానవుడు నియమముతో ప్రాతఃకాలమున దంతధావనమును చేసుకొని స్నానమును చేయవలయును. పరిశుభ్రమైన వస్త్రములను ధరించి శుద్ధుడై, ఒకపూట మాత్రమే భుజించి, బ్రహ్మచర్యము నవలంబించి శ్రీమన్నారాయణుని ముందు నారాయణునే తలచుచు నిద్రించవలెను. ప్రొద్దునలేచి యథావిధిగా స్నానము చేసి ఆచమించి నిత్యకర్మలను ముగించుకొని శ్రీమహావిష్ణువును పూజించవలయును. నలువురు బ్రాహ్మణులతో స్వస్తి వాచనమును గావించి నాందీ శ్రాద్ధమును చేయవలెను. వస్త్రములను చుట్టిన ద్వజస్తంభములను గాయత్రీ మంత్రముచే పోక్షించవలయును. భక్తితో సూర్యుని, గరుడుని, చంద్రుని పూజించవలయును. ధ్వజదండమున ధాతృవిధాతృలను అర్చించవలయును. పసుపు, అక్షితలు, గంధము, తెల్లని పూలు మొదలగు వాటితో విశేషముగా అర్చించవలయును. తరువాత గో చర్మమాత్రము స్థండిలమునేర్పరిచి తన గృహ్య సూత్రప్రకారము అగ్న్యాధానము గావించి యథాక్రమముగా అజ్యభాగాదికమును హోమమును గావించవలయును. నేతితో కలిపిన పాయసమును అష్టోత్తర శతాహుతుల నీయవలయును. మొదట పురుష సూక్తముచే పిదప విష్ణోర్నుకం అను మంత్రముచే, ఇరావతీం అను మంత్రముచే హోమమును చేయవలయును. తరువాత గరుడునికి స్వాహరముతో అష్టహుతుల నీయవలయును. తరువాత 'సోమో ధేనుం' 'ఉదుత్యం' అను మంత్రములచే హోమమును చేయవలయును. అట్లే సౌరమంత్రజపమును చేయవలయును. శక్తికొలది శాంతి సూక్తమును పఠించవలయును. పవిత్రుడై శ్రీహరి సమీపమును రాత్రిపూట జాగరణము చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మను ముగించుకొని గంధపుష్పాదులచే శ్రీహరిని యథాపూర్వముగా నర్చించవలయును. అపుడు ధ్వజమును మంగళవాద్యములచే సూక్తపాఠములచే నృత్యగీతములతో, స్తోత్ర పాఠములతో విష్ణ్వాలయమునకు తీసుకొని వెళ్ళవలయును. దేవాలయమున ద్వారదేవశమున కాని శిఖరమున కాని ఆనందముచే స్థాపించవలయును. ధూపదేపగంధపుష్పాక్షాతాదులచే భక్ష్యభోజ్యాదినైవేద్యములచే శ్రీహరిని పూజించవలయును. ఇట్లు దేవాలయమున శోభనముగా ధ్వజమును స్థాపించి ప్రదక్షిణమును చేసి ఈ స్తోత్రమును పఠించవలయును1-21

నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వాభవన ! నమస్తే7స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. 22

యేనేదమఖిలం జాతం యత్ర సర్వం ప్రితిష్ఠితమ్‌, లయమేష్యతి యత్రైవ తం ప్రసన్నో స్మి కేశవమ్‌. 23

న జానన్తి పరం భావం యస్య బ్రహ్మాదయస్సురాః , యోగినో యం న పశ్యన్తి తం వన్దే జ్ఞానపూపిణమ్‌. 24

అన్తరిక్షం తు యన్నాభి ర్ద్యౌర్మూర్ధా యస్య చైవ హి, పాదో భూదస్య పృథవీ తం వన్దే విశ్వరూపిణమ్‌. 25

యస్య శ్రోత్రం దిశస్సర్వా యచ్చక్షుర్దినకృచ్ఛశీ, ఋక్సామయజుషీ యేన తం వన్దే బ్రహ్మరూపిణమ్‌. 26

యన్ముఖాద్బ్రాహ్మణా జాతా యద్బాహోరభవన్నృపాః, వైశ్యా యస్యోరుతో జాతాః పద్భాం శూద్రో వ్యజాయత. 27

మాయాసంగమమాత్రేణ వదన్తి పురుషం త్వజమ్‌, స్వభావ విమలం శుద్ధం నిర్వకారం నిరంజనమ్‌. 28

క్షీరాబ్ధిశాయనం దేవమనన్తమపరాజితమ్‌, సబ్ధక్తవత్సలం విష్ణుం భక్తిగమ్యం నమామ్యహమ్‌. 29

పృథివ్యాదీని భూతానా తన్మాత్రాణీన్ద్రియాణి చ, సూక్ష్మాసూక్ష్మాణి యేనాసంస్తం వల్దే సర్వతోముఖమ్‌. 30

యద్బ్రహ్మ పరమం ధామ సర్వలోకోత్తమోత్తమమ్‌, నిర్గుణం పరమం సూక్ష్మం ప్రణతో స్మి పునః పునః. 31

అవికారమజం శుద్ధం సర్వతోబహుమీశ్వరమ్‌, యమామన్తి యోగీన్ద్రాః సర్వకారణకారణమ్‌. 32

యో దేవస్సర్వ భూతానామన్తరాత్మా జగన్నయః నిర్గుణః పరమాతామా చ స మే విష్ణుః ప్రసీదతు. 33

హృదయస్థో పి దూరస్థో మాయయా మోహితాత్మనామ్‌, జ్ఞానినాం సర్వగో యస్తు స మే విష్ణుః ప్రసీదతు. 34

చతుర్భిశ్చ చతుర్భిచ్ఛ ద్వాభ్యాం పంచభీరేవ చ, హూయతే చ పునర్ద్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు. 35

జ్ఞానినాం కర్మిణాం చైవ తథా భక్తిమతాం నృణామ్‌, గతిదాతా విశ్వమృగ్యస్స మే విష్ణుః ప్రసీదతు. 36

జగద్ధితార్ధం యే దేహా ధ్రియన్తే లీలయా హరేః, తానర్చయన్తి విబుధా స మే విష్ణుః ప్రసీదతు. 37

యమామనన్తి వై సన్తస్సచ్చిదానన్దవిగ్రహమ్‌, నిర్గుణం చ గుణాధారం స మే విష్ణుః ప్రసీదతు. 38

ఇతి స్తుత్వా నమేద్విష్ణుం బ్రహ్మణాంశ్చ ప్రపూజయేత్‌, ఆచార్యం పూజయేత్పశ్చాద్దక్షిణాచ్ఛాదనాదిభిః. 39

పుండరీకాక్షా ! నీకు నమస్కారము. విశ్వభావనా ! నమస్కారము. ఓ మహాపురుషా ! పూర్వజా ! హృషీకేశా ! నీకు నమస్కారము. ఈ ప్రపంచము నీచే పుట్టినది. నీ యందే నిలిచి యున్నది. నీ యందే లయముకానున్నది. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను. బ్రహ్మాది దేవతలు కూడా నీ పరత్వమును తేలియ లేరు. యోగులు చూడలేని జ్ఞానస్వరూపుడవైన నీకు నమస్కరించుచున్నాను. నీకు అంతరిక్షము నాభి. స్వర్గలోకము శిరస్సు. భూమి పాదము. దిక్కులు చెవులు. సూర్యచంద్రులు నేత్రములు. ఋగ్యజుస్సామములు నీనుండి ఆవిర్భవించినవి. నీ ముఖమునుంచి బ్రాహ్మణులు, బాహువులనుంచి క్షత్రియులు, ఊరువులనుంచి వైశ్యులు, పాదములనుంచి శూద్రులు పుట్టియున్నారు. మాయా సంగమముచే పుట్టుకలేని ఆత్మను పురుషునిగా వ్యవహరింతురు, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, నిర్వలుడవు, వికారరహితుడవు, సంబంధమంటనివాడవు. క్షీరసాగరమున శయనించువాడవు అన్తము పరాజయము లేనివాడవు. సద్భక్తవత్సలుడవు. భక్తిమాత్రముచే తెలియువాడవు సర్వవ్యాపివి. అట్టి నీకు నమస్కారము. పృథివ్యాది పంచభూతములు పంచతన్మాత్రలు, ఇంద్రియములు, సూక్ష్మములు, స్థూలములు నీ నుండి కలుగుచున్నవి. అట్టి నీకు నమస్కారము. సర్వలోకములలో ఉత్తమలోకము నీ ధామము. నిర్గుణుడు, పరముడు, సూక్ష్ముడు, అయిన నిన్ను శరణువేడుచున్నాను. పుట్టుక వికారములులేనివానిని, శుద్ధుని, సర్వతో బాహుని ఈశ్వరుని యోగీన్ద్రులచే సర్వకారణకారణునిగా ధ్యానించబడువానికి సర్వప్రాణులకు అంతరాత్మగా నుండు దేవునికి జగత్స్వరూపునికి నమస్కరించుచున్నాను. నిర్గుణుడు పరమాత్మయగు విష్ణువు ప్రసన్నుడగుగావుత. మాయా మోహితులకు హృదయమున నున్ననూ దూరముగా నున్నటుల భాసించును. జ్ఞానులకు సర్వాంతర్యామిగా తెలియబడు విష్ణువు నాకు ప్రసన్నుడగుగావుత. నాలుగు వర్ణముల వారిచే, నాలుగు ఆశ్రమముల వారిచే, రాత్రింబవళ్ళచే, అయిదు విధముల మనుజులచే వాఙ్మనస్సులచే పూజింపబడు విష్ణువు నాకు ప్రసన్నుడగుగావుత. జ్ఞానులకు కర్మష్ఠులకు, భక్తులకు ఉత్తమగతిని ప్రసాదించువాడు, ప్రపంచముచే అన్వేషించబడువాడు అయిన విష్ణువు ప్రసన్నుడగుగావుత. జగద్ధితము కొఱకు లీలగా ధరించు దేహములను జ్ఞానులు అర్చింతురు. అట్టి విష్ణువు నా విషయమున ప్రసన్నుడగు గావుత. యోగులచే నిర్గుణుడుగా, గూణాధారుడుగ, సచ్చిదానన్ద విగ్రహుడుగా ధ్యానించబడు విష్ణువు ప్రసన్నుడగుగావుత. ఇట్లు శ్రీమహా విష్ణువును స్తుతించి నమస్కరించి బ్రాహ్మణులను పూజించవలయును. తరువాత వస్త్రదక్షిణాదులచే ఆచార్యుని పూజించవలయును. 22-39

బ్రాహ్మణోన్భోజయేచ్ఛక్త్యా భక్తిభావసమన్వితః, పుత్రమిత్రకలత్రాద్యైః స్వయం చ సహబంధుభిః. 40

కుర్వీత పారణం విప్ర నారాయణపరాయణః, యస్త్వేతత్కర్మ కుర్వీత ధ్వజారోపణముత్తమమ్‌. 41

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుష్వ సుసమాహితః, పటో ధ్వజస్య విప్రేన్ద్ర యావచ్చలతి వాయునా. 42

తావన్తి పాపజాలాని నశ్యన్త్యేవ న సంశయః, మహాపాతకయుక్తో నా యుక్తో నా సర్వపాతకైః. 43

ధ్వజం విష్ణుగృహే కృత్వా ముచ్యతే సర్వపాతకైః, యావద్దినాని తిష్ఠేత ధ్వజో విష్ణుగృహే ద్విజ. 44

తావద్యుగసహస్రాణి హిరిసారూప్యమశ్నుతే , ఆరోపితం ధ్వజం దృష్ట్వా యే భినన్దన్తి ధార్మికాః. 45

తేపి సర్వే ప్రముచ్యన్తే మహాపాతకకోటిభిః, ఆరోపితో ధ్యజో విష్ణుగృహే ధున్వన్పటం స్వకమ్‌. 46

కర్తుస్సర్వాణి పాపాని ధునోతి నిమిషార్ధతః, యస్త్వారోప్య గృహే విష్ణోర్ధ్వజం నిత్యముపాచరేత్‌. 47

స దేవయానేన దివం యాతీవ సుమతిర్నృపః. 48

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే

వ్రతాఖ్యానే ధ్వజరోపణం నామ ఏకోనవింశోధ్యాయః

భక్తి భావముతో బ్రహ్మణులును భుజింపజేయవలయను. నారాయణ సంస్మరణ చేయుచు పుత్రమిత్ర కళత్ర బంధు పరివార సమేతుడై తాను మౌనముగా భుజించవలయును. ఉత్తమమైన ధ్వజారోపణమును చేసినచో కలుగు ఫలమును చెప్పెదను. వినుము. ధ్వజపటము ఎన్ని కదలుటలు చేయునో అన్ని పాపరాశులు నశించి తీరును. మహాపాతకములున్ననూ ఇతరపాతకములున్ననూ విష్ణ్వాలయమున ధ్వజారోపణమును చేసినచో అన్ని పాపములు తొలగిపోవును. విష్ణ్వాలయమున ఎన్ని దినములు ధ్వజముండునో అన్ని వేలయుగములు హరిసారూప్యమును పొందును. ధ్వజారోపణమును చూచి అభినందించినవారు మహాపాతకరాశుల నుండి విముక్తులగుదురు. విష్ణ్వాలయమున ప్రతిష్ఠించిన ధ్వజము తన పటమును ఎగురవేయుచు అర నిముషములో కర్త యొక్క పాపములన్నింటిని నశింపచేయును. విష్ణ్వాలయమున ధ్వజారోపణమును చేసి నిత్యము పూజించినవారు దివ్యవిమానముతో సుమతి మహారాజు వలె స్వర్గమును చేరెదరు. 40-48

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున

వ్రతాఖ్యానమున ధ్వజారోపణమును పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page